Saturday, August 31, 2019

శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ?
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-3

ఈ స్త్రోత్రం “శివః శక్త్యా” అనే పదాలతో , ఎంతో మంగళకరమైన ’శివ’ శబ్దముతో ప్రారంభమయ్యింది. శ్లోకమేమో “శక్తితో లేనినాడు, శివుడు స్పందించనూలేడు” అంటోంది. కానీ శ్లోకం ’శక్తి’ శబ్దంతో కాక  ’శివ’ శబ్దంతో మొదలయ్యింది. మనం సాధారణంగా ’సతి-పతి’, ’శ్రీమతి-శ్రీ’ అంటూ ఉంటాము. ముందు భార్య, తరువాత భర్త. ఈ స్తోత్రం అంతా శక్తి వైభవం గురించినది. శక్తి లేకపోతే శివునికి గొప్పదనమే లేదంటుంది. కాలకూట విషం మింగినా జీవించేఉన్నాడంటే అమ్మవారి తాటంకముల (కర్ణాభరణములు) మహిమే అంటుంది. శక్తి వైభవాన్ని ఎంతో వర్ణించిన స్తోత్రం మాత్రం శివుని పేరుతో మొదలయ్యింది, తరువాతే దేవి పేరు (శక్తి).

ఎందుకలాగ ? ఆచార్యులు ప్రపంచానికి ధర్మశాస్త్ర నియమాలను గుర్తుచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ ప్రాపంచిక భార్యాభర్తలకంటే ఈశ్వరుడూ, అమ్మవారూ చాలావిధాలుగా విభిన్నం. ఆడువారిని అబల అనటం కద్దు. మగవాడు ఆమెకు రక్షణ. బల అన్నా శక్తి అన్న ఒకే అర్థం. ఈ దేవతా జంట -శివ శక్తులను – చూసినట్లయితే , భార్య పేరే శక్తి. ఆమె లేక శివుడేమీ చేయలేడు. తమిళంలో ఎవరికైనా “ఓ మూల మాట్లాడకుండా కూర్చో” అని చెప్పాలంటే “శివనేన కిడ” అంటాం. పురాణ ప్రవచకులు ఈ విషయమై హాస్యమాడటం గుర్తువస్తుంది. ఎవరైన పనికోసం ఉత్సాహంగా బయలుదేరితే “శక్తి” తో బయలుదేరుతున్నాడని అంటాం. “శక్తి లేక శివుడిలా ఏంచెయ్యకుండా కూర్చున్నాను” అంటాం. ఈ భాష మనకు సహజంగా అబ్బినది.

ఈ ప్రపంచంలో జీవనవిధానం చూపే ధర్మశాస్త్రాలు, భార్య భర్తపై ఆధారపడిఉన్నదని తెలిపాయి. మనం దేవతా జంట – ఈశ్వరుడు అమ్మవారు – చూసినట్లయితే అది ధర్మశాస్త్రాలకు వ్యతిరేకం. ఈశ్వరుడు నిర్గుణ నిశ్చల పరబ్రహ్మమయితే అమ్మవారు గొప్ప శక్తి (మాయాశక్తి అనీ పిలువబడుతుంది), ఈ జగత్తును నడుపుతోంది.

శివుడు శక్తిరహితంగానూ, అమ్మవారు శక్తివంతంగానూ ఉండటం, కేవలం భావన మాత్రమే కాదు. కవితా సంప్రదాయంలోకూడా ప్రేమ, శృంగార అభినయములలో నాయికకు నాయకుడికన్నా ఉన్నతస్థానం ఇవ్వబడుతుంది. ఇరువురి మధ్య స్పర్థల తరువాత శాంతి నెలకొన్నప్పుడు కూడా నాయకుడే నాయిక పాదాలచెంత వ్రాలతాడు. ఇదీ కవులు నాయికానాయకుల సంబంధం చూసే విధానం.

