Saturday, September 28, 2019

shakthi peethams puja

నేడు మహాలయ అమావాస్య

మహలయ పక్షంలో చివరి మహాలయ అమావాస్యగా పిలుస్తారు. సమయం ఉంటే తప్పకుండా తెలుసుకోవలసిన చిన్న కధ ఇది.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
*****సేకరణ*****
పొంగల్ - మాట్టు పొంగల్

పరమాచార్య స్వామి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ ప్రతి భోగి రోజు వచ్చేవారు. అలాగే 1989లో మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, శ్రీమఠం గోశాల నిర్వాహకుడు చిన్న కాళీయన్ కూడా స్వామిదగ్గర నిలబడి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. “అతనికి ఏమి కావాలో కనుక్కో?” అని శిష్యులను అడిగారు.

”ఎల్లుండి మాట్టు పొంగల్(కనుమ) పెరియవ. గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి. వాటిని పూలదండలతో అలంకరించాలి. . .” అంటూ కాస్త నసుగుతూ ఇంకా చెప్పబోతుండగా, మహాస్వామివారే “ఓహ్ అలాగా అలాగైతే. అతని వద్ద ద్రవ్యం లేదా?” అని అడిగారు. కాళీయన్ అవునని తలూపాడు.

”ఎవరు వచ్చారు?” అని శిష్యులను అడిగారు స్వామివారు.

”తిరువారూర్ వచ్చారు” అని చెప్పారు.

న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ నుండి బయలుదేరుతున్నప్పుడు, అతని క్లైయింట్ ఒకరు స్టాంపు, కోర్టు ఖర్చులకు గాను ఇచ్చిన 4000 రూపాయలను అతని చేతిసంచిలో ఉంచుకొని కాంచీపురం బయలుదేరాడు. కేవలం తిరుగు ప్రాయాణానికి బస్సు చార్జీలకు సరిపడు డబ్బు ఉంచుకొని తక్కిన సొమ్ము మొత్తం కాళీయన్ కు ఇవ్వమని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. ఆ డబ్బు తీసుకుని కాళీయన్ ను వెళ్లమన్నారు.

తరువాత స్వామివారు ఆ న్యాయవాదితో, “ప్రతి మాట్టు పొంగల్ కి శ్రీమఠానికి నీకు ఇవ్వగలిగినంత సొమ్ము తీసుకునిరా. అలాగే బెల్లం పొంగలి చేసుకొని వచ్చి మీ చేతులతోనే గోవులకు పెట్టండి” అని చెప్పారు. అతను అలాగే అని స్వామి వారి వద్దనుండి ప్రసాదం స్వీకరించి వెల్లిపోబోతుండగా, “తిరువారూర్ వెళ్ళిపొయాడా?” అని అడీగారు.

స్వామివారు మరలా వారిని పిలిపించి “బెల్లం పొంగలి ఎలా తయారు చేస్తారో తిరువారూర్ భార్యని అడగండి” అని శిష్యులను ఆదేశించారు. ఆమె తయారు చేసే విధానాన్ని చెబుతుండాగా, స్వామివారు అందుకొని “లేదు. లేదు. ఆవులకు పెట్టడం కోసం తయారు చేసేప్పుడు గోవుల నుండి వచ్చిన పదార్థాలను అందులో కలపకూడదు. అలా చేస్తే పాలిచ్చే ఆవు వట్టిపోతుంది” అని చెప్పారు.

ఇంకా ఇలా చెప్పారు, “అన్నాన్ని ఉడికించి, బెల్లం కరిగించి అవక్షేపాలు తొలగించాలి. ఆ అన్నాన్ని బెల్లాన్ని బాగా కలిపి గోవులకు తినిపించాలి”. పాలు, పెరుగు, నేయి, వెన్న - ఇవి ఏవి దానికి కలపకూడదు. వాటిని కలిపి పెడితే ఆవులు పాలు ఇవ్వవు. ”క్షేమంగా ఉండండి” అని స్వామివారు ఆ దంపతులను ఆశీర్వదించారు. ముగ్గురు అన్నదమ్ముల ఆ తిరువారూర్ కుటుంబం 1990 నుండి ప్రతి సంవత్సరము మాట్టు పొంగల్ రోజు పరమాచార్య స్వామివారు విధంగా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
👩‍🦰*తల్లి ఋణం ఎన్ని కోట్లు ఇచ్చి తీర్చగలం?**_👩‍🦰

      _**ఈ మధ్య మా దూరపు బంధువు ఒకాయన తన కూతురు పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చాడు. కర్నాటకలో కాంట్రాక్టు పనులు చేసుకుంటూ ఖరీదైన కారులో ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన కళ్లజోడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకసారి చూసి పక్కున పడేసే పెళ్లి పత్రికతో సహా అన్నీ ఖరీదైనవే ఉపయోగించే ఆయన పెళ్లికి పిలిచిన తరువాత నాతో నీవు చిన్నతనం నుండి చాలా తెలివైన వాడివి కదా మరి ఇప్పుడు కేవలం యోగా శిక్షణతో మాత్రమే ఆగిపోయి, కేవలం అమ్మకు సేవ చేసుకుంటున్నానని అమ్మను చూసుకొంటూ కూర్చుంటే రేపు నీ పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేస్తావు? అన్నాడు..*_

        _**అలాగే నన్ను చూడు నా తెలివితో కోట్లు సంపాదించి మా అమ్మ పేరుతో కోటి రూపాయలు డిపాజిట్ చేశాను. అలాగే ఆమెను చూసుకోవడానికి పని మనుషులను నియమించాను. ఇక అంతా వాళ్ళే చూసుకొంటారు అన్నాడు. అది విన్న నాకు అతడి మాటలు కొత్తగా ఆశ్చర్యపోయే విషయంగా కాదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేస్తున్న తప్పు ఇదే కదా. అలాగే అతడితో నా శిష్యుడికి జరిగిన ఒక స్వానుభవాన్ని ఆయనకు వివరించాను..*_
                     
       _**నిజానికి తల్లిదండ్రులు తమ బిడ్డలను కనిపెంచే సమయంలో వారు పడే కష్టానికి, ఆవేదనకు, సహనమునకు బదులు తీర్చుకోవడం ఆ బిడ్డలు ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా అది పూర్తి కాదు. ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకోలేరు. దీనికి ఉదాహరణ..*_

        _**సుబ్బారావు అనే నా శిష్యుడు తన తెలివితేటలతో గొప్పగా వ్యాపారం చేసి కోట్లు గడించి తన తల్లి ఋణం తీర్చుకోవాలనే భావంతో ఒక లక్ష రూపాయల సంచిని తీసుకొచ్చి తల్లి పాద పద్మములకు సమర్పిస్తూ "అమ్మా! ఈ డబ్బు నీకు ఇష్టమైన విధంగా దానం చేసుకో, దానితో నీ ఋణం నుండి నాకు ముక్తి లభిస్తుంది.” అని అన్నాడు. అది విన్న ఆ ఆ తల్లి అన్నది....*_

         _**చూడు నాయనా ! నా రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే నాకు నువ్వు సంపాదించిన డబ్బును ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఒక్క రోజు రాత్రి పూట నావద్ద పడుకో ” చాలు అన్నది. అందుకు సమ్మతించిన సుబ్బారావు ఆ రాత్రి తల్లి దగ్గరకు పోయి ఆమె పక్కనే తోడు పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టగానే ఆ తల్లి అతడిని లేపి “నాయనా దప్పికయినది నీళ్లు ఇవ్వు” అన్నది..*_

       _**అమ్మ తనను మొదటి సారిగా అడిగిన ఆ పనికి సుబ్బారావు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్లిచ్చాడు. రెండు గుటకలు వేసి మిగిలిన నీటిని పక్క మీద దొర్లించింది. పక్క అంతా తడిసి పోవడం చూసి “ఏంటి ఇలా చేసావ్ అమ్మా ” అని సుబ్బారావు అడుగగా “నాయనా పొరపాటు అయింది” అని చెప్పింది. అందుకు సుబ్బారావు శాంతించి నిద్రపోయాడు.*_

         _**సుబ్బారావు గాడ నిద్రలో గురకలు పెట్టడం మొదలు పెట్టగానే తల్లి మళ్ళీ లేపి “నాయనా! దప్పిక అవుతున్నది నీళ్లు ఇవ్వమన్నది. అందుకు సుబ్బారావు విసుక్కుంటూ అమ్మా ఇప్పుడే కదా నీళ్ళు ఇచ్చాను. ఇంతలోనే మరల దప్పిక అయినదా ” అంటూ వస్తున్న కోపాన్ని అనుచుకొంటూ లేచి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఆ తల్లి మొదటి సారిలాగానే ఒకటి రెండు గుక్కలు తాగి మిగిలిన నీటినంతటినీ పక్క మీద పోసింది.*_

       _**దీనికి సుబ్బారావు విసుక్కుంటూ “అమ్మా ఏమిటి నువ్వు చేస్తున్నది, చూడు పక్క ఎలా తడిపేశావు.” నేనెలా పడుకోవాలి అనగా “నాయనా! చీకటిగా ఉన్నందున గ్లాసు చేతి నుండి జారిపోయింది” అని జవాబు చెప్పింది. సరే అని శాంతించిన సుబ్బారావు వెంటనే నిద్రపోయాడు. కాసేపటికి సుబ్బారావు నిద్ర పోతుండగా మరలా లేపి మంచినీళ్లు అడగగానే ఈసారి సుబ్బారావుకు పిచ్చ కోపం వచ్చింది. ఆవేశంతో, కోపంతో “అమ్మా ఏమిటి ఒకటే దప్పిక దప్పిక అని నన్ను చంపేస్తున్నావు. నన్ను నిద్ర పోనిస్తావా? లేదా” అంటూ విసురుగా వెళ్ళి నీళ్ళు తీసుకువచ్చి “ఇదిగో తాగి చావు” అన్నాడు కోపంగా..*_

        _**ఆ తల్లి మరల మొదటి లాగానే కొంచెం నీరు తాగి తక్కిన నీటితో పక్కను తడిపేసింది. అది గమనించిన సుబ్బారావు ఇక సహించలేక పోయి కోపంతో... “ఇలా తడిసిపోయిన పక్కమీద నేను ఎలా పడుకో గలను? నీకు మతి చెడిపోయినట్లు ఉందంటూ.” కోపంగా అన్నాడు.*_

        _**అది విని అప్పుడు ఆ తల్లి... చూడు నాయనా ! నీవు నా ఋణం తీర్చుకుంటానన్నావు. తల్లి ఋణం తీర్చుకోగలుగుతావా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నీవు అన్ని జన్మలెత్తినా, నీ జీవితాంతం తల్లికి నిరంతర సేవ చేసినా కూడా మాతృఋణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటే నీవు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీవు పక్క మీద  మలమూత్రములు వదిలేవాడవు. మురికయి వాసనతో తడిసిపోయిన నీ బట్టలను విప్పేసి, నా వద్ద ఉన్న పొడి గుడ్డలతో నిన్ను కప్పేదాన్ని.*_

         _**నీ తడిసిన గుడ్డలను నా క్రింద పెట్టుకొని నిన్ను పొడిగా ఉన్న నా చీరెతో కప్పి ఏడుస్తూన్న నిన్ను  నిద్రబుచ్చే దాని కోసం గంటలతరబడి జోకొడుతూనే ఉండేదాన్ని. అలా ఒక్క రోజు రెండు రోజులు వారం రోజులు కాదు, నిరంతరం కొన్ని సంవత్సరాల వరకు చేశాను. అంటే...నీ అంతట నీవు వేరేగా పడుకోగలిగే వరకు నేను అలా చేస్తూనే ఉండేదాన్ని. నిద్ర ముంచుకొస్తున్నా కళ్ళళ్ళో వత్తులు వేసుకుని రేయింబవళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొనేదాన్ని అదీ ఆనందంతో, సంతోషంతో..*_

       _**మరి నేను పొరపాటుతో ఒకటి రెండు సార్లు పక్క నీటితో తడిపేసినందుకే నీకు అంతలా కోపం వచ్చి విసుక్కుంటున్నావు. అదికూడా ఒక్క రాత్రికే కాదు కొన్ని గంటలకే ఇంత విసుగుతో, చికాకుతో, చిరాకుతో, ఆవేశంతో నన్ను కోప్పడ్డావే ” మరి అప్పుడు నేను కొప్పడి విసిగిపోయుంటే ఈ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు అన్నది..*_

        _*ఇదంతా విన్న మా సుబ్బారావు సిగ్గుతో తలదించుకుని తల్లి పాదాలు పట్టుకుని అన్నాడు.“అమ్మా !నీవు ధన్యురాలవు. నీ ఋణం చెల్లించడం అసంభవం. ఇట్టి మమతా స్వరూపిణి యగు మాతృమూర్తితో ప్రతి పుత్రుడు పుత్రికలు జీవితాంతం కేవలం సేవకులుగా ఉండాలి తప్ప, తల్లికి చేసే సేవకోసం పనిమనిషులను పొరపాటున కూడా పెట్టకూడదు. అలాగే ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఆ తల్లి ఋణాన్ని తీర్చుకోలేమన్న నగ్నసత్యాన్ని బిడ్డలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ”.. అన్నాడు..*_

      _**ఇదంతా విన్న మా బంధువు కళ్ళలో నుండి కారుతున్న కన్నీటిని తుడిచుకొంటూ నా తల్లికి పాదాభివందనం చేసి "ఈ నీ కుమారుడి సేవలో తరించిపోతున్న మీ జన్మధన్యం తల్లి. ఇలాంటి కొడుకు నీకు దొరకడం అనేది నీవు గతజన్మలో చేసుకొన్న పుణ్యఫలం అని అంటూ, నా దగ్గరకు వచ్చి క్షమించమన్నట్లుగా నా రెండు చేతులు పట్టుకుని "నీ దగ్గర డబ్బు లేకపోయినా, నా కంటే గొప్ప కోటీశ్వరుడివి నువ్వే అంటూ " భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు..*_

       _**కాబట్టి మిత్రులారా ! మీరు కూడా ఆలోచించండి, తల్లిదండ్రుల ఋణం తీర్చుకునే పద్ధతి ఏదో..*_

     _**సర్వే జనా సుఖినో భవంతు.*
28/09/2019
బతుకమ్మ పండగ ప్రారంభం.

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

బతుకమ్మ పండుగ విశిష్టత

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ.

రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు  రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి  సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు.

9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం  తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ:

మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ :

 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ :

ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ :

 నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ :

అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..

అలిగిన బతుకమ్మ :

 ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ :

 బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ :

నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ :

ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.

తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.🙏🙏🙏
*భర్తృహరి (సుజనపద్దతి) సుభాషిత శ్లోకాలు  ~ 59*

*59: యః  ప్రీణయే త్సుచరితైః  పితరం  స పుత్త్రో*
‌        *య ద్బర్తురేవ హిత మిచ్చతి తత్కళత్రం*
        *తన్మిత్ర మాపది సుఖే చ*
        *సమక్రియం  య, దేతత్ త్రయం జగతి పుణ్యకృతో లభన్తే*

*అనువాదపద్యము*

*చ: జనకుని బూజలం గడు బ్రసన్నుని జేయునతండు పుత్త్రు, డే*
      *వనితమెలంగు భర్తృవశవర్తి యై యది సత్కళత్ర, మే*
      *జనుడు విపత్తి సౌఖ్యసదృశ క్రియుడాతడు మిత్త్రు; డీత్రయం*
      *బును జగతిన్ లభించు గడు బుణ్యాము జేసినయట్టి వారికిన్*

        మంచి నడవడిచేత తండ్రిని సంతోషపెట్టువాడే పుత్రుడు, భర్తకు హితము
కోరునదియే భార్య, ఆపత్సమయమునందును సంపదల యందునూ, సమానముగా చెలిమి చేయునతడే మిత్రుడు; ఇట్టి పుత్రుడునూ, భార్యయూ,
స్నేహితుడునూ,  పుణ్యాత్ములకు గానీ లభించరు‌.

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~
* బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈ పద్యం గురించి మీకు తెలుసా !?

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి.

ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం.

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను.

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు.

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ.

’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి
చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.

అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.

మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.

కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ అనడానికి కష్టం ఏమిటి?

ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.

ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ

సర్వేజనా సుఖినోభవంతు ..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹బృహధర్మ పురాణం లో బ్రహ్మ దేవుడు చేసిన పితృస్తుతి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 నమో పిత్రే జన్మ దాత్రే.
 సర్వ దేవ మయాయచ
 సుఖదాయ ప్రసన్నాయ
 సుప్రీతాయ మహాత్మనే

సర్వాయజ్ఞస్వరూపాయ                                      స్వర్గయా పరమేష్ఠినే
సర్వ తీర్దావ లోకాయ  
కరుణా సాగరాయ చ

నమోసదాఽశుతోషాయ శివ రూపాయతే నమః
సదాపరాధ క్షమినే
 సుఖాయసుఖదాయచ.

దుర్లభంమానుషమిదం
యేనలభ్ధంమాయామిదం
సంభావనీయం ధర్మార్ధే
 తస్మై పిత్రే నమో నమః.

తీర్ధస్నాన తపోహోమ
 జపాదీన్ యస్య దర్శనం
మహా గురోశ్చ గురువే
 తస్మై పిత్రే నమో నమః

యస్య ప్రాణామ స్తవనాథ్
 కోటీసః పితృ తర్పణం
అశ్వమేధస్తతైః తుల్యం
 తస్మైపిత్రే నమోనమః.


ఫల శృతి :-  ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతి రోజు ఏవరు పఠిస్తారో,వారికి ఈతి బాధలు ఉండవు.ఎవరైనా పితృదేవతల విషయములో తప్పు చేసిన, అంటే శ్రాద్ధము  జరుపక పోయిన, పశ్చాతాపముతో ఈ స్తోత్రాన్ని పఠించిన ప్రాయశ్చిత్రం జరిగి వారిని పితృదేవతలు అనుగ్రహిస్తారు.
పుట్టిన రోజునాడు ఎవరైతే తండ్రి కి నమస్కరించి పఠిస్తారో  వారికి పితృదేవతల ఆశీస్సులు  అందుతాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*THVAMEVAAHAM త్వమేవాహమ్‌*

కన్నతల్లి కడుపులోంచి బయటపడి,
>

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి,
>
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు
>

 ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం

 పేరే

 *నేను =NENE*

          *ఈ *నేను*
 ప్రాణశక్తి అయిన
"ఊపిరి"కి మారుపేరు●

 * ఊపిరి ఉన్నంతదాకా *నేను*’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది

* జననమరణాల మధ్యకాలంలో
>
 సాగే జీవనస్రవంతిలో
ఈ
*నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది●

          *ఈ *నేను*
లోంచే
*నాది* అనే భావన పుడుతుంది!

         *ఈ *నాది* లోంచి

1.నావాళ్ళు,
2.నాభార్య,
3.నాపిల్లలు,
4.నాకుటుంబం,
5.నాఆస్తి,
6.నాప్రతిభ,
7.నాప్రజ్ఞ,
8.నాగొప్ప...
అనేవీ పుట్టుకొచ్చి
>
చివరికి ఈ *నేను*
అనే భావన
 భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి,
నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.

              * *EGO అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ
*నేను*  *నేనే సర్వాంతర్యామిని*
అని విర్రవీగుతుంది.

*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.
*

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో
4. ప్రతీకారాలతో

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ
సిద్ధపడుతుంది ●

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య
దశలదాకా
విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన
 *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు
మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.◆

               *వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.●

               *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.●

              * సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.●

              *కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.●

               *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.●

             *మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.◆

*1.నేనే* శాసన కర్తను,

 *2.నేనే* ఈ భూమండలానికి అధిపతిని,

*3.నేనే* జగజ్జేతను...
అని మహోన్నతంగా భావించిన

 *నేను*
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది.
రోజు మారుతుంది.

               *ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన          *నేను* కథ అలా సమాప్తమవుతుంది.

               * అందుకే ఊపిరి ఆగకముందే
*నేను*
గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత
BHAGAVATH GEETHA..

             * చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే.

             *అది శాశ్వతం కానే కాదు*

* *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
' వైరాగ్యస్థితి ' సాధ్యమవుతుంది.

             * *వైరాగ్యం* = అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం*.

 తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.

             *స్వర్గ ~నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

              * మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే *=నరకం*

              * అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడ0=* స్వర్గం.*

              *ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం*.

1. నిజాయతీగా,

2. నిస్వార్థంగా,

3.సద్వర్తనతో,

4. సచ్ఛీలతతో

5.భగవత్‌ ధ్యానం
తో జీవించమనేదే

 *వేదాంతసారం*.

    *అహం బ్రహ్మాస్మి*
అంటే =
*అన్నీ నేనే* .◆

అనే స్థితి నుంచి

 *త్వమేవాహమ్‌* = అంటే- *నువ్వేనేను*
అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత.
దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని...
చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.
మనవాళ్లు  వెంటనే  చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .
మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు
 ... మనం వాడే మాట అదే!.

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌  కాదు గదా !.
మనం చెప్పాల్సిన సమాధానం  అది కాదు.
తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.
మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే  ప్రక్రియ.
దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.
రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.
ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.
అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది
 ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే  చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని  చెప్పండి.
మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.
అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా  పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....

అమూల్యమైన సందేశం పంపిన మిత్రులకు ధన్యవాదాలు
🙏🌷🙏

Thursday, September 26, 2019

ఈ చిత్రాన్ని కాస్త దగ్గరగా చూడండి 9 గ్రహాలు 27 నక్షత్రాలు 12 రాశులు ఈ రాతి విగ్రహం లో అందంగా చెక్కబడి ఉన్నాయి ఈవిడే భగవతి భువనేశ్వరి దేవి.
శ్రీ కళా దేవి ఆలయం, రాజపలయం రోడ్డు, గోపాలపురం, మధురై, తమిళనాడు.

Wednesday, September 25, 2019

రుద్రాక్షలు....
గురించి తెలుసుకుందాం....

ఒకానొక కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్య వత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు.

ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు - మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి - కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.

రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్ల ; రుద్ర (దుఃఖములను) క్షయము (నాశనము చేయు గుణము) కలిగినందువల్ల వీటికి రుద్రాక్షలనే పేరు సార్ధకమైంది.

నాలుగు వర్ణాల భక్తులకూ ధారణయోగ్యమైనవి ఈ రుద్రాక్షలు. జపం చేసుకోవడానికీ - ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఫలవంతమైనవి.

గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు - ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.

రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు. కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ - పురుగులు ప్రవేశించినవీ - గుండ్రంగా లేనివీ - కండలేనివీ పనికిరావు. వీటితో జపమైనా నిషిద్ధమే!

నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి.

మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక, అదీ సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం!

పదకొండు వందల రుద్రాక్షలను ధరించినచో అతడు సాక్షాత్‌ శివస్వరూపుడు, బ్రాహ్మణులు తెల్లనివీ - క్షత్రియులు ఎర్రనివి, వైశ్యులు పసుపు రంగువీ, అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు!

ఆరోగ్యానికి రుద్రాక్షలు :

రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. వ్యాధులు - బాధలు ఉండవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.

మామిడిచెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది. ఫలం యొక్క పై పొర దళసరిగా ఉంటుంది. పండు రూపంలో దీన్ని సేకరించగలిగితే మంచిదే! దానంతట అదే ఎండి, గట్టి పడుతుంది. పండు పుల్లగా ఉంటుంది. వాత - కఫ దోషాలను నివారిస్తుంది.

రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి. నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసినదే! అలాగే తేనెలో అరగదీసి మూర్చరోగాన్ని పోగొట్టవచ్చు!

వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు.

రుద్రాక్షలలో రకాలు :

ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి...ఇలా మొత్తం 14 వరకూ ఉన్నాయి. ఇవిగాక కొన్ని ప్రత్యేకమైనవీ ఉన్నప్పటికీ - అవి అరుదుగా లభిస్తాయి. వారి పూర్వ పుణ్యానుసారం లభిస్తే లభించ వచ్చునేమో గానీ, సాధారణంగా అలభ్యం అనే చెప్పాలి.

రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి నుంచి 14 ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రమే లభిస్తున్నాయి.

వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం వుంటుంది. అంతేగాకుండా వీటిని ధరించడం ద్వారా మంచి ఫలితాలు, శుభాలు పొందుతారు.

* ఏకముఖీ రుద్రాక్ష: శివ స్వరూపంగా చెప్పబడే ఏకముఖ రుద్రాక్ష లభించడం చాలా కష్టం. ఈ ఏకముఖి రుద్రాక్ష అర్థచంద్రాకారంలో ఉంటుంది. దీనిని ధరించే ముందు "ఓం ఎం హం బెం ఇం ఓం'' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించిన వారికి సిరిసంపదలు వృద్ధి చెందడంతో పాటు ఇంద్రియనిగ్రహం కలుగుతుంది. మనోవికాసం, పరతత్వ జ్ఞానము లభిస్తాయి.

* ద్విముఖి రుద్రాక్ష: ఈ రుద్రాక్షను పార్వతీ పరమేశ్వరుల రూపంగా అర్థనారీశ్వరుల రూపంగా వర్ణిస్తారు. ఈ రుద్రాక్షను గురుపూర్ణిమ, దత్త జయంతి పర్వదినాల్లో, కార్తీక మాసంలో గురు, శుక్రవారాల్లో ధరించాలి. "ఓం, క్ష్రీం హ్రీం క్షాం వ్రీం ఓం' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ఈ  రుద్రాక్షను ధరించాలి. దీనిని ధరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, సంతానప్రాప్తి, మనశ్శాంతి లభించి సమస్త కోరికలు నెరవేరుతాయి.

త్రిముఖ రుద్రాక్ష : మూడు ముఖములు గల ఈ రుద్రాక్ష త్రికాలగ్నుల స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ రుద్రాక్షను సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, పర్వదినాలలో గురువారం రోజు ధరించాలి. దీనిని ధరించే ముందు త్రిమూర్తులను అష్టోత్తర పూజచేసి, ధరించే సమయంలో ''ఓం క్లీం నమః'' అనే మూల మంత్రాన్ని 108 సార్లు పఠించి దీనిని ధరించాలి. దీనిని ధరించడం వల్ల సంపదలు, విద్యాభివృద్ధి, గుండె జబ్బులు వంటి వ్యాధులు తగ్గిపోతాయి. కుజదోషము గలవారు ఈ రుద్రాక్షను ధరించడం చాలా మంచిది.

చతుర్ముఖ రుద్రాక్ష : నాలుగు ముఖములు గల చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మదేవుడి స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ రుద్రాక్షను గురుపూర్ణిమ, దత్తజయంతి, పర్వదినాల్లో, వారాల్లో బుధవారం నాడు ధరించడం మంచిది. దీనిని ధరించే ముందు "ఓం వాం క్రాం తాం హాం ఈం" అనే మంత్రాన్ని 11 సార్లు పఠించి, పూజించి, కుడిచేతికి ధరించవలెను. మానసిక రోగములు తగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యార్థులు దీనిని ధరిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు దీనిని ధరిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి  చెందుతుంది.

పంచముఖ రుద్రాక్ష: ఐదు ముఖములు గల ఈ రుద్రాక్ష కాలాగ్ని స్వరూపం దీనిని దత్తజయంతి, గురుపూర్ణిమ, శివరాత్రి పర్వదినాలలో, సోమవారం నాడు ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం అం క్ష్మా స్వాహా" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించి ధరించాలి. దీనిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పొందటంతో పాటు గుండె జబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు నయమవుతాయి.

* షణ్ముగ రుద్రాక్ష : ఆరు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష షణ్ముఖుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతీకగా అభివర్ణించారు. దీనిని వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో గానీ, మంగళ వారాల్లో కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం శ్రీం క్షీం సాం ఇం" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠించి ధరించవలెను. ఈ రుద్రాక్షను కుడిచేతికి ధరించాలి. దీనిని ధరించడం వల్ల గుండెదడతో పాటు హిస్టీరియా వంటి వ్యాధులు తగ్గుతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.

* సప్తముఖ రుద్రాక్ష : ఏడు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష మన్మథ స్వరూపంగా అభివర్ణించారు. దీనికే "అనంగము'' అని పేరు కూడా కలదు. దీనిని దీపావళి పర్వదిన నాడు కానీ, శుక్ర, శనివారాల్లో గాని ధరించవలెను. దీనిని ధరించే ముందు శ్రీలక్ష్మీ అష్టోత్తరం గానీ, సహస్రనామంతో గానీ పూజ చేసి "ఓం హ్రీం, క్రీం గ్లౌం హ్రీం సాం" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠిస్తూ ధరించాలి. శనిగ్రహ ఇబ్బందులు, ఏలినాటి శని దశను అనుభవిస్తున్నవారు దీనిని ధరిస్తే ఆ బాధల నుంచి నివారణ లభిస్తుంది.

* అష్టముఖ రుద్రాక్ష: ఎనిమిది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష వినాయకుడి స్వరూపంగా చెప్పబడుతోంది. దీనిని వినాయక చవితి పర్వదినం నాడు కానీ, ఆదివారం గానీ ధరించవలెను. ఈ రుద్రాక్ష ధరించే ముందు ''ఓం హ్రీం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించవలెను. దీనిని ధరించడం వల్ల విఘ్నాలు తొలగి, కార్యానుకూలత, మనశ్శాంతి, ఏకాగ్రత కలుగుతాయి.

* నవముఖ రుద్రాక్ష: తొమ్మిది ముఖాలున్న ఈ రుద్రాక్ష భైరవ స్వరూపంగా చెప్పబడుతుంది. నవశక్తులు అంటే విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రేధిశక్తి, అంగశక్తి, పశ్వంతీ అనువాటికి ప్రతీకలుగా పూజలందుకునే ఈ రుద్రాక్ష అధిదేవత దుర్గాదేవి. దీనిని నవరాత్రుల్లో కానీ, శుక్రవారం గానీ ధరించడం చేయాలి. ధరించేముందు "ఓం క్లీం హ్రూం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. దీనిని కుడి భుజానికి ధరించడం వల్ల బలం చేకూరుతుంది. దీనిని ధరించిన వారికి వాక్సుద్ధి వృద్ధి చెంది గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చర్మ వ్యాధులు నిర్మూలింపబడతాయి.

* దశముఖ రుద్రాక్ష : పది ముఖములు గల ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపముగా తెలియజేయబడింది. దీనిని ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదినాల్లో ధరించాలి. దీనిని ధరించేముందు "ఓం హ్రీం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. దీనిని ధరించడం ద్వారా భూత, ప్రేత, పిశాచ, రాక్షస వంటి భయాలు గ్రహపీడలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు చేకూరుతాయి.

* ఏకాదశ ముఖ రుద్రాక్ష: 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష రుద్ర స్వరూపంగా పేరు పొందినది. ఈ రుద్రాక్షను శివరాత్రి నాడు కానీ, సోమవారం నాడు కానీ ధరించడం మంచిది. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం హూం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు జపించవలెను. దీనిని ధరించడం ద్వారా సంతానాభివృద్ధి, సౌభాగ్యం, ధైర్యము, సంపద, జ్ఞానము మొదలగునవి అభివృద్ధి చెందుతాయి.

* ద్వాదశముఖ రుద్రాక్ష: పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష శ్రీ మహావిష్ణువు స్వరూపమని శివపురాణంలో చెప్పబడివుంది. దీని అధిపతి సూర్యభగవానుడు. దీనిని రథసప్తమి, పర్వదినంనాడు కానీ ఆదివారం నాడు కానీ ధరించడం మంచిది. దీనిని ధరించేముందు అరచేతిలో వుంచి "ఓం ఘృణిశ్రీం" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి, అనంతరం "ఓం క్రీం క్ష్రాం రౌం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు జపించి ధరించాలి. దీనిని ధరించిన వారికి మానసిక శాంతి లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం, సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఏకముఖి రుద్రాక్షతో సమానమైన శక్తి గలదని చెబుతారు.

*త్రయోదశ ముఖ రుద్రాక్ష: పదమూడు ముఖాలుండే ఈ రుద్రాక్షను ఇంద్రుడి స్వరూపంగా చెప్పబడుతోంది. దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, పర్వదినములలో గానీ, మంగళవారం నాడు కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించవలెను. దీనిని ధరించిన వారు చేపట్టే అన్ని కార్యక్రమాలు సఫలమవుతాయి.

* చతుర్దశముఖ రుద్రాక్ష : పదునాలుగు ముఖములు కలిగిన ఈ రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు. అంతేగాకుండా దీనిని హనుమంతుడికి ప్రతీక అని కూడా చెప్తారు. ఈ రుద్రాక్షను శివరాత్రి, హనుమజ్జయంతి పర్వదినములలో కానీ, సోమ, మంగళవారాల్లో కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం నమః - ఓం శివాయ నమః" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠించవలెను. దీనిని ధరిస్తే  సర్వరోగాలు నశిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.

నియమాలు

రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించ
రుద్రాక్షలను ధరించడం ద్వారా అష్టకష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణం చెప్తోంది. రుద్రాక్షలను పద్ధతి ప్రకారం, ఆధ్యాత్మిక గురువులు, పంచాంగ నిపుణుల సూచనల మేరకే ధరించాలి. మహా శివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ధరించడం ఉత్తమం. సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం. నుదుట విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించడం, వాటిని ధరించి శృంగారంలో పాల్గొనడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

ఏకముఖి రుద్రాక్ష: : దర్శనం మహాపాతక నాశనం ; అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.

ద్విముఖి : : గోహత్యాపాతక నివారిణి, సర్వాభీష్ట కారిణి.

త్రిముఖి : : కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.

చతుర్ముఖి : : బ్రహ్మస్వరూపం, దర్శన - స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.

పంచముఖి: కాలాగ్ని రుద్ర స్వరూపం. మోక్షకారకం.

షణ్ముఖి : కుమారస్వామి స్వరూపం. సమస్తపాపహారిణి.

సప్తముఖి : మన్మధరూపిణి. వశీకరనణి.

అష్టముఖి : దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ; దీర్ఘాయుష్య కారకం.

నవముఖి : నవదుర్గా స్వరూపం. శివతుల్య వైభవదాయిని.

దశముఖి : విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.

ఏకాదశముఖి : రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.

12, 13, 14 ముఖాలు : ఏవైనా ఒక ప్రత్యేకమైన ఇచ్చను హృదయ మందుంచుకొని, ఆరాధన చేయదగ్గవి. మండలం (40) రోజుల్లో ఫలితాన్నివ్వగలవు.

ధారణకు మంత్రబీజాలు :

ఏకముఖ, చతుర్ముఖ, పంచముఖ, దశముఖ, త్రయోదశ ముఖాలకు : "ఓం హ్రీం నమః" అనే మంత్రంతో ధరించాలి.

ద్విముఖ, చతుర్ముఖి, చతుర్దశ ముఖాలకు : "ఓం హ్రీం నమః"

త్రిముఖ రుద్రాక్షకు : "ఓం క్లీం నమః" అని 108 సార్లు జపించాలి.

6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలకు : "ఓం హ్రీం నమః"

సప్త, అష్టముఖి రుద్రాలకు : "ఓం హుం నమః"

ద్వాదశ ముఖికి : "ఓం క్రౌం నమః"

మంత్ర హీనంగా రుద్రాక్ష ధారణ ఫలితాన్నివ్వదు..

సేకరణ(భక్తి సమాచారం)Forwarded by Seetha Prasanna 
🌼🌿శివలింగం యొక్క ఆథ్యాత్మిక రహస్యము!🌼🌿

లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.

1. మొదటిది బ్రహ్మ కి గుర్తు
2. రెండవది విష్ణువు కి గుర్తు
3. మూడవది శంకరుడు కి గుర్తు

మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.

1. పరమాత్ముని నామం సదా శివ,

2. సదా శివ అంటే
సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"

3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.

4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.

5. పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.

6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు అందుకే ఇంగ్లీష్ లో GOD అంటారు.

7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు .

8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.  Forwarded by Seetha Pra

Tuesday, September 24, 2019

మీరు చూస్తున్నది మహా మేరు/ఆర్య పుష్పము. ఇది ప్రతి 400 సంత్సరములకు ఒక పర్యాయము హిమాలయాలలో కనిపిస్తుంది. ఈ పుష్పమును మళ్ళీ చూడాలి అనుకుంటే 400 సంత్సరములు వేచి ఉండవలసిందే. కనుక మన తరము వారు అదృష్టవంతులు.అందరూ చూసే లాగున షేర్ చేయండి.




















శృంగేరి – నవరాత్రి
శృంగేరిలో జరిగే అన్ని పండుగలలో నవరాత్రి ఉత్సవము అత్యంత ప్రసిద్ధి చెందినది. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు. ఎవరైతే మధు-కైటభులను, శుంభ-నిశుంభులను, మహిషాసుర మరియు క్రూరమైన రాక్షసులను చంపారో, ఆ జగన్మాతను ఈ పవిత్రమైన తొమ్మిది రాత్రులలో పూజిస్తారు.  ఈ క్రింది శ్లోకము మార్కండేయ పురాణంలోని దేవి మహాత్మ్యం నుండి ఉటంకించబడింది.
శరత్కాలే మహాపూజ క్రియతే య చ వార్షికీ, తస్యాం మమైతాన్మహాత్మ్యం శృత్వా భక్తి సమన్వితః....
జగన్మాత యొక్క ప్రత్యేక ఆరాధన ద్వారా మరియు శరత్కాల సమయంలో దేవి మహాత్మ్యాన్ని జపించడం ద్వారా, దేవి సంతోషంగా ఉండి, తన భక్తులకు అన్ని రకాల శ్రేయస్సును ఇస్తుందని ఈ శ్లోకము వివరిస్తుంది. నవరాత్రి మన జాతీయ పండుగ మరియు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇప్పటికీ, శృంగేరిలో జరుపుకునే పండుగ ప్రత్యేకమైనది. ఆ సమయంలో శృంగేరిలో చాలా కార్యక్రమాలు గొప్పగా నిర్వహిస్తారు. విలువైన మరియు ఆకర్షణీయమైన ఆభరణాలు మరియు ముత్యాలు, జాడే, వజ్రాలు మొదలైన వాటితో తయారు చేసిన అందమైన ఆభరణాలతో శారదాంబ దేవి అలంకరించబడుతుంది.
మహాభిషేకం:-
నవరాత్రికి ముందు రోజు (అనగా భాద్రపద అమావాస్య రోజున) శారదాంబ దేవికి ఒక మహాభిషేకం జరుగుతుంది. వివిధ రకాలైన ఫల-పంచామృత అభిషేకము తరువాత మహాన్యాసముతో కూడిన శత రుద్రాభిషేకము మరియు శ్రీసూక్తము తో 108 సార్లు అభిషేకము జరుగును. ఆ రోజున తల్లి జగత్ప్రసూతికా అలంకారంతో విరాజిల్లుతుంది.
జగత్ప్రసూతికా అలంకారం: ముఖం మీద చిరునవ్వుతో తల్లి శారద తన ఒడిలో ఒక అందమైన బిడ్డను కూర్చొబెట్టుకొని, ఆమె తన భక్తుడికి “నేను మొత్తం సృష్టికి తల్లిని, నువ్వు నా బిడ్డవు. మీరు నన్ను వెతుకుతున్నట్లయితే మీరు నా ఒడిలో ఉన్న ఈ బిడ్డలా మిమ్మల్ని మీరు చూసుకోండి”. ఈ అలంకరణ చాలా బాగుంటుంది. నవరాత్రి పండుగ మరుసటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ నవరాత్రి అంతటా శ్రీ శారదాంబ కు క్రొత్త అలంకరణ తయారు చేయబడుతుంది. ఈ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
హంస వాహన అలంకరణ - బ్రాహ్మీ: బ్రహ్మదేవుని రాణి అయిన తల్లి శారద, హంస వాహనంపై కూర్చొని తన హస్తములలో కమండాలు, అక్ష మాలా, పుస్తక, పాశ మరియు చిన్ముద్రలను ధరించి తన భక్తులను ఆశీర్వదిస్తారు. వృషభ వాహన అలంకరణ - మహేశ్వరి: ఆదిశక్తి, మహేశ్వరుని తో కూడి వృషభ వాహనం మీద కూర్చొని,  నెల వంకను ధరించి, త్రి శూలముతో తన భక్తులను ఆశీర్వదిస్తూ అభయమిస్తూ వుంటుంది. భానా.
మయూర వాహన అలంకరణ - కౌమారి: తల్లి శారద నెమలిపై కూర్చుని, శక్తి ఆయుధాన్ని ధరించి, కుమారస్వామి యొక్క శక్తి రూపంలో, తన కారుణ్యముతో ప్రపంచాన్ని రక్షిస్తూ వుంటుంది.
గరుడ వాహన అలంకరణ - వైష్ణవి: శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిగా దేవి గరుడుని పై కూర్చుని, శంఖ, చక్ర గదలను ధరించి  ఆమె తన భక్తులను ఆశీర్వదిస్తుంది.
ఇంద్రాణి అలంకరణ: వృత్రాసురుడి వంటి రాక్షసులను నాశనం చేసిన దేవేంద్రుని రాణిగా, ఐరావతంపై కూర్చొని వజ్రాయుధము ధరించి దేవి తన భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.
వీణ శారద అలంకరణ: తల్లి శారద తన చేతుల్లో వీణను ధరించి,  తన భక్తులైన మంద బుద్దులకు  కూడా జ్ఞానం ఇస్తుంది. ఈ అలంకరణ చూడటానికి చాలా అందంగా వుంటుంది.
మోహిని అలంకరణ: అమృత కలశమును చేతియందు ధరించి, అమృతమును దేవదూతలకు పంపిణీ చేయుటకు మోహినీ అవతారము ఎత్తి, తన మనోజ్ఞతను, అందాన్ని చూపి చెడ్డ, క్రూరమైన రాక్షసులను మోసగించిన జగన్మాత యొక్క ఈ అలంకరణనుచూడటం భక్తులు తమ జీవిత కాలపు ఆశయముగా భావిస్తూ వుంటారు.
రాజరాజేశ్వరి అలంకరణ: కామేశ్వరుని పట్టమహిషి అయిన తల్లి శ్రీ రాజరాజేశ్వరి, పాశ, అంకుశము, పుష్ప బాణములను మరియు చాపాలను ధరించి కృపారసముతో , అన్ని ఆభరణాలతో అలంకరించబడి, తన అనుగ్రహము ద్వారా తన భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది.భానా.
సింహా వాహన అలంకరణ - చాముండా: ప్రజలను రక్షించడానికి మరియు చండ, ముండ మొదలైన క్రూరమైన రాక్షసులను నాశనం చేయడానికి జగన్మాత ఈ చాముండా రూపాన్ని తీసుకున్నారు. త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్న సింహవాహనంపై ఆమె కూర్చొని వున్నది.
గజలక్ష్మి అలంకరణ: రెండు వైపులా గజములతో నమస్కరింపబడుతూ కమలం మీద కూర్చుని, నవ్వుతున్న ముఖంతో, తన భక్తులకు సంపద, ఆహారం, ఆనందం మరియు శ్రేయస్సును మనోహరంగా ఇస్తున్న తల్లి.
అలంకారాల ప్రాముఖ్యత:- శ్రీ దేవి మహాత్మ్యంలో దేవి ఉదహరించిన ఒక ఉల్లేఖనం “ఏకైవాహమ్ జగత్యాత్ర ద్వితీయ కా మమాపారా” (నేనే ప్రపంచంలోని ఏకైక శాశ్వతమైన శక్తిని, మరెవరో కాదు). అందువల్ల ఈ విభిన్నమైన అలంకారాలు మరియు అవతారాలు జగన్మాతకు చెందినవి. సర్వమూ తానైన ఏకైక శక్తి ఆ జగన్మాత. జగన్మాత సరస్వతి రూపాన్ని తీసుకుంటుంది మరియు విద్య మరియు జ్ఞానాన్ని ఇస్తుంది, మహాలక్ష్మి రూపాన్ని తీసుకుంటుంది మరియు సంపద, ఆహారం మొదలైనవి ఇస్తుంది మరియు దుష్ట బుద్ధి గల వారిని  నాశనం చేసే సమయంలో మహా కాళి (చాముండి) రూపాన్ని తీసుకుంటుంది, రూపం తీసుకుంటుంది.  తన భక్తుల యొక్క భయమును పారద్రోలడానికి దుర్గా పరమేశ్వరి అవతారము తీసుకుంటుంది. ఆమె తన భక్తులను వివిధ పేర్లు మరియు వివిధ రూపాల ద్వారా కాపాడుతూ వుంటుంది.  జగదంబ యొక్క రూపాలు మరియు పేర్లు చాలా ఉన్నప్పటికీ, శక్తి ఒకటే. ఇంత గొప్ప తాత్విక సత్యం దేవికి భిన్నమైన అలంకారాలను తయారుచేసే ప్రక్రియలో ఉంది.
నవరాత్రి సమయంలో పారాయణాలు (శ్లోకాలు):- నవరాత్రి పండుగ సందర్భంగా శృంగేరి మఠంలో అనేక పారాయణాలు జరుగుతాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం పారాయణాలు, వాల్మీకి రామాయణం, దేవి భాగవతము,  శ్రీమద్భాగవతం,  మాధవీయ శంకర దిగ్విజయము, సూత సంహిత,  లలితోపాఖ్యానము, , ప్రస్థానత్రయము, సూర్య నమస్కారం, శ్రీసూక్త జప, భువనేశ్వరి జప, దుర్గా జప మరియు ఇతర జపాలు జరుపబడతాయి.  శ్రీ చంద్రమౌలిశ్వర స్వామి వారికి శత రుద్రాభిషేకము, శ్రీచక్రమునకు నవావరణ పూజ శాస్త్రము ప్రకారము జరుపబడును.  ప్రతిరోజూ 12 గంటలకు సువాసిని పూజ మరియు కుమారి పూజలు కూడా నిర్వహిస్తారు. అలాగే భక్తులకు ప్రసాదం అందుతుంది. రోజుకు సుమారు 15 - 20 వేల మందికి భోజనం ఉంటుంది
రథోత్సవము:-  శారదాంబకు ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవము ప్రధాన వీధిలో జరుపబడును.  పరమ పూజ్య ఆచార్య సమక్షంలో మంగళారతి ఇవ్వబడుతుంది. వెనువెంటనే రథోత్సవము ప్రారంభమవుతుంది.  ఈ ఉత్సవ మూర్తికి కూడా చాలా అలంకారాలు చేయబడతాయి.
నవరాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు మతపరమైన కార్యక్రమాలు మాత్రమే కాదు, గాత్ర, వీణ, వేణువు, వయోలిన్, సాక్సోఫోన్, క్లారియోనెట్ మొదలైన రంగాలలోని ప్రసిద్ధ కళాకారుల సంగీత కచేరీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నవరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడతాయి. ఈ కాలం సంగీత ప్రియులకు ఉత్సాహంగా ఉంటుంది.
నవరాత్రి పండుగ సందర్భంగా తెల్లవారుజామున అహ్నికా మరియు అనుష్టానము తరువాత, పరమ పూజ్య ఆచార్యుల వారు, మహా సన్నిధానం వారు,  గురు పాదుకులకు మరియు శ్రీ చక్రములకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆచార్యుల వారు ఉదయం 9.30 గంటలకు మఠం ప్రాంగణంలోని అన్ని దేవాలయాలను సందర్శించి అందరి దేవతలను దర్శనం చేసుకుంటారు.  ఉదయం మరియు మధ్యాహ్నం పూజల తరువాత, శ్రీ జగద్గురు మహాస్వామి వారు  మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2.30 గంటల మధ్య శ్రీ శారదాంబకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆచార్య వారు సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ శారదాంబ రథోత్సవమునకు హాజరవుతారు. రాత్రి 7.30 గంటలకు మహా సన్నిధానం వారు  మళ్లీ స్నానం చేసి అహ్నికా పూర్తి చేసిన తరువాత రాత్రి 8 గంటలకు శ్రీ చంద్రమౌలిశ్వర పూజకు హాజరవుతారు. ఈ పూజ రాత్రి 9.30గంటలకు పూర్తి అవుతుంది. అప్పుడు ఆచార్య వారు దర్బార్ అధ్యక్షత వహిస్తారు.
దర్బారు:- నవ రాత్రి సమయంలో దర్బార్ ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ ప్రత్యేక కార్యక్రమం శ్రీ విద్యారణ్య కాలం నుండి జరుగుచున్నది.  విజయనగర సామ్రాజ్యం స్థాపనలో శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు  ప్రధాన పాత్ర పోషించి,  ప్రతి అంశంలోనూ హరిహరరాయ మరియు బుక్కరాయలను ఆశీర్వదించినారు.  దానికి కృతజ్ఞతగా, స భక్తితో  మొత్తం రాజ్యం, బంగారు సింహాసనం, రూబీలతో చేసిన కిరీటం, బంగారు ఆభరణములు, చత్ర-చామరాలు మరియు అన్ని రాజ చిహ్నాలను శ్రీ విద్యారణ్య మహా స్వామి వారి పాద పద్మములకు సమర్పించినారు. విద్యానగర మహారాజులు  పరమ పూజ్యులైన  శ్రీగురు విద్యారణ్య మహాస్వామి వారికి  “కర్ణాటక సింహాసనా ప్రతిష్ఠానాచార్య”,  “శ్రీమద్రాజాధిరాజగురు”,  “భూమండలచార్య”, వంటి గొప్ప బిరుదులతో సత్కరించారు. వీరి  వినయపూర్వకమైన అభ్యర్థన మరియు భక్తి కారణంగా, శ్రీ గురు మహాస్వామి వారు ఈ రాజ చిహ్నాలను అంగీకరించాల్సి వచ్చింది.
శ్రీ మఠం సంప్రదాయం ప్రకారం జగద్గురు మహాస్వామి వారు  కిరీటం మరియు ఆభరణాలు ధరించి, చంద్రమౌలిశ్వర పూజా మందిరము నుంచి ఊరేగింపుగా శారదా ఆలయంలోని దర్బార్‌ హాలు లోకి ప్రవేశిస్తారు. తరువాత వ్యాఖ్యాన సింహాసనము వద్ద ఉంచిన శారదాంబ విగ్రహమును బంగారు రథంలోకి తీసుకొని రాబడుతుంది. ఆలయ ప్రాంగణము లో  వేద ఘోష, వాద్య ఘోష, చత్ర-చామరాలతో పాటు మూడుసార్లు బంగారు రథోత్సవము  జరుగుతుంది. ఆచార్యుల వారు జగదంబ వైపు చూస్తూ, వెనుకకు నడుస్తూ, రధం ముందు నడుస్తారు....
రథోత్సవము అయిన తరువాత, ఆచార్యుల వారు, శారదాంబకు ఎదురుగా ఉంచిన బంగారు సింహాసనంపై తాను ఆసీనులౌతారు.  అప్పుడు సప్తశతి యొక్క ఒకటి లేదా రెండు అధ్యాయాల శ్లోకం జరుగుతుంది....

Wednesday, September 18, 2019

https://www.facebook.com/groups/1063592027066242/?ref=shareమహాలయపక్షం – నువ్వులు నీళ్ళు

ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం.... దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో . . .

ప్రతి మానవుడు వారి పితృ దేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు ఋణపడిఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితోపాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్యయజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్నాయం చెయ్యడం, బోధించడం దేవయజ్ఞం. అందరిపలుపున దేవయజ్ఞం చెయ్యడం కొందరి పని. అందరు చెయ్యవలసినది చెయ్యగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణులయందు ప్రేమ, దయ కలిగిఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదోఒక రకంగా చేయవలసినవే. ప్రతిఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నాట్లు. “తిరుక్కురళ్” రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెబుతారు.

“తెన్పులత్తర్, దైయివం, విరుండు, ఒక్కళ్ తన్ ఎన్రు అంగు అయింబులత్తరు ఒంబళ్ తలై”

తెన్పులత్తర్ అంటే పితృదేవతలు - తాత ముత్తాతలు. అందరూ వారి ఋణాన్ని తీర్చవలసినదే. వేదము “మాతృదేవోభవ, పితృదేవోభవ” అని చెప్తుంది. అంటే మన తల్లి తండ్రులు దైవసమానులు. వారిని ఎన్నటికి దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికి వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లితండ్రులే. వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత, తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధ కర్మములు చేయవలెను. శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లితండ్రులను కాపాడుకోవలెను అని ఒప్పుకున్నారు.

“మనం సమర్పించే నువ్వులు, నీళ్ళు, అన్న పిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా? మనకళ్ళ ముండు చనిపోయినవారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా? పునర్జన్మ సిధ్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించియుంటే, వారికోసమని ఇవన్ని చెయ్యటం పిచ్చిపని” అని కొందరి వాదన.

మీకు ఒక కథ చెబుతాను.

”ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పైచదువులకై పంపించాడు. కొన్ని దినములలో ఫీజు కట్టవలనెని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాసాడు.” తండ్రి కార్త కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ గుమాస్తా “డబ్బు మీ అబ్బాయికి పంపబడింది. అతనికి చేరుతుంది” అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లా పెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు. అతను గుమాస్తా గారితో “నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది. వాటికి మీరు కన్నం కూడా చేయలేదు. మరి మా అబ్బాయికి ఎలా పంపారు?” అని అన్నాడు. గుమాస్తా అతనితో “మీ అబ్బాయికి చేరుతుంది” అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు.

కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది.

పితృదేవతలకు పిండప్రదానము చెయ్యడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టైతే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి, దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు. అది వారికి చెందుతుంది అంతే.

ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా? అతను ఈ దేశములో నివసించకపోయినా, అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి, ఇక్కడ రూపాయిలలో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో, పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది.

ఇక్కడ ముఖ్యముగా ఉండవలసినది తల్లితండ్రులయందు కృతజ్ఞతా భావము. శాస్త్రముయందు నమ్మకము. శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? “నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను. పోస్ట్ డబ్బాలో వెయ్యను. మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు.”

ప్రేమ, భక్తి, జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కాని ఫలమాసించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము. ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది.

“తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ”

--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగForwarded by MVMRAO 

Tuesday, September 17, 2019

https://www.facebook.com/senapati.mudigonda/videos/2426499937428848/ is Very close darshan of Lord vithhal from Pandharpur. Very rare as photography is not allowed inside.Forwaded By Jaganmohan IVATURI 

Saturday, September 14, 2019

🙏🙏🙏🙏🙏🙏 పితృదేవతా స్తుతి

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!
పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!
సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!
యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!
సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!
మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!
రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!
నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!
సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!
అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!
మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!
నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!
ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!
స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!
ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!
శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)Forwarded By Seetha Prsp

Friday, September 13, 2019

💐నిత్యం సంధ్యావందనంలో చెప్పే ప్రవర యొక్క అర్ధం💐

చతుస్సాగర పర్యంతం
( మానవ పరిభ్రమణానికి నలువైపులా గల మహాసముద్రాల అంచుల వరకూ   ఆ చతుస్సాగరాలు
1ప్రశాంతోదధి
2ఆర్కోదధి
3అమలాంచోదధి
4 సింధోదధి
సముద్రాలు ఉన్నాయి

గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
( సర్వాబీష్ట ప్రదాయిణి అగు.. గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)

...................
త్రయాఋషేయ ప్రవరాన్విత..

( మా వంశమునకూ.. మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ.. త్యాగే నైకే అమృతత్త్వ మానశుః అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..
........... గోత్రః
(మా గోత్రమునకూ..)

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ
( మా శాఖకూ.. అందలి శాస్త్ర మర్మంబులకు.. )

.............. శర్మ నామధేయస్య

( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో.. వేదాధ్యయనాది వైదిక క్రతువులతో.. 1. స్నానము 2. సంధ్య 3. జపము 4. హోమము 5. స్వాధ్యాయము 6. దేవ పూజ 7. ఆతిధ్యము 8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ.. త్రివిధాగ్నులు 1. కామాగ్ని 2. క్రోధాగ్ని 3. క్షుద్రాగ్ని.. అనే త్రివిధాగ్నులను అదుపులో (సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై.. పేరుకు ముందు శ్రీ అనబడే.. ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన.. శ్రీ చక్రాల రాఘవేంద్రశర్మ అనబడే సుశ్రోత్రియుడనైన నేను.. జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు.. యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

అహంభో అభివాదయే..
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై.. త్రికరణ శుద్ధిగా ( మనసా, వాచా, కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న) దండ ప్రణామమిదే.. అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని.. అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా.ForwardeJ hyJ M IVY