Tuesday, April 30, 2019

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ

అది దేవి నవరాత్రుల సమయం. పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు. స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆమె తమిళనాడు నుండి వచ్చి కలకత్తలో స్థిరపడిన మామి. ఒక్కరోజు కూడా అమె వీటిని తప్పలేదు. ఆమె శ్రీ రబీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజూ వెళుతుండేది. తొమ్మిది రోజుల పాటు పరమాచార్య స్వామివారి కర్యక్రమాలు చూసి మరుసటిరోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది.

మామూలుగా కలకత్తా వాసులు దేవి ఉపాసకులు. ఠాగూర్ గారు కూడా శ్రీవిద్యోపాసకులు అయినప్పటికి కొద్దిగా ఆధునిక భావాలు కలవారు. సాహిత్యంపై వారికున్న పట్టు జగమెరిగినది. మామి కొద్దిసేపటి తరువాత ఠాగూర్ గారిని కలిసింది. ఇన్నిరోజులూ కనపడలేదేమిటని ఆవిడని అడిగారు. ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారని దేవి నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ జరిగాయి అని చెప్పింది.

పరమాచార్య స్వామివారు కూడా దేవి ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే మామిని, “స్వామిజి కన్యాపూజ బ్రాహ్మణ కన్యతో చేశారా? లేదా వేరే అమ్మాయితో చేశారా?” అని అడిగారు.

”లేదు! పెరియవ ఎప్పుడూ సాంప్రదాయాన్ని తప్పరు. కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యాపూజ చేశారు” అని చెప్పింది మామి.

ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త, అందరిచేత గౌరవింపబడే ఆధునికవేత్త అయిన ఠాగూర్, శ్రీ లలితా సహస్రనామం నుండి ‘ఆబ్రహ్మకీటజననీ’ అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు. “ఆయన గొప్ప దేవి ఉపాసకులు; మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి? చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత. మరి కన్యాపూజకు బ్రాహ్మణ కన్యే ఎందుకు?”

ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామివారి గురించి అలా అనడం మామికి కొంచం మనస్థాపం కలిగించింది. ఆమె దీన వదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది. “నిన్న పూజకు రాలేదేమి?” అని మహాస్వామివారు అడిగారు.

”లేదు నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను” అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పలా వద్దా అని అలోచిస్తోంది.

మహాస్వామివారు అర్థం చేసుకుని మామితో, “వారు నాగురించి ఏమి చెప్పలేదా?” అని అడిగారు. ఇక ఆపుకోలేక కళ్ళ నీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది.

పరమాచార్య స్వామివారు నవ్వుతూ, “ఇంకా మూడు పదాలు ఉన్నాయి. ఆ శ్లోకం చదివేటప్పుడు అవికూడా కలుపుకోమను” అని చెప్పారు.

ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది. స్వామివారి సమాధానంలో ఎదో విషయం ఉందని గ్రహించి అది ఏంటని అడిగింది. ముందు వెళ్ళి చెప్పు తరువాత చూద్దాం అన్నారు స్వామివారు.

ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరకు వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది. ఠాగూర్ గారు గుర్తుతెచ్చుకున్నారు “ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ - నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా”. పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు. “అహా! అహా! దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసింది ఇలాగన్నమాట. నాకు తెలియదు ఇప్పటిదాకా! వారు సమాధానమిచ్చారు. స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారు” అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో “స్వామివారు మహాత్ములు. నేను చెప్పినది వారితో చెప్పావా? అరే! తప్పు జరిగిపోయింది”. వారు యోగ్యులైన సాహితీవేత్త. తరువాత ఏమి చెయ్యాలో వారికి తెలుసు.

“నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి. దయచేసి ఏర్పాటు చెయ్యండి. కాని అది బహిరంగంగా కాదు. ఎందుకంటే ప్రతి స్వామిజి నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు. తప్పక వారిని దర్శించాలి” అని అన్నారు. మామి సంతోషంగా స్వామివద్దకు వచ్చింది. పరమాచార్య స్వామివారు ఒక శేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామిని దర్శించుకున్నారు బయట జనానికి తెలియకుండా.

ఠాగూర్ గారు వారి రోజువారీలో రాసుకున్నారు. “ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు. వారిని దర్శించి నేర్చుకోవలసినది ఎంతో ఉంది” ఆ మహాత్ములెవరో చెప్పాల్సిన పనిలేదు. ఎందరో భక్తులు చెప్పారు. కొంతమంది దర్శించుకున్నారు. సాక్షాత్ దేవి అవతారమైన మహాస్వామివారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసనా ఫలితం కావచ్చు లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు.

[శ్లోకార్థం: చిన్న పురుగు మొదలుకుని బ్రహ్మండంలోని పిపీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి. అలాగే వర్ణము, ఆశ్రమము అనే పద్ధతిని విధివిధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే.

కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ. వర్ణవ్యవస్థ సైంటిఫిక్ వ్యవస్థ. ప్రతివర్ణమూ భగవంతుడు తరించడానికి ఇచ్చిన ఒకానొక మార్గము. ఉపాధిగతంగా అసమానత్వమే. చైతన్యగతంగా సమత్వం. ఎక్కువతక్కువలు లేవు]

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
నాన్నే నారాయణుడు...
అవసరాన్ని బట్టి తానే ఓ అవతారం అవుతాడు..

*పాకడానికి ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు..*

*అంబాడే సమయానికి "కూర్మం" అవుతాడు..*

*కాస్తా పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు"*

*అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నరసింహుడు"*

*తాహతు తేలీిక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు"*

*వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా నరుకుంటు వెళ్ళే"భార్గవుడు"*

*జీవిత విలువల నడక నేర్పే "రాముడు"*

*జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు"*

ఏదేమైనా.. నాన్నే నారాయణుడు!!

Monday, April 29, 2019







ఉపనిషత్తు
హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.
వ్యుత్పత్తి
ఉప +ని + షత్
ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట
ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.
ఉపనిషత్తుల అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి మరియు వారి పేరు మీద చేయబడ్డాయి: అవి యాజ్ఞవల్క, ఉద్దాలక మరియు అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద మరియు సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఇంకనూ చర్చించు, తర్కించు, విచారించు, వివేచించు వారు అయిన గార్గి, మరియు యాజ్ఞవల్క భార్య మైత్రేయి ముఖ్యమైన మహిళలు పేరు మీద కూడా ఉన్నాయి.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, దారా షిఖ్, 1657 లో. పెర్షియన్ భాష లోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగింది.
ఉపనిషత్తులులో ఎక్కువగా బ్రాహ్మణాలు మరియు అరణ్యకములు యొక్క ముగింపు భాగం లోనివి.
భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రములును ప్రస్థానత్రయం అంటారు.
అర్థము
వేదాల చివరి బాగాలు. గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. 1. పరావిద్య, 2. అపరా విద్య.
ఉపనిషత్తుల విభాగాలు
ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి: 1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నో పనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.
శైవ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్‌ వర్గీకరణ ఒకటి ఉంది.
శైవులు తమవని భావించే ఉపనిషత్తులు పదిహేను ఉన్నాయి: 1. అక్షమాలికోపనిషత్తు, 2. అథర్వ శిరోపనిషత్తు, 3. అథర్వ శిఖోపనిషత్తు, 4. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు, 6. గణపతి ఉపనిషత్తు, 7. జాబాలోపనిషత్తు, 8. దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు, 12. రుద్రహృదయో పనిషత్తు, 13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14. శరభోప నిషత్తు, 15. శ్వేతాశ్వతరో పనిషత్తు.[ఆధారం కోరబడింది]
వైష్ణవులు తమవిగా చెప్పే పదునాలుగు ఉపనిషత్తులు: 1. అవ్యక్తోప నిషత్తు, 2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోప నిషత్తు, 4. గారుడోపనిషత్తు, 5. గోపాలతాప సోపనిషత్తు, 6. తారసోపనిషత్తు, 7. త్రిపాద్వి భూతి ఉపనిషత్తు, 8. దత్తాత్రేయో పనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు, 11. రామ తాపస ఉపనిషత్తు, 12. రామరహస్యో పనిషత్తు, 13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు
సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి: 1. అరుణికోపనిషత్తు, 2. అవధూతోపనిషత్తు, 3. కఠశ్రుత్యుపనిషత్తు, 4. కుండినోపనిషత్తు, 5. జాబాలోపనిషత్తు, 6. తురీయాతీత అవధూతోపనిషత్తు, 7. నారద పరివ్రాజకో పనిషత్తు, 8. నిర్వాణోపనిషత్తు, 9. పరబ్రహ్మోపనిషత్తు, 10. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 11. పరమహంసో పనిషత్తు, 12. బ్రహ్మోపనిషత్తు, 13. భిక్షుక ఉపనిషత్తు, 14. మైత్రేయ ఉపనిషత్తు, 15. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 16. శాట్యాయన ఉపనిషత్తు, 17. సన్యాసో పనిషత్తు.
ఉపనిషత్తుల సంఖ్య
ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది పది ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన విన వస్తుంటుంది. ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉప నిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ, వైదిక వాఙ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సవిూపానికి తీసుకునిపోవడం అనే అర్థం ఉన్నదనీ, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో, ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య అంటారు. ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది

ఋగ్వేదానికి సంబంధించినవి - 10
కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
సామవేదానికి సంబంధించినవి - 16
అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)
ముఖ్య ఉపనిషత్తులు
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)

2. కేనోపనిషత్తు

3. కఠోపనిషత్తు

4. ప్రశ్నోపనిషత్తు

5. ముండకోపనిషత్తు

6. మాండూక్యోపనిషత్తు

7. తైత్తిరీయోపనిషత్తు

8. ఐతరేయోపనిషత్తు

9. ఛాందోగ్యోపనిషత్తు

10. బృహదారణ్యకోపనిషత్తు

11. శ్వేతాశ్వతరోపనిషత్తు

12. కౌశీతకి ఉపనిషత్తు

13. మైత్రాయణి ఉపనిషత్తు

14. బ్రహ్మోపనిషత్తు

15. కైవల్యోపనిషత్తు

16. జాబలోపనిషత్తు

17. హంసోపనిషత్తు

18. ఆరుణికోపనిషత్తు

19. గర్భోపనిషత్తు

20. నారాయణోపనిషత్తు

21. పరమహంస ఉపనిషత్తు

22. అమృతబిందు ఉపనిషత్తు

23. అమృతనాదోపనిషత్తు

24. అథర్వశిరోపనిషత్తు

25. అథర్వాశిఖోపనిషత్తు

26. బృహజ్జాబాలోపనిషత్తు

27. నృసింహతాపిన్యుపనిషత్తు

28. కళాగ్నిరుద్రోపనిషత్తు

29. మైత్రేయోపనిషత్తు

30. సుబాలోపనిషత్తు

31. క్షురికోపనిషత్తు

32. మంత్రికోపనిషత్తు

33. సర్వసారోపనిషత్తు

34. నిరలాంబోపనిషత్తు

35. శుకరహాస్యోపనిషత్తు

36. వజ్రసూచ్యుపనిషత్తు

37. తేజోబిందూపనిషత్తు

38. నృసిందబిందూపనిషత్తు

39. ధ్యానబిందూపనిషత్తు

40. బ్రహ్మవిద్యోపనిషత్తు

41. యోగతత్వోపనిషత్తు

42. ఆత్మబోధోపనిషత్తు

43. నారదపరివ్రాజకోపనిషత్తు

44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు

45. సీతోపనిషత్తు

46. యోగచూడామణ్యుపనిషత్తు

47. నిర్వాణోపనిషత్తు

48. మండల బ్రాహ్మణోపనిషత్తు

49. దక్షిణామూర్త్యుపనిషత్తు

50. శరభోపనిషత్తు

51. స్కందోపనిషత్తు

52 మహానారాయణోపనిషత్తు

53. అద్వయతారకోపనిషత్తు

54. రామరహస్యోపనిషత్తు

55. రామతాపిన్యుపనిషత్తు

56. వాసుదేవోపనిషత్తు

57. ముద్గలోపనిషత్తు

58. శాండిల్యోపనిషత్తు

59. పైంగలోపనిషత్తు

60. భిక్షుకోపనిషత్తు

61. మహోపనిషత్తు

62. శారీరకోపనిషత్తు

63. యోగశిఖోపనిషత్తు

64. తురియాతీతోపనిషత్తు

65. సన్యాసోపనిషత్తు

66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు

67. అక్షమాలికోపనిషత్తు

68. అవ్యక్తోపనిషత్తు

69. ఏకాక్షరోపనిషత్తు

70. అన్నపూర్ణోపనిషత్తు

71. సూర్యోపనిషత్తు

72. అక్ష్యుపనిషత్తు

73. అధ్యాత్మోపనిషత్తు

74. కుండికోపనిషత్తు

75. సావిత్ర్యుపనిషత్తు

76. ఆత్మోపనిషత్తు

77. పశుపతబ్రహ్మోపనిషత్తు

78. పరబ్రహ్మోపనిషత్తు

79. అవధూతోపనిషత్తు

80. త్రిపురతాపిన్యుపనిషత్తు

81. శ్రీదేవ్యుపనిషత్తు

82. త్రిపురోపనిషత్తు

83. కఠరుద్రోపనిషత్తు

84. భావనోపనిషత్తు

85. రుద్రహృదయోపనిషత్తు

86. యోగకుండల్యుపనిషత్తు

87. భస్మజాబలోపనిషత్తు

88. రుద్రాక్షజాబలోపనిషత్తు

89. గణపత్యుపనిషత్తు

90. దర్శనోపనిషత్తు

91. తారాసారోపనిషత్తు

92. మహావాక్యోపనిషత్తు

93. పంచబ్రహ్మోపనిషత్తు

94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు

95. గోపాలతాపిన్యుపనిషత్తు

96. కృష్ణోపనిషత్తు

97. యాజ్ఞవల్క్యోపనిషత్తు

98. వరాహోపనిషత్తు

99. శాట్యానీయోపనిషత్తు

100. హయగ్రీవోపనిషత్తు

101. దత్తాత్రేయోపనిషత్తు

102. గరుడోపనిషత్తు

103. కలిసంతారణోపనిషత్తు

104. బాల్యుపనిషత్తు

105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు

106. సరస్వతీ రహస్యోపనిషత్తు

107. భహ్వృచోపనిషత్తు

108. ముక్తికోపనిషత్తు

దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం:
దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా

ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ
దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.
వేదములవలె ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి. అనగా గురు ముఖతః శిష్యుడు విని నేర్చుకున్నవి.
ఆనాడు వేదాంతమును ఉపదేశించే అశ్రమాలకు (పాఠశాలలకు) ప్రధానమైన అంశాలు 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మ సూత్రములు.
ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ మరియు పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాతృడు.
భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును శంకరాచార్యుడు, ద్వైతమును మధ్వాచార్యుడు తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు.
అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేసారు.
కొత్త ఉపనిషత్తులు
పైన 108 ఉపనిషత్తులని తెలిపినప్పటికీ కొత్త ఉపనిషత్తుల రచన జరుగుతూనే ఉంది. ఎవరైనా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు, అప్పటికే ఉన్న ఉపనిషత్తులు కొత్త సిద్ధాంతంతో విభేదించిన సందర్భాలలో, సిద్ధాంతకర్తలే స్వయంగా మరో ఉపనిషత్తును రచించడం జరిగింది. అలాంటి కొన్ని ఉపనిషత్తులను 1908 వ సంవత్సరములో డా. ఫ్రెడ్రిక్ ష్రేడర్ అనే జర్మన్ భాషా శాస్త్రవేత్త కనుగొన్నాడు. అవి: బష్కళ, ఛాగలేయ, ఆర్షేయ మరియు శౌనక ఉపనిషత్తులు.
కొత్త ఉపనిషత్తులు ముఖ్య ఉపనిషత్తుల్లోని అనుకరణలు అయి ఉండాలి అని వాదన ఉంది.
ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి ఆంగ్ల అనువాదాన్ని హెన్రీ థామస్ కొలెబ్రూక్ 1805 లో రచించడం జరిగింది.
వేదాంతం
లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము
గురువుల స్థానం చాలా ఉన్నత స్థితిలో ఉండేది
బోధనా పద్ధతులు శ్రవణం, మననం, నిధిధ్యాస (అనుభవం)
వర్ణము (కులము అనరాదు) ద్విజులకు (అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు) వేద పఠనమునకు ఆర్హత కల్పించ బడింది. కానీ వేదాంత పఠనమునకు ఎట్టి నిషిద్ధము విధించలేదు.
అనగా అన్ని వర్ణములవారు దీన్ని అభ్యసించవచ్చు.
స్త్రీ విద్య కొంత మంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు

Sunday, April 28, 2019

శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో
చూడండి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ
ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ  
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః🙏🙏🙏
బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి తుకారామస్వామి చరిత్రము నుండి
గజానన దండకం

శ్రీ మన్మహాదేహ శృంగార! నీహార శైలేంద్రజాపుత్ర! లోకత్రయస్తోత్ర!
సమ్మోహ సౌందర్య సంపత్ప్రభా పుంజ సంభూత సద్గాత్ర! కైలాస శైలేంద్ర రాగామృతా స్వాదనాభృంగ! సద్భక్తి యుక్త ప్రజా పూజనామోదితా త్మాబ్జ భూదివ్య కారుణ్య సత్సంగ! గంధేభ వక్త్రా! సుగంధానులేపప్రభామాన దేహా! రమానాథ పద్మోద్భ వామర్త్యనాథార్చితా! ఏకదంతా! శ్రితాభీలనాశా! గణాధీశ! ఈశా! పురాణస్తుతాఖ్యా! చతుర్బాహురమ్యా! గజాధీశకర్ణా! గుహాగ్రీయ! ద్వైమాతురా! మోదకామోదకా! మూషకస్కంధవాహా! దయాస్వాంత! లోకేశ! హేరంబ! లంబోదరా! దేవధూమధ్వజా! విఘ్నవల్లీ విభేదీ! నిశానాధగర్వాంత! శీతాంశురేఖాస్ఫురత్ఫాల! కోట్యర్కభాస్వత్తనూ! దీనకల్పద్రుమా! దానధర్మోజ్వలా! స్వర్ణపీఠస్థితా! నాట్య సమ్మోదకా! నాద సమ్మోదకా! వేదవేదాంత సంస్తుత్య! విద్యా ప్రదాతా! ప్రఫుల్లేందు కోటిప్రభాభానురాస్యా! మునీంద్ర ప్రమోద ప్రదాతా! శివానంద! భూభృత్కుమారీ ప్రమోదాప్తి కార్యాచలా! నాగయజ్ఞోపవీతా! కుఠారాయుధా!   నీల వర్ణా! ఋషిస్తుత్య! విఘ్నేశ! విశ్వేశ్వరా! భూషణాలంకృతా! సత్కృపాభావ లీలావినోదా! నికృష్టావనా! శైలజా ప్రేమసంపాదనా! సర్వకార్యాంగ ప్రారంభ సంపూజనా! దేవలోకావనా! నీలానాగాననా! పాహిమాం! పాహిమాం! పాహిమాం!

Monday, April 22, 2019

🥀 *సంకష్టహరచవితి వ్రత విధానం* 🥀
https://www.youtube.com/hindudharmachakram

గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.
ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి.
రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు.
ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.
ఈ వ్రతాన్ని  12 లేదా 21 నెలలు ఆచరిస్తారు.
ఈ సంకట హర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి  అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే  ప్రదక్షిణ చేయవచ్చు.  శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.
సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

🥀 *సంకటహర గణపతి స్తోత్రం* 🥀

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

*సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.*

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ( *ఈ కథ అంతర్జాలంలో లభ్యం అయింది మాత్రమే, ఏ పురాణ అంతర్గతమో తెలియదు* )

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

*అంగారక చతుర్థి*

సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజ దోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.

భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు.

*అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?*

గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు.
అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ.
వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే,
అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'.
అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి,
వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

🥀 *సంక్షిప్త వ్రత విధానం* 🥀

1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
*2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి*.
*3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి*.
4. సాయంత్రమవగానే స్నానం చేయాలి.
5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
*7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి*.
*8. కొంతసేపు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి*.
9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.
10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
*11. చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి*.
*12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి*.
*13. బ్రహ్మచారికి భోజనం పెట్టి , తరువాత తానూ భుజించాలి*.
14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, నిద్రపోవాలి.

నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,

1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి?
జ. పైన bold చేసినవి (2,3,7,8,11,12,13).

2. ఏ పూలు వాడాలి?
జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.
వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు  వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.
3. ఏ మంత్రం జపించాలి?
జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,
' *ఓం సంకష్టహర గణపతయే నమః* ' అనే నామ మంత్రంగానీ,

'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే'
అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.

4. నైవేద్యం ఏమి సమర్పించాలి?
కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు, 21 మోదకాలు.

5. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?
జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.

6. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?
జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.

7. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?
జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.

8. పూజ చేయడం చేతకాదనుకుంటే?
జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.

🥀 *వ్రతాచరణ వలన లాభాలు* 🥀

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కఏడాది అయినా  ఆచరిస్తే చాలు మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం.

పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.

🥀 *సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు* 🥀

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం

🥀 *ఏకవింశతి నామ పూజ* 🥀

ఓం సుముఖాయ నమః మాలతీ పత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమః జంబూ పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః గణ్డకీ పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి

🥀 *వ్రత కథ* 🥀

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.
...✍ హిందూ ధర్మచక్రం - 9849485645* 🥀

Friday, April 19, 2019

సుందరకాండ విశిష్టత..!💐శ్రీ💐

ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ.
ఇది రామాయణంలో ఐదవ కాండ.
సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు.

సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి.
హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము,
లంకాదహనము,
సీత జాడను రామునికి తెలియజెప్పుట
ఇందులో ముఖ్యాంశాలు.

బ్రహ్మాండపురాణం ఈ కాండమును
"సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి,
న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది.

సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి
అనేక కారణాలున్నాయి.
తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది
ఏది లేదని చెప్పవచ్చు.
శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.

భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు.
అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు.
ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాండ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది.

ఆధ్యాత్మక చింతనతో చూస్తే..
భగవత్సౌందర్యమును,
జీవ సౌందర్యమును,
ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?
అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ.
సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ.
సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ.
సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.
పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో,
విశేషించి సుందరకాండలో,
హనుమ యొక్క కుండలినీ యోగసాధన,
త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి.

ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము.
ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును.
అట్టి అమ్మవారే సౌందర్యనిధి.
ఆమెయే సౌందర్యము.
శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు
ఆమె వసించును కావున ఇది సుందరకాండమైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి - రామాయణ రహస్యములు’ అనే పుస్తకాంలో అభిప్రాయపడ్డారు.

తతో రావణనీతాయహ్ సీతాయహ్ శత్రుకర్షనహ్ ఇయెష్ట పదమన్వెష్ణుం చారణచిరితె పథి సుందరకాండ ‘తత్’ అనే పదంతో కూడిన పైపద్యంతో మొదలవుతుంది.
తత్ అంటే పరబ్రహ్మము.
పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసనచేయాలో సుందరకాండ వివరిస్తుంది.
అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు. అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము: సంక్షేప రామాయణం,
శ్రీరామావతారము,
సీతాకళ్యాణము,
సీతారామోయోః సుఖజీవనము,
నాగపాశము విమోచనము,
ఆదిత్య హృదయము,
రావణవధ,
బ్రహ్మకృత రామస్తుతి,
పట్టాభిషేకము.
ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు.

