06/06/17, 8:46:34 AM: KK: సౌందర్యలహరి- 5
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ || ౫
అమ్మా
! ఓ జననీ నీకు నమస్కరించే నీ భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు. పూర్వం
శ్రీ మహావిష్ణువు నిన్ను ఆరాధించి స్త్రీ రూపాన్నిధరించి,
త్రిపురాసురులను సైతం సంహరించిన జితేంద్రియు డైన శివున్ని కూడా కలత
పెట్టాడు, క్షోభ పెట్ట గలిగాడు.
అలాగే మన్మధుడు
కూడా నిన్ను కొలిచి తన సతి అయిన రతి దేవి కన్నులను, మనస్సును రంజింప చేయగల
సౌందర్యాన్ని పొంది, ఆ రూపముతో మునీశ్వరుల మనస్సును సైతం మొహపెట్ట
గలుగుచున్నాడు. ఇది అంతా నీ ప్రాసాద మహిమే కదా తల్లీ.
No comments:
Post a Comment