Friday, April 28, 2017
Thursday, April 27, 2017
మంగళగిరి.
26/4//17,
8:28:54 PM: +91 80088 84529: ఆంధ్రప్రదేశ్ లో ని గుంటూరు జిల్లాలోని ఒక
మండలం మంగళగిరి. భారత దేశం లో ని అష్టమహాక్షేత్రము ల లో ఒకటైన ప్రదేశంగా
మంగళగిరి ప్రసిద్ది. హైదరాబాద్ నుండి 280 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం
ఉంది. మంగళగిరిలో ఉన్న ప్రముఖమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి
ఆలయం. ఈ ఆలయానికి చేరుకునే మెట్ల మార్గం లో కుడి వైపున విజయనగర రాజు శ్రీ
కృష్ణదేవరాయ వారి శాసనాలు కనబడతాయి. ఇంకా ముందుకి వెళుతున్న కొద్దీ
మహాప్రభు చైతనైయా వారి పాద ముద్రలు కనిపిస్తాయి. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.
పానకాల
లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయం లో కేవలం నోరు విశాలంగా తెరిచిన స్వామి వారి
ముఖం మాత్రమే ఉంటుంది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహ
స్వామి అవతారం లో ఇక్కడ విష్ణుమూర్తి వెలిసారు. సుదర్శన నరసింహస్వామి గా
కూడా భక్తులు స్వామి వారి ని కొలుస్తారు. ఈ ఆలయం వెనుక శ్రీ లక్ష్మీ ఆలయం
ఉంటుంది. ఈ ఆలయానికి పశ్చిమాన ఉన్న సొరంగ మార్గం ద్వారా కృష్ణా నది ఒడ్డున
ఉన్న ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చని నమ్ముతారు.
పురాణాల
ప్రకారం నముచి అనే రాక్షసుడు ఘోర తపస్సు తరువాత బ్రహ్మ దేవుడి నుండి ఒక
వరం పొండుతాడు. ఆ వరం ప్రకారం పొడిగా లేదా తడిగా ఉన్న వాటితో అతనికి మరణం
కలుగకూడదు. ఆ తరువాత నుండి ఇంద్రుడిని అలాగే దేవతల్ని ఆ రాక్షసుడు
హింసించడం ప్రారంభిస్తాడు. మహా విష్ణువు సహకారం తో ఇంద్రుడు ఆ రాక్షసుడిని
సంహరించడానికి సిద్దపడతాడు. సుక్ష్మాకారం లో ఒక గుహలో దాక్కున్న ఆ
నముచిపైకి ఇంద్రుడు సముద్రపు నురుగు లో ముంచబడిన విష్ణువు యొక్క సుదర్శన
చక్రాన్ని పంపుతాడు. ఆ సుదర్శన చక్రం మధ్య లో దాగి ఉన్న విష్ణుమూర్తి ఆ
గుహలోకి వెళ్లి అక్కడ తన ఉపిరి ద్వారా వచ్చిన వేడితో ఆ రాక్షసుడి యొక్క
ప్రాణవాయువుని నాశనం చేస్తాడు. అందువల్ల సుదర్శన నరసింహ గా పేరు వచ్చింది.
ద్వాపర యుగం లో పాలవల్ల, త్రేతాయుగం లో నెయ్యి వల్ల అలాగే కలియుగం లో పానకం
వల్ల స్వామి వారు శాంతి చెందుతారు అని అంటారు.
మరి
యొక గాధ ప్రకారం, తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకోబోతున్న రాముడు
ఆంజనేయ స్వామి ని మంగళగిరి లో నివసించమని కోరుతాడు. ఆ తరువాత రాముల వారి
ఆశీస్సులతో మంగళగిరి లో నే ఆంజనేయ స్వామి ఉంటారు. మంగళగిరి
క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామిని కొలుస్తారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని
ముక్త్యాద్రి గా కూడా పిలుస్తారు. అంటే, ముక్తి ని ప్రసాదించే కొండ అని
అర్ధం.
నరసింహుని(సగం
సింహం సగం మనిషి) అవతారం లో ఉన్న స్వామి వారి ప్రతిమ ఇంకా స్వామి వారికి
ఎడమ వైపు ఉన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు రాతివి. స్వామి వారికి 108
సాలిగ్రామాలతో చేసిన దండ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. భారత, భాగవత రామయణాలలోంచి
వర్ణించబడిన కొన్ని ముఖ్య సంఘటనలతో చెక్కబడిన స్వామి వారి రథం ఈ ఆలయం లో
ని ప్రధాన ఆకర్షణ. విజయనగర పరిపాలకుల ముఖ్య సేనాధిపతి అయిన తిమ్మరాజు
దేవరాజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, భైరవ
స్వామి యొక్క అయిదు ప్రతిమలు, ఊరేగింపు రధం, వివిధ వార్షికోత్సవ వేడుకల
కోసం పది రకాల కోర్టులు, పూల తోటలు, సరస్సులు ఇంకా ట్యాంకుల వంటివి ఇతనే
ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ
ఆలయానికి ఉత్తరాన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, దక్షిణాన సీతా రామ
లక్ష్మణుల ఆలయం, పశ్చిమాన వాహనశాల ఉన్నాయి. ఈ నగరం లో పెద్దబజార్ ఉన్న
లక్ష్మీనారాయణ ఆలయం ఇంకా ఆంజనేయ మందిరం ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్నిఆలయాలు.
ఈ
ఆలయం లో సంవత్సరానికి ఒకసారి జరిగే పెద్ద పండుగ శ్రీ పానకాల లక్ష్మీ
నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు. శ్రీకృష్ణుడి అజ్ఞ ప్రకారం ఈ వేడుకలు
ధర్మరాజు చేత ప్రారంభించబడినవని అంటారు. ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలలో వచ్చే
ఫాల్గుణ శుద్ధ షష్టి నుండి పదకొండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ
ఆలయం లో ని విశిష్టత ఏంటంటే పానకాన్ని స్వామి వారి నోటిలో భక్తులు
పోస్తారు. ఎంత పానకం పోస్తే అందులో సగం పానకం మాత్రమే స్వామి వారు
సేవిస్తారు. మిగతా పానకం బయటకి పడిపోతుంది. పానకాన్ని స్వామి వారు
సేవిస్తున్న శబ్దాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఆశ్చర్యకరంగా స్వామి వారి దగ్గర
ఒక్కటంటే ఒక్క చీమ కనపడదు. స్వామి వారికీ పానకం నివేదించే ఆచారం ఉండటం
వల్ల పానకాల స్వామి గా ప్రాచుర్యం పొందారు. శ్రీరామ నవమి, హనుమత్జయంతి,
నరసింహజయంతి మరియు ఏకాదశి పండుగలను ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
🙏🙏🙏
Wednesday, April 26, 2017
జీవితంలో ఎవర్నీ తగ్గించి 🗣మాట్లాడకూడదు
25/04/17,
4:04:42 PM: +91 93947 40505: ఒక పక్షి 🦅బతికి ఉన్నప్పుడు చీమల్ని
🐜తింటుంది. ఆ పక్షి🦅 చనిపోయినప్పుడు దానిని 🐜చీమలు తింటాయి. కాలం,
పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి. జీవితంలో ఎవర్నీ తగ్గించి
🗣మాట్లాడకూడదు. ఎవర్నీ బాధించకూడదు. ఇవాళ నువ్వు💪🏽 శక్తిమంతంగా
ఉండొచ్చు. కానీ కాలం నీ కన్నా 💪🏽శక్తిమంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు🌳
నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల 🌳చెట్లను బూడిద చెయ్యడానికి
ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో 😇ఉండాలి. మంచిమనసుతో
🤔ఆలోచించాలి.ఫ్రెండ్స్
కామాక్షి – కన్యక
25/04/17, 1:06:10 PM: +91 80088 84529: కామాక్షి – కన్యక
మనం
శుభ్రత కోసం రోజూ బట్టలకు శరీరానికి పట్టిన మురికిని ఎలా వదిలించుకుంటామో
అలాగే జీవన గమనంలో చడ్డ ఆలోచనలు, చడ్డ ఆశలు, అనవసర కోపం వల్ల మనస్సుకు
పట్టిన మలినాన్ని కూడా వదిలించుకోవాలి. ప్రతిరోజు మన్ బుద్ధిని శుద్ధి
చెయ్యడం చాలా అవసరం. దానివల్ల చెడు భావనలు తొలగి మనకు దుఃఖము, బాధ కష్టాలు
దరిచేరవు. మనస్సును శుద్ధి చెయ్యడానికి వాడే నీరు కేవలం ధ్యానం. కాబట్టి
ప్రతిరోజు మనము కొద్దిసేపు భగవంతుని ధ్యానములో గడపవలెను. అమ్మసన్నిధిలో
ఎంతటి వాడికైనా చెడ్డ ఆలోచనలు పోయి మనసు ప్రశాంతత పొందుతుంది. అలాగే ఆ
పరాశక్తి సమక్షంలో మన మనస్సులోని కల్మశాన్ని కొడుక్కోవాలి.
ఆ
పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి రూపంలో ఇక్కడ నెలకొని ఉంది.
ఆబ్రహ్మకీట జనని అయిన పరాశక్తిని కన్యకగా కొలవటం మన పూర్వీకులు మేధస్సుకు
అద్దం పడుతుంది. ప్రతొరోజూ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముంది ధ్యానం చేసి
మన మన్సులను శుభ్రపరచుకోవడం అందరి కర్తవ్యం. అలా చేయడం వల్ల మన బాధలన్నీ
సూర్యుని ముందు మంచులాగా కరిగిపోతాయి. మనకు సంతోషం కలిగి మనము మన కుటుంబం
వృద్ధిలోకి వస్తుంది.
శ్రీ
వాసవి కన్యకాపరమేశ్వరిగా అవతరించిన ఆ పరాశక్తి ఆర్యవైశ్యులకు కులదైవం,
అరాధ్యదైవం. ఆ అమ్మయే కాంచీపురంలో కామాక్షిగా వెలసిన తల్లి. శ్రీ శంకర
భగవత్పాదులు లోపల శ్రీచక్రం ప్రతిష్టించి, కామకోటి పీఠాన్ని స్థాపించారు.
అలా వారు అనేక చోట్ల పీఠాలను స్థాపించడంలో ముఖ్య ఉద్ధేశ్యం రాబోవు తరాలకి
మన శాస్త్రాలను తెల్పడం, దాని వల్ల వారు ధర్మమార్గం వదలక పయనించేట్టు
చెయ్యడం.
కాలాంతరంలో మన
సంఘంలో ఎన్నో మార్పులు వచ్చాయి. శాస్త్రాలు నిషేధించిన అహారం తినడం మరియు
నైతిక విలువలు క్షీణించిపోతున్నాయి. మన సమాజాన్ని కులాలుగా వర్గాలుగా
విభజించడం మనలో తారతమ్యాలను తీసుకురావడానికి కాదు. అది అనుకూలమైన సమూహాలుగా
రూపొందించి, వారి క్షేమాన్ని పంచాయితి పెద్దలు పరిరక్షీంచేవారు. అటువంటు
సమూహాలను వారి వారి వృత్తుల ఆధారంగా జరిగేవి. ఆ కులాలోని పెద్దలు వారు
సరిగా పనిచేయునట్టూ, ధర్మమార్గం వదలక బ్రతికేలాగును చూసుకునేవారు. ఏదైనా
సమస్య వచ్చిన ఆ పంచాయితీలలో పరిష్కరించుకుని తప్పు చెసిన వారికి సరిఅయిన
దందనలు విశించేవారు. అలా సంఘంలో ప్రతి సమూహము చక్కగా పనిచేసుకుంటూ వారి
వారి ధర్మాలను ఆచరిస్తూ దేశ సంక్షేమానికి తోడ్పడేవారు.
కామకోటి
పీఠం పీఠాధిపతిగా మన శాస్త్రాలలో మనకు విధించిన ధర్మాలు మనం ఆచరించాలని
మీకు గుర్తు చెయ్యడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. వర్ణాశ్రమ ధర్మాల
ప్రకారం వైశ్యులకి ఉపనయన సంస్కారము, వేదాధ్యన అధికారము నిర్దేశించబడ్డాయి.
12 నుండి 24 ఏళ్ళలోపు ఉపనయనం చేసుకుని సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి.
వేదమును నేర్చుకుని నిరంతరము దాన్ని ఆమ్నాయం చెయ్యాలి. వేదమును,
పురాణాతిహాసాలను చదువుకుని ఋషిఋణం తీర్చుకోవాలి. వైశ్యులకు వర్తకము,
వాణిజ్యముతో పాటు ధర్మాచరణము కూడా ముఖ్యమైనదే. మూడు తరములు సంధ్యావందనము
వదిలేసిన వారిని వైశ్యులు అనికాక వైశ్య బంధువులు అని పిలవబడుదురు. అలాగే
బ్రాహ్మణ క్షత్రియులకు కూడా. అంతేకాక ముందుతరాలకు మన శాస్త్రాలను అందించటం
మన కర్తవ్యం.
ఈ పీఠం
యొక్క శక్తి భక్తుల అవ్యాజమైన ఆప్యాత అభిమానాలే. వాటినే పునాదిగా నేను పని
చేయగలుగుతున్నాను. విదేశీయులను మనదేశం ఆకర్శించునది ఈదేశ సంపద కాదు, ఈ దేశ
ప్రభోదించిన ఆధ్యాత్మిక సందేశాలకు వారు ఆకర్శితులవుతున్నారు. మీరు దీన్ని
మనసులో పదిలముగా గుర్తుపెట్టుకుని భక్తితో శాస్త్రము చెప్పినట్టుగా
బ్రతుకుతూ ఆ పరాశక్తి అనుగ్రహానికి పాత్రులగుదురని, ఆ జగజ్జనని మీకు
ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించుగాక!
--- ‘ఆచార్యాస్ కాల్’ చెన్నై కొత్వాల్ బజార్ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో స్వామివారి ఉపన్యాసం.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
మరణం తర్వాత?*
24/04/17, 6:00:18 PM: +91 97002 39198: *మరణం తర్వాత?*
మరణం తర్వాత జీవితం ఉందా?
మరణం అంటే ఏమిటి?
మరణం భాదాకరమైనదా?
పునర్జన్మ ఎలా సంభవిస్తుంది?
మరణం తర్వాత?
ముఖ్యంగా
మనం ప్రేమించినవారో లేక మనతో ఉండే వారికో మరణం సంభవించినప్పుడు, ఇలాంటి
ప్రశ్నలు మన మెదడులో మెదలతూ ఉంటాయి. ఆ సమయంలో మనం అప్పటిదాకా ఉన్న బంధం ఏదో
ఉన్నపలాన తెగిపోయింది అని భాదపడతాము అలాగే, ఆ భందం ఇంకా కొనసాగితే
బాగుండును కదా అని ఆలోచిస్తాము. ఈ ఆలోచనల పోరాటంలో, పైన వివరించిన
ప్రశ్నలకి సమాధానల కోసం, మన ప్రయత్నం మొదలవుతుంది.
*అందువలన, మరణం తర్వాత ఏమౌతుంది?*
మొట్టమొదటి
ప్రశ్న మన మనస్సులో ఉదయించేది *మరణం తర్వాత ఏమౌతుంది?* అని. ఇది ఒక
ఆశ్చర్యకరమైన పద్దతి. ప్రజలు మరణం అనేది ఒక భయానకమైనది మరియు ఆ తర్వత
పరీస్థితులు అత్యంత ఘోరమైనది అని అనుకుంటూ ఉంటారు. మరణం తర్వాత నేను
స్వర్గానికో లేక నరకానికో వెల్తాను అనుకుంటారు. మరణం తర్వాత ఏమౌతుందో
ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం కోసం, ఇకపై వచ్చే విషయలాను జాగ్రత్తగా
చదవండి.
*భుమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది*
భూమితో
ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల
ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే
మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు
పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు. ఎప్పుడైతే
మరణ ఘడియలు ఆసన్నమయ్యాయో అప్పుడు యమధర్మరాజు వచ్చి ఆ వ్యక్తి యొక్క
ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చాడని ప్రజలు విశ్వసిస్తారు.
*సూక్ష వెండి తీగ*
అసలు
ఏం జరుగుతుందంటే, ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ
తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు బందింపబడిన
ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం
ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి
శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని,
మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో
సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన
శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిని కాసేపటికి శరీరం
నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో
దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి
వచ్చేస్తుంది. *ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి,
ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.*
*భౌతికశరీరానికి ముగింపు*
ఈ
సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినబడటం మొదలవుతుంది. అలా అన్ని
మాటలు ఒక్కసారిగా ఎందుకువినబడుతున్నాయంటే, ఆ మరణించిన వ్యక్తి యొక్క
చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు, ధ్వనులరూపంలో వినబడటం జరుగుతుంది.
శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మా తన ప్రియమైన వాళ్లతో మాట్లాడుతుంది, నేను
మరణించలేదు అని చెబుతుంది. కానీ, ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు.
నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను మరణించానని ఇక తన శరీరంలో
జేరలేనని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో
జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది. సాధారణంగా
అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన
వుంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, *ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు
కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబందించిన ఆత్మ ఉండి,
అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుందని.*
*భౌతికదేహంతో విడివడుట*
ఇక
అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి
ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థీవ దేహం పంచభూతాలలో కలసిపోయిందని
నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బందాలన్నీ
పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్చ అనుభవంలోకి వస్తుంది.
ఆత్మ తలచుకున్న మాత్రానా ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7
రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, ఆఫీసు, పార్క్ లు ఇలా
తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ దేహంలో
ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే, మరణించాక, ఆత్మ తన గల్లాపెట్టి
వద్దనే ఉంటుంది. ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే, తన పిల్లలు ఉన్న
గదిలోనే ఉంటూ, వ్రేలాడుతూ ఉంటుంది. 7 రోజులు ముగిసాకా, తన కుటుంబానికి,
ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది.
*ఆత్మప్రయాణం*
ఆత్మలలోకానికి
వెళ్ళ్దడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసివుంటుంది.
అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. *ఈ 12 రోజులలో మనం
జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చవలసి వుంటుంది. మరియు మనం చేసిన
తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్ధించడము జరుపవలెను.* మనం
అలా అడగడం వలన, కొంతలో కొంత వరకైనా తన ప్రియమైన వారియొక్క, సరికాని అంటే
నెగటీవ్ ఎమోషన్ లు (భాదలు, కోపాలు మొదలగునవి) ఆత్మ ప్రయాణంలో
వెంటవెల్లకుండా ఉంటాయి. నేను మీకు సూచించేది ఏమిటంటే మరణం సంభవించిన రోజు
నుండి 21 రోజుల వరకు, రోజుకు 15 నిమిషాలు చొప్పున *హొపొనొపొనో* పద్ధతిని
అవలంబించండి. ఈ పద్దతి హవాయ్ దేశంలో చాలా పురాతణమైన పద్దతి. (ఈ పద్దతిలో
సంబందబాంధవ్యాలను మెరగుపరచుటకు, క్షమించమని ప్రార్థించడమూ జరుగుతుంది.)
*అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన
ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి.* ఆత్మలలోకానికి అడుగుపెడుతున్నాను
అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు
కనపడుతుంది.
*పూర్వీకులను కలసుకొనుట*
హిందువులు
11వ మరియు 12వ రోజున జరుపబడే హోమము మరియు ఇతర కార్యక్రమాలవలన, *ఆత్మ తన
పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన
వారిని కలసుకోవడం జరుగుతుంది* మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపుబందువులు మన
ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదేవిధంగా ఆత్మలలోకంలో కూడా
12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా
కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు, ఆత్మని తను
భూలోకంలో, భాద్యతవహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద
వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకునివెళ్తారు. దీనినే *కార్మిక్
బోర్డ్* అంటారు. ఈ బోర్డ్ లో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది.
*జీవితాన్ని పరిశీలించుకొనుట*
ఇచ్చట
అంక్షపెట్టే వారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. *ఎలాగైతే ఆత్మ భూమిపైన తన
జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే
జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని
తాను తప్పుచేసానని ఫీల్ అవుతుంది. *తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం
పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది.* ఈ విధమైన తన గత జీవితాన్ని
పరిశీలించుకోవడం ద్వారా, *రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు
లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలంజ్
లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక
రచనలతో నఖలు తయారుచేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు,
వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ, తాను ఎదుర్కొనవలసినవి
రచించుకుంటుంది.* ఉదాహరణకి ఒక వ్యక్తి తలనొప్పి వచ్చింది. ఎన్ని మందులు
వాడినా నయం కాలేదు. ఆ వ్యక్తి గతజన్మలను చూసుకునే ఒకప్రక్రియలో
పాల్గొన్నప్పుడు తెలిసినది ఏమిటంటే, తాను గత జన్మలో ఒక వ్యక్తిని ఒక పెద్ద
రాయితో తలపై కొట్టి చంపినట్లు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని
ఆత్మలోకంలో చూసుకున్నాడో, తాను తప్పుచేసిన భావనతో రాబోయే జన్మలో అంటే
ప్రస్తుత జన్మలో, తనకి ఎటువంటి మందులకి నయం కానటువంటి తలనొప్పి రావాలని తన
నఖలులో నిర్ణయించుకున్నాడు. మీకు ఇంకో ఉదాహరణగా నా బార్య ప్రేమ విషయం
చెప్పాలి. తను ధీర్ఘ కాలంగా, ఉబ్బసం అంటే ఆస్త్మా వ్యాధితో బాధపడుతుండేది.
గతజన్మలు చూసుకునే ఒక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు, తాను గత జన్మలో ఒక
తండ్రి కి కూతురు, ఈ జన్మలో కూడా ఆయనే తండ్రిగా వచ్చాడు. ఆ జన్మలో తాను 8
నుంచి 10 ఏళ్ళ వయస్సు లో ఉన్నప్పుడు తమ పాడి ఆవును బరికే తో కొట్టి
ఆనందించిందిట. ఆ సమయంలో ఆ ఆవు ఊపిరి సలుపుకోలేనంతగా భాదపడిందిట. అందువలన
ఆత్మలలోకంలో ఎప్పుడైతే ఈ విషయాన్ని చూసుకుందో, తాను రాబోయే జన్మలో అంటే
ప్రస్తుత జన్మలో శ్వాస సంబంధిత వ్యాధితో జీవితాంతం భాదపడాలని
నిర్ణయించుకుందిట.
*నఖలు లేదా నమూనా*
*ఈ
విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము.* ఒక
ముఖ్యవిషయం చెప్పాలి అదే ఏమిటంటే, మీరు ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు
లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ
ఆత్మా తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా భాదపడుతుందో అంత
ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను
భాదపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో భాదపడాలి అని కూడా
నిర్ణయంతీసుకుంటుంది. అందువలనే, *మీ భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని
అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి.*
ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ఒక ప్రాశాంతతో కూడిన కాలం ఆత్మకి
అప్పుడు ప్రారంభమవుతుంది.
*మరుజన్మ*
*మన
మరుజన్మ ఆత్మలలోకంలో తయారు చేసుకున్న నఖలు పై ఆధారపడి ఉంటుంది.* జన్మకి
మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా
పట్టవచ్చు. *మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము* ఒకోసారి
తల్లిగర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4, 5
నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ
సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్ట్లు
గ్రహముల అమర్చబడినాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను,
నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, *నీ జీవితం మొత్తం కూడా,
నువ్వు ఆత్మలలోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే.* ఒకసారి
మరుజన్మ తీసుకున్నాక, 40 రోజులదాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన
జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబందం లేకుండా నవ్వడమూ
లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని
జ్ఞాపకాలు ఆటోమెటీక్ గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా
అన్నంతగా మారిపోతాము.
*నఖలు అమలుపరచబడుట*
*ఇక
అప్పటినుండి నఖలు లో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం
ప్రారంభమవుతుంది.* ఇక అప్పటి నుండి, మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు
భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. *అందువలన మీరు ఇంకొకరిని వ్రేలెత్తి
చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ నఖలు లో మీరు పూర్తిగా మీ స్వంత
ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని.* మనము ఏదైతే
ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. *తలిదండ్రులు,
బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి
ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి.
వాళ్లందరూ మనము డైరక్టు చేస్తున్న సినిమాలో పాత్రలు వేస్తూ వారి వారి
పాత్రలకు న్యాయం చేస్తున్నారు అంతే.*
*మరణించినవారికి హీలింగ్ మరియు ప్రార్థనలు అవసరమా?*
మరణించినవారికి
ఖచ్చితంగా శక్తివంతమైన హీలింగ్ మరియు ప్రార్థనలు కావాలి, దానికి ఎన్నో
ముఖ్యమైన కారణాలు ఉన్నా, అతి ముఖ్యమైన కారణం ఎమిటంటే, వారు ఏదో ఒక కారణం
వలన ఆత్మలలోకానికి వెళ్లలేక భూమిపైనే వ్రేలాడుతూ ఉండకూడదు కాబట్టి.
మరణించిన తర్వాత భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో
కొన్ని, చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం,
అనుకోని సమయంలో అంటే ఉన్నపలంగా మరణం సంబవించడము, ఆత్మలలోకానికి వెళ్ళాలంటే
భయము, తప్పు చేసామనే భావన ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది
ఏమిటంటే వారికి జరుపవలసి కార్యక్రమాలను బంధువులు సరిగా లేక పూర్తిగా
నిర్వహించికపోవడము. ఆత్మ ఎల్లప్పుడూ ఇంకొంత కాలం జీవించి ఉంటే బావుండును
అనుకోవడం వలన కూడా భూమిపైననే వ్రేలాడుతూ లేక తిరుగాడుతూ ఉండడానికి ఒక
కారణము. ఏది ఏమైనప్పటికి ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది, ఈ గడువులోపే
తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల
లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది.
అలా
జరిగితే, ఆత్మల పరిస్థితి మరీ దయానీయకమై పోతుంది. ఎందువలన అంటే, అవి
ఆత్మలలోకానికీ వెళ్లలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ
తీసుకోలేవు. ఇలాంటి ఆత్మలు భయానకమైనవి మరియు నెగటీవ్ ఆత్మలే
అయివుండక్కర్లేదు కానీ తప్పనిసరిగా అటూ పోలేక ఇక్కడ వుండలేక మనుగడ
సాగించవలసి వస్తుంది. *అందువలననే మన ప్రార్థనలు మరియు మరణించినవారికి
జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి.* అలా చేయడం వలన, ఆత్మలు తమ
ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మలలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ
సాంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్దం అని వుంది. కానీ
*మరణించిన వారి కుటుంబ సభ్యుల ప్రార్థనలు మరణించిన వారికి ఎంతో సహాయం
చేస్తాయి.* ఇంకో ముఖ్యవిషయం నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, *ఆత్మల నుండి
రక్షణ కొరకు* ఒక చిన్న పెన్ సైజు లో ఉన్న కత్తి లేక గోళ్లు
కత్తిరించుకునేది పిల్లలు పడుకునే దిండు కింద పెట్టాలి. *అలాగే మనము
మరణించిన వారికి కాపాడుటకు వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం
కూడా ఎంతో ప్రాదాన్యమైనదే.*
దయచేసి
*మరణాన్ని ఏదో చిన్న విషయంగా భావించకండి*. ఈ కాలంలో సరాసరి 20% ఆత్మలు,
ఇందాక చెప్పబడిన ఎన్నోకారణాల వలన భూమిపైననే ఇరుక్కుపోయివున్నాయి. *చివరిగా
నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, మీకు వారు ఎంత ప్రియమైన వారైనప్పటికీ
మరణించిన వారిని తలచుకుని బాధపడకండి, ఏడ్వకండి. మనకి మరణం లేదు, మరణం అనేది
అంతం కాదు, అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి.*
Subscribe to:
Posts (Atom)
