22/06/17, 12:04:07 PM: +91 79811 59026: *బుధ్ధి, ప్రజ్ఞ, స్థితప్రజ్ఞత*
సాధారణంగా
ప్రజ్ఞ అనే పదానికి బుద్ధి అనే అర్థం చెబుతారు. ప్రజ్ఞ కలవాడే ప్రాజ్ఞుడు.
కాబట్టి బుద్ధిమంతులందరు ప్రాజ్ఞులు.స్థితప్రజ్ఞుడు అంటే సుస్థిరమైన
ప్రజ్ఞ కలవాడు.
ప్రతి
మనిషికీ కర్మానుసారం ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ద్వారా అతడు జీవన
కలాపాలను కొనసాగిస్తుంటాడు. అయితే మనిషి ఆత్మ స్థితిలో నిలువనంత వరకు
బుద్ధి ఏ క్షణంలోనైనా మనసు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. కేవలం
ఆత్మస్థితిలో ప్రవేశించి తద్వారా బుద్ధిని జాగృతం చేసుకున్నవాడే మానసిక
క్లేశాలకు దూరం అవుతాడు. ఆ విధంగా ఆత్మస్థితిలో అనుభవం ద్వారా పదునెక్కిన
బుద్ధినే ప్రజ్ఞ అనాలి. అటువంటి ప్రజ్ఞలో సుస్థిరుడైన వ్యక్తి
స్థితప్రజ్ఞుడు.
మనశ్శాంతి
కరువైందని అందరూ వాపోతుంటారు. కాని మనశ్శాంతి కేవలం రెండు స్థితులలోనే
లభిస్తుంది. ఆ రెండు స్థితులే నిద్ర, మరణం. నిద్రలో ఉన్నప్పుడు మనసు
శాంతిగా ఉంటుంది. ఇక మరణం గురించి చెప్పనక్కర్లేదు. అయితే మనిషి
జాగృతావస్థలో ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉండే అవకాశమే లేదు.
కాని
ఆత్మస్థితి గురించిన ఎరుకతో జాగృతమైన బుద్ధిలో, అంటే ప్రజ్ఞలో
స్థితుడైనపుడు (స్థితప్రజ్ఞుడైనపుడు) మానసిక కలాపాలు ఆగిపోతాయి. అంటే
అనవసరమైన భోగవాంఛలు ఆగిపోతాయి. దీని అర్థం స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి
కోరికలు కలగవని కాదు. అయితే ఆ కోరికలు స్వీయభోగానికి అయి ఉండవు. అవన్నీ తన
ఆత్మోద్ధారానికో లేదా జనుల, సకల జీవుల ఉద్ధారానికో అయి ఉంటాయి. సంపూర్ణ
భగవదాశ్రయంలో అటువంటి మహాత్ములు, స్థితప్రజ్ఞులు సకల మానవాళికి
ఆదర్శనీయులుగా మారుతారు. అటువంటి స్థితప్రజ్ఞులను అనుసరించినపుడే మానవులు
నిత్యోత్సాహంతో జీవనాన్ని కొనసాగిస్తూ జన్మను సార్థకం చేసుకొంటారు.
No comments:
Post a Comment