05/06/17, 6:06:31 AM: +91 80088 84529: ధర్మాకృతి : మణికుట్టి - 3
ఈ
రకంగా ‘చింతామణి’ నుండి ‘గదాధరి’ వరకూ అభివృద్ధి పొందిన ఈ ‘నవ్య న్యాయం’
బెంగాలులో, ఉత్తరప్రదేశ్ కొన్ని భాగాలలో ప్రాచుర్యం పొందింది. మన కథాకాలం
నాటికి తమిళనాడు పండితులు మంచి లోతు కల్గిన అలాటి శాస్త్ర మొకటుందని
విన్నారే కానీ చదివి ఉండలేడదు. అలాటి కాలంలో దానిలో విశేష జ్ఞానం
సంపాదించడానికి బస్సులు, రైళ్ళు లేనందున తంజావూరు నుంచి బెంగాలుకు
నడిచిపోయి అక్కడి పండితులను ఆశ్రయించి నవ్య న్యాయమును పూర్ణముగా ఔపోసన
పట్టిన వారొక్కరే. వారు మన ‘వాంజీశ్వరన్’. చదువుకోవడానికి వెళ్ళారే – ఆ
మనసూర్ శ్రీనివాస అయ్యర్ – 18వ శతాబ్దపు మొదటి అర్థమో తిరిగి స్వగ్రామం
చేరారాయన.
ఎవరికంటే
బుద్ధిమంతులుండ శక్యం కాదో, అటువంటి వారే బ్రాహ్మణ్య వాదాన్ని అర్థం
చేసుకోగలుగుతారు అని చెప్పుకొన్నాం కదా! అలా పరిపూర్ణ బుద్ధి కలిగిన మన
వాంజీశ్వరన్ ఒక్కడే వారి వద్ద ఈ తర్కమభ్యసించగలిగారు. రోజుకు పన్నెండు
మైళ్ళు రానుపోను నడిచి విద్యనభ్యసించి 18ఏళ్ళ వయస్సులో మన ‘కుట్టిశాస్త్రి’
64 వాదములలోనూ మహా ఘటికుడయినాడు.
ఆ
కాలంలో బంగాళ విద్వాంసులొకరు రామేశ్వర యాత్ర సంకల్పించి దారిలోని అన్ని
సంస్థానాలలోని విద్వాంసులకు వాదములో పరాస్తులను గావించుతూ తంజావూరు చేరి
వాద పరీక్షకై రాజాను సందర్శించారు. అప్పటి తంజావూరు మహారాజా సర్వోజీ.
అది
తెల్లదొరలు రాజ్యం కబళించే కాలం. వారు యుద్ధాలు చేసి రాజ్యాలు కలుపుకొన్న
భాగం కన్నా కృత్రిమమైన కోతి మధ్యస్థం చేసి రాజ్యాలను స్వాహా చేసిన భాగమే
ఎక్కువ. ఒక రాజ్యం అంటూ ఉంటే వారసత్వం విషయంలో ఏదో ఒక స్పర్థ రాక మానదు
కదా! ఆ సమయాలలో వీరు పోయి పిల్లవాడిని గిల్లి, ఉయ్యాల ఊపి ఆడించే విధాన
రెండు వైపులా రెచ్చగొట్టి, తలబడేట్లు చేసి, రాజీ చేసే మాదిరి పెద్ద
మనుష్యుల వలె వచ్చి ఒకరికి రాజ్యాధికారం. ఇంకొకరికి అందులోనే కొన్ని
అధికారాలు, రాజా బిరుదులూ, లక్షల నష్ట పరిహారం, సుఖ జీవనానికి గారంటీలంటూ
ఏర్పాటు చేసి, ఇద్దరినీ ఒత్తిడి చేసి ఒప్పించేవారు. తీరా చూస్తే
రాజ్యాధికారం అన్న పెద్ద పేరుతో వీరిచ్చేది భవంతిలో గౌరవయుతమయిన జీవనం,
పట్టపేనుగు ఊరేగింపు, డబ్బు సౌకర్యం వంటివి మాత్రమే. ముఖ్యమైన అధికారాలన్నీ
వారే హస్తగతం చేసుకునే వారు అదృష్టమేమంటే సంస్కృతి విషయమును ముఖ్యమైన
అధికారాల్లో ఒకటిగా వారు భావించే వారు కాబట్టి వీరని కేవలం బొమ్మ రాజులుగా
చేసినా, కళాకారులను, విద్వాంసులను పోషించడానికి తగు అధికారం, సౌకర్యాలు
కలుగజేసేవారు.
ఇదేరకంగా
సర్వోజీ, అమరసింహులు వారసత్వ విషయమై ప్రతికక్షులుగా మారినప్పుడు, ఈ
తెల్లదొరలు అటూ ఇటూ తాళం వేసి సర్వోజీని తంజావూరి మహారాజాగా చేశామన్నారు.
అమరసింహునికి అధికారాలు లేని మహారాజా టైటిల్ మాత్రమిచ్చి తిరువిడైమరుదూరులో
గృహ నిర్బంధము మాదిరి చేసి ఉంచారు. ఇది ఒక రకంగా చాలా మంచిదయింది. ఆ
ఇద్దరు రాజులు కళాభివృద్ధి పైన అభిరుచితో విశేషముగా కళలను పోషించి
కళాకారులను వేదవిద్వాంసులను పోషిస్తూ వచ్చారు.
ఈ
బంగాళ పండితుడు మొదట సర్వోజీ వద్దకు వచ్చారు. వాద పరీక్షకు సదస్సు ఏర్పాటు
చేయబడింది. తంజావూరి సంస్థానములో ప్రసిద్ధి పొందిన పండితులెంతో మంది
ఉన్నప్పటికీ బంగాళ నవ్య న్యాయములో వీరికి ప్రవేశము లేదు. వచ్చిన
విద్వాంసులో దానిలో అందె వేసిన చేయి. ప్రసిద్ధి గాంచిన తంజావూరి సంస్థానపు
మహా పండితులు బంగాళా పండితుని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మర్యాదానుసారం
మహారాజా వారు జయించిన వారికి విశేష సంభావన చేసి పంపారు. దక్షిణ దేశ
ప్రతిష్ఠకిది కళంకంగానే ఉన్నది.
తంజావూరు
విజయం తరువాత వంగ విద్వాంసులు తిరువిడైమరుదూరు అమరసింహుని వద్దకు వచ్చారు.
తిరువిసైనల్లూరు గ్రామం తంజావూరు కన్నా తిరువిడైమరుదూరుకే దగ్గర. ఆ
కారణంగా ఆ గ్రామ పండితులందరూ అమరసింహుని సదస్సులలో ఎక్కువ పాల్గొనేవారు. ఆ
సదస్సులో అమర సింహునితో తిరువిడైమరుదూరు తరలి వచ్చిన మహారాష్ట్ర శాస్త్ర
పండితులతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలోని విద్వాంసులు కూడా పాల్గొనేవారు. ఆ
వచ్చిన పండితుడు రాజును వాద పరీక్ష ఏర్పాటు చేయ కోరగా, అమరసింహుడు
విద్వాంసులందరికీ ఆహ్వానము పంపినారు. తంజావూరు సమాచారం అందరకూ తెలిసి
ఉన్నందున పేరు పొందిన విద్వాంసులు అవమాన భయంతో సదస్సుకే రాలేదు. అయితే
ఇదివరకు ఈ రకమైన వాద పరీక్షలలో పాల్గొనని యువక పట్టభద్రులు, తంజావూరు
అవమానాన్ని తుడిచి చేయాలనే సదుద్దేశ్యంతో సదస్సుకు పెద్ద సంఖ్యలో
తరలివచ్చారు.
సదస్సులో
వంగపండితుడు సింహంలా గర్జిస్తూ తమ నవ్య న్యాయవాదాన్ని వెలికితీశారు.
తంజావూరి గతియే ఇక్కడా పట్టేలా పట్టేలా ఉంది. వృద్ధులు, వాదోత్సాహంతో
ఉర్రూతలూగుతూ వచ్చిన యువకులూ, సిగ్గుతో కుంగిపోయే పరిస్థితి వచ్చింది.
అంతలో ఓ మూలనుండి మెల్లగా ఒక గొంతు వినిపించింది. ఆ వైపుకు సదస్సంతటితో
పాటు వంగ విద్వాంసులూ చూశారు. వారి ముఖంలో పరిహాస రేఖ తోచింది. ఎవరో ఊరు
పేరు లేని 18ఏళ్ళ యువకుడు అలక్ష్యంగా కూర్చోమన్నట్లుగా చేత్తో సైగ చేశారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment