Friday, March 29, 2019

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం--     శని వార మహిమ

 శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి .అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శని వారం శ్రేష్టమైనది .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని  అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

         శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

        ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

                 శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు .సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి  మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే  నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

         హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని  ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

   ‘’ మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

     హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం--     శని వార మహిమ

 శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి .అన్ని వారాల్లోను మంద వారం అని పిలువ బడే శని వారం శ్రేష్టమైనది .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని  అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

         శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

        ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

                 శని వార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీ పించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరం మీద ఉంటానని చెప్పాడు .సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి  మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే  నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

         హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని  ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

   ‘’ మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

     హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది . ఇస్తుంది .
అరటిపండు పుట్టుక.

ఓం నమః శివాయ.

దుర్వాస మహర్షి తన భార్య అయిన ' కదళి ' తో
ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు.
ఆయనకు కోపం ఎక్కువ .
అందువల్ల 'కదళి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురికాకుండా ఉంటుండేది.

ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి
ఎంతో అలసటగా ఉండటాన  పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు.
వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నాడు.
ఆయన అర్ధాంగి అయిన ' కదళి ' ఎంతో సేపు
ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి,
సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది.

నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు
ఆమె భస్మమైపోయింది.
ముందువెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు.
చేసేదేంలేక మౌనంగా ఉండిపోయాడు.

ఐతే కొన్నిదినాల తర్వాత దుర్వాసుని మామగారు,
తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తన కుమార్తె గురించీ అడగ్గా,
దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే
భయంతో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి, క్షమించమని కోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టించాడుట.
అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.

దుర్వాసుడు తన మామగారితో  మీ కుమార్తె  కదళి అందరికీ ఇష్టురాలై’ కదళీఫలం రూపంలో
అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదనకే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ ,
నోముల్లోనూ
అన్ని శుభకార్యాల్లోనూ
ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడుట!
           
ఆ కదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవుని ముందుంచి కొద్దిగా తొక్క తీసి కదళీఫలం సమర్పయామి  అంటూ నివేదన చేస్తాం.
స్వస్తి .

Thursday, March 28, 2019


💐What is spiritual maturity?
🍁1. Spiritual Maturity is when you •stop trying to change  others, ...instead focus on changing yourself.•

🍁2. Spiritual Maturity is when you •accept people as they are.•

🍁3. Spiritual Maturity is when you •understand everyone is right in their own perspective.•

🍁4. Spiritual Maturity is when you •learn to "let go".•

🍁5. Spiritual Maturity is when you are able to •drop "expectations" from a relationship and give for the sake of giving.•

🍁6. Spiritual Maturity is when you •understand whatever you do, you do for your own peace.•

🍁7. Spiritual Maturity is when you •stop proving to the world, how intelligent you are.•

🍁8. Spiritual Maturity is when you •don't seek approval from others.•

🍁9. Spiritual Maturity is when you •stop comparing with others.•

🍁10. Spiritual Maturity is when you •are at peace with yourself.•

🍁11. Spiritual Maturity is when you •are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.•

& last but most meaningful !

🍁12. You gain Spiritual Maturity when you •stop attaching "happiness" to material things !!•

Wednesday, March 27, 2019

ఈ క్రింది ఫోటోలో ఉన్న అమ్మవారు శ్రీ శీతలాదేవి..

భయంకరమైన తీవ్రమైన రోగాలను నిర్మూలించే అమ్మవారు శ్రీ  శీతలా దేవి. ఈ అమ్మవారిని స్మరించినంత మాత్రం చేతనే తీవ్ర వ్యాధులకు కూడా ఉపశమిస్తాయని శాస్త్రం చెబుతోంది..  అమ్మ వారి గురించి మరింత వివరంగా రేపు చెప్పుకుందాం... ఇప్పుడు అమ్మ వారి గురించి అడగడానికి కారణం ఏంటంటే
హోలీ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిధులను శీతలా సప్తమి, శీతలా అష్టమి అంటారు..

రేపు అనగా 28 మార్చి 2019, గురువారం శ్రీ శీతలా అష్టమి. లోక క్షేమం కోసం తీవ్ర వ్యాధుల నిర్మూలన కోసం ఈనాడు అందరూ శీతల దేవి ని ఆరాధించాలి అమ్మవారి అష్టకం ఇందులో ఉన్నది... చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పంతో అందరూ ఈ అమ్మ అష్టకాన్ని పఠించి వేడుకుందాం...

శ్రీ శీతలా దేవి అష్టకం (Sri Sheetala Devi Ashtakam)
అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః
అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా
లక్ష్మీర్బీజం – భవానీశక్తిః
సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

ఈశ్వర ఉవాచ:

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||

ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం

Tuesday, March 26, 2019

🌸🌸🌸 *చిత్రగుప్తుడు*🌸🌸🌸

మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది.
సృష్టి కర్త బ్రహ్మకు ఎందరో పుత్రులు, పుత్రికలు ఉన్నట్టు పౌరాణిక కథలు చెబుతున్నాయి. అతని మానసపుత్రులు వశిష్ట, నారద, ఆత్రిలతో పాటు మాయా, కామం, యమ ధర్మ, భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతం సంతానమే. కానీ మిగతా సంతానంతో చిత్రగుప్తుడు వైవిధ్యమనే చెప్పాలి. బ్రహ్మకు పుట్టిన పిల్లలకు చిత్రగుప్తుడికి చాలా తేడా ఉంది. బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు. గరుడ పురాణంలో లిఖితపూర్వ కంగా ఆయన ప్రస్తావన ఉంది. పుట్టిన ప్రాణి గిట్టక మానదు. ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదు. ఎందుకంటే విధి విధానం అది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మృత్యు ఒడిలో ఎప్పుడయినా సేదతీరాల్సిందే. మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ రహస్యమే. ఈ రహస్యాన్ని కూడా చేధించడం ఇంతవరకు సాధ్యం కాలేదు. కానీ వేదాలు,పురాణాల్లో మాత్రం ఈ భూలోకం మీద దివ్య లోకం ఉంటుంది. అక్కడ మృత్యుశోకమే ఉండదు.ఆ దివ్య లోకంలో దేవతలు నివాసముంటారు. ఆ దివ్యలోకం పైన బ్రహ్మ, విష్ణు, శివ లోకాలు ఉంటాయి. ఎప్పుడయితే కర్మఫలానుసారం పాప కార్యాల వల్ల దోషులవుతారో వారు యమలోకం వెళ్లాల్సి ఉంటుంది.

భూలోకంలో జీవులు చనిపోయిన తర్వాత వాటి ఆత్మలు నరకానికో, స్వర్గానికో వెళతా యని అంటుంటారు. నరక లోకానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న యమధర్మ తీవ్ర గందర గోళంలో ఉండేవాడట. పాపాలు చేసి చనిపో యిన వారి ఆత్మలతో పాటు పుణ్యాలు చేసిన వారి ఆత్మలు కూడా తన వద్ద వస్తూ ఉండ డంతో కొంత అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొ న్నాడు. కొడుకు ఎదుర్కొంటున్న సమస్య తండ్రి బ్రహ్మకు అర్థమైంది. బ్రహ్మ సృష్టించిన నాలుగు వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉన్నాయి.

అయితే జీవుల పాప పుణ్యాలకు సంబంధిం చిన వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైన నెట్‌ వర్క్‌ లేదు. ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ 11వేల సంవత్సరాలు ధాన్య ముద్రలోకి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్లు తెరిచి చూసేసరికి ఆజానుబాహుడు కనిపిస్తాడు. చేతిలో పుస్తకం ,పెన్ను, నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది. అపుడు బ్రహ్మ పురుషా నీవు ఎవరివి. ఎచటి నుండి వచ్చావు అని అడిగాడు. అపుడు ఆ పురుషుడు  మీ చిత్ర్‌ (శరీరం)లో గుప్త్‌(రహస్యం)గా నివాస మున్నాను. ఇపుడు నాకు నామకరణం చేయండి, నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతాడు. అపుడు బ్రహ్మజీ ఈ విధంగా అన్నారు. నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త.అదే పేరుతో వెలుగొందుతావు. అంతే కాదు జీవుల శరీరాల్లో తలదాచుకుని వారి మంచి చెడుల గూర్చి తెలుసుకుని పాపాత్ములకు శిక్షలు పడే విధంగా కృషి చేయి అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ. చిత్రగుప్తను సంస్కృతంలో కాయస్త్‌ అంటారు. కాయం అంటే శరీరం. అస్త్‌ అంటే అదృశ్యం అని అర్థం.ప్రస్తుతం ఇదే పేరు ప్రాచుర్యంలో ఉంది.

యమపురికి దారి తెలియాలంటే మనిషి చచ్చేవరకు బతకాల్సిందే. బతికున్నప్పుడు చేసిన మంచి,చెడులు, పాప,పుణ్యాల మీద స్వర్గమా నరకమా డిసైడ్‌ అవుతుంది. కాబట్టి దుష్టులు,దుర్మార్గులకు మాత్రమే ఈ అడ్రస్‌ తెలిసే అవకాశం ఉంటుంది. వారిని తీసుకెళ్లడానికి ఎటువంటి ఫ్లయిట్లు మన వ్యవస్థలో లేవు. యమభటులే వారిని పద్దతి ప్రకారం ఎంత దూరం తీసుకెళ్లాలో అలా తీసుకెళ్లి యమపురికి చేర్చుతారు. బహుభీతి గ్రామం దాటిన తర్వాత వచ్చేదే యమపురి. దీనికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. దక్షిణాన ధర్మ ధ్వజుడు అనే ద్వార పాలకుడు కావలి కాస్తుంటాడు. తమ వెంట తీసుకెళ్లిన ఈ జీవి చేసిన పాప పుణ్యాల గూర్చి యమభటులు ఆ ద్వార పాలకుడికి సంక్షిప్తం గా సమాచారం అందిస్తారు. ఆ ద్వార పాలకుడు విన్నదంతా చిత్రగుప్తుడికి వివరి స్తాడు. చిత్రగుప్తుడేమో యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెబుతాడు. నిజానికి యమధర్మరాజు వద్ద వచ్చిన జీవుల పూర్తి బయోడేటా ఉన్నప్పటికీ పరిపాలన పద్దతి ప్రకారం జరగాలన్న ఉద్దేశ్యంతో చిత్రగుప్తుడి ద్వారా సమాచారం తెప్పించు కుంటాడు. చిత్రగుప్తుడు కూడా యమభటులు చెప్పిన విషయాన్ని ప్రాతి పదికగా తీసుకోకుండా శ్రవణులు అనే యమలోకవాసులను అడిగి తెలుసు కుంటాడు. అంటే గూఢచారులు ఆ కాలంలో నుంచే ఉన్నారన్నమాట. యమ లోకంలో శ్రవణులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ శ్రవణులు బ్రహ్మదేవుడి కుమారులు. స్వర్గ, మత్స్య, పాతాళ లోకాల్లో వారు సంచరిస్తుంటారు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని ధ్వనిని వినే శక్తి, చూడగలిగే దృష్టి వీరికి ఉంది. అందుకే వారిని శ్రవణులుగా పిలుస్తుంటారు. వీరి భార్యల పేర్లు కూడా శ్రవణులు. యమలోకానికి వచ్చే స్త్రీల విషయాన్ని ఆరా తీస్తారు. వీరు కూడా చిత్రగుప్తుడికి జవాబుదారిగా ఉంటారు. ఇంత పారదర్శకంగా జరుగుతున్న పరిపాలన వల్లే యమపురిలో తప్పు చేసిన ప్రతి వ్యక్తీ శిక్ష నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది. పాపాత్ములందరికీ యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. కానీ అతి భయంకరంగా. యముడి చేతిలో దండం ఉంటుంది. దున్నపోతు మీద కూర్చుని ఉంటాడు. తళ తళ లాడే ఆయుధాలు ఆయన చేతిలో ఉంటాయి. ఎర్రని గుంత కళ్లతో, కోరలున్న ముఖంతో, పొడవైన ముక్కుతో కనిపిస్తాడు యమ ధర్మరాజు. ఇదే సమయంలో చిత్రగుప్తుడు ఒక ప్రకటన చేస్తాడు. మీరు చేసిన పాపాల ఫలితంగానే మీరు ఇక్కడికి వచ్చారు. ఇందులో యమధర్మ రాజుది ఎటువంటి లోపం లేదుఃః అని చెబుతాడు. యమధర్మరాజు ఏ జీవిని డైరెక్ట్‌గా తీసుకెళ్లి పాపకూపానికి పంపించడు. ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకున్నాకే పాపాత్ములకు శిక్ష విధిస్తాడు అని గరుడ పురాణం చెబుతోంది. చిత్రగుప్తుడు హిందువు ల్లోని కాయస్త్‌ కులానికి చెందిన వాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కుల దైవం కూడా

చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు

చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు.మొదటి భార్య సూర్యదక్షిణ నందిని. ఈమె బ్రాహ్మణ స్త్రీ, నలుగురు కొడుకులు.వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పక్షిణి, మాలతీ, రంభ, నర్మదా.రెండో భార్య పేరు పార్వతీ శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ, ఎనిమిదిమంది కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్‌, హిమవన్‌, చిత్ర్‌చారు,అరుణ, జితేంద్రలు. కూతుళ్లు ఎనిమిది మంది. వారి పేర్లు భద్రకాళిని, భుజ్‌ గాక్షి, గడ్‌ కీ, పంకజాక్షి, కొకల్సూత్‌, సుఖ్‌ దేవి, కామ కాల్‌, సౌభాగ్యినిలు.
వేదాలలో
వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. యమధర్మరాజు మనుషులు చేసిన పాపాలు, పుణ్యాల గూర్చి తన వద్ద సమాచారం అస్పష్టంగా ఉందని బ్రహ్మతో మొరపెట్టుకుం టాడు. అపుడు బ్రహ్మ చిత్రగుప్తుడిని సృష్టిస్తాడు. పద్మ పురాణంలో చిత్రగుప్తుడు యమధర్మరాజు మనుషులు చేసిన మంచిచెడు విషయాల రికార్డు తయారు చేశాడు. భవిష్యపురాణంలో చిత్రగుప్తుడి సంతానం కాయస్త్‌ పేరిట భూలోకాన పరిఢవిల్లుతుంది. విజ్ఞాన తంత్ర కూడా అదే విషయాన్ని చెబుతుంది.

చిత్రగుప్తుడి పూజా సామాగ్రి

చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్‌, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్కె, ఆవాలు, నువ్వులు,తమలపాకులు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి.
అకాలమృత్యువును జయించొచ్చు
వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు. అకాల మృత్యువు వల్ల ఆ కుటుంబం దిక్కులేకుండా పోతుంది. వారి మీద ఆధారపడ్డ వారంతా అనాథలవుతారు. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.
పుట్టినవారు గిట్టక మానరు కానీ అకాల మృత్యువును జయించడం సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి చిత్రగుప్తుడు కొంతవరకు సహకరిస్తాడని భక్తుల నమ్మకం. ఎందుకంటే చిత్రగుప్తుడు యమ ఆస్థానంలో అకౌంటెంట్‌ లేదా రికార్డ్‌ కీపర్‌. మనం చేసిన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుడి వద్ద ఉంటుంది.పాపాల చిట్టా పెరిగినప్పుడే యముడు తన లోకానికి తీసుకెళ్తాడన్న ప్రచారం ఉండనే ఉంది.🌹
విదురుడు

విదురుడు తుది శ్వాస వరకు నిజాయితీనే నమ్మాడు, మహాభారతంలో ఇలాంటి పాత్ర మరొకటుండదు


మహాభారతంలో చాలా పాత్రలకు చాలా ప్రత్యేకతలున్నాయి. అలాగే విదురుడు పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతను ప్రణాళికలకు చాలా పేరుంది. వ్యూహరచనలో, నీతిలో మంచి పేరు సంపాదించాడు విదురుడు.


విదురుడు ఎక్కువగా నిజాయితీ పక్షాన నిలబడాలి అనుకునేవాడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో విదురుడి నుంచి సలహాలు కోరాడు ధృతరాష్ట్రుడు. విదురుడు తండ్రి కృష్ణద్వైపాయన వ్యాసుడు. విచిత్రవీర్యుడి భార్యా అయిన అంబిక దాసికి విదురుడు పుట్టాడు.


విదురుడి పుట్టుక
విదుడు ధృత రాష్ట్రుడికి తమ్ముడు అవుతాడు. అయితే అంధుడు కావడంతో ధృతరాష్ట్రుడికి మొదట రాజ్యం అప్పగించలేదు. పాండురాజు మరణించాక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం వస్తుంది. వాస్తవానికి అప్పుడు విదురుడికి బాధ్యతలు అప్పగించాలి కానీ విదురుడి పుట్టుక వెనుకున్న కథ వల్లే అతనికి రాజ్యాధికారం రాలేదు.


దాసికి పుడతాడు
అంబికకు గుడ్డివాడు పుడతాడని వాళ్ల అత్తకు తెలుస్తుంది. దీంతో ఆమె మళ్లీ కోడల్ని వ్యాసమహర్షి దగ్గరకు పంపాలనుకుంటుంది. కానీ వ్యాసుడి వేషధారణ చూసి భయపడిన ఆ కోడలు తన దాసికి అసలు విషయం చెబుతుంది. దయచేసి నా కోరిక మన్నించి ఆ వ్యాసుడి దగ్గరకు నువ్వు వెళ్లు అని కోరుతుంది. తన మాదిరిగానే వేషం వేసి దాసిని వ్యాసుడి దగ్గరకు పంపుతుంది. ఆమె వ్యాసుడు చెప్పినట్లు శ్రద్ధగా అతనికి సహకరిస్తుంది.

దీంతో ఎంతో జ్ఞానం కలిగిన విరుదుడు దాసికి జన్మిస్తాడు.

ఎంతో జ్ఞానం ఉన్నా కూడా దాసికి పుట్టాడని అతనికి రాజ్యాన్ని అప్పగించలేదు. అయినా విదురుడు కూడా రాజ్యం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ధృత రాష్ట్రుడికి మంత్రిగా ఉంటూ తన సేవలు అందిచాడు.



దుర్యోధనుడి జాతకం
అయితే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టగానే విరుదుడు అతని జాతకం మొత్తం అన్నకు చెబుతాడు. అన్నా.. దుర్యోధనుడు మన వంశాన్ని నాశనం చేసేస్తాడు.. ఇతనికి అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని చెబుతాడు. కానీ ధృతరాష్ట్రుడు కొడుకంటే అమితమైన ప్రేమ ఉండడం వల్ల విరుదుడి మాట అస్సలు లెక్కచెయ్యడు. ఇక ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూదానికి పిలుచుకురావడానికి కూడా విదురుడినే వాడుకుంటాడు. విదురుడంటే ధర్మరాజుకు ఎంతో నమ్మకం.

ఒక రాజు ఎలా ఉండాలి
ఇక ధృతరాష్ట్రుడు అంధుడుకావడంతోనే అతనికి అన్ని రకాలుగా అండగా నిలిచి రాజ్యపాలనతో సలహాలిస్తాడు విదురుడు. ధృతరాష్ట్రుడికి ఏ కష్టం వచ్చినా సరే మొదట విదురునితోనే చెప్పుకునేవాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఒక రాజు ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నో సార్లు వివరిస్తాడు. విదురుడి నీతి సూత్రాల్లో కొన్ని....

"ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇతరుల విషయంలో ఎప్పుడూ ఈర్ష్య ఉండకూడదు. పొగడ్తలకు ఎప్పుడూ కూడా పొంగిపోకూడదు. పాలించే వాణ్ని, దేవుణ్ని, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి. తెలివి తక్కువ వాళ్లు ఏం చేస్తారంటే... తమను ఎక్కువగా ఇష్టపడే వారిపై ద్వేషం పెంచుకుంటారు. తమను ఎక్కువగా ద్వేషించేవారిపై ఇష్టం పెంచుకుంటారు."

క్షమాపనకు మించినది లేదు
"ఒంటిరిగా ఉండడం, ఒంటిరిగా ఆలోచించడం, ఒక్కడే తినడం, ఒక్కడే ప్రయాణాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఈ ప్రపంచంలో క్షమాపనకు మించినది ఇంకొకటి లేదు. ఇతరు స్త్రీల పట్ట వ్యామోహం ఉండకూదు. మద్యపానం, ఇతరులను అనవసరంగా ఆడిపోసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు"

పాండువులకు సహకరించాడనే కారణంతో
"మిత్రుడిని ద్వేషించకూడదు. అలాగే ఎవరి శ్రేయస్సు అయితే మనం కోరుకుంటామో వాళ్లకు మంచి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్నా కూడా ధర్మాన్ని వీడకూడదు. విదురుడు బతికినంత కాలం నీతి, నిజాయితీలనే నమ్మాడు."

పాండువులకు సహకరించాడనే కారణంతో ఒకసారి దృతరాష్ట్రుడు విదురుడిని తన దగ్గర నుంచి వెళ్లిపొమ్మని కోప్పడుతాడు. కానీ విదురుడు వెళ్లిపోగానే మరుక్షణమే మళ్లీ పిలుపించుకుంటాడు. విదురుడి లేకుండా ధృతరాష్ట్రుడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు.
విదురుడు

విదురుడు తుది శ్వాస వరకు నిజాయితీనే నమ్మాడు, మహాభారతంలో ఇలాంటి పాత్ర మరొకటుండదు
మహాభారతంలో చాలా పాత్రలకు చాలా ప్రత్యేకతలున్నాయి. అలాగే విదురుడు పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతను ప్రణాళికలకు చాలా పేరుంది. వ్యూహరచనలో, నీతిలో మంచి పేరు సంపాదించాడు విదురుడు.
విదురుడు ఎక్కువగా నిజాయితీ పక్షాన నిలబడాలి అనుకునేవాడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో విదురుడి నుంచి సలహాలు కోరాడు ధృతరాష్ట్రుడు. విదురుడు తండ్రి కృష్ణద్వైపాయన వ్యాసుడు. విచిత్రవీర్యుడి భార్యా అయిన అంబిక దాసికి విదురుడు పుట్టాడు.
విదురుడి పుట్టుక
విదుడు ధృత రాష్ట్రుడికి తమ్ముడు అవుతాడు. అయితే అంధుడు కావడంతో ధృతరాష్ట్రుడికి మొదట రాజ్యం అప్పగించలేదు. పాండురాజు మరణించాక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం వస్తుంది. వాస్తవానికి అప్పుడు విదురుడికి బాధ్యతలు అప్పగించాలి కానీ విదురుడి పుట్టుక వెనుకున్న కథ వల్లే అతనికి రాజ్యాధికారం రాలేదు.
దాసికి పుడతాడు
అంబికకు గుడ్డివాడు పుడతాడని వాళ్ల అత్తకు తెలుస్తుంది. దీంతో ఆమె మళ్లీ కోడల్ని వ్యాసమహర్షి దగ్గరకు పంపాలనుకుంటుంది. కానీ వ్యాసుడి వేషధారణ చూసి భయపడిన ఆ కోడలు తన దాసికి అసలు విషయం చెబుతుంది. దయచేసి నా కోరిక మన్నించి ఆ వ్యాసుడి దగ్గరకు నువ్వు వెళ్లు అని కోరుతుంది. తన మాదిరిగానే వేషం వేసి దాసిని వ్యాసుడి దగ్గరకు పంపుతుంది. ఆమె వ్యాసుడు చెప్పినట్లు శ్రద్ధగా అతనికి సహకరిస్తుంది.
దీంతో ఎంతో జ్ఞానం కలిగిన విరుదుడు దాసికి జన్మిస్తాడు.
ఎంతో జ్ఞానం ఉన్నా కూడా దాసికి పుట్టాడని అతనికి రాజ్యాన్ని అప్పగించలేదు. అయినా విదురుడు కూడా రాజ్యం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ధృత రాష్ట్రుడికి మంత్రిగా ఉంటూ తన సేవలు అందిచాడు.
దుర్యోధనుడి జాతకం
అయితే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టగానే విరుదుడు అతని జాతకం మొత్తం అన్నకు చెబుతాడు. అన్నా.. దుర్యోధనుడు మన వంశాన్ని నాశనం చేసేస్తాడు.. ఇతనికి అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని చెబుతాడు. కానీ ధృతరాష్ట్రుడు కొడుకంటే అమితమైన ప్రేమ ఉండడం వల్ల విరుదుడి మాట అస్సలు లెక్కచెయ్యడు. ఇక ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూదానికి పిలుచుకురావడానికి కూడా విదురుడినే వాడుకుంటాడు. విదురుడంటే ధర్మరాజుకు ఎంతో నమ్మకం.
ఒక రాజు ఎలా ఉండాలి
ఇక ధృతరాష్ట్రుడు అంధుడుకావడంతోనే అతనికి అన్ని రకాలుగా అండగా నిలిచి రాజ్యపాలనతో సలహాలిస్తాడు విదురుడు. ధృతరాష్ట్రుడికి ఏ కష్టం వచ్చినా సరే మొదట విదురునితోనే చెప్పుకునేవాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఒక రాజు ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నో సార్లు వివరిస్తాడు. విదురుడి నీతి సూత్రాల్లో కొన్ని....
ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఇతరుల విషయంలో ఎప్పుడూ ఈర్ష్య ఉండకూడదు. పొగడ్తలకు ఎప్పుడూ కూడా పొంగిపోకూడదు. పాలించే వాణ్ని, దేవుణ్ని, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి. తెలివి తక్కువ వాళ్లు ఏం చేస్తారంటే... తమను ఎక్కువగా ఇష్టపడే వారిపై ద్వేషం పెంచుకుంటారు. తమను ఎక్కువగా ద్వేషించేవారిపై ఇష్టం పెంచుకుంటారు."
క్షమాపనకు మించినది లేదు
"ఒంటిరిగా ఉండడం, ఒంటిరిగా ఆలోచించడం, ఒక్కడే తినడం, ఒక్కడే ప్రయాణాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఈ ప్రపంచంలో క్షమాపనకు మించినది ఇంకొకటి లేదు. ఇతరు స్త్రీల పట్ట వ్యామోహం ఉండకూదు. మద్యపానం, ఇతరులను అనవసరంగా ఆడిపోసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు"
పాండువులకు సహకరించాడనే కారణంతో
"మిత్రుడిని ద్వేషించకూడదు. అలాగే ఎవరి శ్రేయస్సు అయితే మనం కోరుకుంటామో వాళ్లకు మంచి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్నా కూడా ధర్మాన్ని వీడకూడదు. విదురుడు బతికినంత కాలం నీతి, నిజాయితీలనే నమ్మాడు."
పాండువులకు సహకరించాడనే కారణంతో ఒకసారి దృతరాష్ట్రుడు విదురుడిని తన దగ్గర నుంచి వెళ్లిపొమ్మని కోప్పడుతాడు. కానీ విదురుడు వెళ్లిపోగానే మరుక్షణమే మళ్లీ పిలుపించుకుంటాడు. విదురుడి లేకుండా ధృతరాష్ట్రుడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు.
*యోగి లక్షణములు*
💫🌞🌏🌙🌟🚩
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి
💫🌞🌏🌙🌟🚩
*బ్రహ్మ జ్ఞాని అయిన యోగి భౌతిక సాధనలు, పూజ సామాగ్రిని వాడడు. తాంత్రిక సాధనలు చేయడు. దేవతారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు.*



*ఆసనములు, ప్రాణాయామము, భూచరి, ఖేచరి, సాంభవి ముద్రలను అభ్యసించడు.*



*యోగి అయిన వాడు ఇడ, పింగళ, సుషుమ్న, నాడుల మార్గములు అన్వేషించడు.*



*ఆత్మ నిగ్రహమునకు, ఇంద్రియ నిగ్రహమునకు అతీతముగా యోగి వుండును.*



*సకామ, నిష్కామ కర్మలకు అతీతుడుగా ఉండును. ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఆత్మానందుడై ఉండును.*



*బ్రహ్మ జ్ఞాని అయిన యోగి తాను మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియములు, అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు కాదని తెలిసియుండును.*



*శాస్త్ర జ్ఞానములందు, శుద్ధ అశుద్ధులందు అతీతుడుగా ఉంటూ కేవలం ఆత్మ యందే రమించి ఉండును. 7. యోగి శరీరపరముగా ఏ స్థితిలో మరణించినను, ఎచ్చట మరణించినను, తాను పరమాత్మ యందే ఐక్యమై యుండును.*



*యోగులు భౌతికముగా చతుర్విద ధర్మములను ఆచరిస్తూ ప్రేమ, వైరాగ్యములను అలవర్చుకుని నిర్గుణుగా యుండును.*



*యోగికి వేదాధ్యయనము, దీక్షలు, విగ్రహారాధనతో పనిలేదు.*



*యోగి సదా బ్రహ్మ భావనలో లీనమైఉండుటచే అంత్య కాలమందు కూడా అదే నిష్ఠ కల్గి పునర్జన్మ పొందడు.*



*యోగి సంకల్ప రహితుడు, జన్మ రహితుడు అగుటచే అతనికి పిత్రుయానము, దేవయానము లుండవు.*



*యోగి జీవన్ముక్తుడగుటచే మానసికముగా అంతరముగా పవిత్రుడై ఉండును.*



*యోగి కర్మలను నిష్కామముగా ఆచరించుటచే, అతడు కర్మలను చేసినను త్యజించినవాడే అగును.*



*యోగి జ్ఞానికంటెను, తపస్వుల కంటెను పండితులకంటెను,శ్రేష్ఠుడు. నిరంతర కృషి,ధ్యానాభ్యాసము, కఠోర సాధన వలన యోగి అగుచున్నాడు.*



*యోగులలో మహా యోగియైనవాడు పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములను, మనసును నిగ్రహించి భగవంతుని యందు వాటిని ఐక్యము చేయు నేర్పరియై యుండును.*



*యోగియైన వాడు విషయ, వస్తు, శబ్ధ, భోగ రాహిత్యముతో సాధన యందు అనాసక్తుడై వుండి కర్మలను కూడా అనాసక్తితో ఆచరించును. అపుడు కర్మ అంటదు.*



*యోగికి యోగాభ్యాసకాలములో అనారోగ్యము, భోగాదులపై ఆసక్తి, ఇతర వ్యక్తిగత, బాహ్యకారణముల వలన యోగాభ్యాసమునకు భంగము కలిగినపుడు అతడు యోగభ్రష్టుడగు చున్నాడు.*



*యోగభ్రష్టుడు మరణానంతరము పుణ్యలోకములు పొంది, తిరిగి శ్రీమంతుల సదాచారపరుల ఇండ్లలో జన్మించి జ్ఞానియై మరల యోగాభ్యాసము కొనసాగించి చివరికి ముక్తుడగును. గత జన్మ సంస్కారములు ఇతనికి తోడ్పడును. అందువలన యోగి ముక్తి నందువరకు యోగిగానే జీవించి ఉండును.*

🕉🌞🌏🌙🌟🚩

Saturday, March 23, 2019

*వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?*

భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుష జననం

 యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు*

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

chaganti koteswara rao gari shastipurthi celebrations

‘‘శారదాజ్ఞానపుత్ర’’
శ్రీశ్రీశ్రీ చాగంటి కోటేశ్వరరావు షష్ట్యబ్ధి మహోత్సవ సందర్భంగా 
                   వారి ఆధ్యాత్మికా సంసేవ ప్రకటనా గీతిక

సమర్పణం  :  శాంతా  - వసంతా ట్రస్టు 
రచన            :  శ్రీ రాంభట్ల నృసింహ శర్మ
గానం            :  శ్రీ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం      :  శ్రీ నాగరాజు తాళ్ళూరి

సాకి :    శ్రీశారద జ్ఞానపుత్ర ధీసార విశాలనేత్ర
             ఆథ్యాత్మిక జగన్మిత్ర అలుపెరుగని సుధాగాత్ర
             అడుగుపెట్టు ప్రతితావున తాను ఋష్యశృంగుడే
             మడుగుకట్టు దైవీవర వర్షధార పొంగులే !

పల్లవి  :  కనుమిదె ! పుంభావ సరస్వతీ కళాకలకంఠుని
               కలియుగ వాల్మీకి, వ్యాస సుప్రభాస ‘చాగంటి’ని
               నడతల, నుడువుల, నగవుల ఆ తైజస ధాటిని
               తడియని వారేరీ!? ఆ పలకుల పన్నీటిని...                              ॥ కనుమిదె ॥

చరణం:  కమండలం  చేపట్టక, కాషాయం మెయిచుట్టక
               సాధారణ, సామాజిక జీవన ఋషిసత్తమునిగ
               పల్లెలు  పట్నాలే తన నైమిశారణ్యాలని
                కొల్లగ  భక్తికి మలిపే పుణ్యమె నైపుణ్యమని...                           ॥ కనుమిదె ॥

చరణం:  ప్రతిన పట్టినట్టుగ ప్రతి మాట మంత్రపాఠమే
                 కృతిని పాడు నట్లగు ఆకృతి గనక దాటమే
                 ఆర్షధర్మ సూత్రాంగిక చలిత లలిత పీఠమే
                 హర్షణీయ భారతీయ నిజధర్మోద్ఘాటనమే...                            ॥ కనుమిదె ॥

చరణం:  రామశీల, ధర్మహేల, కృష్ణలీల కథామాల
                అష్టాదశ పురాణాల శిష్టాచారాల వాల
               యజ్ఞ, వ్రత, తీర్థక్షేత్ర మహిమల మహి చాటగా        
                ప్రజ్ఞామయ శ్రుతి స్మృతుల కచ్ఛపి తంత్రులు  మీటగ...          ॥ కనుమిదె ॥

చరణం:  కోటి కోటి హితవుల ముక్కోటి దివ్యస్వరావళిని
               గోటి కొనల కుప్పించగ, గుప్పించే వాఙ్మయఖని
                కోటేశ్వర నాముని, నిష్కామ కర్మ గుణధాముని
                సాటిలేని వైదిక సంస్ఫూర్తిని... సద్గురు మూర్తిని...                ॥ కనుమిదె ॥












Friday, March 22, 2019

తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?
ఓం నమః శివాయ..!!🙏

తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం.
కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి
అన్నది ఎప్పుడైనా ఆలోచించారా?

ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!!
దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు,
తులసి దళాలు,
సుగంధ ద్రవ్యాలు,
మంత్ర శక్తులు ఉంటాయి.
దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది.

తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం,
ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక,
మానసిక శుద్ధి జరుగుతుంది.

రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ,
ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.

ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.

మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది
అని అర్ధం.
దీన్ని మూడుసార్లు తీసుకుంటే..
భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు.
తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి.
ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది,
నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం!!

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి.
కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది.
ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి.

తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు.
కాని అలా చేయకూడదు.
తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు.
మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.
ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు,
బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై
అవగాహన కలిపించండి..!

ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా..సుఖినోభవంతు..!

Thursday, March 21, 2019

మహాదేవ...........

శుభోదయం........

లత్తుకలొత్తిన, ఆ జగదంబ పాదపద్మ వర్ణన నా రచనలో.................

చివురుటాకులుంగలువలు చింతమునిగె
షట్పదములవి భ్రమజెందే సరసిజమని
అనలుడడలె నీ చరణములరుణిమకును
భాగ్యదాయి వీవమ్మ మా భద్రకాళి

భావము:.......... అమ్మా! ఓ భద్రకాళి.. !  పారాణి అద్దిన నీ పదద్వంద్వమును చూసి, ఎర్ర కలువపూలు, చిగురుటాకులు చింతించసాగినాయి...అగ్నిదేవుడు ఆ ఎర్ర్రని పాదములను చూసి భయపడ్డాడు........తేనుటీగలేమో అవి ఎర్ర తామరలనుకొని భ్రమచెంది, ఆ పాదములపై  చేరినాయి........... అట్టి నీ పదపద్మములే మాకు దిక్కు( ముదిగొండ రవి శంకర్)

Wednesday, March 20, 2019


కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. అది తాత్పర్య సహితంగా ఇక్కడ ఇవ్వబడినది.

मुक्तामणिस्तवं नयनं ममेति
राजेति जीवेति चिर सुत त्वम् ।
इत्युक्तवत्यास्तव वाचि मातः
ददाम्यहं तण्डुलमेव शुष्कम् ॥ १॥

ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.

తాత్పర్యము:

అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.

अम्बेति तातेति शिवेति तस्मिन्
प्रसूतिकाले यदवोच उच्चैः ।
कृष्णेति गोविन्द हरे मुकुन्द
इति जनन्यै अहो रचितोऽयमञ्जलिः ॥ २॥

అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.

తాత్పర్యము:

పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

आस्तां तावदियं प्रसूतिसमये दुर्वारशूलव्यथा
नैरुच्यं तनुशोषणं मलमयी शय्या च संवत्सरी ।
एकस्यापि न गर्भभारभरणक्लेशस्य यस्याक्षमः
दातुं निष्कृतिमुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः ॥ ३॥

ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.

తాత్పర్యము:

అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.

गुरुकुलमुपसृत्य स्वप्नकाले तु दृष्ट्वा
यतिसमुचितवेषं प्रारुदो त्वमुच्चैः ।
गुरुकुलमथ सर्वं प्रारुदत्ते समक्षं
सपदि चरणयोस्ते मातरस्तु प्रणामः ॥ ४॥

గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.

తాత్పర్యము:

కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను

न दत्तं मातस्ते मरणसमये तोयमपिवा
स्वधा वा नो दत्ता मरणदिवसे श्राद्धविधिना ।
न जप्त्वा मातस्ते मरणसमये तारकमनु-
रकाले सम्प्राप्ते मयि कुरु दयां मातुरतुलाम् ॥ ५॥

న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.

తాత్పర్యము:

అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ!

Tuesday, March 19, 2019


కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు

ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట.

అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు.

తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.

కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాహున్నది నాకిస్తావా? అని అడిగాడు.

వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె
యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు? కుడిచేత్తో యీయరాదా? అన్నాడు.

అందుకు కర్ణుడు
క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:

*_అర్థము:--కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచు ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు._*

అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే
చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను.అన్నాడు.

అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.

అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ

*_అర్థము:-కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు._*

దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.

దానం విషయం లో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.

దానం చేసి నేను చేశానని
డప్పు కొట్టుకోకూడదు.

ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.

మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి....
🙏🙏🙏🙏

Friday, March 15, 2019

శ్రీ శంకరాచార్య కృత గురు అష్ఠకం...

1

శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

చక్కని రూపం గల అందమైన భార్య  ఉన్నప్పటికి, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికి గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

2.
   
కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

3.    
షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

నీవు ఆరు అంగముల లోను, నాలుగు వేదముల లోను, పారంగతుడవైనా కాని, గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని,  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

4.    
విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య
సదాచార వృత్తేషు మత్తో న చాన్యా
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తి గలవానిగా జీవించు వాడవని పొగడ బడినా, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

5.    
క్షమా మండలే భూప భూపాల వృందై
సదా సేవితమ్ యస్య పాదారవిందమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందఱో రాజులు, రారాజులు నీ పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

6.    
యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినాను, ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

7.    
న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధ చూప నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

8.    
అరణ్యే న వాసస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్    

అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా, ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని వారైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

   
ఫలశృతి:
 గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్యదేహి
యతిర్ భూపతిర్, బ్రహ్మచారీ చ గేహీ
లబేత్ వాంఛితార్థమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
గురోరుక్త వాక్యే, మనో యస్య లగ్నమ్

ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై వినెదరో, గురువును శ్రద్ధతో సేవించెదరో, వారు పవిత్రులైనా, సంయాసులైనా, రాజైనా, సజ్జనులైనా, బ్రహ్మచారు లైనా, ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

🔱🔱🌸 *శివతత్వం*🌸🔱🔱
మానవ శరీరం ఏర్పడినపుడు అది కేవలం ఒకే ఒక కణం మాత్రమే. ఆ ఒక్క కణమే మొత్తం శరీరంగా మారింది. శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో, ఎక్కడ చెవులుగా ఏర్పడాలో, ఎక్కడ గుండెగా పనిచేయాలో.. అన్నీ ఆ కణానికి తెలుసు. అలా ఆ ఒక్క కణమూ తనను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా.. గోళ్లు, జుట్టు, నాలుక, కండరాలు, ఎముకలు ఇలా అన్నిటిగానూ రూపొందింది. మానవ శరీరం ఒక్కటే.. కాని ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం.. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్ని ఒకే పదార్థంతో తయారయ్యాయి. ఆ ఒక్కదానికే ‘శివ’ అని పేరు.

శివతత్వాన్ని గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నవాడా? కాదు. సమస్త విశ్వమూ శివుడే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం. దీని నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాదు. ఎందుకంటే సృష్టి అంతా శివుడే.

శివుడు విశ్వరూపుడే. అంటే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరాకారుడు. విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్లినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా? అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. శివరాత్రి గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు. ‘నీవు శివుని పాదాలు కనుక్కో.. నేను తలను కనుగొంటాను’ అని బ్రహ్మ చెప్పాడు. సరేనని విష్ణువు.. శివుని పాదాలు వెదుకుతూ పాతాళానికి బయల్దేరాడు. బ్రహ్మ ఆకాశమార్గాన పైకి వెళ్లాడు. కొన్ని వేల సంవత్సరాలపాటు గాలించినా పరమేశ్వరుడి ఆద్యంతాలు వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే సృష్టంతా శివునిలోనే ఉన్నది.

ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది. ఒకవంక అతడు శ్వేత వస్త్రధారుడిగా అగుపిస్తాడు. మరోవంక కృష్ణవర్ణుడు. అతడు విశ్వానికి అధిపతి అయినా ఆభరణాలు లేవు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు భోళాశంకరుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతి. అదేసమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతనే. ఆనందతాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగునూ, అమాయకత్వాన్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతున్నది.
సాధారణంగా ప్రజలు, ‘ఈ జీవితం ఉద్దేశం ఏమిటి? ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది?’ అని అడుగుతూ ఉంటారు. ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వసృష్టికి కారణం లేదు.

ఇది కేవలం ఒక లీల. విశ్వ చైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యమూ, నాట్యకారుడూ విడివిడిగా ఉండలేరో.. అలాగే సృష్టి, సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజస్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతములు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనందనాట్యమే ఈ విశ్వం. ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటోంది. ఇది తెలియనివాడు బాధపడతాడు. తెలిసినవాడు ఆనందాన్ని కనుగొంటాడు. ఆ సత్యమే శివతత్వం.శివుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు. శివతత్వం ఇక్కడే ఉంటుంది. మన చైతన్యంలో మూడు దశలు ఉంటాయి. మెలకువ, కల, నిద్ర. ఇవిగాక నాల్గో దశ చైతన్యస్థితి ఉన్నది. అది మెలకువ కాదు. కల కాదు. నిద్ర కూడా కాదు. అది ధ్యానంలో అనుభవంలోకి వస్తుంది. ఆ నాల్గోస్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివతత్వం. చైతనత్వంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది. జీవం ఉన్న ప్రతిదానిలోనూ ఆ తత్వం ఉన్నది. ఆ మహత్తే శివతత్వం.

 *ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం*
*ఉర్వారుకమివబంధనాన్‌ మృత్యోర్ముక్షియమామృతాత్*
వేదాచారాలలోని అత్యంత పవిత్రమైన మంత్రాలలో శివుని మృత్యుంజయ మంత్రం ఒకటి. మృత్యుంజయ అంటే చావుపై గెలుపు. ఆత్మకు చావు లేదు. అది ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. మృత్యుంజయ అంటే ఈ అశాశ్వతమైన జీవనంపై గెలిచి, మనసు శాశ్వతత్వానికి చేరుకోవడం. *‘నేను శాశ్వతం, ఎన్నటికీ మార్పు చెందనిదేదో అది నాలో ఉన్నది’* అని మనసు గ్రహిస్తుంది. అప్పుడు భయం ఉండదు. భయం అనేది మృత్యువుకు గల సంకేతాలలో ఒకటి. భయాన్ని జయించినపుడు ఈ అశాశ్వతమైన విషయాలను గుర్తుంచుకోవడం మానేసి, ఎన్నటికీ నాశనం కాని దానికోసం కదులుతాము. మనం ఈ రెండింటి కలయికగా ఉన్నాము. మన ఆత్మ నాశనం లేనిది. శరీరం నశించిపోయేది. చాలాసార్లు మన మనసు శరీరానికి అంటిపెట్టుకుని తాను చనిపోతున్నానని భావిస్తూ ఉంటుంది. మనసును ఈ పరిమితమైన గుర్తింపు నుంచి అపరిమితమైన విశ్వవ్యాప్తమైన గుర్తింపుకు మృత్యుంజయ మంత్రం తీసుకెళ్తుంది. ఈ మంత్రంలో ఒక ప్రార్థన ఉన్నది. *‘శివుడు నన్ను బలవంతునిగా చేయుగాక. ఆతడు నన్ను బలవంతునిగా చేయుగాక. ఆతడు నన్ను బంధం నుంచి విముక్తుణ్ని చేయుగాక’’

Thursday, March 14, 2019

గృహప్రవేశము ఎలాచేయాలి?
శ్లో "అకవాట మానాచ్చన్న మభుక్త బలి భోజనం
గృహం న ప్రవిశేద్ధిమానా పదమా కరంహి తత్"
వాస్తురాజవల్లభం
ద్వారాలులేకుండా, ,పైకప్పులేకుండా,వాస్తుశాంతి,వాస్తుహోమములేకుండా,8 దిక్కులలో బలిలేకుండా,భదువులకు భోజనాలు పెట్టకుండా గృహప్రవేశము చేయరాదు సత్యనారాయణ వ్రతం రోజుయినా భోజనాలు పెట్టాలి
 శాంతికమళాకారము,బృహద్వా స్తుమాలా,ధర్మ సింధు,నిర్ణయసింధూ,కాలామృతము, మొదలైన గ్రంధాలలో గృహప్రవేశము ముందు వాస్తుశాంతులు చేయకుండా యజమాని గృహప్రవేశము చేయరాదని గ్రంధాలు చెబుతున్నాయి
ఎందుకంటే ఇల్లునిర్మాణము చేసేటప్పుడు క్రిమికీటకాలహింస,చెట్లు నరికినదోషము,అంతర్గత శల్యదోషాలు,ఆయాది దోషము,ముహూర్తదోషము,కాకిప్రవేశ దోషము,భూతప్రేతపిశాచ ప్రవేశము పోవాలంటే వాస్తుదోషాలకు ,తగిన శాంతి హోమాలుచేసి తరువాత శుభమూహర్తంలో గృహప్రవేశము చేయాలి ఇదిశాస్త్రము ఈవిధంగా తెలంగాణ,రాయలసీమ ప్రాంతాలలో కొన్నిప్రాంతాలలో చేస్తారు ఈనాడు గృహప్రవేశాలు మరిదారుణంగా చేస్తున్నారు
శుభముహూర్త సమయంలో ముందుగా గోవు,దంపతులు గృహంలో కుడికాలుపెట్టి లోపలికి వెళ్ళాలి కానీ ముందు ఫోటోగ్రాఫర్ వెళ్తున్నాడు ఆదిిచెప్పులతో ఇలా అందరుకాదు కొంతమంది
గుమ్మందగ్గరే చెప్పులు,బియ్యము గ్లాసు కాలితోతన్ని లోపలికి పోవటం ఇవిిదోషము, సాంప్రదాయవస్త్రాలు ధరించకుండా,ఆడవారు కాలికి పసుపురాయకుండా గృహప్రవేశం చేసేస్తున్నారు,ఆగ్నేయంలో వంటగదిలో పొంగించవలసిన పాలు నట్టింట్లోపొంగించడం చేస్తున్నారు ,సింహద్వారానికి పసుపురాసి బొట్లుపెట్టకుండా,మామిడిఆకులు కట్టకుండా ప్రవేశం చేస్తున్నారు
కొంతమందిపుణ్యాహవాచనము,ఏకాశీతి పదవాస్తుమండపారాధన చేయకుండా పూజముగిస్తున్నారు
గృహప్రధానద్వారాము తలుపులు ముహూర్త సమయానికి తెరిచి ప్రవేశము చేయాలి అంతవరకు మూసిఉంచాలి ప్రవేశం ముందు దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండటానికి
రాత్రి గృహప్రవేశము ఐతే ఉదయమునూతన గృహంలో వాస్తుశాంతి చేయవలెను వాస్తుశాంతి రాత్రి,సాయంత్రము చేయరాదు
గృహప్రవేశము,రాత్రి పూట,పగటిపూట చేయవచ్చు ఎక్కువగా పగలు చేయకపోవడానికి కారణము మంచి శకునంకాజాలదని,రాత్రి ఎవ్వరు తిరగరని ఎక్కువగా రాత్రి గృహప్రవేశం చేస్తున్నారు గృహప్రవేశము చేసినవారు రాత్రిఅంతా జాగరణ చేయాలి సూర్యోదయం వరకు నిద్రపోరాదు ఎందుకంటే ఆగృహము కూడా నిద్రావస్థను పొదుతుందని పెద్దలు చేెప్పినారు
మూడురోజులు తప్పకుండా ఉదయము సాయంత్రము నూతన గృహంలో దీపారాధన చేయవలెను ఒకవేళ మైలసోకిన 5 రోజులు ఆపివేసి మరల చేయవలెను
పాలు పొంగించడానికి తొడబుట్టిన చెల్లెలులేదా అక్కచేత పాలుపొంగించవలెను వారులేకపోతే పెళ్లయిన కూతురు చేత పాలుపొంగించవలెను వారులేకపోతే సోదరివరస ఐనవారు ఎవరైనా పాలుపొంగించాలి పాలుపొంగించినవారికి పసుపు కుంకుమతో వస్త్రాలు పెట్టవలెను
వాస్తుశాంతి పూజ విధానము
గణపతిపూజ,పుణ్యాహవాచనము, పంచగవ్యసంస్కారము,ఏకాశీతి పదమండల వాస్తుపూజ,నవగ్రహ మండపారాధన,లక్ష్మీ గణపతి,రుద్ర,నవగ్రహ,వాస్తు,హోమాలు,వాస్తుపర్యగ్నికరణ, బ్రాహ్మణులకు నవగ్రహ దానాలు మొదలైన పూజలు చేయవలెను.
*వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు*

 🥥 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.
 🍌అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
🍒నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.
🍇 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
 🍋మామిడి పండు. - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
🥝అంజూర పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
🍑సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
 🍎యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
 🍊కమలా పండు. - భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
 🍍పనసపండు - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.
🦚🦜🦚🦜🦚🦜🦚🦜🦚

_*🙏 ★ ఓం నమోవేంకటేశాయ ★ 🙏*_
     


*_💠 " స్త్రీ కి ఏది భరోసా..? "_*

*స్త్రీ  ఒంటరిదైనప్పుడు,*
      *మగాడు  నీడవ్వాలి.*
*స్త్రీ  పడితే,...! తను వాలడానికి,*
      *మగాడు భుజంకావాలి.*
*స్త్రీ  సంతోషంగా లేనప్పుడు,*
      *మగాడు ఆమె నవ్వుగా మారాలి.*
*స్త్రీ  ఒత్తిడికి లోనైనప్పుడు,*
       *మగాడు సేదదీర్చాలి. చిరుగాలిలా*
*స్త్రీ  తోడు కావాలనుకున్నప్పుడు,*

       *ఎప్పటికీ నేనున్నాననే రీతిలో*
 *ఆ  మగాడు భరోసా ఇవ్వగలగాలి.*



🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
*నేటి కథ*

*గుర్తించే పద్ధతి*

*ఒక బౌద్ధారామాన్ని చూసేందుకు ఒకసారి ఒక సందర్శకుడు వచ్చాడు. అక్కడి సన్యాసి ఒకాయన అతనికి అక్కడి విశేషాల్ని పరిచయం చేస్తున్నాడు. తిరుగుతూ తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక బుద్ధ విగ్రహం దగ్గరికి వచ్చారు. ఆ విగ్రహం ఎంత పురాతనమైనదో, దాన్ని చెక్కిన శిల్పులు ఎవరో- వివరిస్తున్నాడు సన్యాసి. చూడవచ్చిన సందర్శకుడు ఆగి, అంతా విని, అకస్మాత్తుగా విగ్రహం మీద ఉమ్మివేశాడు!*

*సన్యాసి అతనిపై కోపగించుకోలేదు సరికదా, కనీసం 'అది తప్పు' అని కూడా అనలేదు. -ఉత్సాహంగా ముందుకు సాగాడు; ఎదురయ్యే విశేషాల్ని ఎప్పటిమాదిరే వివరిస్తూ పోయాడు. అయితే వాళ్లు ముందుకు పోతున్న కొద్దీ సందర్శకునికే అసౌకర్యంగాను, మనసంతా అలజడిగానూ అనిపించసాగింది. సగం దూరం వెళ్లేసరికి అతను ఇక భరించలేకపోయాడు. సన్యాసిని నిలబెట్టి, ’తాను చేసిన దుష్కార్యానికి అతను ఎందుకు స్పందించలేదు?' అని అడిగాడు.*

*సన్యాసి చిరునవ్వు నవ్వి, చెప్పాడు: "నేను దేనికి స్పందించాలి? ఈ విగ్రహం దగ్గరికి రాగానే ఇక్కడికి వచ్చే సందర్శకులందరూ బుద్ధుడిని గుర్తిస్తుంటారు. కొందరు పువ్వుల్ని అర్పిస్తారు, కొందరు వంగి నమస్కరిస్తారు; చాలా మంది తీపి వస్తువులిస్తారు. ఆ శుద్ధత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేందుకు కొందరు విగ్రహాన్ని ముట్టి చూస్తుంటారు. దూర దేశాలనుండి వచ్చిన సందర్శకులు కొందరైతే బుద్ధుని పాదాలను ముద్దుపెట్టుకున్నారు. మీరు బుద్ధునిపై ఉమ్మివేశారు... ఇవన్నీ బుద్ధున్ని గుర్తించటంలోని వేరువేరు మార్గాలు. మీరు మీ పద్ధతిలో బుద్ధ భగవానుడిని గుర్తించారు" అన్నాడు.*

*సందర్శకుడు వెనక్కు పరిగెత్తి విగ్రహం ముందు సాగిలపడ్డాడు. తన దుశ్చర్యను క్షమించమని మనసారా వేడుకున్నాడు.*
*వారణాసి కాశీి వైభవం*

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:

# కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

# విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.

# ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.
# స్వయంగా శివుడు నివాసముండె నగరం.

# ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

# కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

# పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

# కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

# ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశీ లోనికి అనుమతించడు.

# కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

# కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

# డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

# కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

# కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

# కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

# అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

# మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

# గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

# ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

@ శివుని కాశీలోని కొన్ని వింతలు...

# కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

# కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

# కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

# అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

# అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

# అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

# అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

# కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

# కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

# కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

# విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

# ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

# ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో  తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

*కాశీ స్మరణం మోక్షకారకం*!
ప్రతిలిపిలో చదవండి - "అదృశ్య బంధం"
"అదృశ్య బంధం", ప్రతిలిపిలో చదవండి:
https://telugu.pratilipi.com/story/1el5d5ady9gj?utm_source=android&utm_campaign=content_share
భారతీయ భాషల్లో అపరిమిత కథలను పూర్తి ఉచితంగా చదవండి,రాయండి మరియు వినండి
*నలభై ఏళ్ల వయసులో..*
ఉన్నతవిద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. *సంపాదనలో ఎదుగుదలనే సమాజం గమనిస్తుంది.*

*ఏభై ఏళ్ల వయస్సులో..*
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. *ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.*

*అరవై ఏళ్ల వయసులో..*
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. *పదవీవిరమణ తర్వాత బంట్రోతుకూడా పలకరించకపోవచ్చు.*

*డెబ్బై ఏళ్లవయస్సులో..*
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే.. కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. *సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.*

*ఎనభైఏళ్ల వయస్సులో..*
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎంత డబ్బున్నా .. *స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.*

*తొంభైఏళ్ల వయస్సులో..*
నిద్ర మెలుకువ రెండూ ఒకటే. *సూర్యోదయం.. సూర్యాస్తమయం.. రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.*

అందంతో వచ్చే మిడిసిపాటు..
ఆస్తులతోవచ్చే అహంకారం..
కులమతాలు పదవులతో గౌరవాన్ని ఆసించటం..
కాలగమనంలో మనకళ్లముందే కనుమరుగయ్యే సత్యాలు.

*సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.*

అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ..
అనుబంధాలను * పదిలపరుచుకుంటూ..
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం....
ఆస్వాదించండి.

🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీవారి సేవ చేద్దాం శ్రీవారి శుభాశీస్సులు పొందుదాం.
〰〰〰〰〰➖➖〰〰〰〰〰
 మనము చేసే పరకామని సేవతో పాటు మన దర్మపత్ని తో  / మహిళల తో పాటు (25 సం . నుండి 50 సం. నిండి ఉండాలి) శ్రీవారి సేవా చేసే అవకాశం ఉంది.
 ఎలాగంటే మనకు పరకామని (3 రోజులు  శుక్ర వారం నుండి ఆదివారం ) మరియు (4 రోజులు సోమవారం నుండి గురువారం వరకు) ఉంటుంది .  వారికి కూడా ఆ  రోజులలో శ్రీవారి సేవ చేసే భాగ్యం ఉంది. *కానీ వారికి వయస్సు 25-50 సం. మద్య ఉండాలి.*  వారు మనతో పాటు తిరుమలకు వెళ్లవచ్చు.   మనతో పాటు Reporting చేస్తారు. మరలా తిరిగి మనతో పాటు రావచ్చు.*
*కానీ వారి విధులు మరియు వసతి వేరుగా ఉంటుంది.*
 వారు వ్యక్తిగతంగా కాని, Group తో కాని మనకు నచ్చిన *16 శాఖలలో* (Department / Wing) సేవ, నచ్చిన రోజులలో, నచ్చిన తేదీలలో మరియు నచ్చిన సమయం లలో శ్రీవారి సేవ చేయడానికి అవకాశం కల్పించింది.

*వయస్సు అర్హతలు :-*

👉 3 మరియు 4 రోజుల సేవ చేయాలనుకొనే వారికి వయస్సు 25-50 మద్య ఉండాలి.

👉 7 రోజుల సేవ చేయాలనుకొనే వారికి వయస్సు 18-60 మద్య ఉండాలి.

*క్రింద 👇👇👇👇వివరించిన విధంగా శ్రీవారి సేవ (సాధారణ) ఏ ఏ శాఖలలో ?, ఎన్ని రోజులలో ?, ఏ ఏ సమయాలలో ? ఉంటుందో వివరించడం జరిగింది.*  


*I. ANNA PRASADAM*
( Serving Annaprasadam to Pilgrims in the halls of Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ )
7 రోజులు (బుధ – మంగళ )

A- Batch  ఉదయం 9.00 నుండి సాయంత్రం  4.00 వరకు
B- Batch సాయంత్రం 4.00 నుండి రాత్రి 11.00 వరకు


*II.  Vegetables Cutting*
(Cutting the vegetables to prepare the delicacies to be served to the Pilgrims in Annaprasadam Complex.)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ )

A  Batch  ఉదయం 6.00 నుండి మద్యాహ్నం 12.00 వరకు
B  Batch మద్యాహ్నం 12.00 నుండి రాత్రి 6.00 వరకు


*III. Employees Canteen*
(Serving Annaprasadam to fellow sevakulu, scouts, employees.)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 8.00 నుండి మద్యాహ్నం 2.00 వరకు
B  Batch సాయంత్రం 4.00 నుండి రాత్రి 9.00 వరకు

*IV. Food Courts:-*
(Serving Annaprasadam in the mobile food counters located at Rambageecha Bus Stand, Central Reception Office and PAC-I.)
    https://t.me/ttdnews
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 7.00 నుండి మద్యాహ్నం 2.00 వరకు
B  Batch మద్యాహ్నం  1.30 నుండి రాత్రి 8.00 వరకు

*V.  V.Q.C.-2 (ANNA PRASADAMS)*
(Serving food to Pilgrims waiting in compartments of VQC-2)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 5.00 నుండి ఉదయం 11.00 వరకు
B  Batch ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 వరకు
C  Batch సాయంత్రం 5.00 నుండి రాత్రి 11.00 వరకు
D  Batch రాత్రి 11.00 నుండి ఉదయం 5.00 వరకు

*VI. V.Q.C.-2 (OUT SIDE LINES)*
(Serving Annaprasadam to the Pilgrims spread out in the lines of Narayanagiri Gardens when there is heavy rush.)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 5.00 నుండి ఉదయం 11.00 వరకు
B  Batch ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 వరకు
C  Batch సాయంత్రం 5.00 నుండి రాత్రి 11.00 వరకు

*VII. Health:-*
https://t.me/ttdnews
(Offering water to the Pilgrims)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 5.00 నుండి ఉదయం 11.00 వరకు
B  Batch ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 వరకు
C  Batch సాయంత్రం 5.00 నుండి రాత్రి 11.00 వరకు

*VIII. Vigilance and Security:-*
(Maintenance of Pilgrim queue lines, scanning of their baggage at different vital points)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 5.00 నుండి ఉదయం 11.00 వరకు
B  Batch ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 వరకు
C  Batch సాయంత్రం 5.00 నుండి రాత్రి 11.00 వరకు
D  Batch రాత్రి 11.00 నుండి ఉదయం 5.00 వరకు
*IX. Kalyana Katta Complexes:-*
(Guiding and maintaining Pilgrims in Kaynanakatta tonsuring areas, distribution of blades and wearing Tirunamam to devotees)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 5.00 నుండి ఉదయం 11.00 వరకు
B  Batch ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 వరకు
C  Batch సాయంత్రం 5.00 నుండి రాత్రి 11.00 వరకు
D  Batch రాత్రి 11.00 నుండి ఉదయం 5.00 వరకు

*X. A.N.C. Sub Enquiry (Anjanadri Nagar Cottages):-*
(Maintenance of rooms allotted to Pilgrims in ANC area for which the able bodied, educated male volunteers are eligible)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 వరకు
B  Batch సాయంత్రం 4.00 నుండి రాత్రి 12.00 వరకు
C  Batch రాత్రి 12.00 నుండి ఉదయం 8.00 వరకు
      https://t.me/ttdnews

*XI. Saptagiri Satralu (Saptagiri Cottages):-*
(Maintenance of rooms allotted to Pilgrims in Sapthagiri Satralu area for which the able bodied , educated male volunteers are eligible)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 వరకు
B  Batch సాయంత్రం 4.00 నుండి రాత్రి 12.00 వరకు
C  Batch రాత్రి 12.00 నుండి ఉదయం 8.00 వరకు



*XII. Coconut Sales Counters:-*
(To sell coconut to Pilgrims, Volunteers with minimum education qualification are eligible)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 2.00 నుండి ఉదయం 8.00 వరకు
B  Batch ఉదయం 8.00 నుండి మద్యాహ్నం 2.00 వరకు
C  Batch మద్యాహ్నం 2.00 నుండి రాత్రి 8.00 వరకు
D  Batch రాత్రి 8.00 నుండి ఉదయం 8.00 వరకు

*XIII. BOOK STALLS:-*
(For the sale of TTD publications in the book stalls located in front of Srivari temple, laddu complex, Annaprasadam complex and at Lepakshi)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 5.00 నుండి ఉదయం 11.00 వరకు
B  Batch ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.00 వరకు
C  Batch సాయంత్రం 5.00 నుండి రాత్రి 11.00 వరకు
D  Batch రాత్రి 11.00 నుండి ఉదయం 5.00 వరకు


*XIV. HELP DESK AND MILK DISTRIBUTION:-*
(To receive the feedback from the Pilgrims waiting in VQC compartments. To distribute milk to infants in the compartments.

3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 7.00 నుండి మద్యాహ్నం 1.00 వరకు
B  Batch మద్యాహ్నం 1.00 నుండి రాత్రి 7.00 వరకు
C  Batch రాత్రి 7.00 నుండి రాత్రి 11.00 వరకు

*XV. TEMPLE CLEANING:-*
(Only able bodied female sevakulu who have minimum qualification can register for this cleaning service in Srivari Temple and Mada Streets)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 6.00 నుండి మద్యాహ్నం 12.00 వరకు
B  Batch మద్యాహ్నం 12.00 నుండి రాత్రి 8.00 వరకు


*XVI. THIRU NAMAM (తిరునామo):-*
(To apply Tirunamam to Pilgrims at different earmarked areas)
3 రోజులు (శుక్ర – అది)
4 రోజులు (సోమ – గురు)
7 రోజులు (మంగళ – సోమ)
7 రోజులు (బుధ – మంగళ)
A  Batch  ఉదయం 8.00 నుండి మద్యాహ్నం 2.00 వరకు
B  Batch మద్యాహ్నం 2.00 నుండి రాత్రి 8.00 వరకు

వివరాలకు మరియు సందేహాలకు :
Srivari Sevakudu,
GOVERDHAN Garu,
83419 23370  - 94410 60270
Email:- goverdhan.rajula@gmail.com
🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀

                     స్త్రీ...!!
                 ➖➖➖✍

        మగాడితో సహా  సర్వ జీవులను... పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు.

   ఒక రోజూ    రెండు రోజులూ    కాదు...!
ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు...
స్త్రీ సృష్టికోసం!

  మిగిలిన పనులన్నీ మానుకుని...  తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా    తల మునకలైపోవడం  చూసిన    ఆ దేవత అడిగింది "స్త్రీని సృష్టించడానికి ఎందు కింత సమయంతీసుకున్నారని?".

అప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి
ఈ స్త్రీహృదయంలో ఎన్ని విషయాలు... పొదగాల్సి వచ్చిందో తెలుసా...?

ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..

వివక్ష తగదు.

మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి.

చిన్న చిన్న గాయాలు మొదలుకుని..... ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...

ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...?

ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే ... తనకు తానే సర్దుకుపోవాలి.       అడిగే వారు  ఉండచ్చూ... ఉండకపోవచ్చు...!
రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి.

ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.

"ఏంటీ... ?    ఇన్ని పనులు చేయడానికి ఆమెకు    రెండు చేతులేనా....?"   అని ఆశ్చర్యపోతూ దేవత   ఆమెను...ఆస్త్రీని మెల్లగా తాకింది!         "ఇదేంటీ ఇంత మృధువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.

ఆప్పుడు దేవుడు..   "ఆమె శారీరకంగా మృధువుగా , మెత్తగా ,  నాజూకుగానూ ఉండొచ్చు.  కానీ   మానసికంగా    ఆమె ఎంతో బలవంతురాలు!

అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు.
అంతేకాదు,  ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు.

ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి!
అవసరమైతే దిగమింగాలి!

కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి!

తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు.
ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.

"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.

అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు?
అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.

దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.

అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది.
ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి.

ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....
పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.

దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.

అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు.

అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది " అవసరమైనప్పుడు.ఆ శక్తి ముందు... ఎవరూ నిలబడలేరు..!"
అనిచెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని..!!

                   ➖➖➖

అందుకే.. ..చెల్లాయ్..లూగా..ఓ..గొప్ప..కూతుర్లు..గా..సహదర్మచారిణి..గా..
ఆడపిల్లలు-ఎక్కడఉన్నా.. బంగారు తల్లులూ..వారికి.. ...

ఇవే..మా..వందనాలు....!

                   🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀
_*గరుడ పురాణము - 8* (1) వ అధ్యాయము

🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉

సూర్య , చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక, మకర సంక్రమణము లందును. అమావశ్య, పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును.
దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము, గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :
శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||
తా || బంగారము, గుఱ్ఱము, తిలలు, ఏనుగులు, దాసీ జనము, రధములు, భూమి, గృహములు, కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.
దేవతలకు గాని, బ్రాహ్మణులకు గాని, గురువులకు గాని, తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును .
ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు, ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది తీర్ధములందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును.
వైవస్వత మన్వంతరము
ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము. అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి, పదునెనిమిది పురాణములు రచించెను. దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి. ప్రతి కలియుగములోను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగములోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము, యజుర్వేదము ,సామవేదము,అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