‘‘శారదాజ్ఞానపుత్ర’’
శ్రీశ్రీశ్రీ చాగంటి కోటేశ్వరరావు షష్ట్యబ్ధి మహోత్సవ సందర్భంగా
వారి ఆధ్యాత్మికా సంసేవ ప్రకటనా గీతిక
సమర్పణం : శాంతా - వసంతా ట్రస్టు
రచన : శ్రీ రాంభట్ల నృసింహ శర్మ
గానం : శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : శ్రీ నాగరాజు తాళ్ళూరి
సాకి : శ్రీశారద జ్ఞానపుత్ర ధీసార విశాలనేత్ర
ఆథ్యాత్మిక జగన్మిత్ర అలుపెరుగని సుధాగాత్ర
అడుగుపెట్టు ప్రతితావున తాను ఋష్యశృంగుడే
మడుగుకట్టు దైవీవర వర్షధార పొంగులే !
పల్లవి : కనుమిదె ! పుంభావ సరస్వతీ కళాకలకంఠుని
కలియుగ వాల్మీకి, వ్యాస సుప్రభాస ‘చాగంటి’ని
నడతల, నుడువుల, నగవుల ఆ తైజస ధాటిని
తడియని వారేరీ!? ఆ పలకుల పన్నీటిని... ॥ కనుమిదె ॥
చరణం: కమండలం చేపట్టక, కాషాయం మెయిచుట్టక
సాధారణ, సామాజిక జీవన ఋషిసత్తమునిగ
పల్లెలు పట్నాలే తన నైమిశారణ్యాలని
కొల్లగ భక్తికి మలిపే పుణ్యమె నైపుణ్యమని... ॥ కనుమిదె ॥
చరణం: ప్రతిన పట్టినట్టుగ ప్రతి మాట మంత్రపాఠమే
కృతిని పాడు నట్లగు ఆకృతి గనక దాటమే
ఆర్షధర్మ సూత్రాంగిక చలిత లలిత పీఠమే
హర్షణీయ భారతీయ నిజధర్మోద్ఘాటనమే... ॥ కనుమిదె ॥
చరణం: రామశీల, ధర్మహేల, కృష్ణలీల కథామాల
అష్టాదశ పురాణాల శిష్టాచారాల వాల
యజ్ఞ, వ్రత, తీర్థక్షేత్ర మహిమల మహి చాటగా
ప్రజ్ఞామయ శ్రుతి స్మృతుల కచ్ఛపి తంత్రులు మీటగ... ॥ కనుమిదె ॥
చరణం: కోటి కోటి హితవుల ముక్కోటి దివ్యస్వరావళిని
గోటి కొనల కుప్పించగ, గుప్పించే వాఙ్మయఖని
కోటేశ్వర నాముని, నిష్కామ కర్మ గుణధాముని








No comments:
Post a Comment