జగద్గురువులుగా ఆచార్యులు, ధర్మశాస్త్రములో చెప్పబడిన ప్రవర్తనానియమావళి ప్రపంచానికి బోధించటం తమ తొలి కర్తవ్యంగా భావించారు. తరువాత మనుష్యుల పరిణతిని బట్టి (వివిధ దేవతలకు తమ స్తోత్రాలద్వారా) భక్తిని, తరువాత తత్వ, జ్ఞాన బోధ (తరువాతి కర్తవ్యాలని భావించారు). అయినాసరే ఈ స్త్రోత్ర రచన సమయంలో, అమ్మవారి స్పూర్థితో, శాక్త సంప్రదాయాన్నీ, మన కవితా సంప్రదాయాన్నీ దృష్టిలో ఉంచుకున్నారు. కాబట్టి మనం ఆచార్యులు అమ్మవారికి తమ భర్త పరమశివుని కన్నా ఉన్నతస్థానమునివ్వటం చూస్తాము. వారు కవితా సంప్రదాయములో నాయికకు నాయకుడికన్నా ఉన్నతస్థానం ఇచ్చినట్లే ఇక్కడా ఇచ్చారు. కానీ ఆచార్యులు ఈ విధంగా అనుకుని ఉంటారు – ” అన్ని ధర్మశాస్త్రాలూ భార్య భర్తను అనుగమించాలని ఘోషిస్తున్నాయి. రాతితో వివాహమైనా రాతిని భర్తగా గౌరవించాలి. ఈ స్తోత్రంలో అమ్మవారు అందుకు భిన్నంగా, శివునికన్నా ఉన్నతంగా చూపబడింది. ఒక ధర్మస్థానంలో కూర్చుని ఉన్నవాడిగా (ఆచార్యస్థానంలో ఉంటూ), ఆడువారందరూ అమ్మవారినే ఉదాహరణగా తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించాలి. ” ఈ ఆలోచనతో (అమ్మవారికి ఉన్నతస్థానము ఇచ్చినందుకు బదులుగా) ఆచార్యులు ఈ స్త్రోత్రప్రారంభములోనే “శక్తి” కి ముందే “శివు”ని ఉంచారు. శ్లోకంలో వెంటనే “శివుని గొప్పదనము శక్తితో కలిసినప్పుడే” అని చెప్పినా, శ్లోకాన్ని “శివ” శబ్దముతో ప్రారంభముచేస్తూ ఆడువారికి “అమ్మవారి గొప్పదనము శివుని పేరుకు ఉన్నతినివ్వటంలోనూ, అమ్మవారు శివుని అనుగమించుటలోనూ ఉన్నదని” ఉపదేశిస్తున్నారు.

స్తోత్రంలోని తరువాతి శ్లోకాలు చాలా స్పష్టంగా అమ్మవారు పతివ్రతలలో శ్రేష్ఠమైనదనీ, అమ్మవారి ప్రవర్తన ధర్మశాస్త్రాలకు పూర్తిగాలోబడి ఉన్నదనీ తెలుపుతున్నాయి. 29వ శ్లోకంలో అమ్మవారు సింహాసనారూఢయై రాజవైభోగంతో రాజరాజేశ్వరిగా ఉన్నట్లు వర్ణన ఉన్నది. దేవతలందరూ ఆ మహారాజ్ఞికి సాష్టాంగం చేస్తున్నారు. కానీ సభలో ఈశ్వరుడు ప్రవేశించగానే అమ్మవారు ఉత్సాహభరితయై పతియందు గౌరవాభిమానములతో ఎదురేగి స్వాగతం పలుకుతుంది. సాష్టాంగం చేస్తున్న దేవతల కిరీటాల వలన కాలు తూలగలదని పరిచారికలు హెచ్చరిస్తుంటారు. అలాగే మరో (64వ) శ్లోకంలో నిరంతరమూ అలుపులేకుండా అమ్మవారు తన పతి యొక్క గుణగణాల వర్ణన చేయుట చేత అమ్మవారి నాలుక ఎరుపెక్కి మందారపుష్ప వర్ణములోకి మారిందని ఆచార్యులు అంటారు.  పరమేశ్వరుని లీలావిశేషాలను రాగయుక్తంగా సరస్వతీదేవి తన వీణపై పలికిస్తుంది (66వ శ్లోకం).  అమ్మవారు ఆ వీణా వాదన తో సంతోషతరంగితయై మళ్ళీ మళ్ళీ వింటుంది. మరో శ్లోకంలో (82వ శ్లోకం) తన పతికి మరల మరల సాష్టాంగ ప్రణామములు చేయుటచేత అమ్మవారి మోకాళ్ళు బిగదీసుకుపోయాయి అని ఆచార్యులు అంటారు. చివరిశ్లోకాలలో ఒకదానిలో (96వ శ్లోకం) ఆచార్యులు “సతీనాం అచరమే” అంటూ అమ్మవారిని పతివ్రతలలో మొట్టమొదటది అంటూ శ్లాఘిస్తారు.