సుందర కాండం పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు..💐
1.కళ్యాణం కావాల్సిన వారికీ కళ్యాణం,
2.ఆరోగ్య సంపద కోసం
3.గృహం లో శుభకార్యాలు జరగడం కోసం
4.భార్య భర్త ల మద్య సఖ్యత కోసం
5.ఇంట్లో ఏవరు అయిన తప్పి పోయిన వారు తిరిగి ఇంటి కి రావడం కోసం
6.సంతానం కోసం
7.పిల్లల అభివృద్ధి కోసం
8.ధన ప్రాప్తి కోసం
9.అప్పులు తీరడం కోసం
10.శని దోష నివారణ కోసం
11.బుద్దిమాంద్యం తగ్గుతుంది
12.ఇంట్లో గ్రహపీడ తొలగుతుంది.
13.మనసుకు శాంతి లభించి మానసిక బలం చేకూరుతుంది..

సుందర కాండము పారాయణం వల్ల ఉన్న ఫలితాలు ఇవీ..జై శ్రీరామ్..!!
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!!💐

Thursday, April 18, 2019

**హనుమత్ జయంతి విషయ సంగ్రహం--**
శ్రీపాద్మ,పరమపురుష సంహితలలో ఇట్లు కలదు.
1)వైశాఖమున అనూరాధ యందు శ్రీహనుమజ్జయంతి అని ఉన్నది.

2)శ్రీ హనుమజ్జయంతి చైత్ర పూర్ణిమ యందు ఉత్తరదేశం వారు ఆచరిస్తున్నారు.

3)ఎక్కువమంది వైశాఖ మాసమున కృష్ణ పక్షమున దశమియందు పూర్వాభాద్ర నక్షత్రమునందు ఆచరిస్తున్నారు.

4)మరికొందరు మార్గశీరమాసమున శుక్లపక్ష త్రయోదశి యందు హనుమద్వ్రతం అను పేరుతో ఆచరిస్తున్నారు.

*ఒక్కొక్క కల్పమునందు ఒక్కొక్క తీరుగా శ్రీ ఆంజనేయస్వామి జననము జరిగి ఉండుటచేత ఇట్లు అనేక తీరులుగాఉండెనని కొందరు పెద్దలు తెల్పుచున్నారు.
----------------------------------------
**హనుమత్ జయంతి**
చైత్రేమాసి సితేపక్షే హరిదిన్యాం మఘా౭భిదే-
నక్షత్రే చ సముత్పన్నో హనుమాన్ రిపుసూదన:!!
మహా చైత్రీ పూర్ణమాయాం సముత్పన్నో౭ంజనీ సుత:!
వదంతి కల్పబేధేన బుధా ఇత్యాది కేచన!!--శ్రీ ఆనందరామాయణే సారకాండే
----------------------------------------

Hindup temple at Ankotshat




















Wednesday, April 17, 2019

*శ్రీకాకుళం అరసవిల్లి సూర్య దేవాలయం...*

*అద్భుతం! జై శ్రీ సూర్యనారాయణా!*🙏

ఇంతకన్నా ఆధారాలు కావాలా సనాతన ధర్మం గొప్పతనం గురించి?

*ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూప ఆరాధన.!!*

1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌
2. భరణి -- సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి.
8. పుష్యమి - మహ గణపతి.
9. ఆశ్లేష - విజయ గణపతి.

10. మఖ - నృత్య గణపతి.
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి.
12 ఉత్తర - ఏకాక్షర గణపతి.

13. హస్త - వరద గణపతి .
14. చిత్త -  త్య్రక్షర గణపతి.
15. స్వాతి - క్షిప్రసాద గణపతి.

16. విశాఖ - హరిద్ర గణపతి.
17.అనూరాధ - ఏకదంత గణపతి.
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .

19 మూల ఉద్దాన గణపతి.
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి.

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి.
23. ధనిష్ట - త్రిముఖ గణపతి.
24. శతభిషం - సింహ గణపతి.

25. పూర్వాభాద్ర - యోగ గణపతి.
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి.
27. రేవతి - సంకట హర గణపతి.          

పై గణపతి ఆరాధన వలన
మన పూర్వ జన్మ కర్మల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పోందుతాము.

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలుకు
ముడి పడి వుంది.
పై గణపతులు మరియు నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకోగలిగితే
ద్వాదశ భావాలు యెక్క రహస్యం అర్దం అవుతుంది.

ఓం గణపతి దేవుని
దీవెనలు మన అందరికీ వుండాలని కోరుతూ శుభోదయం ఫ్రెండ్స్
*రుద్రం విశిష్టత*

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.
రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. నమో పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో చమే అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు. 

*నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |*
*నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||*

నమకం చమకం ఎవరైతే మూడుమార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకంప్రాప్తిస్తుంది.

*నమకం విశిష్టత :*

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని అనువాకం అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.

*అనువాకం 1:*

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం  ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతు వుల నుండి, జబ్బుల నుండి కాపాడుతుంది.
జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.

*అనువాకం 2:*

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.

*అనువాకం 3:*

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకుంటాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించు తాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

*అనువాకం 4:*

ఇందులో రుద్రుడు సృష్టికర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణ కోసం చదువుతారు.

*అనువాకం 5:*

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచతత్వాలు వర్ణించబడతాయి అనగా  సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

*అనువాకం 6:*

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేదరూపం, వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిషపరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

*అనువాకం 7:*

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని, వారసులను పొందడానికి పశుసంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మొక్షం కోసం కూడా చదువుతారు.

*అనువాకం 8:*

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాజ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.

*అనువాకం 9:*

ఈ అనువాకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వశక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

*అనువాకం  10:*

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.

*అనువాకం 11:*

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం  జ్ఞానానికి చదువుతారు.

*చమకం విశిష్టత*

నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.

Tuesday, April 16, 2019

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!
💠 శివాష్టకం - శివ అనుగ్రహం !!
💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!
💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!
💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!
💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!
💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!
💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!
💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!
💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!
💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!
💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!
💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!
💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!
💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!
💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!
💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!
💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!
💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!
💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!
💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!
💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!
💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!
💠 శ్రీ సూక్తం - ధన లాభం !!
💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!
💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!
💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!
💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!
💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!
⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!

పంచపునీతాలు
⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

💠 వాక్ శుద్ధి :
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

💠 దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

💠 భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

💠 కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

💠 మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

⏩ ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
⏩ ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
⏩ నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
⏩ యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
⏩ సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
⏩ గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
⏩ సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
⏩ పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
⏩ భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!

Friday, April 12, 2019

*మన సమస్యలకు గీత పరిష్కారాలు ~ 84*

*సమస్య*
                    లోకములో  అందరికీ ఒకే రకమైన అర్హతలు, లక్షణాలు ఉండవు కదా! వారందరూ భగవంతుణ్ణి చేరాలంటే వారికి తగినట్లు ఏవైనా మార్గాలున్నాయా? ఎలా భక్తులు భగవంతుణ్ణి చేరాలి?

*ఈ ప్రశ్నకు భగవానుడు ఏమని చెప్పినాడో గీతలో 12/8-9-10-11 శ్లోకాలను చూద్దామా!*

*మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్దిం  నివేశయ*
*నివసిష్యసి మయ్యేవ అతి ఊర్ధ్వం న సంశయః*

*మయి మనః ఆధత్స్వ* ~ నాయందే నీ మనస్సును లగ్నము  చెయ్యి;
*మయి ఏవ బుద్దిమ్ నివేశయ* ~ నాయందే బుద్దిని నిమగ్నము‌ చెయ్యి;
*అతః ఊర్ధ్వమ్ మయి ఏవ నివసిష్యసి* ~ ఆ పిమ్మట నాయందే నివసిస్తావు
*సంశయః న* ~ ఇందు ఏ మాత్రమూ సంశయము లేదు.

*అథ చిత్తం సమాధాతుం  న శక్నోషి మయి స్థిరమ్*
*అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుమ్ ధనంజయ*

*అథ చ్జిత్తమ్ మయి స్థిరమ్ సమాధాతుమ్* ~ ఒకవేళ ‌చిత్తమును నాయందు నిలుపుటకు;
*న శక్నేషి తతః ధనంజయ!* ~ సమర్థుడవు కానిచో అట్టి స్థితిలో అర్జునా!
*అభ్యాస యోగేన మామ్ ఆప్తుమ్ ఇచ్చ* ~ అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము;

*అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ*
*మదర్థమపి కర్మాణి  కుర్వన్ సిద్దిమవాప్స్యసి*

*అభ్యాసే అపి అసమర్థః అసి* ~అభ్యాసమునందును అసమర్థుడవైనచో;
*మత్క ర్మపరమః భవ* ~ మత్పరాయణుడవై కర్మలను ఆచరించుము;
*మదర్థమ్ కర్మాణి కుర్వన్ అపి* ~ నాకొరకై కర్మలను చేయుచునూ;
*సిద్దిమ్ అవాప్స్యసి* ~  నా ప్రాప్తి రూప సిద్దిని పొందుతావు.

*వ్యాఖ్య*

             ఏ పనికైనా ఆయా వ్యక్తుల అధికారాలను(అర్హతలు) బట్టి మర్గముంటుంది. అందరికీ ఒకే మార్గమని ఏమీ ఉండదు. వారి అర్హతలను బట్టి మార్గాలుంటాయి. *ఒకటి* ~ ఎప్పుడూ మనస్సును భగవంతునిపై వుంచడము, అన్ని పనులనూ   భగవత్పరముగా చెయ్యడము. *రెండవది* ~ మనస్సును నిలకడగా పెట్టుకోలేకపోతే అభ్యాసము చెయ్యి. *మూడవది* ~ మనస్సు చంచ లమైతే ప్రతిపనినీ ఆయనకే అంకితము చెయ్యి. *నాలుగవది* ~ నీవు నిత్యమూ చేసే కర్మల ఫలాన్ని ఆయనకు త్యాగము చెయ్యి.  *చివరిది* ~ అందరూ వారి వారి పనులు వారు చేసుకోవచ్చు;  ఫలాన్ని‌ ఆయనకే వదిలెయ్యి. ఈ ఐదింటిలో దేన్ని అశ్రయించినా మోక్షము వస్తుంది.

~~~~(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)~~~~

Thursday, April 11, 2019

First Hindu Temple in Abu Dhabi ... to be inaugurated by Narendra Modi on 20th April, 2019.

*మన సమస్యలకు గీత పరిష్కారాలు ~ 83*

*సమస్య*

           *అనన్య భక్తితో భగవంతుణ్ణి నమ్మి  సేవించేవారిని ఈ సంసార బంధాల  నుండీ ఆయన ఉద్దరిస్తాడా?*

*ఈ ప్రశ్నకు భగవంతుడు ఏమని సమాధానమిచ్చాడో గీతలోని‌ 12/7 వ శ్లోకాన్ని ఒకసారి చూద్దామా?*

*తేషామహం  సముద్దర్తా  మృత్యు  సంసార  సాగరాత్*
*భవామి  నచిరాత్  పార్థ  మయ్యావేశిత  చేతసామ్*

*ప్రతిపదార్థాలు:*

*పార్థా! తేషామ్ మయి ఆవేశిత చేతసామ్* ~ ఓ అర్జునా! అట్టి నాయందే లగ్నమైన చిత్తము కలవారికి;
*అహమ్ నచిరాత్* ~ నేను శీఘ్రముగా;
*మృత్యు సంసార సాగరాత్* ~ మృత్యు రూప సంసార సాగరమునుండీ;
*సముద్దర్తా భవామి*~ ఉద్దరించు వాడను.

*వ్యాఖ్య*

              *అటువంటి పరమ భక్తులను నాశ భూయిష్టమైన సంసార సముద్రము నుండీ భగవంతుడు తప్పకుండా సముద్దరిస్తాడు. అయితే వారు సర్వకర్మలను భగవంతుని పాదపద్మాలలో సమర్పించి, ఎల్లప్పుడూ భగవంతుని పైన ఆసక్తి  కలిగిన మనస్సుతో ఆయననే ధ్యానించాలి.*
*తాను ఏ పనిచేస్తున్నా, ఏ మాట మట్లాడుతున్నా, ఏ ఆలోచన చేస్తున్నా,* *దాన్ని దైవకృతముగా భావిస్తూ మూడు రకాల కర్మలలోనూ భగవంతుణ్ణి* *స్మరిస్తూ,మనస్సునుఆయనలోనేఆవేశింపజేస్తే,  ,అటువంటి ,భక్తాగ్రేసరులను భగవంతుడు తనవారిగా భావించి తప్పక కాపాడుతాడు. సంసార* *యాతనలు  అతనికి‌ అంటవు.  సంసార ధుఃఖాంభుధి నుండీ అలాంటి భక్తులను‌ భగవంతుడే ఉద్దరిిస్తాడు తప్పకుండా!*

~~~~(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)~~~~
🕉🌞🌎🌙🌟🚩

*మహర్షికి గోచీ ఎందుకు?*

      శ్రీ అరుణాచల రమణ మహర్షుల వారిని ఒకాయన  అయ్యా! మీరు వంటి మీద ఎక్కడా గుడ్డ కట్టుకోకుండా ఉన్నారు.మరి గోచీ మాత్రం పెట్టుకున్నా రంటే, మీకింకా సిగ్గూ, అభిమానంపూర్తి గా వదలనట్లున్నదే', అని అడిగాడట.  

         
         మహర్షుల వారు చిరునవ్వు నవ్వుతూ "నీవంటున్నవన్నీ నన్నెప్పుడో వదిలేసాయి, కానీ మీలాంటి వాళ్లు వచ్చి ఇలాంటివన్నీ అంటగడు తున్నారు. దానికి గుర్తుగా యీగోచీ నన్ను పట్టుకొని వదలటం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, బయట క్షీరరంద్రాలు లోపలి బ్రహ్మ రంద్రం కాక మానవులకూ జంతువులకూ తొమ్మిది చిల్లులే ఉన్నాయి. జంతువులూ,  పిచ్చి వాళ్ళు అన్ని చిల్లులూ గాలికి వదిలేస్తు న్నారు. మానవులు మాత్రం తలకాయ కున్న ఏడు తొర్రలు గాలికొదిలేసి, కింద రెండు మాత్రం గుట్టుగా గుడ్డలతో దాచుకుంటున్నారు. బైటవి  లోపలికి లాక్కునే  పై ఏడింటిని అదుపు చేసుకోలేక,  లోపలివి బయటకు వెళ్ళ గొట్టే కింద రెండిటిని దాచుకుంటు న్నారు. ...ఇది చిత్రమైన విషయమే, కానీ నాకవసరం లేదు.అందుకే తొలిరోజుల్లో ఈ వంటి మీద గుడ్డ వున్నదీ, లేనిదీ కూడా నాకు తెలియదు. అయితే ఆ తరువాత, వీడు  పిచ్చి వాడు కాదు, పశువూ కాదు,  మనిషే అని తెలియజేయడానికి ఈ గోచి నన్ను పట్టుకున్నది. కానీ నేను మాత్రం ఈ దేహం  కాదు. కాబట్టి మనిషిని కాదు. నాకీ దేహమే ఒక గుడ్డ. మళ్లీ దీనికో గుడ్డ ఎందుకనిపించి, గుడ్డ మీద గుడ్డ కట్టడం లేదు", ఆన్నారు‌‌ శ్రీ రమణ మహర్షులవారు. ( శ్రీ రమణమహర్షుల వారు బాల్యము నందే తపఃసిద్ధులు, ఆత్మసాక్షాత్కారము పొందినహాత్ములు).

🕉🌞🌎🌙🌟🚩
_*శ్రీరమణీయం* *-(135)*_
🕉🌞🌎🌙🌟🚩

_*"పూజలు, స్తోత్రాలు చివరికి ఏమవుతాయి ?"*_

_*స్తోత్రం అంటే జ్ఞప్తిలో ఉన్నదాన్ని వల్లెవేయటమే కదా ! నేను 'ఆత్మరూపాన్నే' అన్న జ్ఞాపకాన్ని నిరంతరం వల్లెవేస్తే వచ్చేది శాంతే. కాబట్టి అన్ని స్తోత్రాల్లోకి ఉత్తమ స్తోత్రం అదే అవుతుంది. ఏ పూజా విధానమైనా దేహభావన తగ్గించి శాంతినివ్వటానికే. అలా కానప్పుడు అవన్నీ నిష్ఫలం అవుతాయి. పరిశుద్ధంగా ఉన్న దైవాన్ని మనలోనే ఉంచుకొని మరెక్కడో ఉన్నట్లు వేడుకుంటాం. శాంతితో నిదానించే మనసు సహస్త్ర నామాలు పఠించినంత ఫలాన్ని పొందుతుంది ఎందుకంటే ఏ స్త్రోత్రాల ఫలమైనా కర్మలు తీర్చి శాంతిని ఇవ్వటానికే. అంతేకాకుండా పరమాత్మ ప్రతిరూపమైన ఆత్మ తెలియాలంటే మనసు నెమ్మదించాలి మరి !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'అనవసరమైన ఆలోచనలే ఆటంకం !'*-

🕉🌞🌎🌙🌟🚩
🌹 *వివేక చూడామణి* 🌹
*35 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*

🍃  *ఆత్మ మార్పులేనిది*  🍃

*380. బుద్దిని స్థిరముగా ఆత్మపై ఉంచినప్పుడు అది శాశ్వతముగా ప్రకాశమును వెదజల్లుతూ స్వయం ప్రకాశమైన సాక్షిగా అన్నింటిని దర్శిస్తుంది. ఈ ఆత్మ అసత్య వస్తు సముదాయము కంటే వేరుగా ఉంటూ, లక్ష్యమును చేరుటకు ఆత్మపై ధ్యానము చేయుము. ఇతర ఆలోచనలను వదలివేయుము.*

*381. నిరంతరముగా ఆత్మపై స్పందిస్తూ ఏవిధమైన ఇతర ఆలోచనలు మధ్యలో అడ్డుపడకుండా, ప్రతి వ్యక్తి ఖచ్చితముగా బ్రహ్మామే తన నిజమైన ఆత్మ అని తెలుసుకోవాలి.*

*382. ప్రతి వ్యక్తి తన గుర్తింపును ఆత్మతో జోడించి, అహమును ఇతర భౌతిక వస్తువులను వదలి, వాటితో ఎట్టి సంబంధమును పెట్టుకోకుండా, (ఎందువలనంటే అవి చిక్కులతో కూడినవి, పగిలిన కుండ ముక్కల వంటివి.) అలా ఆత్మను దర్శించాలి.*

*383. స్వచ్ఛమైన మనస్సును ఆత్మపై స్థిరపర్చి తమ ఖచ్చిమైన ఆత్మ విజ్ఞానమును పొందుతూ, నిదానముగా అట్టి స్థితిపై మనస్సును నిల్పిన అట్టి వ్యక్తి తన శాశ్వతమైన ఆత్మను తాను తెలుసుకొనగలడు.*

*384. ప్రతి వ్యక్తి తన ఆత్మను తాను దర్శించవలెను. అది విభజించుటకు వీలులేని, శాశ్వతమైనది. అన్ని పరిమితులకు అతీతమైనది. అది శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహమును తన యొక్క అజ్ఞానము వలన సృష్టించబడినవని గ్రహించి, అవన్నీ ఆకాశముతో నిండి యున్నవని తెలుసుకోవాలి.*

*385. ఆకాశము వందలకొలది పరిమిత వస్తు సముదాయమును తనలో నింపుకొని; అవి కుండ, జాడి, పార, సూది మొదలగునవి; తాను ఒకటిగా, అనేకముగా కాకుండా ఉన్నది. అదే విధముగా పవిత్రమైన బ్రహ్మము కూడా అహాన్ని ఇతరమైన వాటిని తనలో లేకుండా చేసి ఒకటిగానే తోచుచున్నది.*

*386. అపరమిత వస్తు సముదాయము గడ్డితో సహా అన్ని బ్రహ్మములోంచి వ్యక్తమైనప్పటికి అవి నిజముగా లేనివే అగును. అందువలన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, తాను శాశ్వతమైన బ్రహ్మమని అదే ఒకానొక సిద్దాంతము.*

*387. పొరపాటున ఏ వస్తువైనా ఒక దానిలో ఉన్నదని భావించిన, వెంటనే దాని గూర్చి వివరణ ద్వారా గ్రహించాలి. ఆ వస్తువునకు మూలము బ్రహ్మమేనని, దానికి వేరు కాదని గ్రహించాలి. ఎపుడైతే తప్పు భావన తొలగిపోతుందో, అసలు సత్యమైన తాడు వ్యక్తమై పాము తొలగిపోతుంది. అదే విధముగా విశ్వము నిజానికి ఆత్మయే.*

*388. ఆత్మయే బ్రహ్మము. ఆత్మయే విష్ణువు. ఆత్మయే ఇంద్రుడు. ఆత్మయే శివుడు. ఆత్మయే ఈ విశ్వమంతా దానికి మించినది ఏదీ లేదు.*

*389. ఆత్మయే లోపల బయట ఉన్నది. ఆత్మయే ముందు వెనుక ఉన్నది. ఉత్తరదక్షిణాలలో ఉన్నది ఆత్మయే. అలానే ఆత్మ పైన క్రింద ఉన్నది.*

*390. అలలు, నురుగు, సుడులు, బుడగలు మొదలైనవన్నియూ నీరుగాక వేరుకాదు. అదే విధముగా ఆత్మ జ్ఞానము, అన్ని అదే అయి ఉన్నది. శరీరము నుండి అహం వరకు ప్రతిది కేవలము చిత్‌తో సమానమైనవే.*
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*
🌹 *గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌)* 🌹
*34 వ భాగము*
✍ రచన : *పేర్నేటి గంగాధరరావు*
🍃 *వాసనలు 1* 🍃

*235. వాసన అనునది ఒక భయంకరమైన, అంధకారమైన వికారములతో కూడి; మానవునకు సుఖదుఃఖములు, రాగద్వేషములు, పునర్జన్మలకు కారణమవుతాయి.*

*236. వాసనలు మాయాజాలము పిశాచములవలె జన్మ జన్మలుగా వెంబడించి మనిషిని మింగి వేయచున్నవి. ప్రతి సాధకుడు తీవ్రముగా విచారణ అభ్యాసము ద్వారా వాటి స్వభావములను తెలుసుకొని ఎవరికి వారు తమ జన్మలను, సంస్కారములను ఉద్ధరించుకొనవలెను. ఇదే సృష్టి రహస్యము, జన్మ రహస్యము, మాయాతత్వము.*

*237. వ్యక్తి ఎంత పండితుడైనను, గొప్ప జాతి వారైనను, వాసనల వలననె బంధింపబడి పునఃజన్మలకు ఈడ్వబడుచున్నాడు. జననమరణ హేతువైన సంస్కారముల నుండి విడుదలయినవాడే ధీరుడనబడును.*

*238. పంచేంద్రియములు, మనస్సు ద్వారా విషయ భోగములపై వ్యామోహము కల్గిన మనిషికి దుఃఖము కలుగుచున్నది.*

*239. వాసనలకు పుట్టుక, ఆది లేదు. అనాదిగా ఇది మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. ఇవి వాటంతట అవె నశించవు. అది నశించాలంటే యోగ సాధన, యోగ విజ్ఞానము, సత్‌గ్రంధ పఠనము, దృఢ చిత్తముతో వాటి రహస్యమును తెలుసుకొని అంతము చేయాలి.*

*240. ఈ భౌతిక శరీరము వాసనలచే నిండియున్నది. మానవ దేహముచే, ఇంద్రియములచే, సూక్ష్మ శరీరములు చేయు కర్మల ఫలితములే వాసనలు. పూర్వవాసనలు ప్రారబ్ధాను భవమునిచ్చునప్పుడు సంస్కారములని పిలువబడును. జన్మ జన్మలుగా వెంబడించు కోరికలు, అలవాట్లు, అభ్యాసములతో కూడిన సంస్కారములు ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి బలపడి వాసనా రూపములుగా ఉంటున్నవి.*

*241. వాసనలు మూడు రకములు: 1) కర్మ వాసనలు 2) స్మృతి మాత్ర వాసనలు 3) కర్మలను అనుభవించుట వలన కలుగునవి (ఆగామి).*

*242. అనేక జన్మలందు అభ్యాసము చేతను, సంసార బంధముల చేతను, భోగముల చేతను, కోరికలు మొదలగు లౌకిక కార్యములే వాసనలగుచున్నవి.*

*243. విషయ వాసనలనే విషము, అవిద్యా, అజ్ఞానము వలన ప్రోగై దృఢపడి వాటితో నిండిన ఈ శరీరమే శాశ్వతమని భావన కలుగుటచే, అజ్ఞానములో కర్మలకు, బద్ధులగుచున్నారు.*

*244. వాసనలు అనేక రకములు.*
*1.లోకవాసన: అనగా లోకముచే గుర్తింపబడవలెనని కోరిక.*
*2.శాస్త్రవాసన: తాను గొప్ప శాస్త్రవేత్తననే భావన.*
*3. దేహవాసన: దేహమునందు ప్రీతి.*
*4.శుద్ధవాసన: సాధన ద్వారా తనలోని దుర్గుణములను వదలివేయుట.* *5.అశుద్ధవాసన: కామ క్రోధాదుల ద్వారా, వస్తు భోగముల ద్వారా ఏర్పడునది.*
*6. శుభవాసన: సాధన ద్వారా శుద్ధుడై శాశ్వతమైన మోక్షమునకు అర్హుడగుట.*
*7. సంచితవాసన: గత జన్మల వాసనలే సంచిత వాసనలు.*
*8. ప్రారబ్ధవాసన: తన యొక్క తన పూర్వికుల ద్వారా ఏర్పడిన వాసన ఈ జన్మలో వెంటవచ్చును.*
*9. ఆగామివాసన: కొత్తగా చేసినది రాబోవు జన్మలకు ప్రోగుపడినది.*
*10. ఇహలోక వాసనలు: ఈ లోకములోని ప్రసిద్ధ దృశ్యముల భావనలు.*
*11. పరలోక వాసనలు: సత్కర్మల ద్వారా పుణ్యలోక(స్వర్గ), దుష్కర్మల ద్వారా పాపలోక (నరక) అనుభవముల వాసనలు.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*
ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయంటుంది వేదం. ఈ జీవరాశులన్నింటినీ నాలుగు తరగతులుగా వర్గీకరించారు.

1. జరాయుజములు  - మావితోపుడతాయి

2. అండజములు -గుడ్డుబద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి

3. స్వేదజములు -చెమట నుండి పుడతాయి, పేలవంటివి.

4. ఉద్బుజములు - భూమిని చీల్చుకుని పైకి వస్తాయి, చెట్లవంటివి.

ఈ నాలుగురకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల జన్మలు తిరిగి తిరిగి అంటే పుట్టీ చచ్చీ, పుట్టీచచ్చీ, దాన్ని సంసార చక్రం అంటారు. అంటే జననమరణ చక్రమందు తిరుగుట అని. దీనికి అంతుండదు. శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం. ఈ సంసార చక్ర పరిభ్రమణం తాపం అంటే వేడితో ఉంటుంది. ఎందుచేత?

అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికయిందేమీ కాదు. భాగవతంలో *కపిలగీత* చదివితే పుట్టుక ఇంత భయంకరంగా ఉంటుందా! అనిపిస్తుంది.

శుక్రశ్రోణితములు కలిసిన దగ్గర్నుంచీ తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి, తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై, మెల్లమెల్లగా అవయవాలు సమకూరిన తరువాత తలకిందకు, కాళ్లు పైకీ పెట్టి గర్భస్థమైన శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది, జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే, తొమ్మిది నెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని కొట్టుకుని పరమేశ్వరుని ప్రార్థన చేసి, ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువు బయటికి తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు జీవుడు.

ఈ మనుష్యజన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో! ఆఖరికి చేసుకున్న పాపాలన్నీ చాలా భాగం తగ్గిపోయిన తర్వాత జన్మపరంపరలో పూర్తి చేసుకోవడానికి అవకాశమివ్వబడే చిట్టచివరి అవకాశం మనుష్య శరీరం. ఇదే మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం అంటారు శంకరులు.

జననమరణాలు పోగొట్టుకునే అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప మరే శరీరానికీ ఉండదు. దానితో ఒక్క మనుష్యుడు మాత్రమే కర్మానుష్ఠానం చేయగలడు.

మనుష్యజన్మ వైశిష్ట్యాన్ని అంతసేపు చెప్పి చివరన *కురుపుణ్య మహోరాత్రం* అన్నాననుకోండి. అంటే మంచి కర్మలు చేయండి అన్నప్పుడు *మనుష్య శరీరం కానప్పుడు అదెలా సాధ్యం*?

మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలమీద ఉంచి బుద్ధిస్థానాన్ని దానితో కలిపి పదకొండింటినీ భగవంతుని పాదాల వద్ద న్యాసం చేయడం నమస్కారం. ఇలా ఏ ఇతర ప్రాణీ చేయలేదు. అందుకే అలా కర్మలను చేయుటవలన భక్తితో జీర్ణించిన కారణంచేత ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు.

అందుకే *జంతూనాం నరజన్మ దుర్లభం* అంటారు శంకరాచార్యులు. అంటే మనుష్యుడు కూడా జంతువే.

*మనుష్యుడు జంతువెలా అవుతాడు*?

జంతువును సంస్కృతంలో ‘పశు’ అంటారు.

పాశంచేత కట్టబడినది కాబట్టి పశువు అయింది. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు ఉన్నవే కాదు, శాస్త్రంలో మనుష్యుడు కూడా జంతువుగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే తత్త్వాన్నిబట్టి మనకు కూడా ఆ మూడూ ఉంటాయి. అందువల్ల మనల్ని కూడా పశువులు అని పిలుస్తారు.

అయితే అలా అంటే మనం కాస్త చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు *శివానందలహరి* చేస్తూ అదేదో తన మీద పెట్టుకున్నారు.

*ఓ పరమేశ్వరా! నేను పశువుని, నీవు పశుపతివి* అన్నారు.

మనకు పశువుకులాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు. ఆ తాడు కట్టడానికి ఒక రాయి. మెడలో తాడు అంటే కర్మపాశాలు. కర్మపాశాల చేత జన్మ అనే రాయికి కట్టబడతాడు. అలా కట్టబడి ఉంటాడు కనుక మనిషిని కూడా పశువు అని పిలుస్తారు.

ఏ జంతువయినా పాశాలను విప్పుకుంటే యజమాని పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుష్యుడి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.

*సాధన* చేత మనుష్యుడి తాళ్ళు తెగిపడిపోతాయి. అంటే ఇక మళ్ళీ పుట్టనటువంటి స్థితిని పొందాడని గుర్తు. ఇది మిగిలిన జంతువులకు, మనిషికి ఉండే తేడా. కర్మపాశాల ముడి విప్పడం కాదు. కర్మపాశాన్ని పరమేశ్వరుడు తెంచేస్తాడు.

