Friday, June 30, 2017
పరిశోధనలు - అధ్యాత్మిక అంశాలు
29/06/17,
7:01:22 PM: KK: *పరిశోధనలు - అధ్యాత్మిక అంశాలు:-- ఒక పరిశోధకుడు, ఒక
శాస్త్రవేత్త తాను ఎంచుయికున్న రంగంలో అన్వేషణలను చేస్తున్నప్పుడు, ( ఉదా:-
భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు మొదలైనవి ) ఆయా శాస్త్ర పరిశోధనలు చాలా
లోతుగా చేయబడినప్పుడు, పరిశోధనా విషయానికి అతీతమైన అనేక కొత్త విషయాలు
తెలుస్తుంటాయి. ఇవి ఆధ్యాత్మిక విషయానికి, లేదా, విశ్వ చైతన్యశక్తి యొక్క
విభూతులకు సంబంధించి అయివుంటాయి. అప్పటి మన ఋషులు చెప్పినవాటికి, ఇప్పటి
ఆధునిక శాస్త్రజ్ఞులు చెబుతున్నవాటికి సమపోలికలు కనిపిస్తుంటాయి.*
గరుడ గమన తవ చరణకమలమిహ
28/06/17,
8:54:26 PM: +91 94414 31313: This is a kriti on Maha vishnu composed
by Jagadguru Bharathi Theertha swamiji. Just by hearing this itself
your mind gets relaxed. Most powerful as Maha Vishnu will ward off all
difficulties.
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీి - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం - 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా?
29/06/17, 7:31:38
PM: +91 77990 20257: ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని
”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు
అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా,
పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం
చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి
నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి
ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు.
నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే
చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా
శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి
చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని
అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే
మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్
సాధన ఫలించింది అనడానికి సంకేతాలు
29/06/17,
7:01:13 PM: KK: *సాధన ఫలించింది అనడానికి సంకేతాలు (ప్రాథమిక
స్థాయిలో):-- కొందరికి గుడికి వెడితే బాబా మీద అలంకరించిన పువ్వు పడితే అది
వారికి ఆశీస్సులు లభించినట్లు సూచన. కొందరికి వారి సంకల్పం తలుచుకోగానే
పూజారి ప్రసాదం ఇవ్వడం సంకేతం. ఒకరికి హోమం చెయ్యగానే వర్షం పడితే అది
దేవతానుగ్రహ సంకేతం. కొందరికి జపం చేస్తున్నప్పుడు శరీరం రోమాంచితమయ్యే
కుండలినీ జాగృతీకరణ సంకేతం. చండీ సప్తశతిలో అర్గళా (అంటే గడియ అని అర్ధం)
స్తోత్రాన్ని ఉపాసిస్తే తలుపుకున్న గడియలు వాటంతట అవే కొట్టుకోవడం చప్పుడు
చేయడం, తలుపులు తెరుచుకోవడం సంకేతం. ఇలా ఎన్నో రకాల సాధనా సంకేతాలు ప్రపంచ
వ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాయి. తెలంగాణాలో ఒక ప్రదాయంలో కొత్తగా
పెళ్ళైన తర్వాత దంపతులు పూజ చేసి ఎదురుగా మూడు బిందెలు పెడతారు. అందరూ
'గోవిందా, గోవిందా' అంటూ మనసులో పితృ దేవతలని ఆహ్వానిస్తారు. చిన్నపిల్లలు ఆ
నీళ్ళు నిండిన బిందెల మీద చెయ్యి ఆంచి ఉంచుతారు. కొంతసేపటికి ఆ బిందెలు
వాటంతట అవే జరగడం మొదలుపెడతాయి. ఇది ఆ పితృ దేవతల ఆశీస్సులకి సంకేతంగా
భావిస్తారు.*
శ్రీ విద్యా సాధకులనియమాలు
29/06/17, 9:18:05 AM: +91 99499 26268: 🌹 *శ్రీ విద్యా సాధకుల నియమాలు*🌹
👉🏻
1. గురువు ను దూషణ గాని పరిహాసము గాని చేయరాదు.
👉🏻
2. గురువును మన ఆలోచనలకు సరిపడ నడవమని చెప్పరాదు.
👉🏻
3. గురువు వద్దనుండి ధనము ఇచ్చి పుచ్చు కోకూడదు.
👉🏻
4. గురువుకు నచ్చనివారితో సహవాసమును చేయరాదు గురు దూషణ కూడ చెవులతో వినరాదు
👉🏻
5. గురువు చెప్పే మాట చేసే పని విరుధ్ధం గా ఉన్నా కూడా వారు చెప్పిన దాన్ని పాటించడమే
👉🏻
6. గురువు కూడా మనలాగ మనిషి అని తెలుసుకుని వారి తప్పులెంచకూడదు
👉🏻
7. గురువే భగవంతుని రూపముగా భావించాలి కాని సందేహం కూడదు.
👉🏻
8. గురువు వద్ద సమర్పణలో ఏరకమైన లోపము లోభము ఉండకూడదు
👉🏻
9. గురు ఆజ్ఞను లోకమునకు భయపడి ఆచరించకుండా ఉండరాదు
👉🏻
10. అందరి ముందు గురువుకు నమస్కారం చేయడానికి సిగ్గు పడకూడదు.
👉🏻
11. గురువును చాలా కాలము చూడకుండా ఉండకూడదు.
👉🏻
12. గురు పాదుక ఇచ్చారు కదా ఇక గురువెందుకు అని నిర్లక్ష్యం చేయకూడదు
👉🏻
13. గురువు నుండి ప్రత్యేక ఫలితంకోసం మంత్రము అడగకూడదు .నాకు ఆమంత్రం ముందే తెలుసు అనకూడదు.
👉🏻
14. గురువు వద్ద నాకు మంత్రం ఓక విధంగాను వేరొకరికి వేరే విధంగాను ఎందుకు ఇచ్చారని అడగకూడదు. మంత్రం ఇంత చిన్నగా ఉంది అని అడగకూడదు.
👉🏻
15. గురువుతో వేరే శిష్యులు దగ్గరగా చనువుగా ఉండటం గురువు వారికి చేసే ఉపచారాలు ఉపేక్షణలు చూసి అసూయపడకూడదు .
👉🏻
16. గురువు తో వేరొకరు మాటలాడునది ఏమిటి అని తెలుసుకొనుటకు ప్రయత్నించరాదు.
*గురువు మార్గదర్శి మాత్రమే. సాధన మనమే చేయాలి.*
ఒక యజ్ఞం జరుగుతోంది----
30/06/17,
2:02:07 PM: +91 80088 84529: ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో
బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు . అప్పుడు భార్య చెప్పింది.
"నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది."
ఇంటి యజమానిపరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు.
మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.
ఈ
వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ
కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
"యజ్ఞం
పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం.
బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే
ప్రసక్తే లేదు" అన్నాడాయన.
ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
ఆయన భార్యకు ఇది నచ్చలేదు.
"మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం" అని నచ్చచెప్పింది.
అర్కసోమయాజి ససేమిరా అన్నాడు.
చివరికి ఆమె కోపంతో *పుట్టింటికి పయనమైంది.
ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.
ఊరి
పొలిమేర దాటాడో లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల
పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు.
మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.
అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.
అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు.
"ఇన్నాళ్లూ
నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం
తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో
ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను
చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను." అన్నాడు కలిపురుషుడు.
...ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే...
II ధర్మో రక్షతి రక్షితః II
ప్రణవ ధ్వని ఓంకారం
30/06/17, 9:57:02 AM: +91 79811 59026: _ప్రణవ ధ్వని ఓంకారం_
*ఓంకారానికి,
ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ
మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది.*
ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో
ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.
‘ప్రశాంతత
కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి’ అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా,
లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. *‘అ’కార, ‘ఉ’కార,
‘మ’కారాలు కలిసి ‘ఓంకారం’ అయిందని పండితులు చెబుతారు.*
*ఔషధాన్ని
నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ
అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా
పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టవద్దు- అంటారు యోగ
నిపుణులు.*
వేదభూమికి
ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే
చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు
చెబుతున్నాయి.
*ఓంకారం
అంటే, ఆనంద స్వరూపం.* అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ,
మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం
చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.
సుధాసింధోర్మధ్యే*
30/06/17, 9:58:53 AM: +91 98660 49721: *సుధాసింధోర్మధ్యే* *సురవిటపివాటీపరివృతే*
*మణిద్వీపే నీపోపవనవతి* *చింతామణిగృహే .*
*శివాఽకారే మంచే* *పరమశివపర్యంకనిలయాం*
*భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్*
ఇంతవరకూ మహామహిమాన్వితురాలు జగజ్జనని అని చెప్పిన తల్లి నివాసం ఎక్కడ అన్నదానికి సమయ మతానుసారంగా, ఈ శ్లోకంలో సమాధానం చెబుతున్నారు.
ఈ
సమయమతం అంటే ఏమిటో క్లుప్తంగా చెప్పుకుందాం. శ్రీశంకరులు
సౌందర్యలహరీస్తోత్రం అనే మహధ్భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. కేవలకైవల్య
ప్రదాయకమైన మహిమాన్వితమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పరమేశ్వరుడే అమ్మవారిని
ఉద్దేశించి చెప్పాడనీ దానిని కాలడి శంకరులు మనకు అనుగ్రహించారనీ ఒక
ఐతిహ్యం. ఇది శ్రీవిద్యారహస్యసంపుటీకరణ మన దగ్గ స్తోత్రం. దీనిని బట్టి
శ్రీశంకరులు శ్రీవిద్యా ఉపాసకులనీ శాక్తేయులనీ భావించవచ్చును. అయన సమయమత
సిధ్ధులనే విశ్వాసం. ఈ శ్రీవిద్య శ్రీశంకరుల అద్వైతానికి అభిన్నమైనదే. ఈ
శ్రీవిద్యలో మూడు ముఖ్యమార్గాలున్నాయి. అవి కౌలం, మిశ్రం, సమయం అనేవి.
వీటిలో వేదప్రమాణం కాల్దీ పారమార్థికమైనది కేవలం సమయమతమే. మొదటి రెండూ
వామమార్గాలనీ, ఈ సమయమతాన్ని దక్షిణామ్నాయమనీ పరిభాషగా వాడుక చేస్తూ
ఉంటారు. శంకరమఠాల్లో దక్షిణామ్నాయము అని వ్రాస్తూ ఉండటం చూసే ఉంటారు కదా.
సుధ
అంటే అమృతం అని మనకు తెలుసు. సింధువు అంటే సంధర్భాన్ని బట్టి నది లేదా
సముద్రం అని చెప్పుకోవాలి - ముఖ్యంగా సముద్రం అని చెప్పటమే రివాజు. కాబట్టి
సుధాసింధువు అంటే అమృతసముద్రం. సుధాసింధోః మధ్యే అంటే ఆ అమృతసముద్రం
మధ్యలో అని. ఆ అమృతసముద్రం మధ్యలో ఒక మణిద్వీపం ఉందట. అక్కడి విశేషం
చెబుతున్నారు.
సురలు
అంటే దేవతలు. విటపి అంటే చెట్టు. సురవిటపి అదే దేవతల చెట్టు అంటే
కల్పవృక్షం. వాటి అంటే తోట. కాబట్టి సురవిటపివాటీ అంటే కల్పవృక్షాలతోట
అన్నమాట. అంటే ఇప్పటి వరకూ మనకు ఆకచార్యులవారు చెప్పినది ఆ ద్వీపంలో
కల్పవృక్షాలతోట ఒకటి ఉందని. కొంత చిరునామా తెలిసింది కదా.
చింతామణి
అంటే తెలుసుకదా. ఇంద్రుడి దగ్గర ఉండే గొప్ప మణి. అదికూడా అడిగిందల్లా
ప్రసాదిస్తుంది. దాన్ని మించిన మణి ముల్లోకాల్లోనూ ఉండదు. చింతామణిగృహం
అని చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఓ కొల్లలుగా చింతామణులున్నా యక్కడా - ఆ
చింతామణులతోటి కట్టిన ఒక గృహం ఉందీ అంటున్నారు. ఇంద్రుడి దగ్గర చచ్చి
ఒక్కటంటే ఒక్క చింతామణి ఉంటే దాంతో విర్రవీగుతూ ఊరేగుతున్నాడయ్యా. ఈ
మహాభవనాన్ని చింతామణుల్నే వాడి కట్టారూ అంటే ఆ అమృతసముద్రం మధ్యలో
కల్పవృక్షాలతోట ఉన్న దీవి వైభవం ఊహించుకోవలసిందే కదా!
ఆ
చింతామణిగృహం నీపోపవనవతి అన్నారు. నీపం అంటే కడిమి చెట్టు. ఆ భవనం చుట్టు
కడిమి పూల తోట ఒకటి ఉందట. ఏం మామిడితోటలో ఒక ఇల్లు కట్టుకుని దాని చుట్టు
ఒక పూలతోట పెంచుకోరూ జనం అలాగే అక్కడ ఆ వైభవమూ.
ఆ పిమ్మట ఆ యింటిలోనికి ప్రవేశిస్తే అందులో సంగతి ఎలా ఉండేదీ చెబుతున్నారు.
మంచె
అంటే మంచం. అంటే రోజూ మనం వాడే మంచం అనేది ఈ మంచె అనే సంస్కృతపదం నుండి
వచ్చిందే అన్న మాట. భలే. దాన్ని శివాకారే అన్నారు - అంటే అది శివా (శక్తి)
ఆకారం కల మంచం అట. ఆక్కడ అమ్మ ఉంది. ఎలా?
పరమశివపర్యంకనిలయగా అంటే ఎక్కడ? పరమేశ్వరుడు శయనించి ఉన్న ప్రక్కమీద.
ఆవిడ ఎలా ఉందట? చిదానందలహరిగా. జ్ఞానస్వరూపంగా నిరతిశయమైన ఆనంద ప్రవాహస్వరూపంగా ఉందట.
అటువంటి అమ్మను గురించి అందరూ భావన చేయగలరా అని ప్రశ్నవేసి, దానికి సమాధానం చెబుతున్నారు. ఏమని?
అమ్మా,
త్వాం - అంటే అలా (అమృతసముద్రం మధ్యలో, కల్పవృక్షాలతోటలో ఉన్న
చింతామణీగృహంలో కేవలశక్తిస్వరూపమైన మంచం మీద, పరమేశ్వరుడితో ఏకశయ్యమీద )
చిదానందస్వరూపంగా ఉన్న నిన్ను ధన్యాః - అంటే నీ అనుగ్రహప్రసాదం కారణంగా
ధన్యులైన వారు కేవలం కొద్దిమంది మాత్రమే భజంతి- సేవించగలుగుతున్నారమ్మా
అంటున్నారు.
ఇది స్థూలార్థం. బాగుంది కదా?
సమయమతానుసారంగా కొంచెం విపులీకరిస్తాను.
శ్రీచక్రంలో
అధోముఖంగా ఉన్న నాలుగు శివాత్మకమైన యోనులూ, ఊర్ధ్వముఖంగా ఉన్న ఐదు
శక్తియోనులూ కలిసి నవయోనులు (నవత్రికోణములు). ఈ శ్రీచక్రంలో ఉన్న
బిందుస్థానానికే సుధాసింధువని పేరు. పంచయోనులే కల్పవృక్షాలు.
దానిమధ్యభాగానికే మణిమంటపం అని పేరు. దానిలోనే దేవీమందిరం. అక్కడ మంచమే
శక్తిస్వరూపమైనది. ఆ మంచపు కోళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు. తలగడ
మహేశ్వరుడు. పానుపు సదాశివుడు. ఆ పర్యంకమందున్న శ్రీదేవి ఆ సదాశివుడే
ఆలంబనంగా పానుపుగా ఆయనతో అభిన్న స్థితిలో నున్నది. అవిడ కేవలం
ఆనందప్రవాహస్వరూప. ఇదంతా చాలా సంకేతాలతో కూడుకొని ఉండటం వలన అంత సులభంగా
అవగాహన కాక పోవచ్చును.
ఇంకా
లోతైన మంత్రశాస్త్ర సంబంధమైన వివరణ చెప్పుకోవాలంటే విస్తారంగా ఉన్నది.
కాని విశేషంగా అది గురుముఖంగా తెలియవలసినది. ఉపాసనద్వారా అవగాహనకు
తెచ్చుకోవలసినది. అంతే కాని వ్రాతలో చెప్పుటకు వీలైనది కాదు.
శ్రీవిద్యాధికారులకు తప్ప ఇలా బహిరంగంగా వివరంగా చర్చించుకొనే విషయం కాదు.
ఈ
శ్లోకాన్ని ప్రతిదినం పన్నెండు సార్లు పారాయణం చేస్తూ ఉంటే అన్ని రకాల
అడ్డంకులూ భయాలు తొలగి పోయి సకలకార్యాలు నెరవేరుతాయని చెప్పబడింది. వీలైతే
పారాయణంతో పాటుగా అమ్మకు ఎర్రనిపూలతో పూజ చేయాలి. నైవేద్యం నల్లమిరియాలు.
*మీ*
*శశికాంత్ శర్మ దహగం*
Wednesday, June 28, 2017
నియోగులు
17/06/17, 11:21:50 PM: +91 92904 53473: *నియోగులు*(మన బ్రాహ్మణుల లో యెన్ని శాఖ లో చూడండి )
ప్రథమశాఖ
ఆరువేల నియోగి
ప్రాజ్ఞాటి నియోగి
వెలనాడు నియోగి
నందవరీకులు నియోగి
తెలగాణ్య నియోగి
ద్రావిడ నియోగి
ఐ.కరణకమ్మ నియోగి
లింగధారి నియోగి
ములకనాడు నియోగి
కాసనాట్లు నియోగి
పాకనాటి నియోగి
మధ్వా నియోగి
శ్రిష్టి కరణాలు
నియోగ వైదీక
కౌండిన్య నియోగి
కాశ్యప నియోగి
మహారాష్ట్ర చిత్సవనులు
కోసలేయ నియోగి
వేగినాటి నియోగి
*"శివార్చకులు" శాఖ*
వీర శైవులు
ఆది శైవులు
శైవ పూజారులు
శివార్చకులు
శైవులు .
ఆరాధ్య లింగధారులు
శివ పురోహితులు
ఆరాధ్య బ్రాహ్మణులు
శైవ స్మార్తులు
మోన భార్గవ
*వైదీకీ బ్రాహ్మణులు*
*వైదీకీ వెలనాడు*
*వెలనాట్లు*,
*వేంగినాడు*
*వేంగినాడ్లు*
*ములకనాడు*
*ములకనాట్లు*
*కోసలనాడు*
*కోసలనాట్లు*
*తెలగాణ్యులు*
*కరణకమ్మ*
*స్మార్త*
*మురికినాట్లు*
*ప్రథమశాఖ వైదికి*
*కాసల్నాటి వైదికి*
*వేగినాటి వైదికి*
మరియు
గోల్కొండ వ్యాపారులు
కాణ్వేయులు
కాణ్వులు
మధ్వా
బడగలనాటి కన్నడలు
యజ్ఞవల్క్యులు
శ్రీ వైష్ణవులు
వైఖానసులు
నంబూద్రి బ్రాహ్మణ
తదితర బ్రాహ్మణులు, ఉపశాఖలుగా విభజించబడ్డారు.
*"ద్రావిడ"*
ఆరామ ద్రావిడ
పూదూరు ద్రావిడ
పేరూరి ద్రావిడ
దివి ద్రావిడ
దివిలి ద్రావిడ
తుమ్మగుంట ద్రావిడ
వూటూరు ద్రావిడ
పూమాలు ద్రావిడ
అనే మరొక ఉప శాఖలు
ఆంధ్ర ప్రదేశ్నకు వలస వచ్చిన తమిళ బ్రాహ్మణులు ద్వారా ఏర్పడినది..
ద్వైతం అద్వైతం విశిస్టాద్వైతం అంటే ఏమిటి?
18/06/17, 8:06:18 AM: +91 98660 49721: ద్వైతం అద్వైతం విశిస్టాద్వైతం అంటే ఏమిటి?
ద్వైతం : నీవు దైవం ; నేను జీవున్ని ..... నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .
మధ్వాచార్యులు
ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.
సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి
మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
అద్వైతం : నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .
అద్వైతం
అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే
అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని
ప్రతిపాదించాడు. శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది.
ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.
చారిత్రకంగా
దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద
భగవత్పాదునకు గురువు. అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి
మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం (Prasthanatrayi) — అనగా ఉపనిషత్తులు, భగవద్గీత
మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.
విశిష్టాద్వైతం
: నీవు(దేవుడు) -నేను(జీవి) -ప్రకృతి(పంచభూతాలు) అన్నవి వేర్వేరు అయినా
ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము.
జీవుడు,
ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది.
'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును.
శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును.
ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప
వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము
మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
దేవాలయం లో దర్శనం
18/06/17,
9:06:50 AM: +91 79811 59026: దేవాలయం లో దర్శనం అయ్యాక తీర్దం,
షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన
పనైపోయిందని చక, చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని
కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు.
షడగోప్యం
అంటె అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి కూడా విన్పించనంటగా కోరికను
తలుచుకోవాలి. అంటె మీ కోరికే షడగోప్యం. మానవునికి శత్రువులైన కామమూ,
క్రొధమూ, లొభమూ, మొహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా
ఉంటామని తలుస్తూ తల వంచి తీసు కోవటము మరో అర్ధం.
సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడ గోప్యము ను వక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చేయద్దు.
పూజారి
చేత షడ గోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడ
గోప్యమును రాగి, కంచు, వెండి లతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి.
షడ
గోప్యము ను తల మీద ఉంచినప్పుడు శరీరం లో ఉన్న విద్యుత్, దాని సహజత్వం
ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక
విద్యుత్ బైటికి వెళ్ళుతుంది. తద్వారా శరీరం లో ఆందోళనా, ఆవేశామూ
తగ్గుతాయి. షడ గోప్యమును శతగోపనం అని కూడా అంటారు.
నవగ్రహాలకు ప్రదక్షిణలు*
19/06/17, 9:58:46 AM: +91 79811 59026: *పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు*
నవగ్రహ
ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ
ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు
చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.
కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.
నవగ్రహ
ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి
ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది
ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి.
ఎప్పుడుపడితే
అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి
పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.
శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.
“ఆదిత్యాయ
చ ... నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత
సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9
ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు
ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు.
నవగ్రహ ధ్యానశ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||
చంద్రః
దథిశఙ్ఞ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్ ||
కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||
బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
రాహుః
అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
కేతుః
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
నిత్య పారాయణ శ్లోకాలు
19/06/17, 10:55:09 AM: +91 98660 49721:
నిత్య పారాయణ శ్లోకాలు
మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...
🌷ప్రభాత శ్లోకం :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
☘ప్రభాత భూమి శ్లోకం : ☘
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
🌝సూర్యోదయ శ్లోకం : 🌝
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!
🍀స్నాన శ్లోకం : ☘
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!
♨భస్మ ధారణ శ్లోకం : ♨
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!
🍀భోజనపూర్వ శ్లోకం : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
💢 *భోజనానంతర శ్లోకం :* 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!
🌷 *సంధ్యా దీప దర్శన శ్లోకం* 🌷
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!
😔 *నిద్రా శ్లోకం* 😔
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!
👍 *కార్య ప్రారంభ శ్లోకం* 👍
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
🌷 *హనుమ స్తోత్రం* 🌷
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!
💢 *శ్రీరామ స్తోత్రం* 💢
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
♨ *గణేశ స్తోత్రం* ♨
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!
🔯 *శివ స్తోత్రం* 🔯
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!
🕉 *గురు శ్లోకం :* 🕉
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!
☸ *సరస్వతీ శ్లోకం* ☸
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
🌷 *లక్ష్మీ శ్లోకం* 🌷:
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!
☘ *వెంకటేశ్వర శ్లోకం* ☘:
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!
♨ *దేవీ శ్లోకమ్* ♨ :
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!
💢 *దక్షినామూర్తి శ్లోకం* 💢
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!
☸ *అపరాధ క్షమాపణ స్తోత్రం* ☸ :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!
🔯 *విశేష మంత్రా:* 🔯
💢పంచాక్షరి
*ఓం నమశ్శివాయ*
☘అష్టాక్షరి
*ఓం నమో నారాయణాయ*
🌷ద్వాదశాక్షరి
*ఓం నమో భగవతే వాసుదేవాయ.*
విధివిలాసం!
19/06/17, 2:17:50 PM: +91 79811 59026: విధివిలాసం!
నారద
మునీంద్రుడు ఒకసారి అడవిలో ఒక చెట్టుకింద కూర్చుని సేదతీరుతున్నాడు. ఆ
చెట్టుమీదినుంచి పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకపిట్ట
నారద మహర్షి సమీపంలోకి వచ్చి ఎగరసాగింది. పసుపు పచ్చని రంగు, నల్లని
రెక్కలు, నల్లటి తోక కలిగి, బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పిట్ట... నల్లటి
కళ్లు, సూదిగా ఉండే చిగురాకులా ఉన్న ఎర్రటి ముక్కుతో, ఉత్సాహానికి,
ఉల్లాసానికి మారుపేరులా ఉన్న ఆ పిట్ట అక్కడక్కడే ఎగురుతూ, గంతులు వేస్తూ,
చక్కగా కూయసాగింది.
మనోహరమైన
దాని కూతలే పాటలా ఉండి, ఆయన మనస్సును సేదతీర్చాయి. నారదుడు ఆ పిట్టను చూసి
ముచ్చటపడ్డాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చాడు. నారదుణ్ణి చూసి
నమస్కరించాడు. అనుకోకుండా యముడి దృష్టి ఆ పిట్ట మీద పడింది. దానివైపు
ఆశ్చర్యపోతున్నట్టుగా చూసి, మళ్లీ నారదునివైపు చూసి తల పంకించి,
అక్కడినుంచి వెళ్లిపోయాడు.
