05/06/17, 8:50:11 AM: KK: 3. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)
శమాది లక్షణాలన్నిటికీ నైఘంటికవివరణలు ఉన్నా శంకరాచార్యులు ప్రత్యేకించి వివరించారు.
శమం
విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే
భా:-
మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ
ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని
అధీనంలో ఉంచుకోవడం).
దమం
విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే
ఉభయేషామింద్రియాణాం స దమః పరికీర్తితః
భా:-
రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు
మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా
విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా
ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.
ఉపరతిః
బాహ్య అనాలంబనం వృత్తేరేషోపరతిః ఉత్తమా
భా:- బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.
తితిక్ష
సహనం సర్వదు:ఖానాం అప్రతీకారపూర్వకం
చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే
భా:- అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడాన్ని ఉపరతి అంటారు.
శ్రద్ధ
శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం
సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే
భా:- ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.
సమాధానం
సర్వదా స్థాపనం బుద్ధః శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనం
భా:-
ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ
మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.
No comments:
Post a Comment