అందుకే భగవంతుని స్వరూపాలన్నింటిలో ఏదో ఒక చేతిలో గొడ్డలి లేదా కత్తి కనిపిస్తుంది. దానితో కర్మపాశాలను తెంపి, భక్తి పాశం వేసి ఆయన తన దగ్గరకు లాక్కుంటాడు. తన పాద పంజరంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని స్థితి కల్పిస్తాడు. ఇంత అదృష్టం ఒక్క మనుష్య శరీరానికే సాధ్యం. అందుకే శంకరుల వారు *జంతూనాం నరజన్మ దుర్లభం* అన్నారు.
భారతీయులు ఉపయోగించిన పుష్పక విమానాల గురించి సంపూర్ణ వివరణ  - 2 .

  అంతకు ముందు పోస్టులో మీకు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి కొన్ని విశేషాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు కొంతమంది ప్రాచీన విమానవిద్య నిపుణుల పేర్లు మీకు వివరిస్తాను .  వరుసగా

  నారాయణముని , శౌనకుడు, గర్గుడు, వాచస్పతి, చాక్రాయణి , దండినాధుడు, విశ్వనాథుడు, గౌతముడు, లల్లాచార్యుడు , విశ్వంభరుడు, అగస్త్యుడు, గోభిలుడు , అత్రి, గాలవుడు , వ్యాసుడు వీరు కాక మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 36 గురు విమానవిద్యానిపుణులు కలరు. అదేవిధంగా మరికొన్ని ప్రాచీన రహస్య గ్రంథాలలో కూడా ఈ పుష్పక విమాన విశేషాలు ఇవ్వడం జరిగింది. ఆ రహస్యగ్రంధాల పేర్లు మీకు నేను వివరిస్తాను. అవి

       క్రియాసారము , యంత్రసర్వస్వము , శౌనకీయము , లోహతంత్రము, దర్పణ ప్రకరణము, విమాన చంద్రిక, వ్యోమయాన తంత్రము , యంత్రకల్పము, ఖేటయాన ప్రదీపిక , యానబిందువు , మణిభద్రకారిక , లోహాప్రకారణము , వ్యోమయానార్క ప్రకాశము, శక్తితంత్రము , దర్పణ శాస్త్రము, ధాతు సర్వస్వము , శబ్దమహోదధి , గతినిర్ణయాధ్యాయము , సమ్మోహక్రియాకాండము , రూపశక్తి ప్రకరణము , ఔషధీ కల్పము .ఇలా 97 రహస్య గ్రంథాలలో ప్రాచీన విమానయాన రహస్యాలు ఉన్నాయి.

                మహర్షి భరద్వాజుడు రచించిన సూత్రము యొక్క వ్యాఖ్యాన ప్రసంగములో బోధానంధయతి విమానాశబ్దాన్ని వివరిస్తూ నలుగురు ఆచార్యులు ఇచ్చిన పలు అర్ధాలను పొందుపరిచారు. ఆ నలుగురు ఆచార్యుల పేర్లు లల్లాచార్య, నారాయణాచార్య, శంఖాచార్య, విశ్వంభరాచార్య వారు పొందుపరిచిన అర్ధములలో ఒక్కటి మీకు వివరిస్తాను .

         ఒక దేశము నుండి ఇంకొక దేశమునకు , ఒక ద్వీపము నుండి మరియొక ద్వీపమునకు అదే విధముగా ఒక లోకము ( గ్రహము ) నుండి మరియొక లోకమునకు ఆకాశములో ప్రయాణము చేయగలది ఈ విమానము అని ఆకాశ శాస్త్ర నిపుణులు నిర్వచించారు.  అదేవిధముగా విమాన చోదకుని ( పైలెట్ ) అర్హతలు ఏమిటి అన్నది కూడా కులంకుశముగా వివరించారు . ఈ అంశంపైనా అతడు మొత్తం విమానచోదకుడు 32 రకాల అర్హతలు కలిగి ఉండాలని తీర్మానించారు. ఈ అర్హతల గురించి లల్లాచార్యుడు "రహస్యలహరి " అనే గ్రంథములో వర్ణించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఆ అర్హతల గురించి సంక్షిప్తముగా తెలియచేస్తాను .

 32 రకాల అర్హతలు  -

     మాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాలక , గూడ , దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్షక, సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర , సురూప, జ్యోతిర్భావ , తమోమయ, ప్రలయ , విముఖ , తారా , మహాశబ్ద విమోహన, లంఘన , సార్పగమన, పల, సర్వోతోముఖ  , పరశబ్ద గ్రాహక , రూపాకర్షణ, క్రియా రహస్య హరణ , కర్షణ, దిక్ ప్రదర్శన, ఆకాశాకార, స్తబ్దక, జలదరూప,  ఇలా 32 రకాల అర్హతలే కాక మరొక 5 రకాల అర్హతలు కూడా అవసరం అని మరొక సూత్రములో తెలియచేశారు. దీనిని శౌనక ఋషి రేఖాపధము , మండలము , కక్ష్య, శక్తి, మరియు కేంద్రము అను అయిదు విధములైన ఆకాశమార్గములు చోదకునకు తెలియుట అత్యావశ్యకం అని తెలియచేసారు.

         పైన తెలిపిన విమాన చోదకునికి ఉండవలసిన అర్హతలలో కొన్నింటి వివరణ మీకు తరవాతి పోస్టులో వివరిస్తాను.

   గమనిక  -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు

                         9885030034

               అనువంశిక ఆయుర్వేద వైద్యులు
*యాసా పద్మాసనస్థా విపుల కటితటి పద్మపత్రాయాక్షీ*
*గంభీరావర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్థ్రోత్తరీయా*
*లక్ష్మీర్థివైః  గజేంద్రైర్మణిగణఖచితైః స్నాపితా హేమకుంభై*
*నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగల్య యుక్తః*

*జయ పద్మ విశాలక్షి జయత్వం శ్రీపతిప్రియే*
*జయ మాతర్మహా లక్ష్మీ సంసారార్ణవ తారిణీ*

*(అగస్థ్య విరచిత లక్ష్మీ స్థ్రోత్రము)*


ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని,
నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది.

నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.

నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ,
పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా,
ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా,
మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది.
మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే.

వాగ్భూషణం భూషణం

కేయూరాణి న భూషయంతి పురుషం* *హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా* సంస్కృతాధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

ఇది భర్తృహరి
నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి.
 ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి._*

సంభాషణం
మిత భాషణం,
హిత భాషణం,
స్మిత భాషణం,
ప్రియ భాషణం,
పూర్వ భాషణం,
సత్య భాషణం అయినప్పుడు-
అంతకన్నా భూషణం మరొకటి లేదు.

‘మితంగా,
హితంగా మాట్లాడాలి.
మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’
అనేవారు గాంధీజీ.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి.
మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా.
ప్రియంగా మాట్లాడాలి.
ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.

రాముడు స్మిత పూర్వ భాషి-
మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.

సత్యమే సర్వోన్నతమైంది
కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు.
ఆ సత్యాన్ని ప్రేమగా,
నేర్పుగా చెప్పాలి.
మర్యాదగా,
హుందాగా మాట్లాడాలి.

ఆలోచించకుండా మాట్లాడటం,
గురి చూడకుండా బాణం వేయడం లాంటిది.
మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు.
కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.

‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు.
*తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’*
అన్నారు స్వామి వివేకానంద.

ఎవరైతే తమ మాటలవల్ల,
చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

ఆచరిస్తూ చెప్పే మాటలకు
ఆదరణ ఎక్కువ.
ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.
ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ.
అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో,
ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ
గొప్ప కళ.
మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు.
మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి,
బలమైనవి కనుక సున్నితంగా వాడాలి,
ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

మాట్లాడటం
అందరూ చేస్తారు.
అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు.
మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో,
శరీరంతో మాట్లాడాలి.

మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం.
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది,
శత్రువుల్నీ తయారు చేస్తుంది.

నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.

అలాంటివారికి శత్రువులే ఉండరు.
మాటలు గాయపరచగలవు,
అదే గాయాన్ని నయం చేయనూగలవు.
సరైన మాటతీరు-
చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు,
లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు,
మరింత మధురంగా,
వినసొంపుగా అనిపిస్తుంది.
సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి.
తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి.
ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు,
సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.
ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది.