29/06/17,
7:01:13 PM: KK: *సాధన ఫలించింది అనడానికి సంకేతాలు (ప్రాథమిక
స్థాయిలో):-- కొందరికి గుడికి వెడితే బాబా మీద అలంకరించిన పువ్వు పడితే అది
వారికి ఆశీస్సులు లభించినట్లు సూచన. కొందరికి వారి సంకల్పం తలుచుకోగానే
పూజారి ప్రసాదం ఇవ్వడం సంకేతం. ఒకరికి హోమం చెయ్యగానే వర్షం పడితే అది
దేవతానుగ్రహ సంకేతం. కొందరికి జపం చేస్తున్నప్పుడు శరీరం రోమాంచితమయ్యే
కుండలినీ జాగృతీకరణ సంకేతం. చండీ సప్తశతిలో అర్గళా (అంటే గడియ అని అర్ధం)
స్తోత్రాన్ని ఉపాసిస్తే తలుపుకున్న గడియలు వాటంతట అవే కొట్టుకోవడం చప్పుడు
చేయడం, తలుపులు తెరుచుకోవడం సంకేతం. ఇలా ఎన్నో రకాల సాధనా సంకేతాలు ప్రపంచ
వ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాయి. తెలంగాణాలో ఒక ప్రదాయంలో కొత్తగా
పెళ్ళైన తర్వాత దంపతులు పూజ చేసి ఎదురుగా మూడు బిందెలు పెడతారు. అందరూ
'గోవిందా, గోవిందా' అంటూ మనసులో పితృ దేవతలని ఆహ్వానిస్తారు. చిన్నపిల్లలు ఆ
నీళ్ళు నిండిన బిందెల మీద చెయ్యి ఆంచి ఉంచుతారు. కొంతసేపటికి ఆ బిందెలు
వాటంతట అవే జరగడం మొదలుపెడతాయి. ఇది ఆ పితృ దేవతల ఆశీస్సులకి సంకేతంగా
భావిస్తారు.*
No comments:
Post a Comment