Wednesday, July 10, 2019

*తొలిఏకాదశి విశిష్టత*  by I Umashankar

 ఈ రోజున ఏం చేయాలి.
*12.07.2019* న
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన *తొలి ఏకాదశి* పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో *ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’* గా పిలుస్తారు. దీనికే *‘‘శయనైకాదశి’’* అని *‘‘హరి వాసరమని‘‘* , *‘‘పేలాల పండుగ’’* అని పేరు.
 పురాణాలను అనుసరించచి *శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు*.. అలా *నాలుగు నెలల* పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే *ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు*..

ఈ నాలుగు నెలల్ని *చాతుర్మాసాలుగా* వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు *చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు*. ఈ నాలుగు నెలలు స్వామివారు *పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని* పురాణగాథ. ఉత్తరాయణం కంటే *దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువ* గా వస్తాయి.. వాతావరణంలో మార్పులు  అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో *ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి*.. అందువల్ల *ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు*,.

ఏకాదశి తిథి: *కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట*. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి *ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది*.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు *‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం* పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. *అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు*.

ఏకాదశి నాడు ఏం చేయాలి: *ఏకాదశి నాడు ఉపవాసం ఉంది.. ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి*.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన *భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ* చేయాలి.. మర్నాడు *ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి*.. తొలి ఏకాదశి నాడు *ఆవులను 🐄 పూజించాలి*..

పేలాల పిండి: *తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు*. పేలాలు  *పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి*.. అందువల్ల మనకు జన్మనిచ్చిన *పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం* మన బాధ్యత. అలాగే *ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు* లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత *వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం*.. కాబట్టి శరీరానికి *పేలాల పిండి వేడిని* కలగజేస్తుంది. అందువల్ల *ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు*.🙏

 అందరిని చల్లగా చూడు తండ్రి🙏🌔👌🏻👍🏻🌹🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment