[12:53PM,
02/06/2017] +91 70135 27083: *అగస్త్య మహర్షి:-- అగస్త్య మహర్షి
ఉత్తరభారతం నుంచి దక్షిణాదికి వచ్చిన మహర్షి. వింధ్య పర్వత శ్రేణి ఉత్తర
భారతానికీ దక్షిణ భారతానికీ మధ్యలో సరిహద్దులాగా ఉంటుంది.అమితంగా
పెరిగిపోతూ గ్రహ గమనానికి కూడా అడ్డుగా వస్తున్న వింధ్య పర్వతపు గర్వం
అణచమని దేవతలు ఆయన్ను కోరారు.దక్షిణభారత దేశానికి పోతున్న ఆయనకు దారి
ఇవ్వడానికి బాగా తగ్గిపోయి వంగింది వింధ్యపర్వతం. తను తిరిగి వెనక్కు
వచ్చేవరకూ అలాగే వంగి ఉండమని చెప్పిన మహర్షి దక్షిణ దేశంలో స్థిరపడి తిరిగి
వెనక్కు పోలేదు. ఈయన మహా సిద్ధుడు. ఈనాటికీ సజీవంగా తమిళనాడులో ఉన్నారు.
తమిళనాడులోని 'టెంకాశి' ప్రాంతాలలో అర్హులైనవారికి ఆయన భౌతిక దర్శనం
ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది. తమిళ వీరవిద్యలైన 'సిలంబం' 'మర్మఅడి' లకు ఈయనే
ఆద్యుడనీ పరమ గురువనీ ఆయా స్కూల్స్ వారు భావిస్తారు. ఆయనకు నమస్కరించనిదే
వారు వీరవిద్యా అభ్యాసం మొదలు పెట్టరు.*
*ఈయన
మహా తంత్రసాధకుడు. ఎన్నో తంత్రాలు అభ్యసించినప్పటికీ ఈయనకు దాహం తీరక,
మహావిష్ణు అవతారమైన హయగ్రీవస్వామిని ఆరాధించాడు. హయగ్రీవ స్వామి అన్ని
విద్యలకూ గురువు. సమస్త జ్ఞానానికీ నిధి. హిందూ తంత్రం లోనే గాక, బౌద్ధ
తంత్రంలో కూడా ఈయన ఒక దేవతగా మనకు కనిపిస్తాడు. ముఖ్యంగా టిబెటన్ తంత్రంలో
ఈయన ఒక, ఈయనకు గుర్రం తల వుటుందిఆరాధింపబ *తనకు ప్రసన్నుడై ప్రత్యక్షమైన
హయగ్రీవ స్వామిని ' నాకు అత్యుత్తమమైన స్తోత్రాన్నీ మంత్రాన్నీ సాధనా
విధానాన్నీ ఉపదేశించమని' అగస్త్య మహర్షి ప్రార్ధిస్తాడు. అప్పుడు ఆయన లలితా
సహస్ర నామాలను మహర్షికి ఉపదేశిస్తాడు.*
No comments:
Post a Comment