27/06/17, 2:02:48 PM: KK: *01. పురుషార్థములు*
*తత్వబోధ వేదాంతానికి చెందుతుంది. అది సంస్కృతంలో శంకరాచార్యచే*
*లిఖించబడిన ముఖ్యమైన, ప్రాధమిక వచన కావ్యం. ఇందులో సాధారణంగా మన
శాస్త్రాల్లో వాడే ముఖ్యమైన పదాలన్నీ వస్తాయి. మన శాస్త్రాలని ` అది
భగవద్గీత కానీ,* *ఉపనిషత్తులు కానీ* *పురాణాలు కానీ, రామాయణం కానీ చదవాలంటే
ఈ పదాల* *అర్థం* *తెలుసుకోవాల్సిన* *అవసరం* *ఎంతైనాఉంది. ముఖ్యంగా వేదాంత
శాస్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ పదాలని క్షుణ్ణంగా*
*అర్థంచేసుకోవాలి.*
*ఈతత్త్వబోధలో* *ఉన్న*
*అంశాలన్నింటి గురించి* *కొన్ని ప్రసంగాల పరంపర చూద్దాం.* *ఇందులోని
అంశాలన్నింటినీ వివరించటమే కాక, కొన్ని కొత్త అంశాలను కూడా చూద్దాం.*
*అద్వైత వేదాంతం బాగా అర్థం చేసుకోటానికి ముందుగా* *పురుషార్థాలంటే ఏమిటో
చూద్దాం. మనుష్య లక్ష్యాలు:` పురుషార్థాలన్న పదాన్ని మనం మన శాస్త్రాల్లో
తరచు చూస్తాం. అందుకని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.* *పురుషార్థాలంటే
మనుష్య లక్ష్యాలు. పురుష: అంటే మనుష్యుడు స్త్రీ గాని,పురుషుడు గాని.
అందుకని దీన్ని మనుష్యార్థాలుగా అనువదించవచ్చు.అర్థ: అంటే సంస్కృతంలో అనేక
అర్థాలున్నాయి. అర్థ: కి ఒక అర్థం, అర్థమే, అర్థ: అంటే* *ఐశ్వర్యం కూడా.ఈ
సందర్భంలో అర్థ: అంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం.
*అర్థ్యతే సర్వైహి మనుష్యైహి ప్రార్థ్యతే ఇతి అర్థ:*
*దేన్నైతే ప్రతి మానవుడు కోరుతాడో అది అర్థ: ప్రతి* *మనుష్యుడూ దేన్ని
కోరుతాడు? రకరకాల లక్ష్యాలుంటాయి* *ఒక్కొక్కరికీ. కాబట్టి ఏ మానవ
లక్ష్యాన్నైనా అర్థ: అంటారు. ఈ రెండు పదాలనీ కలిపితే మానవలక్ష్యాలు అని
అర్థం.*
*శాస్త్రంలో పురుషార్థంకి ఇంకో అర్థం
కూడా ఉంది. ఒక సందర్భంలో పురుషార్థం అంటే ఇచ్ఛ. ఇంకో సందర్భంలో పురుషార్థం
అంటే ఎన్నుకోవటం. ఇంకో సందర్భంలో ప్రయత్నం అని కూడా వస్తుంది. అంటే ఇచ్ఛ,
ఎన్నుకోవటం,* *ప్రయత్నం పురుషార్థంకి ద్వితీయ అర్థం. ప్రాథమిక అర్థం మానవ
లక్ష్యం లేదా మానవ గమ్యం. ఈ లక్ష్యాల* *మనుష్యులుగా సాధించాల్సినవే.
జంతువులకో, వృక్షాలకో ఇది సాధ్యం కాదు. ఈ పురుషార్థాలు అందుబాటులో ఉండటం
వల్ల మనుష్యుడు* *జంతువులు లేదా చెట్ల నుంచి విభిన్నంగా ఉన్నాడు. వీటివల్లే
తక్కిన అన్ని జీవరాసుల కన్నా ఉన్నతంగా ఉన్నాడు.*
*అద్వైత వేదాంత పరిచయం*
*మనుష్యుల ప్రత్యేకత :*
*మనుష్యులకి మాత్రమే ఎందుకు ఉన్నాయి ఈ పురుషార్థాలు?* *మనిషిలోని ఏ శక్తి ఈ
ప్రత్యేక అవకాశాన్ని యిచ్చింది,* *పురుషార్థాలు*
*కోరుకోవటానికి?**మనుష్యులు ఎన్నో* *అంశాలలో* *జంతువులని, చెట్లని పోలి
ఉన్నారని శాస్త్రాలు* *పలుకుతున్నాయి. తక్కిన జీవరాశులకీ మనుష్యులకీ మధ్య
సాధర్మ ్యం ఉంది. కాని మనిషి మాత్రమే వాడగల ఒక ప్రత్యేక లక్షణం*
*ఉంది*
*పురుషార్థాలు* *ఆ విషయం ఒక* *అందమైన శ్లోకంలో చెప్పబడిరది.*
*ఆహార నిద్ర భయ మైథునం చ*
*సామాన్య మేతత్ పశుభిర్ నరాణామ్*
*బుద్ధి: తేషామ్ అధికో విశేష*
*బుద్ధ్య విహీన:* *పశుభిర్ సమాన:*
*మనుష్యులకూ, తక్కిన జీవరాశులకూ* *కొన్ని అంశాలలో పోలికలున్నాయి. అందరూ
ఆహారం కోరతారు.పుట్టినప్పటినుంచి ఆహారం కోసం వెతుకులాట* *మొదలౌతుంది. అలాగే
నిద్ర,భయం,వంశాభివృద్ధి కూడా అందరికీ ఉంటుంది. కాని ఆలోచనా శక్తి,
విచక్షణాశక్తి, అర్థం చేసుకునే శక్తి* *భవిష్యత్తును ఊహించే శక్తి,
ముందుచూపు లాంటివి ఉండటం వల్ల మనిషి తక్కిన జీవరాశులకన్నా ఉన్నతుడయ్యాడు.
భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయటం, భవిష్యత్తు బాగుండాలని* *కష్టపడటం అంతా
విచక్షణాశక్తి కింద వస్తుంది.దాన్నే మనం బుద్ధి అంటాం.బుద్ధిర్ తేషాం*
*అధికో
విశేష: ఇదీ మనకున్న అధిక శక్తి. కేవలం బుద్ధి వల్లే మనిషి తక్కిన
వాటికన్నా* *ఉన్నతుడయ్యాడు. బుద్ధ్యా విహీన:` బుద్ధి లేకపోతే లేదా దాన్ని
వాడకపోతే, పశువుతో సమానం.అందువల్ల విచక్షణాశక్తి* *మనుష్యులకి విశేషంగా
ఉంది.ఈ ప్రత్యేకమైన శక్తివల్లే మనం స్వయం ప్రతిభ,స్వయం నిర్ణయం*
*చేసుకోగలుగుతున్నాం.తక్కిన వారితో మనని పోల్చుకోగలుగుతున్నాం. ఇవి
పశుపక్ష్యాదులు చేయలేవు.*
*ఒక డాగ్షోలో ఏ
కుక్కకి బాగా తర్ఫీదు నిచ్చారో పరిశీలిస్తారు. కుక్కల చేత అనేక గారడీలు
చేయించి వాటికి బంగారు, వెండి, రజత పతకాలిస్తారు. ఒలింపిక్స్లోలాగా వాటిని
ప్రత్యేక స్థానంలో, ప్రత్యేక మెట్లమీద* *నిలబెట్టవచ్చు కూడా. ఆ కుక్కల
భావాలెలా ఉంటాయి? వాటికి బంగారు పతకం వచ్చినా అవి పొంగిపోవు. రాకపోయినా
కృంగిపోవు. అవి నాలుక బయటకి చాచి, అభావంగా యిటూ, అటూ చూస్తాయి అంతే.
నిజానికి ఏం జరుగుతుందో వాటికేం అర్థంకాదు.* *కాని, ఆ కుక్కల యజమానికి
మాత్రం కాంప్లెక్స్ ఉంటుంది. అందువల్ల మనకి బుద్ధి ఈ విశేష లక్షణమైన
కాంప్లెక్సును పెంచి స్వయం నిర్ణయం, తోటివారితో* *పోల్చుకోవటం కలుగ*
*చేస్తుంది*
*అద్వైత వేదాంత పరిచయం*
No comments:
Post a Comment