రుద్రాక్షలు....
గురించి తెలుసుకుందాం....
ఒకానొక కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్య వత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు.
ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు - మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి - కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.
రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్ల ; రుద్ర (దుఃఖములను) క్షయము (నాశనము చేయు గుణము) కలిగినందువల్ల వీటికి రుద్రాక్షలనే పేరు సార్ధకమైంది.
నాలుగు వర్ణాల భక్తులకూ ధారణయోగ్యమైనవి ఈ రుద్రాక్షలు. జపం చేసుకోవడానికీ - ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఫలవంతమైనవి.
గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు - ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.
రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు. కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ - పురుగులు ప్రవేశించినవీ - గుండ్రంగా లేనివీ - కండలేనివీ పనికిరావు. వీటితో జపమైనా నిషిద్ధమే!
నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి.
మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక, అదీ సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం!
పదకొండు వందల రుద్రాక్షలను ధరించినచో అతడు సాక్షాత్ శివస్వరూపుడు, బ్రాహ్మణులు తెల్లనివీ - క్షత్రియులు ఎర్రనివి, వైశ్యులు పసుపు రంగువీ, అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు!
ఆరోగ్యానికి రుద్రాక్షలు :
రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. వ్యాధులు - బాధలు ఉండవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.
మామిడిచెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది. ఫలం యొక్క పై పొర దళసరిగా ఉంటుంది. పండు రూపంలో దీన్ని సేకరించగలిగితే మంచిదే! దానంతట అదే ఎండి, గట్టి పడుతుంది. పండు పుల్లగా ఉంటుంది. వాత - కఫ దోషాలను నివారిస్తుంది.
రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి. నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసినదే! అలాగే తేనెలో అరగదీసి మూర్చరోగాన్ని పోగొట్టవచ్చు!
వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు.
రుద్రాక్షలలో రకాలు :
ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి...ఇలా మొత్తం 14 వరకూ ఉన్నాయి. ఇవిగాక కొన్ని ప్రత్యేకమైనవీ ఉన్నప్పటికీ - అవి అరుదుగా లభిస్తాయి. వారి పూర్వ పుణ్యానుసారం లభిస్తే లభించ వచ్చునేమో గానీ, సాధారణంగా అలభ్యం అనే చెప్పాలి.
రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి నుంచి 14 ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రమే లభిస్తున్నాయి.
వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం వుంటుంది. అంతేగాకుండా వీటిని ధరించడం ద్వారా మంచి ఫలితాలు, శుభాలు పొందుతారు.
* ఏకముఖీ రుద్రాక్ష: శివ స్వరూపంగా చెప్పబడే ఏకముఖ రుద్రాక్ష లభించడం చాలా కష్టం. ఈ ఏకముఖి రుద్రాక్ష అర్థచంద్రాకారంలో ఉంటుంది. దీనిని ధరించే ముందు "ఓం ఎం హం బెం ఇం ఓం'' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించిన వారికి సిరిసంపదలు వృద్ధి చెందడంతో పాటు ఇంద్రియనిగ్రహం కలుగుతుంది. మనోవికాసం, పరతత్వ జ్ఞానము లభిస్తాయి.
* ద్విముఖి రుద్రాక్ష: ఈ రుద్రాక్షను పార్వతీ పరమేశ్వరుల రూపంగా అర్థనారీశ్వరుల రూపంగా వర్ణిస్తారు. ఈ రుద్రాక్షను గురుపూర్ణిమ, దత్త జయంతి పర్వదినాల్లో, కార్తీక మాసంలో గురు, శుక్రవారాల్లో ధరించాలి. "ఓం, క్ష్రీం హ్రీం క్షాం వ్రీం ఓం' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ఈ రుద్రాక్షను ధరించాలి. దీనిని ధరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, సంతానప్రాప్తి, మనశ్శాంతి లభించి సమస్త కోరికలు నెరవేరుతాయి.
త్రిముఖ రుద్రాక్ష : మూడు ముఖములు గల ఈ రుద్రాక్ష త్రికాలగ్నుల స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ రుద్రాక్షను సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, పర్వదినాలలో గురువారం రోజు ధరించాలి. దీనిని ధరించే ముందు త్రిమూర్తులను అష్టోత్తర పూజచేసి, ధరించే సమయంలో ''ఓం క్లీం నమః'' అనే మూల మంత్రాన్ని 108 సార్లు పఠించి దీనిని ధరించాలి. దీనిని ధరించడం వల్ల సంపదలు, విద్యాభివృద్ధి, గుండె జబ్బులు వంటి వ్యాధులు తగ్గిపోతాయి. కుజదోషము గలవారు ఈ రుద్రాక్షను ధరించడం చాలా మంచిది.
చతుర్ముఖ రుద్రాక్ష : నాలుగు ముఖములు గల చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మదేవుడి స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ రుద్రాక్షను గురుపూర్ణిమ, దత్తజయంతి, పర్వదినాల్లో, వారాల్లో బుధవారం నాడు ధరించడం మంచిది. దీనిని ధరించే ముందు "ఓం వాం క్రాం తాం హాం ఈం" అనే మంత్రాన్ని 11 సార్లు పఠించి, పూజించి, కుడిచేతికి ధరించవలెను. మానసిక రోగములు తగ్గి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యార్థులు దీనిని ధరిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు దీనిని ధరిస్తే జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది.
పంచముఖ రుద్రాక్ష: ఐదు ముఖములు గల ఈ రుద్రాక్ష కాలాగ్ని స్వరూపం దీనిని దత్తజయంతి, గురుపూర్ణిమ, శివరాత్రి పర్వదినాలలో, సోమవారం నాడు ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం అం క్ష్మా స్వాహా" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించి ధరించాలి. దీనిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పొందటంతో పాటు గుండె జబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు నయమవుతాయి.
* షణ్ముగ రుద్రాక్ష : ఆరు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష షణ్ముఖుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతీకగా అభివర్ణించారు. దీనిని వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో గానీ, మంగళ వారాల్లో కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం శ్రీం క్షీం సాం ఇం" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠించి ధరించవలెను. ఈ రుద్రాక్షను కుడిచేతికి ధరించాలి. దీనిని ధరించడం వల్ల గుండెదడతో పాటు హిస్టీరియా వంటి వ్యాధులు తగ్గుతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.
* సప్తముఖ రుద్రాక్ష : ఏడు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష మన్మథ స్వరూపంగా అభివర్ణించారు. దీనికే "అనంగము'' అని పేరు కూడా కలదు. దీనిని దీపావళి పర్వదిన నాడు కానీ, శుక్ర, శనివారాల్లో గాని ధరించవలెను. దీనిని ధరించే ముందు శ్రీలక్ష్మీ అష్టోత్తరం గానీ, సహస్రనామంతో గానీ పూజ చేసి "ఓం హ్రీం, క్రీం గ్లౌం హ్రీం సాం" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠిస్తూ ధరించాలి. శనిగ్రహ ఇబ్బందులు, ఏలినాటి శని దశను అనుభవిస్తున్నవారు దీనిని ధరిస్తే ఆ బాధల నుంచి నివారణ లభిస్తుంది.
* అష్టముఖ రుద్రాక్ష: ఎనిమిది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష వినాయకుడి స్వరూపంగా చెప్పబడుతోంది. దీనిని వినాయక చవితి పర్వదినం నాడు కానీ, ఆదివారం గానీ ధరించవలెను. ఈ రుద్రాక్ష ధరించే ముందు ''ఓం హ్రీం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించవలెను. దీనిని ధరించడం వల్ల విఘ్నాలు తొలగి, కార్యానుకూలత, మనశ్శాంతి, ఏకాగ్రత కలుగుతాయి.
* నవముఖ రుద్రాక్ష: తొమ్మిది ముఖాలున్న ఈ రుద్రాక్ష భైరవ స్వరూపంగా చెప్పబడుతుంది. నవశక్తులు అంటే విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రేధిశక్తి, అంగశక్తి, పశ్వంతీ అనువాటికి ప్రతీకలుగా పూజలందుకునే ఈ రుద్రాక్ష అధిదేవత దుర్గాదేవి. దీనిని నవరాత్రుల్లో కానీ, శుక్రవారం గానీ ధరించడం చేయాలి. ధరించేముందు "ఓం క్లీం హ్రూం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. దీనిని కుడి భుజానికి ధరించడం వల్ల బలం చేకూరుతుంది. దీనిని ధరించిన వారికి వాక్సుద్ధి వృద్ధి చెంది గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుతారు. చర్మ వ్యాధులు నిర్మూలింపబడతాయి.
* దశముఖ రుద్రాక్ష : పది ముఖములు గల ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపముగా తెలియజేయబడింది. దీనిని ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదినాల్లో ధరించాలి. దీనిని ధరించేముందు "ఓం హ్రీం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. దీనిని ధరించడం ద్వారా భూత, ప్రేత, పిశాచ, రాక్షస వంటి భయాలు గ్రహపీడలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
* ఏకాదశ ముఖ రుద్రాక్ష: 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష రుద్ర స్వరూపంగా పేరు పొందినది. ఈ రుద్రాక్షను శివరాత్రి నాడు కానీ, సోమవారం నాడు కానీ ధరించడం మంచిది. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం హూం నమః'' అనే మూల మంత్రాన్ని 11 సార్లు జపించవలెను. దీనిని ధరించడం ద్వారా సంతానాభివృద్ధి, సౌభాగ్యం, ధైర్యము, సంపద, జ్ఞానము మొదలగునవి అభివృద్ధి చెందుతాయి.
* ద్వాదశముఖ రుద్రాక్ష: పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష శ్రీ మహావిష్ణువు స్వరూపమని శివపురాణంలో చెప్పబడివుంది. దీని అధిపతి సూర్యభగవానుడు. దీనిని రథసప్తమి, పర్వదినంనాడు కానీ ఆదివారం నాడు కానీ ధరించడం మంచిది. దీనిని ధరించేముందు అరచేతిలో వుంచి "ఓం ఘృణిశ్రీం" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి, అనంతరం "ఓం క్రీం క్ష్రాం రౌం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు జపించి ధరించాలి. దీనిని ధరించిన వారికి మానసిక శాంతి లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం, సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఏకముఖి రుద్రాక్షతో సమానమైన శక్తి గలదని చెబుతారు.
*త్రయోదశ ముఖ రుద్రాక్ష: పదమూడు ముఖాలుండే ఈ రుద్రాక్షను ఇంద్రుడి స్వరూపంగా చెప్పబడుతోంది. దీనిని సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, పర్వదినములలో గానీ, మంగళవారం నాడు కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం హ్రీం నమః" అనే మూల మంత్రాన్ని 11 సార్లు పఠించవలెను. దీనిని ధరించిన వారు చేపట్టే అన్ని కార్యక్రమాలు సఫలమవుతాయి.
* చతుర్దశముఖ రుద్రాక్ష : పదునాలుగు ముఖములు కలిగిన ఈ రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు. అంతేగాకుండా దీనిని హనుమంతుడికి ప్రతీక అని కూడా చెప్తారు. ఈ రుద్రాక్షను శివరాత్రి, హనుమజ్జయంతి పర్వదినములలో కానీ, సోమ, మంగళవారాల్లో కానీ ధరించవలెను. దీనిని ధరించే ముందు "ఓం నమః - ఓం శివాయ నమః" అనే మూల మంత్రాన్ని 11సార్లు పఠించవలెను. దీనిని ధరిస్తే సర్వరోగాలు నశిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.
నియమాలు
రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించ
రుద్రాక్షలను ధరించడం ద్వారా అష్టకష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణం చెప్తోంది. రుద్రాక్షలను పద్ధతి ప్రకారం, ఆధ్యాత్మిక గురువులు, పంచాంగ నిపుణుల సూచనల మేరకే ధరించాలి. మహా శివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ధరించడం ఉత్తమం. సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం. నుదుట విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించడం, వాటిని ధరించి శృంగారంలో పాల్గొనడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
ఏకముఖి రుద్రాక్ష: : దర్శనం మహాపాతక నాశనం ; అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.
ద్విముఖి : : గోహత్యాపాతక నివారిణి, సర్వాభీష్ట కారిణి.
త్రిముఖి : : కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.
చతుర్ముఖి : : బ్రహ్మస్వరూపం, దర్శన - స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.
పంచముఖి: కాలాగ్ని రుద్ర స్వరూపం. మోక్షకారకం.
షణ్ముఖి : కుమారస్వామి స్వరూపం. సమస్తపాపహారిణి.
సప్తముఖి : మన్మధరూపిణి. వశీకరనణి.
అష్టముఖి : దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ; దీర్ఘాయుష్య కారకం.
నవముఖి : నవదుర్గా స్వరూపం. శివతుల్య వైభవదాయిని.
దశముఖి : విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.
ఏకాదశముఖి : రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.
12, 13, 14 ముఖాలు : ఏవైనా ఒక ప్రత్యేకమైన ఇచ్చను హృదయ మందుంచుకొని, ఆరాధన చేయదగ్గవి. మండలం (40) రోజుల్లో ఫలితాన్నివ్వగలవు.
ధారణకు మంత్రబీజాలు :
ఏకముఖ, చతుర్ముఖ, పంచముఖ, దశముఖ, త్రయోదశ ముఖాలకు : "ఓం హ్రీం నమః" అనే మంత్రంతో ధరించాలి.
ద్విముఖ, చతుర్ముఖి, చతుర్దశ ముఖాలకు : "ఓం హ్రీం నమః"
త్రిముఖ రుద్రాక్షకు : "ఓం క్లీం నమః" అని 108 సార్లు జపించాలి.
6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలకు : "ఓం హ్రీం నమః"
సప్త, అష్టముఖి రుద్రాలకు : "ఓం హుం నమః"
ద్వాదశ ముఖికి : "ఓం క్రౌం నమః"
మంత్ర హీనంగా రుద్రాక్ష ధారణ ఫలితాన్నివ్వదు..
సేకరణ(భక్తి సమాచారం)Forwarded by Seetha Prasanna

No comments:
Post a Comment