*వ్యాస గురు పూర్ణిమ ~ (16.07.2019)*
ఆషాడం నుంచీ కార్తీకం వరకూ ఐదు మాసాలకు *వ్యాసపూర్ణిమలు* అని పేరు. వేదవ్యాసుని స్మరిస్తూ ఆషాడపూర్ణిమను *గురుపూర్ణిమ* గా వ్యవహరిస్తారు. భారతీయ సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రవక్త కానీ ఒక గ్రంథమంటూ లేదు. కానీ వేదాధారంగా విస్తరిల్లిన ఆగమ, పురాణ, ధర్మశాస్త్ర, ఇతిహాసాలనన్నింటికీ ఒకే ఒక్క కర్త గా ఎవరినైనా చెప్పుకోవలసి వస్తే వేద వ్యాసుడినే ప్రస్తావించాలి. ద్వాపరగుగాంతములో అపారమైన వేదరాశిని స్వీకరించి నాలుగు వేదాలుగా విభజించి, అష్టాదశ పురాణాలనూ, మహాభారతాన్ని, మహాభాగవతాన్ని రచించి, సమగ్ర ధర్మాన్ని ఏకత్రగా అందించిన నారాయణావతారము విష్ణువు. ఆయన అసలు పేరు కృష్ణుడు ~ సత్యవతీ పరాశరులకు ఒక ద్వీపములో ఉధ్భవించినందున *కృష్ణద్వైపాయనుడు* అని పేరు. *వ్యాసోచ్చిష్టం జగత్సర్వం* ~ అతని ఉచ్చిష్టమే ఈ జగత్తులోని సమస్త వాజ్ఙమయము.
*సకల ధర్మ నిరూపణ సాగరం ~ వివిధ చిత్రకథా సమలంకృతం*
*వ్యరయచ్చ పురాణ కదంబకం ~ మునివరం తమహం సతతంభజే*
అంటే ~ సకల ధర్మాలను నిరూపించే సాగరము వంటిదీ అయిన పురాణ సమూహాన్ని రచించిన వ్యాసమునిని భజిస్తున్నాను అని.
సృష్ట్యారంభములో బ్రహ్మ చతుర్ముఖాలనుంచీ నారాయణుడు వేదవిద్యను ప్రసతించినాడు. అందుకే ఇతని పేరు *అపాంతరతముడు* ~ చీకటిని(అజ్ఙానాన్ని) తొలగించేవాడని.
*నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్*
*దేవీం సరస్వతీ వ్యాసం తతోక్త జయముదీరయేత్*
*వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే*
*నమో బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమోనమః*
*వ్యాసం విసిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్*
వ్యాసుని ముత్తాత వశిష్ట మహర్షి ~ తాత శక్తి మహర్షి ~ తల్లి తండ్రులు సత్యవతీ పరాశరులు. పువ్వు పుట్టగానే పరిమళించేట్లుగా వ్యాసుడు వేదాలను వల్లిస్తూ పుట్టినాడు. సనకాదిమునుల చెంత విద్యాభ్యాసాన్ని చేసి బదరికావనములో తపస్సు చేసి *బాదరాయణుడు* గా ఖ్యాతి గాంచినాడు. ప్రతి యుగములో కూడావ్యాసరూపుడై పుట్టి వేదవ్యాప్తి చేస్తానని తానే స్వయంగా చెప్పినాడు. భాగవత రచనకు ముందు చింతాక్రాంతుడై ఉంటే నారదుడి సలహాతో భగవంతుని కథలనే *శ్రీమద్భాగవతము* గా రచించినాడు. శాక్తేయులైనా, వైష్ణవులైనా, గాణాపత్యులైనా ~ ఏ ఉపాసనా సంప్రదాయానికి చెందినవారైనా వ్యాసుని గురువుగా అంగీకరిస్తారు. ఆయన చెప్పనిదు ఏదీ లేదు. అటువంటి వ్యాసుణ్ణి పూజించుకోవడానికి ఏరపడిందే వ్యాసపూర్ణిమ. వ్యాసవాక్యం అంటే భారతీయులకున్న గౌరవము కారణంగానే చాలా గ్రంథాలు *వ్యాసకృతం* గా ప్రసిద్దిని చెందినాయి. ఆలంబనానికి వేదవ్యాసగురువు ప్రభోధాలు కృపాకటాక్షాలు మోక్షప్రాప్తికి మూలాలు.
~~~ ( సేకరణ : PLNC ) ~~~

No comments:
Post a Comment