శాస్త్ర సంప్రదాయాలకు విరుద్ధమైన ఒక ఆదర్శమును జనులముందు ఉంచరాదని ఆచార్యుల నిశ్చిత అభిప్రాయము. అందుచేతనే తాము అమ్మవారి స్తోత్రంచేస్తూ , ఆస్తోత్రాన్ని అమ్మవారి పతి నామముతో ప్రారంభించారు. తల్లితండ్రులు. వేదాలలో మెదట “మాతృదేవోభవ” తరువాతే “పితృదేవోభవ” ఉన్నది. అయినా సరే, ఆచార్యులు (ఈస్తోత్రంలో) తరచుగా అమ్మవారికి శివునికంటే ఉన్నతస్థానం ఇవ్వటంచేత, అందుకు పరిహారార్థమా అన్నట్లు, ఈ స్తోత్ర ప్రారంభంలోనే శక్తి నామముకంటే ముందు శివుని నామముంచారు. శివుని గొప్పదనం శక్తీసమేతుడైనప్పుడే అని ఈ తొలిశ్లోకం యొక్క సారాంశం. కానీ శ్లోకంలోని పదప్రయోగంచేత అమ్మవారి గొప్పదనంకూడా శివసమేతురాలై ఉండుటపై ఆధారపడి ఉన్నదని చెప్పవచ్చు. కాబట్టి మొదట శివుడు, తరువాత శక్తి.

ఆదిదంపతులు ఒండొరులను స్తుతించుకుంటారు. ఆమె ఆయననూ, ఆయన ఆమెనూ స్తుతిస్తారు. నిజానికి వీరిలో ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు.  ఇద్దరూ సరి సమానులే. “అన్యోన్య సదృశం” – వైభవంలో ఈశ్వరుడూ, అమ్మవారూ సమానులు.

మనం “సమయం” అనే పదాన్ని ’మత’ మనే వ్యవహారంలో వాడుతాం. ఉదాహరణకు ’హిందూ సమయం’, ’శ్రమణ సమయం’ మొదలైనవి. ఈ పదం సామాన్య వ్యవహారంలో ఉన్నదంటే, అది “శివ-శక్తులు సమానమ”ను సిద్ధాంతముతో సంబంధమున్నది అయిఉండాలి.  శాక్త, శైవ సంప్రదాయాలు రెంటిలోనూ ఒక పూజావిధానానికి “సమయాచారము” అను పేరు ఉన్నది. అది బాహ్యపూజ ఏమీ లేకుండా ఉన్నత స్థాయిలో మానసికంగా రమించడం.  దేవత హృదయగతుడైనట్లు భావిస్తూ ధ్యానం చేయటం. దానికి “సమయం” అనే పేరెందుకు ?  ఇందులో, ఈశ్వరుడూ అమ్మవారూ ఐదు విధములుగా సమానమని భావన చేస్తూ ధ్యానిస్తారు.  ఈ విధమైన పూజకు “పంచ సమయం” అనిపేరు.

 – మొదట శివశక్తులిరువురూ తమ తమ నామములలో సమానులు.  ఆయన శివుడైతే ఆమె శివా. ఆయన హంస అయితే ఆమె హంసి.  ఆయన భైరవుడైతే ఆమె భైరవి.  ఆయనకు సమయ అనే పేరే ఉంటే ఆమె సమయి.
 – రెండు – వారిరువురూ రూపములో సమానులు. కామేశ్వరీ కామేశ్వరులుగా ఇరువురూ ఎరుపురంగులో ఉంటారు. ఇరువురికీ నాలుగు చేతులూ, మూడు కళ్ళూ, జుట్టులో చంద్రవంకానూ. ఇద్దరికీ చేతులలోని ఆయుధాలు ఒక్కటే – ధనుస్సు, బాణము, పాశము, అంకుశమూనూ.
 – మూడు – వారిరువురూ ఒకే ప్రదేశంలో ఉంటారు – మేరు శిఖరంపైన,  మణిద్వీప మధ్యంలో, అమృత సముద్రంలో, శ్రీచక్ర బిందువులో.
 – నాలుగు – ఇద్దరూ పంచకృత్యమనే ఒకే పని చేస్తారు.
– ఐదు – జగత్తు వీరినుండి అందుకునే ఆశీస్సులూ సమానమే.

శివశక్తులిరువురూ సమానమనే భావన మన మనస్సులలో ప్రగాఢంగా నాటుకుపోవాలి. జగత్తులో అన్ని జీవాలనూ ఒక్కటిగా చూడమంటున్నప్పుడు కొందరు దేవతలు మరికొందరు దేవతలకంటే ఎక్కువ , తక్కువ అని మాట్లాడవచ్చునా ? ముఖ్యంగా భార్యాభర్తలై మన తల్లితండ్రులైనవారి పట్ల భేదభావం చూపటం దోషమే అవుతుంది. కాబట్టి వీరిరువురూ నిజానికి ఒక్కరే అన్న విషయం మనం ఎల్లప్పుడూ గుర్తెరిగి ఉండాలి. ఎప్పుడైనా ఒకరిని రెండవ వారికంటే ఎక్కువ చేయవలసిన సందర్భం, కారణం రావచ్చు. బిడ్డడు తల్లి దగ్గరకు ప్రాకుతూ వెళ్ళి ముద్దుమాటలు చెప్పేటప్పుడు, బిడ్డడికి తల్లి అందరికన్నా గొప్పది. మరో సందర్భంలో అదే బిడ్డడు తండ్రినీ అలాగే భావించవచ్చు.  అలాంటి సందర్భాలలో  – తల్లిగానీ తండ్రికానీ – బిడ్డడి పూర్తి ధ్యాస ఒకరిమీదే ఉంటుంది. బిడ్డడు ఒకరు రెండవవారికంటే ఎక్కువ అనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.  అలాంటి తదేకధ్యాసతోనే ప్రేమ హృదయంపెల్లుబికి వస్తుంది. అలాంటి సందర్భాలలో  బిడ్డడి ప్రవర్తనను తల్లితండ్రులు తప్పుగా అర్థం చేసుకోరు. ఒక సందర్భంలో బిడ్డడు తండ్రి కంటే తల్లినే ఎక్కువ ఇష్టపడితే, తండ్రికి తల్లికన్నా “తక్కువ” గా కనిపించటానికి అభ్యంతరం ఉండదు. అలాగే తల్లికి కూడానూ.

కవితాదృష్టితో చూసినట్లయితే ఆదిదంపతులు తమ “బిడ్డడు అయిన కవి” కి  తల్లిపై ప్రేమ తండ్రి పై ప్రేమ కంటే ఎక్కువగా (లేదా తండ్రి పై ప్రేమ తల్లిపై ప్రేమ కంటే ఎక్కువగా) ఉండేలా తమ లీలను సాగిస్తారు.  తత్వాన్వేషణ చేస్తున్న బిడ్డడి ఆలోచన ప్రకారం జగన్మాత పితరులులో తల్లి, తండ్రికన్నా ఉన్నతంగా ఉండవచ్చు. లేదా తండ్రి, తల్లికన్నా ఉన్నతంగా ఉండవచ్చు.

సౌందర్యలహరి, ఎంత శాక్త సాంప్రదాయగ్రంథమో, అంతే భక్తి ప్రధానమైన గ్రంథము. మొత్తంమీద ఇది అమ్మవారి వైభవవర్ణన.  భార్యాభర్తల సంబంధములలో (ఈ గ్రంథము) ధర్మశాస్త్ర సంప్రదాయములకు విరుద్ధంగా ఉండరాదనే ఆతృతతో మన జగదాచార్యులు (ఆది శంకరులు) కొన్నిచోట్ల (గ్రంథములో) ఈశ్వరునికి అమ్మవారికంటే ఉన్నతస్థానమునిచ్చి సరిదిద్దారు. అందుకే ఈ స్తోత్ర ప్రారంభములో ముందుగా శివనామము నుంచి, తరువాత శక్తినుంచారు.
Source:shankaravani.orgForwarded by MVMRAO 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శ్రీ మహా గణాధి పతయే నమః

*శ్రీ గణేశ పురాణం - 3వ రోజు*



భీముడు అనే రాజు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భను పాలించేవాడు. భార్య చారుహాసిని. అనేక భోగభాగ్యాలు అనుభవిస్తూ ధర్మ బద్ధంగా రాజ్యాన్ని పాలించేవాడు కానీ సంతానలేమి వారిని బాధిస్తూ ఉండేది. దానితో ఒకనాడు మంత్రులకు రాజ్యాన్ని అప్పజెప్పి అరణ్యవాసానికి భార్యతో సహా పయనమయ్యాడు. మార్గ మధ్యంలో విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని తన సమస్యను వెల్లడించారు. దానికి సమాధానంగా తన గత జన్మలో చేసినదైవ అపరాధం వల్ల అలా జరిగిందని చెప్పి, ఆ రాజు గత జన్మలో ధన మదంతో వారికి 7 తరాలనుండి కులదైవంగా ఉన్న గణపతి పూజ మానివేయడం వల్ల ఈ జన్మలో సంతానం లేకపోవడం జరిగిందని చెప్పాడు.
దానికి రాజు, వారికి గణపతి ఎలా కులదైవం అయ్యాడో వివరించమని అడుగగా విశ్వామిత్ర మహర్షి చెప్పనారంభించాడు. ఆ రాజుకి 7 జన్మల పూర్వంలో ఆ వంశంలో వల్లభుడు అనే రాజుకు లేక లేక ఒక శిశువు కలిగాడు. కానీ వాడు గుడ్డి, చెముడు, మూగ, అవిటివాడుగా పుట్టాడు. దానితో వారు చాలా దుఃఖించి, ఆ శిశువు సహజస్థితికి వచ్చుటకు మణి, మంత్ర, ఔషధ, దేవపూజలు, తీర్థయాత్రలు చేయసాగారు. అయినా ఫలితం లేకపోఇంది. వానికి దక్షుడు అని పేరు పెట్టారు. ఒకనాడు రాజు కోపంతో తన భార్యను ఇక కనిపించవద్దని, బిడ్డను కూడా తీసుకుని ఎక్కడికైనా దూరంగా పొమ్మనెను. దానితో ఆమె బిడ్డను తీసుకుని గ్రామ గ్రామాలు బిచ్చమెత్తుకుంటూ తిరుగసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణ బాలుని దేహముపైనండి వచ్చిన గాలిసోకగానే, తన బిడ్డయొక్క లోపాలన్నీపోయి బాగుపడ్డాడు. దానితో ఆశ్చర్యచకితులై ఆ బ్రాహ్మణ కుమారుని కోసం ఎంతప్రయత్నించినా జాడ దొరకలేదు. అలా తిరుగుతున్న వారికి ఒక గణేశ భక్తుడు కలిసి, వారికి గణేశ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని వారు శ్రద్ధా నియమాలతో జపించడంతో వారికి గణపతి బ్రాహ్మణ బాలుని రూపంలో సాక్షాత్కరించి క్రమంగా గజాననుడిగా మారి వారితో, "మీ తపస్సుకి చాలా సంతోషించాను. మీకు వరాలివ్వాలని ఉంది. కానీ నేనే వరాలిస్తే నా మహా భక్తుణ్ణి కించపరచినట్లు అవుతుంది. నేను మీకు ఇవ్వాలనుకున్న వరాలు మీకు అతడిస్తాడు. అతడు నా భక్తులలో అగ్రగణ్యుడు. అతని పేరు ముద్గల మహర్షి." అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
ముద్గలుని జాడ ఒక మహర్షి వలన తెలుసుకుని, ఆ మహాత్ముని దగ్గరకు చేరారు. ఆ సమయంలో ముద్గలుడు గణపతియొక్క సువర్ణ ప్రతిమను పూజిస్తూ కనిపించాడు. దక్షుడిని చూడగానే ముద్గలుడు ప్రసన్నుడై దక్షుని ఆలింగనం చేసుకున్నాడు. తరువాత తనకు, గణేశునికి అభిన్నమని చెప్పి గణేశ రూపంతో సాక్షాత్కరించాడు కూడా. పిదప దక్షుణకు ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి దానిని నియమనిష్ఠలతో సాధన చేయమని, దానివలన దక్షునకు ఇహ పర సౌఖ్యాలు కలుగుతాయని చెప్పాడు. ఆ ఏకాక్షర మంత్రాన్ని దక్షుడు నియమ నిష్ఠలతో పుష్కరకాలం అనుష్ఠించాడు.


అదే సమయంలో కౌండిన్య పురమును పాలిస్తున్న చంద్రసేనమహారాజు కాలధర్మం చెందాడు. అతనకి సంతానం లేకపోవడం వల్ల రాజుగా ఎవరిని పట్టాభిషేకం చేయాలా అని అలోచిస్తున్న సమయంలో శ్రీ ముద్గలమహర్షి వచ్చి, ఆ రాజ్యం యొక్క పట్టపుటేనుగుకు రత్నాల మాలను ఇచ్చి, ఆ మాలను ఎవరి మెడలో వేస్తే వారే రాజుగా అర్హులు అని చెప్పగా, వారు ఆ విధంగానే చేసారు. పిమ్మట ఆ ఏనుగు ఆ ఊరును దాటి, గణేశ అర్చనలో ఉన్న దక్షుని మెడలో ఆ హారాన్ని వేసింది. దానితో మంత్రులు దక్షుని సకల రాజమర్యాదలతో రాజ్యానికి తీసుకువచ్చేరు. దక్షుడు శ్రీ ముద్గలమహర్షిని దర్శించుకుని, ఇది అంతా వారి కరుణయే అని చెప్పి, వారి ఆశీస్సులతో రాజుగా పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించసాగాడు. దక్షుడు కుండిన నగరంలో ఒక జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించి, వరద గణపతిని అందు ప్రతిష్ఠించాడు. ఆ నాటినుండి గజాననుడు వారి కులదైవమైనాడు. వల్లభుడు అనే రాజుకు గణపతి కలలో కనిపించి తన కుమార్తె వీరసేనను దక్షునకు ఇచ్చి వివాహం జరిపించమని చెప్పాడు. గణేశుని ఆదేశ ప్రకారం వీరసేనకు, దక్షునకు వివాహం అయింది. వారికి బృహద్భానుడను కుమారుడు కలిగాడు. బృహద్భానునికి ఖడ్గధరుడు, అతనికి సులభుడు, సులభునకు పద్మాకరుడు, పద్మాకరుడికి వపుర్దీప్తి, వపుర్దీప్తికి చిత్రసేనుడు, చిత్రసేనుడికి భీముడు కలిగాడు.

ఇలా విశ్వామిత్ర మహర్షి భీమరాజు వంశావళిని తెలియజేసాడు. దానితో భీమరాజు తనకు ఆ గణపతి ఎలా ప్రస్సన్నుడౌతాడు: ఎలా సాక్షాత్కరిస్తాడు?" అని ప్రార్థించాడు. దానికి విశ్వామిత్రుడు భీమునికి గణపతి ఏకాక్షర మంత్రాని ఉపదేశించి దక్షుడు ప్రతిష్ఠించిన గణపతి దేవాలయంలో అనుష్ఠించమని చెప్పాడు. భీముడు ఉపవాస నియమంతో మంత్రజపం చేస్తూ కూర్చున్నా, నిలబడినా, భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా ఆ గజాస్యునే స్మరిస్తూ ధ్యానిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. నీటియందైనా, భూమియందైనా, ఆకాశమందైనా..ఎక్కడైనా ఆ గణేశుని స్వరూపమునే దర్శిస్తూ వచ్చాడు. భీముని అనన్యభక్తికి మెచ్చి గజాననుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా గణేశునిపై నిశ్చల భక్తిని కోరాడు. గజాననుడు ఆ వరాన్ని అనుగ్రహించడమే కాక, వారికి ఒక గొప్ప పుత్రుడు పుడతాడని ఆశీర్వదించాడు. దానితో వారికి అందమైన పుత్రుడు ఉదయించాడు. వానికి "రుక్మాంగదుడు" అని నామకరణం చేసాడు. రుక్మాంగదుడు కూడా గణేశ ఏకాక్షర మంత్రాన్ని క్రమంతప్పకుండా అనుష్ఠిస్తూ సకల విద్యా పారంగతుడయ్యాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Forwaded By Balakoteswara Rao 
*📖 మన ఇతిహాసాలు 📓*


*బ్ర   హ్మ    క   పా   లం*


 "శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు….మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!,దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు…క్రమక్రమంగా ఎండి,చివరికది,కపాలంగా మారిపోయింది….బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరిబ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.'దేవాదిదేవా ! పరమజ్ఞామివి. నీకు తెలియని ధర్మం లేదు.ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .శాసించగలవాడివి.అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ..మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.
నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .
ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.'
అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.
అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……Forwarded by Balakoteswara Rao 
_*ఈ రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభం భాద్రపద మాసం విశిష్టత ఏమిటి ?*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే! భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.

ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.  ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.

తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’ అన్న పేరు వచ్చింది. కానీ ఈ పేరు వెనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి. ఆనాటికి రుతువులలో వచ్చే మార్పునీ, మనుషులలో పరివర్తన రావల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు.

పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే! వామనుడే కాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు. భాద్రపదమాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తల్చుకోవడం ఆనవాయితీ.

భాద్రపదంలో పండుగలే కాదు... నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఇదే కాకుండా ఉండ్రాళ్ల తద్ది నోము, ఉమామహేశ్వర వ్రతం కూడా గుర్తుంచుకోదగ్గవే!

ఇదీ భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Forwarded by Balkoteswara Rao 
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🌸🌸 *ఈ మాలను ధరించు*🌸🌸

కంచి పరమాచార్య స్వామివారు ఆత్మజ్ఞాని అన్నపదానికి సాకార రూపం. వారి కేవల దృష్టికే మహత్తరమైన శక్తి కలదు. స్థాయిభేదం లేకుండా వారు అందరిపై అపారమైన కరుణను చూపారు. వారి కరుణకు ఏదో పెద్ద కారణం అవసరంలేదు. వసంత ఋతువు రాగానే ప్రకృతి అపారమైన సౌందర్యమును ఆహ్లాదమును పొందినట్టు వారి సమక్షంలోకి మనం వెళ్ళగానే వారి కరుణాసముద్రంలో తడిసి ముద్దవుతాము. అలా వారి అపార కరుణకు పాత్రుడవడం నా పూర్వజన్మ సుకృతం.

కొన్నేళ్ళక్రితం నేను చాలా మానసిక సంఘర్షణకు లోనై నెమ్మదిని కోల్పోయాను. నా చుట్టూ ఉన్న ప్రపంచంపై వస్తువులపై నిర్మోహం కలిగి, ప్రాపంచిక విషయలపై ఆసక్తి తగ్గి కనీసం తాత్విక విషయాలను చదవడం కూడా మానేశాను. మరో విచిత్రం ఏటంటే నా జ్ఞాపకశక్తి కూడా సన్నగిల్లుతోంది. దశాబ్ధాలపాటు నేర్చుకున్నదేదీ గుర్తుకురావట్లేదు. అన్ని రకాల చికిత్సలు విఫలమయ్యాయి. కుటుంబంలో అందరూ నా పరిస్థితి చూసి ఆందోలన చెందుతున్నారు.

ఇటువంటి దీనావస్థలో కంచిలో చాతుర్మాస్యం చెయ్యలని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి అభ్యర్థనను మన్నించి పరమాచార్య స్వామివరు మహారాష్ట్ర నుండి కంచి వచ్చారని తెలుసుకున్నాను. వెంటనే కుంటుబ సమేతంగా కంచికి వెళ్ళి మహాస్వామి వారి పాదపద్మాలకు సాష్టాంగపడ్డాను. సంపూర్ణ శరణాగతితో స్వామివారిని అర్థించాను.

స్వామివారికి మొత్తం నా బాధలను వేదనలను చెప్పుకున్నాను. ముఖ్యంగా నాకు జ్ఞాపశక్తి తగ్గిపోవడం, దీనివల్ల నాకు ఎంతో ప్రీతిపాత్రమైన శాస్త్రబోధన కుంటుబడటం అన్ని విన్నవించాను. ఇంతకుముందు పరమాచార్య స్వామివారి ఆదేశం మేరకు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి తర్కశాస్త్రం బోధించాను.

తరువాత స్వామివారు నన్ను శాశ్వతంగా కంచి శంకర మఠంలో ఉండిపొమ్మని ఆజ్ఞాపించారు. శిష్యులొకరిని ఒక రుద్రాక్షమాలను తోసుకురావల్సిందిగా ఆదేశించారు. ఆ రుద్రాక్షమాలను చేతితో తడుముతూ చాలాసేపు మా కుటుంబ యోగక్షేమాలను విచారించారు. “ఈ మాలను ధరించు” అని వారు ఆజ్ఞాపించగానే తీసుకుని వెంటనే వేసుకున్నాను.

అంతే తరువాత కొన్నిరోజులకు మెల్లిగా నా రోగాలు, బాధలు మాయమై నా నేర్చుకున్న విషయజ్ఞానమంతా స్ఫురణకు రాసాగింది. కేవలం కొద్ది రోజులలోనే శాస్త్రబోధన చేసే దశకు చేరుకున్నాను. పరమేశ్వరుణ్ణి అర్చించే చేతులు పరమేశ్వరునికంటే మహోన్నతమైనవని మనకు “శ్రీరుద్రం” చెబుతుంది. అది పరమాచార్య స్వామివారి విషయంలో నిజం అయ్యింది.

--- ‘శాస్త్ర రత్నాకర’ యస్. ఆర్. కృష్ణమూర్తి శాస్త్రిగళ్

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవంBy Balalakoteswara Rao 

Wednesday, August 28, 2019

*ఉచిత సేవలు*

నమస్కారం,
 ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఈ క్రింది సేవలు ఉచితంగా అందివ్వబడును.

1) ఉచిత తెలుగు పుస్తకాలు(3526 pdf)
2) వీడియో ప్రవచనాలు(748)
3) ఆడియో ప్రవచనాలు(720)
4) మైండ్ మేనేజ్‌మెంట్‌(1999)
5) పిల్లలు(1597)
6) సామాజిక అవగాహన(3811)
7) ఇంపాక్ట్ - వ్యక్తిత్వ వికాసం(741)
8)ప్రతి రోజు మంచి వార్తలు

ఆండ్రాయిడ్ ఆప్:
https://play.google.com/store/apps/details?id=freegurukul.org

వెబ్సైట్:
www.freegurukul.org

మీ మిత్రులకు కూడా తెలియచేయగలరు.

ఇట్లు,
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్(NGO Regd: 315/2018) By Bala Koteswara RAO 
Great news... 🙏🙏

You can now read Vedas, Brahmanas, Aranyakas, Upanishads Vedangas online.Started by Gov of India.
Kudos to Gov...

Link vedicheritage.gov.in

Spread the message.Read a little at least, everyday
👍By MVMRAO 
కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి కి 40 కిలోమీటర్ల ముందు kateel అనే గ్రామంలో శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది గుడికి చుట్టు నందినీ నది ప్రవహిస్తూ ఉంటుంది అద్భుతమైన దృశ్యం
శివాయగురవేనమహ
కాకినాడ  శ్రీ శై వారాధ్యసేవాసమితిశ30వార్షికోత్సవంసందర్భంగావిశేషశివాభిషేకం శివశ్రీడా చాగంటికోటేశ్వరావుగారిస్వీయపర్యవేక్షణలోప్రముఖ వైద్యనిపుణులు
డాక్టర్ ఐవిరావుగారుదంపతులచేవిశేషఅభిషేకంజరుపబడింది
ఈఅభిషేకంలోకాకినాడసమితిసభ్యులందరుపాల్గొనితరించారు ఈఅభిషేకంలోపలురకాలపండ్లరసాలు సుగంథద్రవ్యజలాలుమహాబిల్వదళాలువిశేషమైనపూలతోఅర్చనజరుపబడింది
కాకినాడ లోజరిగినఈవిశేపూజాకార్య క్రమం నభూతో న భవిష్యతిఅనేవిధంగానిర్వహించబడింది శ్రీ మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ దంపతుచేడాక్టర్ ఐవిరావుగారుదంపతులకుసన్మానంవేదపండితులచేఆశీర్వచనంజరిగింది
ఇంతటిఘనమైనకార్యక్రమంలోపాల్గొనితరించిన సంఘ సభ్యులందరితరఫున క్రృతజ్ఙతలుతెలుపుకుంటున్నాము.
కార్యదర్శి చాగంటి వీర సుబ్రహ్మణ్యం కాకినాడ

Sunday, August 25, 2019

Today KALYANOTHSAVAM etc











శుభోదయం నిన్నటి రోజు నాగోల్ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం లో జరిగిన కార్యక్రమాల చిత్రాలు.  ఇక ఈ రోజు 13 వ వార్షికోత్సవాల చివరి రోజు నేటి కార్యక్రమం లో అమ్మవారికి అభిషేకం, పూర్ణాహుతి, స్వామి వారి కళ్యాణం, రథోత్సవం ఉంటాయి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వలసిందిగా ప్రార్థన