08/06/17, 8:45:52 AM: +91 80088 84529: ధర్మాకృతి : మణికుట్టి - 5
అంత చిరుత ప్రాయంలో మహా గౌరవమును పొందిన మణికుట్టి తన విద్య ఇంకనూ వినయమును పెంపొందించగా, అణకువతో స్వామి అడిగిన తోడనే ‘పెద్దలు ఆదేశించిన తరువాత తీర్మానం చేసే అధికారం నాకేమున్నది? సన్నిధానము వారు, నా తండ్రి, ఆదేశించిన తీరున నడుచు కొనడమే నా విధి’ అన్నారు. స్వామివారు నవ్వి ‘అలానా! అయితే తండ్రి గార్ని అడిగి చూడు’ అన్నారు. తిరువిసైనల్లూరు వచ్చిన మణికుట్టి తండ్రి వద్దకు వెళ్ళి విషయం వివరించారు. అంతే! అనర్థం వచ్చి పడింది. తండ్రి మండిపడ్డారు.
“బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు శ్వవృత్తి చేయడం పెద్దతప్పు. స్వతంత్రంగా ఉండి శాస్త్ర విహితమయిన ధర్మములను కాపాడుకొంటూ, అందుకోసం చనిపోవడానికైనా సిద్ధపడి ఉండాలి. సేవకా వృత్తికి పోతే తనకు అన్నం పెట్టే యజమానిని అనుసరించవలసి రావడాన ధర్మమును సందర్భానుసారము కొంచెం ఉపేక్షించవలసి వస్తుంది కాబట్టి ఈ వృత్తే కూడదన్నది శాస్త్రం. స్వతంత్రంగా పాఠంచెప్పు. ఎవరయినా నేర్చుకోవడానికి వచ్చిన వారు ప్రియంతో దక్షిణ ఇస్తారా, స్వీకరించు. దాంతో జీవనం చేయి. నీ దగ్గర వేదం చెప్పుకోవడానికి ఎవరూ రాకపోతే ఆ వచ్చిన వారు దక్షిణ ఈయకపోతే అదే వేదము పారాయణ చేసుకుంటూ వేదం ధర్మము కళంకమవకుండా ఉండడానికి ప్రాణ త్యాగం చేయడానికైనా సరే సిద్ధంగా ఉండు అని బ్రాహ్మణునికి విధించబడి యున్నది. ఈ విధి వేరెవరో నియమించినది కాదు. ఋషులే దూరదృష్టితో ఈ రకంగా విధించారు. మరి నువ్వో! మన వర్ణాశ్రమాది ధర్మ విషయమే తెలియని అన్య దేశీయుల వద్ద ఊడిగం చేయడానికి సిద్ధమయినావు. సన్నిధానం వారు చెప్పారని వేరే చెబుతున్నావు. స్వామివారు నీ మనో భావనలు తెలుసుకోవడానికి వేడుకగా అడిగి ఉంటారు. విదేశీ దొరల వద్ద కూలి పని గురించి చెప్పినంతనే నీ శరీరం అసంకల్పితంగా కంపించిందా లేదా అని చూడడానికే వారు ఆ విధంగా అడిగి ఉంటారు. స్వామి వారే అయినా, చంద్రమౌళీశ్వరుడే అయినా, నీమీద నిప్పులు గుమ్మరిస్తే వెంటనే చెదిరి, చెదిరి కంపించిపోతావా లేక తండ్రితో సంప్రదించి కంపించుదామని ఆగిపోతావా? ఉద్యోగమంటే నీకు రుచి ఉన్నందునే వెంటనే అయ్యా! ఇది పాపం! ఈ రకంగా జీవించడం కన్నా చావడం మేలు అని బెదురుతూ చెప్పక నాన్నా మేకపిల్ల అని సాకులు చెబుతున్నావు.నీవు ఏం చదివి ఏం బిరుదులూ తెచ్చుకుంటే ఏం ప్రయోజనం! సన్నిధానంలో ఈ పాప వృత్తి వద్దు అని ఖరాఖండిగా చెప్పనందునే బుద్ధి పరిణితికై ఊరంతా మెచ్చుకోబడుతున్న నీ కుమారుని మనో పరిణితి ఎంత లక్షణంగా ఉందో చూడు అని చెప్పకయే చెప్పినట్లు నా వద్దకు పంపారు. పో! ఈ రకమైన పిల్లవాడు నాకు అక్కరలేదు” అని నిర్దాక్షిణ్యంగా పుత్రుని వెళ్ళగొట్టారు నరసింహ శాస్త్రి.
అధ్యాపక ప్రవృత్తికీ, దైవభక్తికీ, సదాచారమునకు ఆలవాలమయిన మన దేశం, తమ స్వధర్మములను సకల ధర్మములను త్రోసివేసి, తాను పోటీపడలేని లౌకికాభివృద్ధి పోటీలోనే మునిగి వృధా అయిపోవడానికి కారణం. ఈ రోజులలో ఎంతోమంది నరసింహశాస్త్రులు లేకపోవడమే. బ్రాహ్మణులు మొదట్లో స్వధర్మాన్ని వదిలివేసి తెల్లవారి వద్దకు గుమాస్తా ఉద్యోగానికి పోయి, ఆపైన వారి ఆంగ్లేయ విద్య అభ్యసించినందు వల్లనే హిందూ సముదాయపు ఉన్నతి, వర్ణాశ్రమ ధర్మములు కుప్ప కూలిపోయినవి. నరసింహశాస్త్రి ఈ రకంగా చెప్పడం మీ అందరికీ ఎలా తోచినా సరే! నాకు ఈ కోణంలో చూచినప్పుడు ఇలా అనేక నరసింహశాస్త్రులు లేరే! అని బాధగా ఉంది. ఆ విషయం అలా ఉండనీయండి.
ఎందుకూ పనికిమాలిన పిల్లలపై తండ్రి కోపిస్తే, దండిస్తే వారికెంతో కోపం వచ్చి ఇంటినుండి పారిపోతున్నారు. తరువాత వీరి కన్నమనస్సు తాళలేక న్యూస్ పేపర్లలో “ఏమీ మనస్సులో ఉంచుకోక ఇంటికి రా! మేము అన్నీ మరచి పోయాం! మరణ శయ్యలో ఉన్నాము” అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. మరి, నరసింహ శాస్త్రి! మహా విద్వాంసుడు, సుగుణాల ప్రోత, ఏకసంథాగ్రాహి అయిన పిల్లవానిని స్వధర్మంపై తనకున్న శ్రద్ధతో ఇంటినుంచి వెళ్ళగొట్టారు.
మణికుట్టి కూడా సాధారణ బాలుని వలె తండ్రి తిట్టినందుకు కోపించలేదు. ‘మనకు ఉద్యోగాశ లేదనేది మన అంతరంగానికి బాగా తెలుసు. అయనా తండ్రి చెప్పిన విధంగా స్వధర్మ రక్షణపై మనకు తీవ్రమైన పట్టుదల ఉండి ఉన్నట్లయితే వారు ఎదురు చూసిన విధంగా సన్నిధానం వారి ఎదుట హైకోర్టు ఉద్యోగమును సవినయముగా తిరస్కరించి ఉండవలసినది. ఆ రకంగా చేయకపోవడం దోషమే. ఆ దోషం తొలగి తండ్రికి మనపై మనస్సు కరిగి మనలను దగ్గర చేర్చుకొనేంత వరకూ తపస్సు ఒక్కటే శరణ్యమని’ నిశ్చయించుకొన్నారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
y at 10:40
No comments:
Post a Comment