సాక్షాత్తూ
మృత్యుదేవుడు అయిన యమధర్మరాజు దృష్టి ఆ పిట్టపై పడటంతో నారదుడి మనస్సు
కీడు శంకించింది. యముడు ఆ పిట్టను తీసుకుపోతాడా ఏంటి? అనుకున్నాడు.
కొద్దిక్షణాల క్రితం ఎంతో మధురంగా పాటలు పాడి, తన మనస్సుకు ఆనందం కలిగించిన
ఆ పిట్టను ఎలా అయినా సరే, కాపాడాలనుకున్నాడు. వెంటనే ఆ పిట్టను పట్టుకుని
సప్తసముద్రాలూ దాటి, అక్కడ ఉన్న ఒక మర్రిచెట్టు తొర్రలో దాచి, తిరిగి
అరణ్యానికి చేరుకున్నాడు. ఏదో పని ఉన్నవాడిలా యముడు మళ్లీ వచ్చాడు. నారదుడు
యముణ్ని చూసి చిద్విలాసంగా నవ్వాడు.
అది
చూసి యముడు నారదుడి మనస్సు గ్రహించినట్టుగా...‘‘అయితే విధి మీ చేత కూడా
బాగానే విన్యాసాలు చేయిస్తోందన్నమాట.’’ అంటూ ఇలా వివరించాడు. ‘‘నేను మొదట ఆ
పిట్ట వంక చూసినప్పుడు మరికాసేపట్లో అది సప్తసముద్రాలూ దాటిన తర్వాత ఒక
మర్రిచెట్టు తొర్రలోని పాముకి ఆహారం కాబోతోందని తెలుసుకున్నాను. అయితే,
ఇదెలా సాధ్యం. గట్టిగా పదడుగులు కూడా ఎగరలేని ఈ అల్పప్రాణి ఇంత తక్కువ
వ్యవధిలో అంత దూరం ఎలా చేరగలదా అని ఆలోచించి, అబ్బుర పడ్డాను. ఇంతలో మీరు
కనపడ్డారు. ఆ పని మీ చేతుల మీదుగా జరగగలదని గ్రహించి, నిశ్చింతగా
వెళ్లిపోయాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా’’ అంటూ నవ్వాడు.
‘‘విధివిధానం
అమలు జరగడంలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంటుందని తెలిసున్నప్పటికీ, నేనూ మాయకు
లోనయ్యాను కదా!’’ అని వాపోతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు నారద మహర్షి.
---------
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ...
విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ...
యత్ర యత్ర వేద పారాయణం
20/06/17,
7:20:38 PM: +91 94413 84759: యత్ర యత్ర వేద పారాయణం: కన్నీరు
పెట్టుకున్న కంచి స్వామి (పెరియవ ) ....మహాస్వామి వారు మధ్యాహ్నపు పూజ
ముగించుకుని తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలోవున్న
తిరువిడైమరుదూరు(మధ్యార్జునం) మహాలింగస్వామికి చైత్రపౌర్ణమినాడు 11 మంది
ఘనాపాఠీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం స్వామి వారికి సమర్పించాలని
ఉత్సుకతతో ఒక సంపన్నుడైన మిరాశీదారు(భూస్వామి) ఒకరు వరుసలో వేచివున్నారు.
మహాలింగ స్వామి ప్రసాదాన్ని కొత్త పట్టుగుడ్డలో చుట్టి తీసుకొనివచ్చాడాయన.
ఆరోజు భక్తజన సమ్మర్ధం ఎక్కువగావుంది. మిరాశీదారు వంతు వచ్చింది.
మహాస్వామివారియందు అమితమైన భక్తితాత్పర్యములు కలవాడాయన. స్వామివారిని
చూస్తూనే భక్తితో వణికిపోతూ సాష్టాంగ నమస్కారంచేశాడు. స్వామివారు
కనుబొమలెత్తి వారిని చూసి "ఏమి సమాచారం?" అన్నారు. ఆయన తడబడుతూ ప్రసాదాలను
విప్పి వెదురు బుట్టలో విభూతి, చందనము, కుంకుమ, బిల్వపత్రములు,
కొబ్బరిచెక్కలు విడివిడిగా వుంచి స్వామి వారికి సమర్పించాడు. ప్రసాదమనగానే
ముందుకు వంగి గ్రహించే స్వామి "ఏ క్షేత్రానిది ఈ ప్రసాదం?" అని
ప్రశ్నించారు. "స్వామీ! తిరువిడైమరుదూరు మహాలింగ స్వామికి నిన్న
రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం
సమర్పిస్తున్నాను" అన్నాడు మిరాశీదారు….స్వామివారు ప్రసాదాలున్న తట్టవైపు
పరీక్షగాచూసి "నీవే ఎంతో స్థితి పరుడవు కదా! రుద్రాభిషేకానికి చందాలుకూడా
పోగు చేశావా?" అన్నారు. "లేదుస్వామి! మొత్తంఖర్చు నేనే భరించాను", అన్నాడు
నేనే అన్న పదాన్ని వత్తుతూ. “రుద్రాభిషేకం లోకక్షేమంకోసం జరిపించావా?”
అన్నారు స్వామివారు. "రెండు మూడుసంవత్సరాలుగా పంటలు సరిగా పండటంలేదు,
జ్యోతిష్కులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం
బాగుంటుందని చెప్పారు." అందుకు చేయించాను అన్నాడు మిరాశీదారు. "అయితే
నువ్వు ఆత్మార్ధంగానో, లోకక్షేమార్ధమో కాక ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్న
మాట", అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు
స్వామివారు. ….కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచిన వారిని చూస్తే,
జరిగిందేమిటో అవగతమైనట్లు తెలుస్తుంది. "సరే, ఎంతమంది వేదపండితులు
వచ్చారు?" అన్నారు స్వామి. మిరాశీదారు "11 మంది" అన్నాడు. "నీవే
నిర్వహించావుకదా! వారెవరు? ఏగ్రామానికి చెందినవారు?" అన్నారు స్వామి.
అక్కడున్న భక్తులకు స్వామివారు ఎందుకలా తరచి తరచి ప్రశ్నలు వేస్తున్నారో
అర్ధం కాలేదు. మిరాశిదారు కాగితం చూచి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. "ఓహో!
అందరూ మహా పండితులు. నీ జాబితాలో తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనాపాఠి గారు
వున్నారేమో చూడు". అన్నారు. మిరాశీదారుకు సంతోషంవేసింది. స్వామివారు
చెప్పిన ఘనపాఠి గారుకూడా రుద్ర జపంలో పాల్గొన్నారు. "భేష్! భేష్! వేంకటేశ
ఘనాపాఠి గారు కూడా వున్నారన్నమాట మంచిది. ఆయన చాలా పెద్ద విద్వాంసులు. మంచి
వేద పండితులు. పెద్దవారయి పోయారు. రుద్ర జపం ఎంతో కష్టంమీద చేసి వుంటారు."
స్వామివారి ఈ మాటలతో బలంపుంజుకున్న మిరాశీదారు "మీరు సరిగ్గా చెప్పారు
స్వామీ! ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యకుండా కనులు మూసుకుని కూచుంటారు. దాని
మూలంగా సంఖ్య తగ్గిపోతోంది. ఎందుకు పిలిచానా అనుకున్నాను" అన్నాడు.
స్వామివారి కనులలో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. "మనదగ్గర ఏదో కొంచెం
డబ్బు ఉంది కదా అని ఎలాగయినా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు
తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి అర్హతలేమిటో తెలుసా? అతని చరణ ధూళికి
సరితూగవు నీవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు. నిన్న ఏమి జరిగిందో నాకు
ఇప్పుడు అర్ధమయింది. ఆయనలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు
వెళ్ళి, “తీసుకున్న డబ్బుకు గట్టిగా వళ్ళు దాచుకోకుండా పారాయణం చెయ్యకుండా
నోరు మూసుకుని కూరుచుంటే ఎలా?” అని అన్నావా లేదా చెప్పు" అన్నారు
తీక్షణంగా! ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా
అయిపోయింది…భక్తులందరూ నిశ్చేష్టులయి పోయారు. క్షణంవరకు సాధారణంగా
మాట్లాడుతున్న మిరాశీదారు గడగడ వణికి కాళ్ళబలం చాలక మోకాళ్ళమీద ముందుకు పడి
బలవంతంగా లేచి నుంచున్నాడు. కన్నులనుండి నీరు జలజల స్రవిస్తుండగా నోటీమీద
చేయి అడ్డు పెట్టుకుని, "నాది తప్పే! స్వామీ!దయచేసి క్షమించండి. ఘనపాఠి
గారితో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లే అన్నాను. క్షమించండి స్వామీ!
క్షమించండి" అంటూ ప్రాధేయపడ్డాడు…."ఆగు! అంతటితో ఆపలేదు. ఇంకాఉంది. నువ్వు
పండితులందరికి దక్షిణఇచ్చావా? ఎంత ఇచ్చావు?" అన్నారు. "ఒక్కక్కరికీ 10
రూపాయలు ఇచ్చాను""నాకంతా తెలుసు. మళ్ళీ చెప్పు. అందరికీ 10 రూపాయల చొప్పున
ఇచ్చావా?" రెట్టించారు స్వామివారు. మిరాశీదారు మౌనంగాఉన్నాడు. స్వామి
వదిలేటట్లు లేరు. "చెప్పడానికే సిగ్గువేస్తుందికదూ! నే చెబుతాను ఏమి
జరిగిందో! మిగతా పండితులందరికీ నీవు 10 రూపాయలు చొప్పున ఇచ్చావు.
వేంకటేశఘనపాఠి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన సరిగా జపం చేయలేదని 7 రూపాయలకు
తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్చానని నిన్ను నువ్వు మెచ్చుకుని ఆయనను
కించ పరచినందుకు సంతోషించావు. ఆయన ఈషణ్మాత్రం ఈ విషయాన్ని సరుకు చెయ్యలేదు.
నిన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చినది తీసుకున్నారు. చెప్పు ఇది
నిజమేనా?" అన్నారు. ఈ విషయమంతా స్వామి వారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్య
పోయారు…[ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనపాఠి అనే మహా పండితులు చెప్పారు. రామనామం
జరిగేచోటల్లా హనుమంతుడున్నట్లు, వేద పారాయణంజరిగే చోటంతా మహాస్వామి వారు
ఉంటారట. వారి …గురువుగారు ఎక్కడైనా పారయణాలలో శిష్యులు బాల చేష్టలు
చేస్తుంటే "జాగ్రత్త! సరిగ్గాపారాయణ చెయ్యి. మహాస్వామి
వారున్నారు".అనేవారట. మరుసటిరోజు వీరు పెద్ద స్వాములవారిని దర్శనంచేస్తే
జరిగినదంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట మహాస్వామి.మిరాశీదారు
నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరల
ఇటువంటితప్పిదం చేయనని మరల మరల వేడుకుంటున్నాడు. కన్నీరుమున్నీరుగా
అవుతున్నాడు.స్వామివారు అక్కడితో ఆపలేదు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో?
"ఆగు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆరోజు బ్రాహ్మణులందరికి రామచంద్ర
అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావుకదూ! అందరికి నీవే స్వయంగా
వడ్డించావు. చక్రపొంగలి అమృతంలా ఉన్నది. మంచి నెయ్యి ఓడుతూ ఉంది. ఆనేతిలో
ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్రపొంగలి నీవే
స్వయంగా వడ్డించావు కదూ!" అన్నారు స్వామివారు…తానుచేసిన ఒక మంచిపని
శ్రీవారు గుర్తించినట్లుగా మిరాశీదారు, "అవును స్వామీ! నేనే స్వయంగా
వడ్డించాను". అన్నాడు."వడ్డించే టప్పుడు పంక్తి మర్యాదను పాటించావా?" అని
ప్రశ్నించారు స్వామి….మిరాశీదారునుంచి సమాధానం లేదు…"సరే నేను చెప్తాను.
చక్రపొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరలమరల మారువడ్డనకై అడిగారు. నీవుకూడా
ఆనందంతో వడ్డించావు. కాని వేంకటేశఘనపాఠి మారు అడిగితే, ఒకసారి కాదు
అనేకసార్లు, నీవు విననట్లే నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా
నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాదా? ఇది ధర్మమా? ఎంత ఘోరంగా
అవమానించావు". మహాస్వామివారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా
కన్పిస్తున్నారు…మిరాశీదారు సిగ్గుతో చితికిపోతూ
నిలుచున్నాడు…మహస్వామివారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరిని వలె
సర్దుకొని నిటారుగా కూర్చున్నారు. మళ్ళీ కొంతసేపు మౌనంగా ధ్యానముద్రలో
కనులు మూసికొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ .కూర్చున్నారు…కనులుతెరచి
సూటిగా చూస్తూ "మిరాశీదారుగారూ! ఒక విషయం అర్ధం చేసుకోండి.
తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారికి 81 ఏళ్ళు. వారు తన పదహారేళ్ళ
ప్రాయంనుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో,
వారి నెత్తురులోనూ, వారి ఊపిరిలోనూ వ్యాపించింది. వారు మహాపురుషులు. వారి
యెడ నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటికాదు."
మహాస్వామి వారు ఇక మాటలాడలేక పోయారు. కొంచెంసేపు ఆగి మరలా
కొనసాగించారు…."నీవు చేసిన అవమానం ఆయనను కలవరపరచింది. లోతుగా బాధించింది.
నీకు తెలుసా? ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు. నిన్న సాయంత్రం ఆయన నేరుగా
మహాలింగస్వామి గుడికిపోయారు. మూడు ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచొని
ఏమి ప్రార్ధించారో తెలుసా?" మహాస్వామివారికి మాట్లాడటం కష్టమయిపోతుంది.
కొంతసేపయినతరువాత కొనసాగించారు."కన్నీరు బుగ్గలమీదుగా జలజల కారుతుండగా
తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి, స్వామికి చేతులెత్తి నమస్కరించి, "అయ్యా!
జ్యోతి మహాలింగమా! నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా
చిన్నతనం నుండి నే చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవధరించావు.
ఇప్పుడు నావయసు 81. హృదయం చాలా గట్టిగానే ఉన్నది. కానీ వార్ధక్యం
తగ్గిపోయింది. ఇవ్వాళ భోజన సమయంలో ఏమి జరిగిందో చూశవు కదా! ఆ చక్రపొంగలి
..... ఎంతో రుచిగావుంది. నా సిగ్గును ప్రక్కనుంచి, మరికొంచెం వడ్డించమని
అర్ధిస్తున్నాను. ఒకసారికాదు....అనేకసార్లు. మిరాశీదారు విననట్లు నటించి
వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా? నాకు చక్రపొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను
అర్ధించినా అతడు వడ్డించక పోవడంవలన నేనెంతో బాధపడ్డాను. కానీ స్వామీ!
తరువాత నాకీ విధమైన చాపల్యం - అదీ ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను. అందుకే
ఇప్పుడు నీ ముందు నుంచున్నాను. కాశీ వెళితే ఇష్టమైన పండు, కూర
వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే! అందుకే నీ ముందు
వాగ్దానంచేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరంలొ జీవం ఉండేదాకా చక్రపొంగలే
కాదు ఏ మధుర పదార్ధమూ ముట్టుకోను. ఇది నా వాగ్దానము. స్వామీ! ఇక సెలవు."
అంటూ కన్నీటితో ఆ ఘనపాఠి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి
అయ్యర్ గారూ! నీవు చేసినది మహాపాపం కాదా"? మహాలింగ స్వామి నీ చేష్టితాలను
ఒప్పుకుంటారా?"..మహాస్వామివారు మౌనం వహించారు. మూడు గంటలయింది. పరిచారకులు
భిక్షకై రావలసినదని ప్రార్ధిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదలి కదలటంలేదు.
ప్రతివారి కనులనిండా నీరు.మిరాశీదారు మహాస్వామి పాదముల ఎదుట ఆపుకోలేనంతగా
విలపిస్తున్నాడు. మాటలు రావటంలేదు. అయినా ప్రయత్నంమీద "స్వామీ! నా
ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను. క్షమించానని
చెప్పండి. మళ్ళీ ఇటువంటి అపరాధం చేయను స్వామీ! క్షమించండి. మహాలింగస్వామి
ప్రసాదంతీసుకోండి. నన్ను క్షమించండి." అంటున్నాడు. స్వామివారు ప్రసాదం
ముట్టుకోలేదు…."కొంచెం ఆగు. నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదం
పంపుతాడు". న్నారు.అంతలో రుద్రాక్షలు ధరించిన 65ఏళ్ళ పండితుడు చేతిలో
వెదురుతట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. "స్వామీ! నా పేరు మహాలింగం.
నేను తిరువిడైమరుదూరు అర్చకుడను. నిన్న మహాలింగస్వామికి రుద్రాభిషేకం
జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామి వారికి సమర్పించి ఆశీస్సులు
తీసుకొని వెళదామని వచ్చాను". అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు
"శివదీక్ష పుచ్చుకొన్న వారు ఇతరులకు మస్కరించరాదు" అంటూ వారించి, ప్రసాదం
ఎంతోభక్తితో గ్రహించి, ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతు ఈ
మిరాశీదారును చూచి, "ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది" అని చెప్పి
వెళ్ళిపోయాడు…మిరాశీదాదు ఈ పాపమునకు పరిహారమేమిటని మహా స్వామి వారిముందు
మళ్ళీమళ్ళీ ప్రాధేయపడినాడు…మహాస్వామివారు లేస్తూ, "ప్రాయశ్చిత్తం నేను
చెప్పలేను. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మాత్రమే చెప్పగలరు"
అన్నారు."ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశ్చిత్తం చెబుతాడా" అన్నాడు
మిరాశీదారు…"నీకుప్రాప్తముంటే ఆయన చెబుతాడు" అంటూ తనగదిలోనికి వెళ్ళిపోయారు
స్వామివారు. రాత్రిదాకా స్వామివారు బయటకు రాలేదు…
మిరాశీదారు
నేరుగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి పాదములు పట్టుకొని
ప్రాయశ్చిత్తానికై ప్రార్ధించడానికి నిశ్చయించు కొన్నాడు. అక్కడకు
చేరేసరికి తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి ఇంటిముందు జనం గుమికూడి
ఉన్నారు. ఘనపాఠి గారు ఆ తెల్లవారుఝామునే శివసాయుజ్యమొందారు. స్వామివారు
"నీకుప్రాప్తముంటే" అన్న మాటలకర్ధం మిరాశీదారుకు ఇప్పుడు అర్ధమయింది. తాను
మహాపాపిననుకొంటూ ఘనపాఠి గారి పార్ధివదేహానికి నమస్కరించి ఇంటికిపోయాడు.
వేదపండితులకు మనమీయవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేక సందర్భాలలో ఈ
విధంగా తెలియచేశారు…ఇట్టి మహాపరాధం చేసిన, తనను ఆశ్రయించిన మిరాశీదారును
పరమ కరుణామూర్తి ఐన స్వామివారు వదిలివేయలేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు
ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తి పొందారు.
జీవితంలొ ఎవ్వరిని తక్కువగా చూదకండి…….
బుధ్ధి, ప్రజ్ఞ, స్థితప్రజ్ఞత*
22/06/17, 12:04:07 PM: +91 79811 59026: *బుధ్ధి, ప్రజ్ఞ, స్థితప్రజ్ఞత*
సాధారణంగా
ప్రజ్ఞ అనే పదానికి బుద్ధి అనే అర్థం చెబుతారు. ప్రజ్ఞ కలవాడే ప్రాజ్ఞుడు.
కాబట్టి బుద్ధిమంతులందరు ప్రాజ్ఞులు.స్థితప్రజ్ఞుడు అంటే సుస్థిరమైన
ప్రజ్ఞ కలవాడు.
ప్రతి
మనిషికీ కర్మానుసారం ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ద్వారా అతడు జీవన
కలాపాలను కొనసాగిస్తుంటాడు. అయితే మనిషి ఆత్మ స్థితిలో నిలువనంత వరకు
బుద్ధి ఏ క్షణంలోనైనా మనసు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. కేవలం
ఆత్మస్థితిలో ప్రవేశించి తద్వారా బుద్ధిని జాగృతం చేసుకున్నవాడే మానసిక
క్లేశాలకు దూరం అవుతాడు. ఆ విధంగా ఆత్మస్థితిలో అనుభవం ద్వారా పదునెక్కిన
బుద్ధినే ప్రజ్ఞ అనాలి. అటువంటి ప్రజ్ఞలో సుస్థిరుడైన వ్యక్తి
స్థితప్రజ్ఞుడు.
మనశ్శాంతి
కరువైందని అందరూ వాపోతుంటారు. కాని మనశ్శాంతి కేవలం రెండు స్థితులలోనే
లభిస్తుంది. ఆ రెండు స్థితులే నిద్ర, మరణం. నిద్రలో ఉన్నప్పుడు మనసు
శాంతిగా ఉంటుంది. ఇక మరణం గురించి చెప్పనక్కర్లేదు. అయితే మనిషి
జాగృతావస్థలో ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉండే అవకాశమే లేదు.
కాని
ఆత్మస్థితి గురించిన ఎరుకతో జాగృతమైన బుద్ధిలో, అంటే ప్రజ్ఞలో
స్థితుడైనపుడు (స్థితప్రజ్ఞుడైనపుడు) మానసిక కలాపాలు ఆగిపోతాయి. అంటే
అనవసరమైన భోగవాంఛలు ఆగిపోతాయి. దీని అర్థం స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి
కోరికలు కలగవని కాదు. అయితే ఆ కోరికలు స్వీయభోగానికి అయి ఉండవు. అవన్నీ తన
ఆత్మోద్ధారానికో లేదా జనుల, సకల జీవుల ఉద్ధారానికో అయి ఉంటాయి. సంపూర్ణ
భగవదాశ్రయంలో అటువంటి మహాత్ములు, స్థితప్రజ్ఞులు సకల మానవాళికి
ఆదర్శనీయులుగా మారుతారు. అటువంటి స్థితప్రజ్ఞులను అనుసరించినపుడే మానవులు
నిత్యోత్సాహంతో జీవనాన్ని కొనసాగిస్తూ జన్మను సార్థకం చేసుకొంటారు.
సంధ్యావందనము/గాయత్రీ ఉపాసన
26/06/17,
2:09:25 PM: KK: *సంధ్యావందనము/గాయత్రీ ఉపాసన చేయునపుడు – “పవిత్రీ కరణము
చేస్తూ, ఎడమ చేతులో నీటిని తీసుకొని, కుడి చేతితో మూసి , “ ఓం అపవిత్రహ
పవిత్రోవా సర్వావస్తాం గతోపివా | యః స్మరేత్పుండరీకాక్షమ్ స బాహ్యభ్యంతర
శ్శుచి హి …..” అని మంత్రోచ్చారణ చేసి, ఆ జలమును కుడి చేత్తో శిరస్సున
చల్లుకోవాలి. ఈ మంత్ర మందలి ముఖ్య భావనేమిటంటే, అపవిత్రమైన ఈ నా మనస్సును,
శరీరమును సర్వావస్థలందు, బాహ్యమున, అఃతరమున పవిత్రమైన ఈ జలము ద్వారా,
పదే,పదే శుద్ధి కాబడుగాక అని. అదేవిధంగా, “ ఆచమనమ్ “ చేస్తూ, “ ఓం
అమృతోపస్తరణమసి స్వాహః …..” అనే మంత్రాన్ని చదువుతూ, వాక్కు, మనస్సు,
ఆంతఃకరణములు శుద్ధి కాబడుగాక” అని మంత్రపూత జలాన్ని మూడు సార్లు కొద్ది,
కొద్దిగా తాగటం జరుగుతుంది. అదేవిధంగా, “ శిఖాబంధనము “ అను ప్రక్రియను
చేస్తూ, శిఖపై, కుడి చేతి వ్రేళ్లను తడిచేసుకొని స్పృశిస్తూ, ఈ పవిత్రమైన
జలము ద్వారా సునిశితమైన మేధాశక్తి, తేజస్సు నాలో ప్రవేశించుగాక అని
ప్రార్ధన చేయటం జరుగుతుంది. అదేవిధంగా, “ అంగన్యాసము “ చేస్తూ, “ ఓం
వాజ్మే ఆస్యెస్తూ ….” అనే మంత్రాన్ని చదువుతూ, శరీరములోని కుడి, ఎడమ
వైపున్న అన్నీ అంగములను నీటితో స్పృశిస్తూ, ఈ మంత్రపూరిత జలము ద్వారా నా
శరీరాంగములకు పవిత్రత కలిగి, చైతన్య శక్తిచే జాగృతం కాబడి, అట్టి శక్తిని
పొందిన అన్నీ అవయవములు సంయమం కలిగివుండుగాక అని ప్రార్ధించటం జరుగుతుంది.
ఆఖరుగా, “ సూర్యునికి అర్ఘ్యం “ ఇస్తూ, “ ఓం సూర్యదేవ సహస్రామ్సో తేజోరాసే
జగత్ ఫతే …..” అనే మంత్రాన్ని పఠిస్తూ, నీటిని చేతితో వదులుతూ , ఏ
మంత్రపూరిత, పవిత్రమైన జలము ద్వారా తనకు సంపూర్ణ వ్యక్తిత్త్వం లభించిందో
అట్టి దానిని విశ్వ కుటుంబానికి సమర్పణ చేస్తున్నాను అని ప్రార్ధించటం
జరుగుతుంది. ఇదేవిధంగా, ఏవైనా పూజలు చేసేటప్పుడుకూడా నీటిని పవిత్ర
మాధ్యమంగా వాడుతూ, సత్ సంకల్పాన్ని ప్రేరేపించడం జరుగుతుంది.*
Subscribe to:
Posts (Atom)