Friday, May 31, 2019

*మహాభారతంలో రెండు చోట్ల సుబ్రహ్మణ్యుడి యొక్క వైభవం చెప్పబడుతోంది.*   By MVMRAO



ధర్మరాజాదులకు మార్కండేయ స్వామి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని ఆవిర్భావ ఘట్టం చెప్తారు. అరణ్యపర్వంలో వస్తుంది. మళ్ళీ శల్యపర్వంలో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం అని అద్భుతమైన ఒక ఘట్టం చెప్పబడుతున్నది. దాని సారాంశం ఏమిటంటే స్వామికి పట్టాభిషేకం చేసి సర్వదేవతలూ వారి వారి గణములన్నీ సుబ్రహ్మణ్యుని అధీనం చేస్తారుట. ప్రతి దేవతకీ కొన్ని గణములుంటాయి. ఇంద్ర గణములు, వాయు గణములు, వరుణ గణములు, అలాగే వసు గణములు, రుద్ర గణములు, ఆదిత్య గణములు. బ్రహ్మ దేవునికి సృష్టిలో సహకరించే గణములు, విష్ణువునకు స్థితిలో సహకరించే వైష్ణవ గణములు, అలాగే రుద్ర గణములు, శక్తి గణములు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యునికి అప్పగించబడతారు. వారందరినీ నడిపేవాడు సుబ్రహ్మణ్యుడు. అంటే సర్వదేవతా శక్తి సమూహ స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అందుకు సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ఉంటే సర్వదేవతల అనుగ్రహం ఉన్నట్లే. ప్రధానంగా ఈయన పేరు కుమారుడు అని వ్యవహారం. అంటే ఇది కుమారతత్త్వము. శివ, శక్తి ఈ రెండూ మూల తత్త్వములు గనుక తల్లిదండ్రులుగా చెప్పబడతాయి. ఆ రెండిటి సమాహారమై వచ్చినవాడు గనుక కుమారతత్త్వంగా చెప్తూన్నారు. కుమార తత్త్వం కూడా జ్ఞాన స్వరూపం. బ్రహ్మదేవుడికి సనత్కుమారుడు అని పుత్రుడు ఉన్నాడు. యితడు బ్రహ్మవేత్త. బ్రహ్మకు సనత్కుమారుడు ఎలాగో శివుడికి సుబ్రహ్మణ్యుడు. అందుకే సనత్కుమారుడే కుమారస్వామిగా శివుడికి పుత్రుడయ్యాడు అని ఉపనిషత్తుల ఆధారంగా ఒక కథ మనకి చెప్పబడుతున్నది. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. పైగా 'సుబ్రహ్మణ్య' అనే మాటయే ఆయన ప్రత్యేకించి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని మాట చెప్పబడుతున్నది. కనుక జ్ఞానపరంగా ఈయన గురువైతే యజ్ఞపరంగా సర్వదేవతలకీ బలాన్ని ఇచ్చేది యజ్ఞం. యజ్ఞం ద్వారానే దేవతలు బలం పొందుతారు. బలం పొందిన దేవతలు ప్రపంచాన్ని కాపాడతారు. అందుకు దేవతలు బలంపొంది మనల్ని కాపాడాలంటే దేవతలకి మనం బలం ఇవ్వాలి. అలా బలమివ్వగలిగే శక్తి యజ్ఞానికి ఉన్నది. యజ్ఞ స్వరూపమే సుబ్రహ్మణ్యము అని చెప్పబడుతున్నది. వేదమునందు యజ్ఞాగ్నిని ఉద్దేశించి 'సుబ్రహ్మణ్యోం' అని మంత్రం ప్రత్యేకించి చెప్పబడుతున్నది.
దేవా యుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్యాయం హ్యాయమ్!
యం సిద్ధయంతి స్కందం వందే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం!!
అని వేదపాదస్తవం చెప్తున్నటువంటి మాట. దేవతలు యుద్ధ సమయంలోనూ అలాగే ఋషులు యజ్ఞసమయంలోనూ ఎవరిని ఆరాధించడం చేత వారి వారి ప్రయోజనములను సిద్ధింపజేసుకుంటున్నారో అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కారము అని భావం ఇక్కడ.
కార్య సిద్ధి కలగాలన్నా, ప్రతికూలతలు తొలగాలన్నా, విద్య కావాలన్నా, శక్తి కావాలన్నా, వంశవృద్ధి కలగాలన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యారాధన చేయాలి. అందుకే యజ్ఞ, శక్తి, జ్ఞాన తత్త్వములే కాకుండా వంశ వృద్ధిని కలిగించే శక్తి సుబ్రహ్మణ్యుని స్వరూపము. ఇది ఒక ప్రత్యేక కోణం. ఎందుకంటే ఆయన కుమారుడు. శివశక్తులను తల్లిదండ్రులను చేసినటువంటి వాడు ఇతను. అందుకే ఈయన కారణంగా వాళ్లకి సంతాన తృప్తి లభించింది. అందుకు దివ్య బాలకుడైన సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరు చేస్తారో వాళ్లకి కూడా ఉత్తమ సంతానాన్ని పొందినటువంటి తృప్తిని కలిగిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు ఈయనని కుమారతత్త్వంగా ఆరాదించడంలో విశేషమిది.
🌹 *మైత్రేయ మహర్షి బోధనలు*🌹                          
  By MVMRAO
*🌴 ఆశించుట - శ్రమించుట 🌴*

*🌻ఆశించుటకు, శ్రమించుటకు భేదమున్నది. ఆశించుట ఎక్కువైనచో, శ్రమించుట తగ్గును. శ్రమించువాడు ప్రస్తుతమున జీవించును.*

*ఆశించువాడు ప్రస్తుతమును కోల్పోవుచునే యుండును. మరియు శ్రమించువాడు క్రమముగ ఆశయ సిద్ధిని పొందును. కేవల మాశించువాడు ఆశయములకు దూరమగుచుండును.*

 *శ్రమించక ఆశించుట వ్యర్ధము. ఆశించిన దానికి శ్రమించుట ఔచిత్యము.*
*శ్రమించుటలో ఆనందించుట ఉత్తమము.*

*అట్టివారే కాల గమనమున సమర్థవంతులుగ తీర్చిదిద్దబడుదురు.🌻*
🌹 🌹 🌹 🌹 🌹
*🙏 ప్రసాద్*
*☝తపో కామాక్షి 🙏* by MVMRAO

*ఈ ఫోటో లోని ముద్ర గమనించండి...ధ్యానం లో విశ్వప్రాణ శక్తి ని ఆకర్షించే ముద్ర , కాస్మిక్ ఎనర్జీ ముద్ర అంటారు..*

*ఈ ముద్ర పైన చాలా విశేషమైన వివరణ ఉంది, ధ్యానం లో రోగ నిరోధక శక్తి అభివృద్ధి అవుతుంది, బీజాలు కేంద్రం అయిన నాడులలో ప్రేరణ కలుగుతుంది.*

*ఈ ముద్ర ఆధారంగానే పెరమిడ్ వ్యవస్థ కనుగొన్నారు.*

*ఇలాగే గాయత్రి లోని 24 ముద్రల ఎంతో శక్తి వంతమైనది, ధ్యానం లోని అనేక ముద్రలు ఆధారంగానే ఎన్నో శాస్త్రాలు రచించారు.*

 *సూర్యనమస్కారం లోని 12 భంగిమలు కూడా ముద్రలు ఎంతో విలువైన శక్తి కేంద్రాలు ప్రేరణ కూడా కలిగించేవే..*
🌹 🌹 🌹 🌹 🌹
*🙏 ప్రసాద్*
*హిందూ పురాణాలు - వాయు తత్వం - వైజ్ఞానిక విశ్లేషణ :*

వాయువు గురించి వేదం, పౌరాణిక సాహిత్యం చెప్తున్న మొత్తం సారం ఒక చోటికి చేర్చి చూస్తే..... అవన్నీ వాయువును ఒక పదార్ధ తత్వంగానే చూసి దాని లక్షణాల్ని అలంకారిక పరిభాషలో వర్ణిస్తున్నట్టు అర్ధం అవుతుంది - వాయుదేవుడు అని సంబోధించినప్పటికీ అక్కడి వర్ణనలు మానుష దేహానికి సరిపోనందువల్ల, అక్కడ వేదం మానుష దేహాన్ని కాక ఒక శక్తి స్వరూపాన్ని వర్ణిస్తున్నట్టు తెలిసిపోతూ ఉంటుంది.

వాయ వాయాహి దర్శతే మే సోమా అరంకృతాః తేషాం పాహి శ్రుధీ హవం
(ఋగ్వేదం 1వ మండలం 2వ సూక్తం 1వ మంత్రం)

ఇక్కడ వేదం వాయువును దేవతలలో ప్రథమాగామి అని సంబోధిస్తున్నది.అంటే, ఈశ్వర విభూతులైన పాంచభౌతిక జన్యమైన దృశ్యమాన ప్రపంచంలో వాయువు అనే ప్రాకృతిక శక్తికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నది. నిరుక్తం కూడా వాయు అనే పదానికి "గతికర్మణః గత్యర్ధక వాతేః వాగతి" అని నిర్వచిస్తున్నది.

వాయు పురాణం వాయువు గురించి మరికొంత విస్తరించి చెబుతుంది."ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, నివహ, పరివహ, పరావహ అనే ఏడు స్కంధములందు వాయుదేవుడు సదా సంచరించుచండును. సప్త మరుద్గణములు ఆయన అధీనమున ఉండును." అని చెప్పటంలో వాయువు యొక్క మానుష దేహాన్ని కాక ఏడు రకాల వాయు చలనాలను సూచించటమే ముఖ్యం, కదా!


   మన దేశపు మెకాలేయులకు అర్ధం కావాలంటే ఇక్కడ చెప్పినవి వాయువు అనే పదార్ధ తత్వం విశ్వంలో చూపించే ప్రభావాల యొక్క combinations and permutations అని చెబితే చాలు.

"అగ్ని, జల, పృధ్వి అనే మూడు భూతములచే రచించబడిన ప్రాణుల శరీరమునకు ప్రాణము పోసి, ఆహారమును జీర్ణము చేయుటలో అగ్నికి సహకరించుచు ప్రాణులను ధరించుచున్నాడు" అని చెప్తున్న దాని ప్రకారం జీవులకీ నిర్జీవులకీ భేదాన్ని చాలా స్పష్టమైన రీతిలో గుర్తించవచ్చు.పరిమాణం పెరగడం తరగడం కొన్ని కారణాల వల్ల నిర్జీవులలోనూ సంభవమే, కానీ శ్వాస మాత్రం ఉండదు.వాయువు జీర్ణక్రియకు సహాయం చెయ్యడం అంటే ఆహారం కణస్థాయిలో ఆమ్లజనితో కలిసి మండడం - మోడర్న్ సైన్సు దీన్ని ఖండిస్తుందా?

ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టి చెబుతున్న ఎలెక్ట్రాన్ ఈ వాయువు యొక్క అన్ని లక్షణాల్నీ ప్రదర్శిస్తున్నది.గాలి వీచడం దగ్గిర్నుంచీ పిడుగులు పడటం వరకు ప్రకృతిలో కలిగే ప్రతి చలనం వెనక ఎలెక్ట్రాన్ ప్రమేయం ఉంటుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది.అన్నింటికన్న ముఖ్యం ఎలెక్ట్రాన్ ఏడు శక్తిస్థాయుల(orbitals)లోనే సంచరించడం వేదం యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది!మీరు చిన్నప్పుడు చదువుకున్న సైన్సును ఒకసారి గుర్తు చేసుకోండి:

1s2
2s2 2p6
3s2 3p6 3d10
4s2 4p6 4d10 4f14
5s2 5p6 5d10 5f14
6s2 6p6 6d10 6f14
7s2 7p6 7d10 7f14

పదార్ధవిజ్ఞానశాస్త్రం ఎప్పుడు చెప్పింది?వేదవిజ్ఞానశాస్త్రం ఎప్పుడు చెప్పింది?ఒక్క వాయువు గురించి ఇక్కడ చెప్పినది వేదంలో ప్రస్తావించబడిన ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది.వైదిక విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండింటిలోనూ సామాన్యుల సుఖజీవనానికి ఉపయోగపడే వస్తువులను తయారుచేసేది సాంకేతిక పరిజ్ఞానం - కానీ సూత్రాలు,విశ్లేషణ వంటివాటితో కూడిన శాస్త్రం  పునాదిగా ఉండి తీరాలి!వైదిక సాహిత్యం మొత్తం శాస్త్రం,దాన్ని as it is ఉపయోగించుకోలేకపోవటంలో వింత ఏముంది?

చలనానికి కారణమైన వాయువును ఎక్కడ చూసినా వాయుదేవుడు అని పిల్చారే తప్ప వాయుదేవత అని పిలవలేదు, ఎందుకని?సంపదకు కారణమైన లక్షిని దేవి అని పిల్చారే గానీ దేవుడు అని పిలవలేదు, ఎందుకని?మొదటిది dynamic energy రెండోది static energy కాబట్టి!లక్ష్మీ నారాయణుల్నే ఒక జంటను చెయ్యడం దేనికి? static lattice energy, dynamic combussion enerrgy విశ్వం యొక్క స్థిరత్వం అనే అంశానికి చెందిన రెండు పార్శ్వాలు కాబట్టి!బ్రహ్మ-సరస్వతి, శివుడు-పార్వతి, ఇంద్రుడు - శచి వంటి జంటల వెనక ఉన్నది కూడా అదే - ఇది తెలియని వాళ్ళు వాళ్ళకి మానుష దేహాలకి సంబంధించిన శృంగార వ్యభిచారాదులని అంటగడుతున్నారు. కధా రూపంలో ఉండే పౌరాణిక సాహిత్యం కొన్ని పాత్రల్ని ఇవే పేర్లతో సృష్టించటానికి ఉన్న కారణాల్ని తెలుసుకోవాలి తప్ప ఆ పాత్రలనే ఈ దేవతలని భావించి అవేశపడ రాదు - అందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు!By MVMRAO 
🌸🌸 *ఉత్తములుండే ప్రదేశం*🌸🌸

ఉత్తములు ఎక్కడుంటే  అక్కడ  ఉల్లాస భరిత  వాతావరణము  ఉంటుంది.   సాధుస్వభావులు    ఉన్న   చోట శాంతం మూర్తీభవిస్తుంది.
ఆ  పరిసరాలూ  ప్రశాంతంగా
వుంటాయి.  దుష్టులకు  దూరంగా  వుండమనడంలో
అంతరార్ధం అదే. పూవుల
పరిమళం  పూల చుట్టూనే
వున్నట్లుగాను. మనిషి  తత్వం   అతన్ని చుట్టి వుంటుంది.  అ తనితో  బాటే సాగుతుంది.  మహానుభావుల
పాద ధూళి విలువ ఎప్పుడూ
పవిత్రమైనది.  బుద్ధుడు యే
ఋతువు లో  ఎక్కడికి  వెళ్లినా
అతని పరిసరాలు ప్రకాశించేవి.
 " శిశిరములో కూడా ఆకులు
రాలిన చెట్లు మోడు లయినా
 బుద్ధుని పాదము అక్కడ
పెట్టిన. చెట్లన్నీ చిగురించి
పూలు పూచి కళ కళ లాడే
వట. అట్లాగే ధర్మరాజు శాంత  మూర్తి. ధర్మానికి కట్టు
బడినవాడు. నెమ్మదితనం
ఉన్నవాడు.  ఆయన  ఉన్న
పరిసరం శాంతితో నిండి
పోయేది.   భారత యుద్ధము
అనంతరం  స్వర్గారోహణము
చేస్తూ ధర్మరాజు వెళుతున్నప్పుడు మార్గ  మధ్యం లో నరకం పక్కగుండా  ఆయన నడుస్తున్నా డు.  నరకం చాలా దారుణంగా  వుంది. చూడడానికి  భయోత్పాతంగా  వుంది.
మనుష్యుల్ని  చిత్ర  హింసలు
పెట్టడం, నూనెలోకాల్చడం,
మంటల్లో వేయడం  వంటివి
అనేక దారుణాలతో నిండి
వుంది. అవన్నీ పాపులు
చేసిన కర్మలకు  పాప ప్రతి
ఫలాలు. దాంతో నరకంలో
భరించలేని వేడి. ధర్మరాజు
 నరకము ప్రక్కనుండి వెళుతూ   ఉంటే ఆయన శరీరంలో  నుంచి ఆ చలువదనం. ప్రసరించి నరకము
అంతా, పిల్లగాలి  వ్యాపించి
వాతావరణంలో ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు.  ఎందుకిలా
జరిగిందని చూస్తే  ప్రక్కగా
ధర్మరాజు వెళుతున్నాడు.
దాంతో నరక వాసులందరూ
పరుగెత్తుకుంటూ వచ్చారు.
స్వామీ! మీరు అడుగుపెడితేనే  మేము ఇంత ఆహ్లాదం
పొందాము.చల్లనివాతావర
ణముతో ఈ పరిసరం  నిండిపోయింది. దయచేసి
మీరు కొంతకాలం ఇక్కడ
ఉంటే మేము ఎంతో
ప్రశాంతతని అనుభవిస్తాము
స్వామీ!  అనుక్షణం. చిత్రహింసలను  అనుభవించే
వాళ్ళము .  మీరు మమ్మల్ని
కరుణించి ఇక్కడ ఉంటే  మా
పాపాల కు విముక్తి కూడా
కలుగుతుంది. అని వేడుకొన్నారు. ధర్మరాజు చిరు
నవ్వుతో వారి ప్రార్థన  మన్నించి అక్కడ కొంత
కాలం ఉండుటకు అంగీకరించాడు. కానీ  ఆయన అలా అక్కడ  ఉంటే  పరిస్థితులు తల్లక్రిందులవుతాయి  కదా!
ఇంక స్వర్గానికి ,నరకానికి
తేడా వుండదు.  పాపులకు
శిక్ష  ఉండదు. ధర్మరాజు  వల్ల
ధర్మమే తల కిందులయ్యే
ప్రమాదం ఏర్పడింది.యెంత
కాలానికి ఆయన రాకపోయే
సరికి దేవదూతలు అక్కడ కి
వచ్చారు. ధర్మరాజా ! మీరు
ఇక  బయల్దేరండి , మనం
స్వర్గానికి వెళదాం అన్నారు.
అప్పుడు ధర్మ రాజు నేను ఇక
స్వర్గంలో అడుగు పెట్టలేను
నేను చేసిన పుణ్యమంతా
 ఈ నరకవాసులకి ఇచ్చాను.
నేను ఇక్కడే  ఉండిపోతాను.
అన్నాడు .  దేవదూతలు
ధర్మరాజా!  మీరు  కడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు.
మీరే  పుణ్యం  ఇచ్చినా  అది
తరిగేది  కాదు.  ఇచ్చే కొద్దీ
పెరిగేది  అది కొంతకాలం
మీ  దయ  వల్ల  ఈ  నరక
వాసులు. ప్రశాంతత పొందారు
ఇక చాలు.  దయచేసి మీరు
 బయల్దేరండి అన్నారు.
ధర్మరాజు సెలవు తీసుకుని
స్వర్గయాత్రకు  వెళ్ళాడు.
సృష్టికి విరుద్ధంగా ఏ పని
చెయ్యకూడదు. కానీ కొంత
తను చెయ్య గలిగినది  చేసాను  అని  తృప్తి పడ్డాడు
ధర్మరాజు. ఋష్య శృంగుని
పాదమహిమ  అటువంటిదే.
ఆయన  పాదము మోపిన
చోట  కరువు కాటకములు
ఉండవు. వానలు కురిసి
సుభిక్షంగా ఉంటుంది.
మహానుభావు లందరికి నమో
వాకములతో.....
 By MVMRAO
🙏🙏🙏👏👏👏
🌸 *శ్రీమద్భాగవతము* 🌸by MVMRAO
🌻 మగవాని దేహమును ధరించిన జీవుడు నిరంతరముగా స్ర్తీ సాంగత్యమును అనుభవించినచో స్ర్తీయై పుట్టును. స్ర్తీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకు డబ్బు సంపాదించును‌ కుటుంబ వస్తువులు సమకూర్చుకొనును. స్ర్తీ వలన సంతతి కలుగును. వీరందరు ఉండుటకు గృహము ఆవశ్యకము. ఇన్నిటికిని కారణము కాంతయే.

 స్ర్తీ దేహము ధరించిన జీవుడు మరల నా మాయచే పురుషుడుగా పుట్టి ధన‌ సంపాదనాదులను చేయును. స్ర్తీ కూడ భర్త కొరకే అన్నిటిని సమకూర్చుకొనవలెను‌. కనుక పురుష రూపధారియైనవాడు భర్త అనబడి స్ర్తీకి సంసారబంధ కారణమగును. సంసార బంధమే మృత్యువు.

లింగదేహము జీవునకు ఆధారముగా నిలిచి యున్నది. (లింగదేహమనగా తన నామము, రూపము, బంధుత్వము, ఆస్తి మొదలగు వాని స్మరణరూపమైన దేహము Identities Consciousness. ఇచ్చట లింగమనగా చిహ్నమని అర్థము. తనను గూర్చి తానెరిగిన స్మృతులన్నియు ఒక ముడివలె ఏర్పడినదే లింగదేహము)

దాని వలన పాంచభౌతిక శరీరమున ఉండి ప్రజ్ఞ అనేక లోకములలో విహరించును. కూడబెట్టుకొనిన కర్మఫలము ‌అనుభవించుచుండును. ఈ అనుభవముల వలన మరల కర్మల యందు ఆసక్తి పుట్టుచుండును. జీవునకు మనస్సు, ఇంద్రియములు, పంచభూతములతో నిండిన దేహము సుఖములను అనుభవించుటకు సాధనమైనను ఆ సుఖాసక్తి వలననే మృత్యువును కలిగించును.

ఏ దేహము సుఖములను ఇచ్చునో ఆ సుఖముల వలన ఆ దేహమే శుష్కించుటయు నశించుటయు జరుగును. అడవిలో వేటకాడు జంతువులకు సదుపాయములైన ఆకర్షణలను సమకూర్చి ఆ‌ జంతువులను చంపుచున్నాడు కదా! ఇట్టి దేహము తొలగుటయే మరణము. పుట్టుటయే జననము. (అంతకన్న జీవికి జనన మరణములు లేవు.)

కన్ను యొక్క పరిమితిని బట్టియే చూడగగలుగుట యుండును. (కొందరిలో చూచినదానిని చూచినంత వరకే గ్రహింపగలరు. మరికొందరు చూచి అనేక విషయములను గ్రహింపగలరు.) చూడగలిగిన యోగ్యతను అనుసరించి జీవునకు మరణము లేదని తెలియును.

(దేహము వరకే చూడగలిగినచో జననమరణములు ఉన్నవని తెలియును‌. దేహము యొక్క వృత్తాంతమును దర్శింపగలిగినచో జనన మరణములు లేవని తెలియును.) కనుక భయము, లోభము, దీనత అనావశ్యకములు. కంగారు‌పడనక్కర లేదు. జీవుని వృత్తాంతమును సమగ్రముగా తెలిసి, జీవుడు ధీరుడై సంగమును విడుచును. యోగాభ్యాసముతో వైరాగ్యము ఆర్జించి, సక్రమమైన సంపూర్ణజ్ఞానమును పొంది వర్తింపవలెను.

మాయచే ఏర్పడిన లోకమున పుట్టి పోవుచుండు దేహాదుల యందు ఆసక్తి మాని జీవింపవలెను.............


🌻 నిర్మలమైన అనంతుడు అనబడు ఆది శేషుని శయ్యపై యోగ నిద్రలో హరి ఉన్న వేళ సర్వలోకములును వాని యందు లయమై ఉండును. అట్టి సర్వేశ్వరుని గూర్చియే మహానుభావులు ధ్యానింతురు.

(పై చెప్పిన ధూమ మార్గము వారు గాక మోక్ష మార్గము వారి ధ్యానము ఇచ్చట చెప్పబడినది. వారి మనస్సు భౌతిక జీవితము యొక్క సుఖదుఃఖముల సర్దుబాట్లను గూర్చి ఆలోచింపక వాని యందు అంతర్యామిగా వెలుగుచున్న నారాయణుని ధ్యానించును. దానికి ధూమలక్షణము ఉండదు.

పొగలో కూడ అంతర్యామిని ధ్యానించునపుడు పొగ అనునది వేరొక స్థితి కాదు. అట్లే దేహేంద్రియాదుల యందు అంతర్యామిని ధ్యానించినచో దేహేంద్రియాదుల మాలిన్యము ఉండదు. నిర్మల స్థితి ఉండును. ఆద్యంతములు ఉండవు. అదియే అనంతుడు లేక శేషుడు. దేహము శయ్యగా అంతర్యామి శయనించి యుండును. తన యందు తాను మేల్కొని యుండును కనుక ఇంద్రియములకు, మనస్సునకు నిద్ర వంటి స్థితి ఉండును. ఇదియే యోగ నిద్ర.

మనస్సుపై ఆధారపడి జీవించువానికి పూర్తి నిద్ర వచ్చును; దానినే సుషుప్తి అందురు. తన యందు మేలుకొని యున్నవానికి యోగ నిద్ర ఉండును. అట్టి స్థితిలో ఇంద్రియములు, మనస్సు, దేహప్రవృత్తులు తనలో భాగమై వేరుగా అస్తిత్వము లేకుండును కనుక వానికి అది లయస్థితి లేక ప్రళయస్థితి అందురు. ఈ సాధన చేయువారి ఆనందము‌ లింగశరీరముపై ఆధారపడదు కనుక దేహజననము, దేహత్యాగము అనువానిపై ఆధారపడదు. అనగా వారికి జన్మలుండవు.)

సమస్త సంగములను పరిత్యజించి, ముక్తి పొందువారు తమ భక్తిసాధనలో సమస్త ధర్మములను విష్ణువునందు సమర్పణము చేయుదురు. శాంత మనస్సుతో ఉందురు. విష్ణుమూర్తి కన్నా ఇతరము నందు మనస్సు వారికి ప్రసరింపదు. సందులేని విష్ణుధ్యానమే వారి యందు నిలిచియుండును.

(దైత్యులు ఇంద్రియ మనః ప్రవృత్తులలో దుష్ట సంకల్పముగా పుట్టుచున్నారు. వారికి స్థానము ఉండదు కనుక విష్ణుని ధ్యానించుట దైత్యులను సంహరించు వాని ధ్యానమే అగును.)......


🌻  వారికి అహంకార మమకారములు లేవు. అయినను వారి కుతూహలము ‌నారాయణునిపై వర్తించును. వారి దేవుడు‌ అర్చనాది మార్గమున గోచరించువాడు. లోకమందలి మహనీయ చరిత్రములన్నియు వానివే.

అందరి ముఖములు వాని ముఖములే. కీర్తిమంతుల కీర్తి అతడే. సృష్టి స్థితి లయములు అతని యందే తోచుచున్నవి. అతడున్నాడు కాని పుట్టడు. అతడు ప్రకృతి యందును పురుషుని యందును ఉన్నాడు. వానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. ఈ అతీతుడే పురుషోత్తముడనబడును. ఇట్టి లక్షణములతో నారాయణుని అర్చించి, ఇక తిరిగి రాని మార్గమున దివ్యతేజస్సుతో వెలుగొందు చుందురు. వారికి జన్మములు‌ లేవు. వారే నిత్యసూరులు.

కొందరు దేవుడను‌ పేరుతో‌ హిరణ్యగర్భుని కొలుచుచున్నారు. (దేవుని యీ సృష్టి యందు అంతర్యామిగా మాత్రమే కొలుచుచు దీనికి అతీతుడగు పురుషోత్తముని ఆశ్రయింపనివారు.) వారు సత్యలోకమున ఉండి చతుర్ముఖుని పరమాత్మగా ధ్యానించుచున్నారు. వారు చతుర్ముఖుడు బ్రతికియున్నంత వరకు వాని యందు సత్యలోకమున ఉందురు. రెండు‌ పరార్థములు పూర్తియైన వెంటనే బ్రహ్మకు‌ ప్రళయము వచ్చును. అంతవరకు వారు బ్రహ్మయందుందురు. ఇంతలో బ్రహ్మ లయమగుటతో పంచభూతములు, మనస్సు, ఇంద్రియములు, తన్మాత్రలు, వాని లోకములు కూడ సర్వేశ్వరుని యందు లీనమగును.

అపుడు వారు బ్రహ్మలోకము పైన అభిమానము వదలి బ్రహ్మతో కూడి, పురాణపురుషునిలో ప్రవేశించి లీనమగుచున్నారు.

(సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రము పూజింపగలవారు సృష్టియు, సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై యుందురు. అటుపైన సృష్టితో పాటు నారాయణుని యందు లీనమగుదురు.).......


🌻 (సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రము పూజింపగలవారు సృష్టియు, సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై యుందురు. అటుపైన సృష్టితో పాటు నారాయణుని యందు లీనమగుదురు.

దీనికొక ఉదాహరణము. మన భూమిపైన ఒక మహానుభావుని దేహమున ఎములలో ఉన్న సున్నము కూడ మహానుభావునితో పాటు గౌరవింపబడును. అతడు దేహమును వదిలిన వెనుక అది భూమిలోని ఖనిజముల యందలి సున్నముతో కలియును. ఖనిజములలోని సున్నము అట్లుగాక ఎందరోమహానుభావుల ఎముకలుగా ఐనను సేవ చేయగలదు.

భూమిలోని సున్నము వంటి వారు పరబ్రహ్మమును ఆరాదించువారు. మహానుభావుని ఎముకలలోని సున్నము‌ వంటి వారు హిరణ్యగర్భుని ఆరాధించువారు. ఈ భేదము తెలియుటకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగము ప్రసాదింపబడినది.)

 కనుక నీవు సర్వజీవుల హృదయ పద్మముల యందున్న పరబ్రహ్మమునే సర్వభావములతో శరణాగతి చేయుము. అతని అనుభవము ఎల్ల యెడల వినబడుచుండును.

 (వాక్కును ఉచ్చరించి విన్నచో అతడు వాక్స్వరూపుడై వినబడును. అందరి కంఠధ్వనులలో శబ్ద బ్రహ్మ స్వరూపుడై తనను ఉచ్చరించుచున్న మూర్తిగా దర్శనమిచ్చును.) అతనిని గూర్చి ఒక లోపము చెప్పుటకు వీలులేదు. కంటికి ఏ సాధనములు అక్కరలేకయే సూటిగా పొరలుదాటి అతడు సర్వ జీవులుగా దర్శనమిచ్చుచుండును. అతనికి సుఖదుఃఖములుగాని, జనన మరణములు గాని, వ్యక్తావ్యక్త స్థితులు గాని లేవు. అతనిని పురుషుడని భావించి శరణాగతి పొందుము.

(దేవహూతికి పురుషుడు తన భర్త. కనుక కర్దమ ప్రజాపతిని ధ్యానించి నారాయణుని మోక్షస్థితి పొందుమని అభిప్రాయము. కపిలాచార్యుడు గురువై సర్వమును ఉపదేశించినను, జీవునకు నారాయణునకు గల సంబంధము భార్యా భర్తల సంబంధము వంటిది. కనుక దేవహూతి కర్దమ ప్రజాపతినే ధ్యానించి మోక్షము పొందవలెను. కపిలాచార్యుని తనకు ఇచ్చినది కూడా కర్దముడే కదా!

దైవమును అందించువాడే గురువు.).......  b
మనీషా పంచకం

ఒకరోజు శంకరులు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

ఆది శంకరాచార్యులు రచించిన మనీషాపంచకం.

సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తిదాయకం,

కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం.....1

అంత్యవేషధరం దృష్ట్యా గచ్ఛ గచ్ఛేతి చాబ్రవీత్,

శంకరస్సో పి చాండాలస్తం పునః ప్రాహ శంకరం.....2

అన్నమయాదన్నమయం హ్యథవా చైతన్యమేవ చైతన్యాత్,
 By MVMRAO WE
ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్చేతి.....3

కిం గంగాంబుని బింబితే ంబరమణౌ చండాలవాటీపయః

పూరే చాంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాంబరే,

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధఅంబుథౌ

విప్రో యం శ్వపచో యమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః.....4

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్ఞృంభతే

యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,

సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే

చ్చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ.....5

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం

సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం,

ఇత్థం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే

చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ.....6

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో

ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా,

భూతం బావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే

ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ.....7

యా తిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే

యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనాః

తాం భాస్యైః పిహితార్క మండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్

యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ.....8

యత్సౌఖ్యాంబుధిలేళలేశత ఇమే శక్రాదయో నిర్వృతా

యచ్ఛిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః

యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మావి
By MVO

ద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ.....9
*సత్సాంగత్యంతోనే జీవన్ముక్తి*
🕉🌞🌎🌙🌟🚩
 By MVMRAO
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి

‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది. సత్పురుషుల సాంగత్యం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది.


 మోహం తొలగిపోతే మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది (నిశ్చలతత్వం). అలా మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తి అని ఈ శ్లోకం అర్థం.


 మానవుడు ఈ ప్రపంచంలో జీవించినంతకాలం సుఖాలను, భోగాలను, ఆనందాన్ని కోరుకుంటారు. లోకంలో కనిపించే వస్తువుల ద్వారానే ఆనందాన్ని, సుఖాన్ని పొందగలననుకుంటాడు. ఇలా వస్తువుల ద్వారా విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతామనుకోవడమే మోహం.. భ్రమ. ఎందుకంటే ఈ లోకంలో ఏ వస్తువూ ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనందాన్నే ఇస్తుందనే నమ్మకం లేదు. ఏదైనా కొంతకాలం సుఖాన్ని ఇస్తే ఇవ్వవచ్చు. కానీ, అదే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వస్తువు ద్వారా వచ్చే సుఖం.. ఆ వస్తువు పోయినా, చెడిపోయినా పోతుంది. అప్పుడు దుఃఖం కలుగుతుంది.


 కనుక ఏ వస్తువు ద్వారానైనా అనిత్యమైన ఆనందమే తప్ప నిత్యమైన ఆనందం రాదు. ఇది తెలిసీ వస్తువుల ద్వారా కోరుకున్న ఆనందాన్ని పొందగలమనుకోవడమే భ్రమ. మనిషిని భ్రమలోనూ మోహంలోనూ ముంచెత్తివేసే విషయవస్తువుల మాయాజాలం నుంచి, ఆకర్షణల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే గొప్ప ఉపాయం ఏదో కావాలి. అట్టి ఉపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఇచ్చారు. ఎలా మనం ఉన్నతమైన జీవన్ముక్త స్థితిని పొదుతామో తెలియజేశారు. ఆ ఉపాయమే సత్సంగత్వం. అంటే.. సత్పురుషులతో సంగభావం. సత్పురుషులంటే సత్‌ పదార్థాన్ని అన్వేషించే సాధకులు, భగవత్‌ భక్తులు, సత్కార్యాలు ఆచరించేవారు.


ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు, సాధుపురుషులు, జ్ఞానులు. వారితో మాట్లాడటం, వారి మాటలను వినడం, వారి ద్వారా సందేహాలను తీర్చుకోవడం, వారిని అనుసరించడం.. ఇదే సత్సంగత్వం అంటే. ఒకవేళ అలాంటివారు లభించకపోతే సద్గ్రంథాలతో స్నేహం చేయాలి. అందులోని విషయాలను గ్రహించి ఆచరణలో పెట్టాలి. తద్వారా.. అనిత్య వస్తువులు మనకు నిత్యమైన ఆనందాన్ని ఇవ్వలేవని, నిత్యమైన ఆనందం పరమాత్మ వల్లనే లభిస్తుందని తెలుస్తుంది. మనలో మానసిక ప్రశాంతత కలిగి మనసులో విషయవస్తువుల పట్ల నిస్సంగ భావం వస్తుంది. ఆ భావం వాటి ఆకర్షణ నుంచి మాయాజాలం నుంచి రక్షిస్తుంది.


           శుభం భూయాత్
సదా
భగవత్భావనా వ్యాప్తిలో....

🕉🌞🌎🌙🌟🚩
*ధనం, జనం, యవ్వనం(అన్నీ అశాశ్వతమే)*
   ByMVMRap

ఆత్మజ్ఞానం కావాలంటే అందుకు అనువైనది మానవ జన్మయే. అలాంటి మానవ జన్మ లభించి కూడా ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలు, భోగాలే ప్రధానం అనుకొని జీవితం గడిపినవారి గతి ఏమవుతుందో శంకరాచార్యులవారు ఇలా వివరించారు.


మాకురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్‌ కాలః సర్వం
మయామయమిదమఖిలం బుద్ధ్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా


‘‘ధనమున్నదని, అనుచర గణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో.


 ఆత్మానుభూతిని చెందు’’ అని దీని అర్థం. ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. కొందరికి ధన గర్వం, కొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం, కొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం.


 కానీ ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లు, ఆస్తులు నేలమట్టమయిపోతాయి. ‘నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది’ అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఆ క్షణంలో ధనం, జనం ఏవీ రక్షించవు. అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.


వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చికూర్చుంటుంది. కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి.


 అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు. వాటిని అనుభవించడంలో తప్పు లేదు. కానీ, వాటితో సంగభావం (అటాచ్‌మెంట్‌) పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే.. అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు. జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు. శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి. ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే చలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి. పరమాత్మలో ఐక్యం కావాలి.

🕉🌞🌎🌙🌟🚩
వృద్ధ కాశీ..
కడలూర్ జిల్లా...చెన్నై.

ఈ ‘వృద్ధ’కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే
తన ఒడిలోకి తీసుకొని...💐

ఈ క్షేత్రంలో వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని
చీర కొంగుతో విసురుతుండగా..
వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు.

అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇది కాశీ కన్నా పురాతన క్షేత్రమని నమ్ముతారు.
ప్రళయ కాలంలో కూడా విరదాచలం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం.
అందుకే దీనిని వృద్ధకాశీ అని కూడా అంటారు.

అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే
కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు.

చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

అనంద తాండవం..💐
చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు.
అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.

శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు.
అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు.
అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.

స్వామివారిని సేవిస్తే..💐
పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు.
దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.

దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు.
అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.

దీనికి విభాసిత మహర్షి స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు.
దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.

ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.

ఆకులు నాణ్యాలుగా..💐
ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి.
అప్పటి నుంచే చేసిన వారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.

ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరార్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు.
దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.

తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.
ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు.
దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.

ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.

అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.

ఇక్కడ కూడా భూగర్భం నుంచి కిందికి.💐
ఇక్కడ వినాయకుడు భూగర్భంలో నుంచి కొంత కిందికి ఉంటాడు.
అందువల్ల 18 మెట్లు దిగి ఇక్కడి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ అమ్మవారిని వృద్ధాంబిక అనే పేరుతో పిలుస్తారు.

ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా..💐
ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా అంటారు.
ఇక్కడ వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని
చీర కొంగుతో విసురుతుండగా,
వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు.
అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ.💐
అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే
ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.
దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

ఈ ఆలయం..
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ..
సాయంత్రం తిరిగి 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ తెరిచి ఉంచుతారు.
స్వస్తి..!!💐By I. Umashankar 
By MALLIKHARJUN వస్త్రము కంటే  శరీరవర్చస్సు,శరీరవర్చస్సు కంటే మాట్లాడే తీరు,మాట్లాడే తీరు  కంటే విద్య, విద్య కంటే  వినయం
క్రమంగా  గొప్పవి. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి  ఉన్నా  గౌరవం  వస్తుంది. ఈ ఐదూ  ఉన్న  మానవుడు మహాత్ముడే.
By VEERAMALLAYYA ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ధర్మకార్యాలను వాయిదా వెయ్యకుండా, తొందరగా చేయాలి. పనుల ఒత్తిడి పెరిగి, ప్రాధాన్యాలు వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అందరికీ హితవు చెపుతున్నది ఈ శ్లోకం.

శ్లో. శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నానమాచరేత్l
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్ll

...ఆర్యధర్మ.

వంద పనులు మాని సమయానికి భోజనం చేయాలి. వేయి పనులున్నా(పొద్దున్నే) స్నానం చేయాలి. లక్ష ఖర్చులున్నప్పటికీ దానధర్మాలకు ధనం కేటాయించాలి. కోటి పనులున్నా దేవుడికి దండం పెట్టేందుకు సమయాన్ని కేటాయించాలి.

*** *** ***

ఏ వృత్తి వారైనా, తలమునకలయ్యే పని ఉంటే అశ్రద్ధ చేసేది భోజనాన్నే. సమయం లేదని ఆకలి చంపుకోవద్దు. ఆకలి కడుపుతో చేస్తున్న పనిపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గుతుంది. సమయానికి అన్నం తినకుంటే అనారోగ్య హేతువు కాగలదు. అందువల్ల వందపనులున్నా, సమయానికి అన్నం తినాలి. తినటానికి నోచుకోని సంపద ఎందుకు? వేయి పనులున్నా శారీరక శుచిత్వం కొరకు స్నానమాచరించాలి. ఈ విధమైన శుచిత్వం చేస్తున్న పనిపై ఏకాగ్రతను పెంచగలదు. ఈ జన్మలో మనం కడుపునిండా తింటున్నామంటే పూర్వజన్మ సుకృతమే కదా! చేసిన పుణ్యకర్మలే కదా. అందువల్లే లక్ష ఖర్చులున్నా దానానికి కొంత సమయాన్ని, ధనాన్ని పక్కన పెట్టాలి. దైవానికి కృతజ్ఞత తెలపటం మన నిత్యకృత్యం కావాలి.కోటిపనులున్నా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయకూడదు. దైవస్మరణ మన రోజువారీ కార్యక్రమాల్లో ఒక భాగమై పోవాలి.

Wednesday, May 29, 2019

ఇది పొన్నూరు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా అభిషేకాలు! స్వామి వారి విగ్రహాన్ని సాధారణ మనిషి ఎత్తుతో పోల్చి చూడండి!🙏🏼

Tuesday, May 28, 2019

🌸🌸 *ఉత్తములుండే ప్రదేశం*🌸🌸

ఉత్తములు ఎక్కడుంటే  అక్కడ  ఉల్లాస భరిత  వాతావరణము  ఉంటుంది.   సాధుస్వభావులు    ఉన్న   చోట శాంతం మూర్తీభవిస్తుంది.
ఆ  పరిసరాలూ  ప్రశాంతంగా
వుంటాయి.  దుష్టులకు  దూరంగా  వుండమనడంలో
అంతరార్ధం అదే. పూవుల
పరిమళం  పూల చుట్టూనే
వున్నట్లుగాను. మనిషి  తత్వం   అతన్ని చుట్టి వుంటుంది.  అ తనితో  బాటే సాగుతుంది.  మహానుభావుల
పాద ధూళి విలువ ఎప్పుడూ
పవిత్రమైనది.  బుద్ధుడు యే
ఋతువు లో  ఎక్కడికి  వెళ్లినా
అతని పరిసరాలు ప్రకాశించేవి.
 " శిశిరములో కూడా ఆకులు
రాలిన చెట్లు మోడు లయినా
 బుద్ధుని పాదము అక్కడ
పెట్టిన. చెట్లన్నీ చిగురించి
పూలు పూచి కళ కళ లాడే
వట. అట్లాగే ధర్మరాజు శాంత  మూర్తి. ధర్మానికి కట్టు
బడినవాడు. నెమ్మదితనం
ఉన్నవాడు.  ఆయన  ఉన్న
పరిసరం శాంతితో నిండి
పోయేది.   భారత యుద్ధము
అనంతరం  స్వర్గారోహణము
చేస్తూ ధర్మరాజు వెళుతున్నప్పుడు మార్గ  మధ్యం లో నరకం పక్కగుండా  ఆయన నడుస్తున్నా డు.  నరకం చాలా దారుణంగా  వుంది. చూడడానికి  భయోత్పాతంగా  వుంది.
మనుష్యుల్ని  చిత్ర  హింసలు
పెట్టడం, నూనెలోకాల్చడం,
మంటల్లో వేయడం  వంటివి
అనేక దారుణాలతో నిండి
వుంది. అవన్నీ పాపులు
చేసిన కర్మలకు  పాప ప్రతి
ఫలాలు. దాంతో నరకంలో
భరించలేని వేడి. ధర్మరాజు
 నరకము ప్రక్కనుండి వెళుతూ   ఉంటే ఆయన శరీరంలో  నుంచి ఆ చలువదనం. ప్రసరించి నరకము
అంతా, పిల్లగాలి  వ్యాపించి
వాతావరణంలో ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు.  ఎందుకిలా
జరిగిందని చూస్తే  ప్రక్కగా
ధర్మరాజు వెళుతున్నాడు.
దాంతో నరక వాసులందరూ
పరుగెత్తుకుంటూ వచ్చారు.
స్వామీ! మీరు అడుగుపెడితేనే  మేము ఇంత ఆహ్లాదం
పొందాము.చల్లనివాతావర
ణముతో ఈ పరిసరం  నిండిపోయింది. దయచేసి
మీరు కొంతకాలం ఇక్కడ
ఉంటే మేము ఎంతో
ప్రశాంతతని అనుభవిస్తాము
స్వామీ!  అనుక్షణం. చిత్రహింసలను  అనుభవించే
వాళ్ళము .  మీరు మమ్మల్ని
కరుణించి ఇక్కడ ఉంటే  మా
పాపాల కు విముక్తి కూడా
కలుగుతుంది. అని వేడుకొన్నారు. ధర్మరాజు చిరు
నవ్వుతో వారి ప్రార్థన  మన్నించి అక్కడ కొంత
కాలం ఉండుటకు అంగీకరించాడు. కానీ  ఆయన అలా అక్కడ  ఉంటే  పరిస్థితులు తల్లక్రిందులవుతాయి  కదా!
ఇంక స్వర్గానికి ,నరకానికి
తేడా వుండదు.  పాపులకు
శిక్ష  ఉండదు. ధర్మరాజు  వల్ల
ధర్మమే తల కిందులయ్యే
ప్రమాదం ఏర్పడింది.యెంత
కాలానికి ఆయన రాకపోయే
సరికి దేవదూతలు అక్కడ కి
వచ్చారు. ధర్మరాజా ! మీరు
ఇక  బయల్దేరండి , మనం
స్వర్గానికి వెళదాం అన్నారు.
అప్పుడు ధర్మ రాజు నేను ఇక
స్వర్గంలో అడుగు పెట్టలేను
నేను చేసిన పుణ్యమంతా
 ఈ నరకవాసులకి ఇచ్చాను.
నేను ఇక్కడే  ఉండిపోతాను.
అన్నాడు .  దేవదూతలు
ధర్మరాజా!  మీరు  కడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు.
మీరే  పుణ్యం  ఇచ్చినా  అది
తరిగేది  కాదు.  ఇచ్చే కొద్దీ
పెరిగేది  అది కొంతకాలం
మీ  దయ  వల్ల  ఈ  నరక
వాసులు. ప్రశాంతత పొందారు
ఇక చాలు.  దయచేసి మీరు
 బయల్దేరండి అన్నారు.
ధర్మరాజు సెలవు తీసుకుని
స్వర్గయాత్రకు  వెళ్ళాడు.
సృష్టికి విరుద్ధంగా ఏ పని
చెయ్యకూడదు. కానీ కొంత
తను చెయ్య గలిగినది  చేసాను  అని  తృప్తి పడ్డాడు
ధర్మరాజు. ఋష్య శృంగుని
పాదమహిమ  అటువంటిదే.
ఆయన  పాదము మోపిన
చోట  కరువు కాటకములు
ఉండవు. వానలు కురిసి
సుభిక్షంగా ఉంటుంది.
మహానుభావు లందరికి నమో
వాకములతో.....
 By MVMRAO
🙏🙏🙏👏👏👏
🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 మగవాని దేహమును ధరించిన జీవుడు నిరంతరముగా స్ర్తీ సాంగత్యమును అనుభవించినచో స్ర్తీయై పుట్టును. స్ర్తీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకు డబ్బు సంపాదించును‌ కుటుంబ వస్తువులు సమకూర్చుకొనును. స్ర్తీ వలన సంతతి కలుగును. వీరందరు ఉండుటకు గృహము ఆవశ్యకము. ఇన్నిటికిని కారణము కాంతయే.

 స్ర్తీ దేహము ధరించిన జీవుడు మరల నా మాయచే పురుషుడుగా పుట్టి ధన‌ సంపాదనాదులను చేయును. స్ర్తీ కూడ భర్త కొరకే అన్నిటిని సమకూర్చుకొనవలెను‌. కనుక పురుష రూపధారియైనవాడు భర్త అనబడి స్ర్తీకి సంసారబంధ కారణమగును. సంసార బంధమే మృత్యువు.

లింగదేహము జీవునకు ఆధారముగా నిలిచి యున్నది. (లింగదేహమనగా తన నామము, రూపము, బంధుత్వము, ఆస్తి మొదలగు వాని స్మరణరూపమైన దేహము Identities Consciousness. ఇచ్చట లింగమనగా చిహ్నమని అర్థము. తనను గూర్చి తానెరిగిన స్మృతులన్నియు ఒక ముడివలె ఏర్పడినదే లింగదేహము)

దాని వలన పాంచభౌతిక శరీరమున ఉండి ప్రజ్ఞ అనేక లోకములలో విహరించును. కూడబెట్టుకొనిన కర్మఫలము ‌అనుభవించుచుండును. ఈ అనుభవముల వలన మరల కర్మల యందు ఆసక్తి పుట్టుచుండును. జీవునకు మనస్సు, ఇంద్రియములు, పంచభూతములతో నిండిన దేహము సుఖములను అనుభవించుటకు సాధనమైనను ఆ సుఖాసక్తి వలననే మృత్యువును కలిగించును.

ఏ దేహము సుఖములను ఇచ్చునో ఆ సుఖముల వలన ఆ దేహమే శుష్కించుటయు నశించుటయు జరుగును. అడవిలో వేటకాడు జంతువులకు సదుపాయములైన ఆకర్షణలను సమకూర్చి ఆ‌ జంతువులను చంపుచున్నాడు కదా! ఇట్టి దేహము తొలగుటయే మరణము. పుట్టుటయే జననము. (అంతకన్న జీవికి జనన మరణములు లేవు.)

కన్ను యొక్క పరిమితిని బట్టియే చూడగగలుగుట యుండును. (కొందరిలో చూచినదానిని చూచినంత వరకే గ్రహింపగలరు. మరికొందరు చూచి అనేక విషయములను గ్రహింపగలరు.) చూడగలిగిన యోగ్యతను అనుసరించి జీవునకు మరణము లేదని తెలియును.

(దేహము వరకే చూడగలిగినచో జననమరణములు ఉన్నవని తెలియును‌. దేహము యొక్క వృత్తాంతమును దర్శింపగలిగినచో జనన మరణములు లేవని తెలియును.) కనుక భయము, లోభము, దీనత అనావశ్యకములు. కంగారు‌పడనక్కర లేదు. జీవుని వృత్తాంతమును సమగ్రముగా తెలిసి, జీవుడు ధీరుడై సంగమును విడుచును. యోగాభ్యాసముతో వైరాగ్యము ఆర్జించి, సక్రమమైన సంపూర్ణజ్ఞానమును పొంది వర్తింపవలెను.

మాయచే ఏర్పడిన లోకమున పుట్టి పోవుచుండు దేహాదుల యందు ఆసక్తి మాని జీవింపవలెను.............


🌻 నిర్మలమైన అనంతుడు అనబడు ఆది శేషుని శయ్యపై యోగ నిద్రలో హరి ఉన్న వేళ సర్వలోకములును వాని యందు లయమై ఉండును. అట్టి సర్వేశ్వరుని గూర్చియే మహానుభావులు ధ్యానింతురు.

(పై చెప్పిన ధూమ మార్గము వారు గాక మోక్ష మార్గము వారి ధ్యానము ఇచ్చట చెప్పబడినది. వారి మనస్సు భౌతిక జీవితము యొక్క సుఖదుఃఖముల సర్దుబాట్లను గూర్చి ఆలోచింపక వాని యందు అంతర్యామిగా వెలుగుచున్న నారాయణుని ధ్యానించును. దానికి ధూమలక్షణము ఉండదు.

పొగలో కూడ అంతర్యామిని ధ్యానించునపుడు పొగ అనునది వేరొక స్థితి కాదు. అట్లే దేహేంద్రియాదుల యందు అంతర్యామిని ధ్యానించినచో దేహేంద్రియాదుల మాలిన్యము ఉండదు. నిర్మల స్థితి ఉండును. ఆద్యంతములు ఉండవు. అదియే అనంతుడు లేక శేషుడు. దేహము శయ్యగా అంతర్యామి శయనించి యుండును. తన యందు తాను మేల్కొని యుండును కనుక ఇంద్రియములకు, మనస్సునకు నిద్ర వంటి స్థితి ఉండును. ఇదియే యోగ నిద్ర.

మనస్సుపై ఆధారపడి జీవించువానికి పూర్తి నిద్ర వచ్చును; దానినే సుషుప్తి అందురు. తన యందు మేలుకొని యున్నవానికి యోగ నిద్ర ఉండును. అట్టి స్థితిలో ఇంద్రియములు, మనస్సు, దేహప్రవృత్తులు తనలో భాగమై వేరుగా అస్తిత్వము లేకుండును కనుక వానికి అది లయస్థితి లేక ప్రళయస్థితి అందురు. ఈ సాధన చేయువారి ఆనందము‌ లింగశరీరముపై ఆధారపడదు కనుక దేహజననము, దేహత్యాగము అనువానిపై ఆధారపడదు. అనగా వారికి జన్మలుండవు.)

సమస్త సంగములను పరిత్యజించి, ముక్తి పొందువారు తమ భక్తిసాధనలో సమస్త ధర్మములను విష్ణువునందు సమర్పణము చేయుదురు. శాంత మనస్సుతో ఉందురు. విష్ణుమూర్తి కన్నా ఇతరము నందు మనస్సు వారికి ప్రసరింపదు. సందులేని విష్ణుధ్యానమే వారి యందు నిలిచియుండును.

(దైత్యులు ఇంద్రియ మనః ప్రవృత్తులలో దుష్ట సంకల్పముగా పుట్టుచున్నారు. వారికి స్థానము ఉండదు కనుక విష్ణుని ధ్యానించుట దైత్యులను సంహరించు వాని ధ్యానమే అగును.)......


🌻  వారికి అహంకార మమకారములు లేవు. అయినను వారి కుతూహలము ‌నారాయణునిపై వర్తించును. వారి దేవుడు‌ అర్చనాది మార్గమున గోచరించువాడు. లోకమందలి మహనీయ చరిత్రములన్నియు వానివే.

అందరి ముఖములు వాని ముఖములే. కీర్తిమంతుల కీర్తి అతడే. సృష్టి స్థితి లయములు అతని యందే తోచుచున్నవి. అతడున్నాడు కాని పుట్టడు. అతడు ప్రకృతి యందును పురుషుని యందును ఉన్నాడు. వానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. ఈ అతీతుడే పురుషోత్తముడనబడును. ఇట్టి లక్షణములతో నారాయణుని అర్చించి, ఇక తిరిగి రాని మార్గమున దివ్యతేజస్సుతో వెలుగొందు చుందురు. వారికి జన్మములు‌ లేవు. వారే నిత్యసూరులు.

కొందరు దేవుడను‌ పేరుతో‌ హిరణ్యగర్భుని కొలుచుచున్నారు. (దేవుని యీ సృష్టి యందు అంతర్యామిగా మాత్రమే కొలుచుచు దీనికి అతీతుడగు పురుషోత్తముని ఆశ్రయింపనివారు.) వారు సత్యలోకమున ఉండి చతుర్ముఖుని పరమాత్మగా ధ్యానించుచున్నారు. వారు చతుర్ముఖుడు బ్రతికియున్నంత వరకు వాని యందు సత్యలోకమున ఉందురు. రెండు‌ పరార్థములు పూర్తియైన వెంటనే బ్రహ్మకు‌ ప్రళయము వచ్చును. అంతవరకు వారు బ్రహ్మయందుందురు. ఇంతలో బ్రహ్మ లయమగుటతో పంచభూతములు, మనస్సు, ఇంద్రియములు, తన్మాత్రలు, వాని లోకములు కూడ సర్వేశ్వరుని యందు లీనమగును.

అపుడు వారు బ్రహ్మలోకము పైన అభిమానము వదలి బ్రహ్మతో కూడి, పురాణపురుషునిలో ప్రవేశించి లీనమగుచున్నారు.

(సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రము పూజింపగలవారు సృష్టియు, సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై యుందురు. అటుపైన సృష్టితో పాటు నారాయణుని యందు లీనమగుదురు.).......


🌻 (సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రము పూజింపగలవారు సృష్టియు, సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై యుందురు. అటుపైన సృష్టితో పాటు నారాయణుని యందు లీనమగుదురు.

దీనికొక ఉదాహరణము. మన భూమిపైన ఒక మహానుభావుని దేహమున ఎములలో ఉన్న సున్నము కూడ మహానుభావునితో పాటు గౌరవింపబడును. అతడు దేహమును వదిలిన వెనుక అది భూమిలోని ఖనిజముల యందలి సున్నముతో కలియును. ఖనిజములలోని సున్నము అట్లుగాక ఎందరోమహానుభావుల ఎముకలుగా ఐనను సేవ చేయగలదు.

భూమిలోని సున్నము వంటి వారు పరబ్రహ్మమును ఆరాదించువారు. మహానుభావుని ఎముకలలోని సున్నము‌ వంటి వారు హిరణ్యగర్భుని ఆరాధించువారు. ఈ భేదము తెలియుటకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగము ప్రసాదింపబడినది.)

 కనుక నీవు సర్వజీవుల హృదయ పద్మముల యందున్న పరబ్రహ్మమునే సర్వభావములతో శరణాగతి చేయుము. అతని అనుభవము ఎల్ల యెడల వినబడుచుండును.

 (వాక్కును ఉచ్చరించి విన్నచో అతడు వాక్స్వరూపుడై వినబడును. అందరి కంఠధ్వనులలో శబ్ద బ్రహ్మ స్వరూపుడై తనను ఉచ్చరించుచున్న మూర్తిగా దర్శనమిచ్చును.) అతనిని గూర్చి ఒక లోపము చెప్పుటకు వీలులేదు. కంటికి ఏ సాధనములు అక్కరలేకయే సూటిగా పొరలుదాటి అతడు సర్వ జీవులుగా దర్శనమిచ్చుచుండును. అతనికి సుఖదుఃఖములుగాని, జనన మరణములు గాని, వ్యక్తావ్యక్త స్థితులు గాని లేవు. అతనిని పురుషుడని భావించి శరణాగతి పొందుము.

(దేవహూతికి పురుషుడు తన భర్త. కనుక కర్దమ ప్రజాపతిని ధ్యానించి నారాయణుని మోక్షస్థితి పొందుమని అభిప్రాయము. కపిలాచార్యుడు గురువై సర్వమును ఉపదేశించినను, జీవునకు నారాయణునకు గల సంబంధము భార్యా భర్తల సంబంధము వంటిది. కనుక దేవహూతి కర్దమ ప్రజాపతినే ధ్యానించి మోక్షము పొందవలెను. కపిలాచార్యుని తనకు ఇచ్చినది కూడా కర్దముడే కదా!

దైవమును అందించువాడే గురువు.).......Happy   BY MVP
*'అష్టావక్రగీత 13, 14 ప్రకరణల నుండి (307)*_
🕉🌞🌎🌙🌟🚩By MVMRAO

_*విగ్రహంలోనే  కాదు... పూజాసామిగ్రిలో, పూజించేవాడిలో కూడా ఉన్నది శివుడే !!*_

_*మన దృష్టి విశాలమయ్యే కొద్దీ "నేను" చిన్నదై పోతుంది. అప్పుడు  అంతటా శివుడు కనిపిస్తాడు. గుడిలో గోపురం అంత ఎత్తు ఎందుకుంటుందంటే మనం ఎంత చిన్నవారిమో తెలియడానికే. మనలోని "నేను" అనే అహంకారం తగ్గేకొద్ది ఆత్మతత్వం అవగతమవుతుంది. నిజానికి "నేను" అనేది అనంతu ఆత్మ వస్తువుకు మనం ఏర్పరచిన పరిధి. అదే అహంకారం. అది పోతేగాని మనం ఆ అనంతవస్తువే అన్న సత్యం అనుభవంలోకి వస్తుంది. మనలో లోతుగా పాతుకు పోయిన "నేను" అనే పరిధి పోతే మన దృష్టిలో అన్నింటికీ ఏర్పడి ఉన్న పరిధిపోతుంది. అప్పుడు అన్నింటా శివుడే ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు విగ్రహంలో మాత్రమే కాదూ... దాంతో పాటు పూజాసామగ్రిలో, పూజించేవాడిలో కూడా ఉన్నది శివుడే అన్న అవగాహన కలుగుతుంది.*_

🕉🌞🌎🌙🌟🚩
మనీషా పంచకం

ఒకరోజు శంకరులు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

ఆది శంకరాచార్యులు రచించిన మనీషాపంచకం.

సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తిదాయకం,

కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం.....1

అంత్యవేషధరం దృష్ట్యా గచ్ఛ గచ్ఛేతి చాబ్రవీత్,

శంకరస్సో పి చాండాలస్తం పునః ప్రాహ శంకరం.....2

అన్నమయాదన్నమయం హ్యథవా చైతన్యమేవ చైతన్యాత్,

ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్చేతి.....3

కిం గంగాంబుని బింబితే ంబరమణౌ చండాలవాటీపయః

పూరే చాంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాంబరే,

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధఅంబుథౌ

విప్రో యం శ్వపచో యమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః.....4

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్ఞృంభతే

యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,

సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే

చ్చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ.....5

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం

సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం,

ఇత్థం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే

చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ.....6

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో

ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా,

భూతం బావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే

ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ.....7

యా తిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే

యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనాః

తాం భాస్యైః పిహితార్క మండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్

యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ.....8

యత్సౌఖ్యాంబుధిలేళలేశత ఇమే శక్రాదయో నిర్వృతా

యచ్ఛిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః

యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మావి

ద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ.....by MVMRAO 
*సత్సాంగత్యంతోనే జీవన్ముక్తి*
🕉🌞🌎🌙🌟🚩By  MVMRAO

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి

‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది. సత్పురుషుల సాంగత్యం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది.


 మోహం తొలగిపోతే మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది (నిశ్చలతత్వం). అలా మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తి అని ఈ శ్లోకం అర్థం.


 మానవుడు ఈ ప్రపంచంలో జీవించినంతకాలం సుఖాలను, భోగాలను, ఆనందాన్ని కోరుకుంటారు. లోకంలో కనిపించే వస్తువుల ద్వారానే ఆనందాన్ని, సుఖాన్ని పొందగలననుకుంటాడు. ఇలా వస్తువుల ద్వారా విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతామనుకోవడమే మోహం.. భ్రమ. ఎందుకంటే ఈ లోకంలో ఏ వస్తువూ ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనందాన్నే ఇస్తుందనే నమ్మకం లేదు. ఏదైనా కొంతకాలం సుఖాన్ని ఇస్తే ఇవ్వవచ్చు. కానీ, అదే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వస్తువు ద్వారా వచ్చే సుఖం.. ఆ వస్తువు పోయినా, చెడిపోయినా పోతుంది. అప్పుడు దుఃఖం కలుగుతుంది.


 కనుక ఏ వస్తువు ద్వారానైనా అనిత్యమైన ఆనందమే తప్ప నిత్యమైన ఆనందం రాదు. ఇది తెలిసీ వస్తువుల ద్వారా కోరుకున్న ఆనందాన్ని పొందగలమనుకోవడమే భ్రమ. మనిషిని భ్రమలోనూ మోహంలోనూ ముంచెత్తివేసే విషయవస్తువుల మాయాజాలం నుంచి, ఆకర్షణల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే గొప్ప ఉపాయం ఏదో కావాలి. అట్టి ఉపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఇచ్చారు. ఎలా మనం ఉన్నతమైన జీవన్ముక్త స్థితిని పొదుతామో తెలియజేశారు. ఆ ఉపాయమే సత్సంగత్వం. అంటే.. సత్పురుషులతో సంగభావం. సత్పురుషులంటే సత్‌ పదార్థాన్ని అన్వేషించే సాధకులు, భగవత్‌ భక్తులు, సత్కార్యాలు ఆచరించేవారు.


ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు, సాధుపురుషులు, జ్ఞానులు. వారితో మాట్లాడటం, వారి మాటలను వినడం, వారి ద్వారా సందేహాలను తీర్చుకోవడం, వారిని అనుసరించడం.. ఇదే సత్సంగత్వం అంటే. ఒకవేళ అలాంటివారు లభించకపోతే సద్గ్రంథాలతో స్నేహం చేయాలి. అందులోని విషయాలను గ్రహించి ఆచరణలో పెట్టాలి. తద్వారా.. అనిత్య వస్తువులు మనకు నిత్యమైన ఆనందాన్ని ఇవ్వలేవని, నిత్యమైన ఆనందం పరమాత్మ వల్లనే లభిస్తుందని తెలుస్తుంది. మనలో మానసిక ప్రశాంతత కలిగి మనసులో విషయవస్తువుల పట్ల నిస్సంగ భావం వస్తుంది. ఆ భావం వాటి ఆకర్షణ నుంచి మాయాజాలం నుంచి రక్షిస్తుంది.


           శుభం భూయాత్
సదా
భగవత్భావనా వ్యాప్తిలో....

🕉🌞🌎🌙🌟🚩
*ధనం, జనం, యవ్వనం(అన్నీ అశాశ్వతమే)*
🕉🌞🌎🌙🌟🚩
 By MVMRAO
ఆత్మజ్ఞానం కావాలంటే అందుకు అనువైనది మానవ జన్మయే. అలాంటి మానవ జన్మ లభించి కూడా ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలు, భోగాలే ప్రధానం అనుకొని జీవితం గడిపినవారి గతి ఏమవుతుందో శంకరాచార్యులవారు ఇలా వివరించారు.


మాకురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్‌ కాలః సర్వం
మయామయమిదమఖిలం బుద్ధ్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా


‘‘ధనమున్నదని, అనుచర గణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో.


 ఆత్మానుభూతిని చెందు’’ అని దీని అర్థం. ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. కొందరికి ధన గర్వం, కొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం, కొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం.


 కానీ ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లు, ఆస్తులు నేలమట్టమయిపోతాయి. ‘నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది’ అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఆ క్షణంలో ధనం, జనం ఏవీ రక్షించవు. అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.


వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చికూర్చుంటుంది. కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి.


 అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు. వాటిని అనుభవించడంలో తప్పు లేదు. కానీ, వాటితో సంగభావం (అటాచ్‌మెంట్‌) పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే.. అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు. జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు. శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి. ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే చలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి. పరమాత్మలో ఐక్యం కావాలి.

🕉🌞🌎🌙🌟🚩
*🌹 గుప్త విషయాలు 🌹*

*ఆయువు,*
*విత్తము,*
*ఇంటిగుట్టు,*
*మంత్రం,*
*ఔషధం,*
*సంగమం,*
*దానం,*
*మానము,*
*అవమానం*

*అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.*

*భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.*

*రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.*

*ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.*

*అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.*

*ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.*

*సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.*

*‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.*

*ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.*

*సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.*

*దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.*

*మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.*

*అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం.*

*ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ.... స్వస్థి...* *సర్వేజనా సుఖినోభవంతు*
🌹 🌹 🌹 🌹 🌹
*🙏 ప్రసాద్*Thank goodness you By SPK DAY 
ఓం శ్రీ బాలత్రిపురసుందరి దేవ్యై నమః by Sivananda Nirmala

అమ్మవారు ఎన్నో రూపాలలో గోచరిస్తారు అందులో ఒక్క అద్భుతమైన రూపం ఈ బాలత్రిపురసుందరి రూపం.

శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద లలిత సహస్త్ర నామస్తోత్రం లో చెప్పిన విధంగా :

"భండపుత్ర  వధోయుక్త బాలా విక్రమ నందిత"

బాలాత్రిపురసుందరి ఆవిర్భావం :

పూర్వం భండాసురుడు (మన్మధుడి చితాభస్మం నుండి ఉద్భవించినవాడు ) సకల లోకాలలో అరాచకం మొదలు పెట్టాడు ఆలా  వాడిని చంపడానికి లలిత త్రిపుర సుందరి చితాగ్నికుండం నుండి ఉద్భవించింది. వాడిని చంపడం జరిగింది (ఆ కథ వేరే పోస్ట్ లో వివరం గా చెబుతాను ) తన తండ్రి ని చంపిన లలిత దేవి మీద భండాసురుడి పుత్రులు ఆయుధాలతో ముందుకు రావడం చూసి ముందుకు ఒక్క అడుగువేసి  మరల తిరిగి వెన్నకి తగ్గింది ఎందుకంటే యుద్ధం లో  చిన్నపిల్లలను  చంపడం తగదు అను యుద్ధ నీతి గుర్తించి వెనక్కి తగింది. కానీ లోక కంఠకులను వదిలేయడం కూడా మంచిది కాదు అని అమ్మవారు ఒక్క అద్భుత ఘటం ప్రారంభించింది.

                                 అమ్మవారినుండి ఒక్క శక్తి పుంజం వెలుబడి సకలదేవతల సమక్షం లో అందరు నమస్కరించగా ఒక చిన్న పసి పాప సకలాభరణ భూషిత అయి నాలుగు చేతులు గలిగి పుస్తక, జపమాల, అభయ వరద హస్తాల తో తెల్లని పద్మం ఆసనం గా చేసుకోని హంసలు లాగుతున్న రథముయెక్కి రణరంగానికి వచ్చి భండాసురుడి పుత్రులను వధిస్తుందీ.

ఈ విధంగా అమ్మవారు బాల రూపాని ధరించి మనలను తరింపజేస్తుందీ. బాలాత్రిపురసుందరి ఆరాధన ఎవరు చేస్తారో వారికీ సకల దేవతలా అనుగ్రహం తో పాటు అంత్య కాలం లో మణిద్వీప ప్రవేశం కలుగుతుంది.

అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలీక పిల్లలు చాలా తేలీక గా ప్రసన్నులవుతారు అలాగే అమ్మవారుకూడా నవరాత్రులలో కానీ నిత్యం కానీ కనీసం వారం లో శుక్రవారం కానీ బాల పూజ చేస్తాయ్ తప్పక అమ్మవారు ప్రీతి చెంది సకల ఐశ్వర్యసంపదలను కురిపిస్తుంది అంటారు. కనుకనే శుక్రవారం ఇంటికి ఆడపిల్ల వస్తే నోరు తీపిచేయ్యాలని అంటారు మన పెదాలు ఇది  మన కంటే మరాఠీలు ఎక్కువగా  నమ్ముతారు శుక్రవారం వచ్చిన ఆడపిల్లలకు మిఠాయిలు తినిపిస్తారు.

పైగా శ్రీవిద్య లో ప్రప్రధమం గా  బాల మంత్రం నే ఉపదేశిసిస్తారు బాల ఉపాసన గురించి ఎన్ని చెప్పిన తక్కువే అందరి దేవతలా అష్టోత్తర శతనామావళి కి 108 నామాలు ఉంటే  బాల అష్టోత్తరం లో 111 నామాలు విశేషం.
సర్వం శ్రీ బాల త్రిపుర సుందరి చరణార విందారపణమస్తు.
నిత్య కళ్యాణి కామేశ్వర కామేశ్వరి మనోగ్ని నమోస్తు.
by I. Umashankar

చక్కని సంతాన ప్రాప్తికి : (30) ‌‌‌‌‌

శోభావశంకరీ లీలా మాణినీ
పరమేష్ఠినీ త్య్రైలోక సుందరీ
రమ్యాసుందరీ కామచారిణీ
హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి by Sచేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
శ్రీ చక్రం లో యే యే దేవతలు యే యే స్థానాలలో ఉన్నారో " ఎరుపు రంగు " తో సూచిస్తూ , ఖడ్గ మాలా స్తోత్రం పఠించడమయింది . శ్రధ్ధగా స్తోత్రాన్ని వింటూ స్థానాన్ని మార్చుకుంటూ వెళ్తున్న ఎరుపు రంగు గుర్తు ని గమనిస్తూ ఉండండి . మీకు ఆ యా దేవతల స్థానాలు తెలుస్తాయి .

Monday, May 27, 2019

*🌹శ్రీమద్భగవద్గీత 🌹*
*🌴ప్రధమ అధ్యాయము🌴* by MVMRAO
*శ్లోకము 19*

*స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |*
*నభశ్చ పృథివీం చైవ తుములో(భ్యనునాడయన్ ||*

*ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకర మయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను.*

*బాష్యము :  పాండుతనయులు మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట యనెడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననెడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటివారి వరకు సర్వులు (ప్రపంచ పలు దేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా) అచ్చట నిలిచియుండిరి. వారందరును నశింపనున్నారు. తన కుమారులు అనునసరించిన యుక్తి విధానము ప్రోత్సాహించియున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోరవిపత్తుకు కారణమై యున్నాడు.*

*🌹 Bhagavad-Gita as It is 🌹*
*🌴 Chapter 1 🌴*
*Verse 19*

*sa ghoṣo dhārtarāṣṭrāṇāṁ*
*hṛdayāni vyadārayat*
*nabhaś ca pṛthivīṁ caiva*
*tumulo ’bhyanunādayan*

*The blowing of these different conchshells became uproarious. Vibrating both in the sky and on the earth, it shattered the hearts of the sons of Dhṛtarāṣṭra.*

*Purport : When Bhīṣma and the others on the side of Duryodhana blew their respective conchshells, there was no heart-breaking on the part of the Pāṇḍavas. Such occurrences are not mentioned, but in this particular verse it is mentioned that the hearts of the sons of Dhṛtarāṣṭra were shattered by the sounds vibrated by the Pāṇḍavas’ party. This is due to the Pāṇḍavas and their confidence in Lord Kṛṣṇa. One who takes shelter of the Supreme Lord has nothing to fear, even in the midst of the greatest calamity.*
🌹🌹🌹🌹🌹
*🙏 Prasad*
🌹 *మైత్రేయ మహర్షి బోధనలు*🌹                  

*🌴 సహిష్ణుత 🌴* by MVMRAO

*🌻జీవితమున క్రమశిక్షణ ఎవరికీయ వలెను? తనకు తానే ఇచ్చుకొనవలెను.*
*దివ్య బోధనలు  ఎందుకొఱకు? తనకొఱకే కాని ఇతరుల కొఱకు కాదు.*

*మోసమును, దగాను ఎట్లు ఎదుర్కొనవలెను?*

 *వాని నాకర్షించు తత్త్వము తనలోనే వున్నదని, అది ఆశయని గుర్తించి నిర్మూలించు కొనవలెను.*

 *ఇతరులు తన యొడల కఠినముగ ఎందుకు ప్రవర్తించుచున్నారు? తాను ఇతరుల యెడల ప్రవర్తించు తీరును బట్టి.*
*గౌరవించినవారు గౌరవింపబడుదురు. దూషించినవారు దూషింపబడుదురు.*

*ఇతరులను ఉద్దేశించి నీవేమి భావించినను, మాట్లాడినను, చేసినను అదే తీరులో  నిన్ను గూర్చిన భావన, భాషణము, చేత యుండును. ఇది సృష్టి శాస్త్రము. దీనిని మరువకుము.*
*సమస్తమును సహించుటతో నవజీవనమునకు  పునాది వేయుము.*

*సహించుట, భరించుట, బాధ్యత వహించుట తప్పక నీ పురోగతికి తోడ్పడగలవు. 🌻*              
🌹🌹🌹🌹🌹
*🙏 ప్రసాద్*


3. శివలింగము  - అభిషేకఫలం

విభూతి లింగం : మనోభీష్టము
అన్నం లింగం:  కార్యానుకూలం
పటికబెల్లలింగం:  శీఘ్రవివాహం
పాలరాతిలింగం : ‌‌‌‌కీర్తి, యశస్సు
రాగి లింగం. : పుష్ఠి, ఆయుష్యం
ఇత్తడి లింగం : తుష్టి
కంచు లింగం : కీర్తి, ప్రతిష్టలు
లోహ లింగం : శనిదోషనివారణ
వీహ్రి లింగం : రోగనాశనముశుభమస్తు



4. శివలింగం  -  అభిషేకఫలం

సీసపు లింగం : ఆయుష్యం
గజదంతలింగం: సేనాధిప‌‌‌త్యం
గోమయలింగం: రోగనాశనం
మినుములపిండి):  స్త్రీ లాభం
                లింగం)
నువ్వులపిండి లింగం: శనిదోష
                                -నివారణ
ధాన్యపు లింగం : పుష్టి

          ఓం నమశ్శివాయ

మరిన్ని వివరాలు.........by. I. Umashankar 

Saturday, May 25, 2019

🌸 *సాధన - సాధకులు* 🌸

◆◆ *సాధన* ◆◆

అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "సాధన".

ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని, అనంతుడుని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రారంభమయ్యాక ఎన్నో సంఘర్షణలు, సందేహాలు.
ఎలా పయనించాలి,
ఏం చేయాలి,
ఎలా సాధించగలను,
ఎవర్ని ఆశ్రయించాలి...ఓహో... ఎన్నో ప్రశ్నలు.

అయితే తమ తమ సంసారధర్మాలను, గృహధర్మాలను, లౌకిక భాధ్యతలన్నింటిని నిర్వర్తిస్తూ, పరమగమ్యంను చేరగోరు గృహస్థభక్తులుకు తమ దైనందికకార్యంలలో ఆధ్యాత్మిక సాధన  ఓ అంతర్భాగమై ఉండాలి.
సాధనకు కావాల్సింది మొదటిగా మనో నియంత్రణ. వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే మనోరహితస్థితి కల్గుతుంది.
అటుపై కావాల్సింది అంతఃకరణశుద్ధి.
ఇది అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (బ్రహ్మ సత్యం, జగత్తు మిధ్య అను సత్య దృఢ నిశ్చయజ్ఞానమే వివేకం. అనిత్యమైన ప్రపంచవిషయాలను విడిచిపెట్టి నిత్యమైన ఆత్మగురించి ఆలోచించడమే వివేకం),
వైరాగ్యం (ఇహపర భోగాలపట్ల అభిలాష లేకపోవడం),
శమం (మనోనిగ్రహం),
దమం (చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం),
ఉపరతి (స్వధర్మానుష్టానం),
తితిక్ష (శీతోష్ణ సుