11/04/17, 8:12:07 AM: +91 80088 84529: యమ్.జి.ఆర్ - ఉత్తర చిదంబరం
యమ్.
జి రామచంద్రన్ తమిళ ప్రఖ్యాత నటుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. వారు
పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. అనారోగ్యంతో అమెరికాలో వైద్యం
చేయించుకొని చెన్నై తిరిగొచ్చిన రామచంద్రన్ మహాస్వామి వారి దర్శనానికి
వెళ్ళారు. అత్యంత భక్తిప్రపత్తులతో స్వామివారిని దర్శించుకొని, స్వామికి
ఇలా య. ”మఠానికి మీరు ఏమి చెబితే అది చెయ్యడానికి నేను సిద్ధంగా
ఉన్నాను. ఆజ్ఞాపించండి”. ఆయనతో స్వామివారు, “కంచిలో వార తీర్థములు
ఉన్నాయి. వాటిని శుభ్రపరచి చక్కగా చూసుకునే ఏర్పాట్లు చెయ్యి. సోమవారం -
ఏకామ్రేశ్వర కుళం; మంగళవారం - మఠం ఎదురుగా ఉన్న మంగళా తీర్థం; బుధవారం -
చిన్న కాంచీపురం కాలిగమేడు దగ్గర్లోని సత్యవ్రత తీర్థం; గురువారం - కాయరోగన
తీర్థం; శుక్రవారం - కామాక్షి దేవాలయంలోని శుక్రవార తీర్థం; శనివారం -
సర్వతీర్థం; ఇప్పుడు వీటిలో స్నాఅనం చెయ్యాలని మాత్రం సంకల్పించకు” అని
చెప్పారు.
మహాస్వామివారి
వయస్సు, ఆరోగ్య రీత్యా ఆ తీర్థాల్లో స్నానం చెయ్యడానికి చాలా ప్రయాస
పడుతున్నారు. ఒక పెద్ద భక్తుడు స్వామివారికి సాష్టాంగం చేసి వేడుకొన్నారు.
“తన గురించి తాను పట్టించుకోవడం పెరియవకు ఇష్టం లేకపోవచ్చు. కాని మీరు మాకు
ముఖ్యులు. కనీసం మాకోసం మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిందిగా
ప్రార్థన. ఇది కేవలం మాలాంటి వారి కోసం కాని సాక్షాత్ పరమేశ్వరుడైన పెరియవ
కోసం కాదు”
మహాస్వామివారు
శిష్యునితో ఇలా అన్నారు. ”నాకు ఆకలి, బాధ, ఎవరైనా తిడితే బాధపడటం వంటివి
ఇక కలగనప్పుడు నేను నీ మాటను వింటాను. నాకు ఇంకా ఆ స్థాయి కలగలేదని అతనితో
చెప్పు”
అలాగే
స్వామివారు మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర చిదంబర దేవాలయం (తమిళనాడులోని
చిదంబరం నటరాజ దేవాలయ మాదిరి) నిర్మించాలని సంకల్పించినప్పుడు, దక్షిణ
భారతంలోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు; యమ్.జి.ఆర్, యన్.టి.ఆర్,
రామకృష్ణ హెగ్గడె (కర్ణాటక) మరియు వసంత్ దాదా పాటిల్ (మహారాష్ట్ర)
ముఖ్యమంత్రులకు ఆదేశం పంపారు. మీరు వరుసగా దక్షిణ, తూర్పు, పడమర, ఉత్తర
దేవాలయ గోపురముల నిర్మాణ బాధ్యత తీసుకోవాల్సిందిగా. అప్పుడు మొట్టమొదటగా
ముందుకు వచ్చినది దక్షిణ గోపుర నిర్మాణానికి పూర్తి ఖర్చును భరిస్తూ
యమ్.జి.ఆర్ గారే.
దేవాలయ
ముఖ్యద్వార గోపురమైన పడమర గోపురం నిర్మాణ బాధ్యత మహారాష్ట్ర వారు
తీసుకున్నందున దాన్ని “మహారాష్ట్ర గోపురం” అని; ఉత్తర గోపుర నిర్మాణాన్ని
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నందున “ఆంధ్ర గోపురం” అని; తూర్పు గోపుర
నిర్మాణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నందున “కర్ణాటక గోపురం” అని;
దక్షిణ గోపురాన్ని “తమిళనాడు గోపురం” అని వ్యవహరిస్తున్నారు. మొత్తం దేవాలయ
నిర్మాణానికి కావాల్సిన మేలు జాతి కలపను, ధ్వజస్థంబాన్ని కేరళ ప్రభుత్వం
సమర్పించింది.
ఒకసారి మహాస్వామివారు యమ్.జి.ఆర్ తో, “నువ్వు ప్రజలలో చాలా ప్రముఖుడివి కాబట్టి, ఆ ప్రజాదరణతోనే వారికి సేవ చెయ్యి” అని చెప్పారు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment