02/06/17,
1:27:45 PM: KK: *వివేకానందులవారు ఎలుగెత్తి చాటినదేమిటంటే:-- గత
నూరుసంవత్సరాలలో వచ్చిన మహాత్ములేవరైనా సరే వివేకానందస్వామి చూపిన బాటలోనే
పయనించారు.నేటి గురువులు కూడా పయనిస్తున్నారు.వారు వివేకానందస్వామి
అనుచరులమని చెప్పుకోవచ్చు,చెప్పుకోకపోవచ్చు.అది వేరేసంగతి.మఠాలలో,ఆశ్రమాలలో
దాగిఉన్న ఆధ్యాత్మికతను సమాజంలోకి తెచ్చిన ఘనత
వివేకానందస్వామిదే.అంతేకాదు, భారతీయమతం యొక్క విశ్వజనీనతనూ,తాత్విక
అగాథాన్ని,ఆచరణాఆధ్యాత్మికతనూ సముద్రపు ఎల్లలుదాటించి భారతదేశం అంటే
చెట్లను,పుట్టలను పూజించే అనాగరికులు, ఆటవికులు ఉన్నదేశంకాదు,ప్రపంచానికి
గురువులుగా భాసిల్లే మహనీయులు ప్రతితరంలోనూ ఉద్భవించిన పుణ్యభూమి ఈ హిందూ
దేశం అని ఒక్కడే ధైర్యంగా చాటి చెప్పిన ఘనత వివేకానందస్వామిది.*
No comments:
Post a Comment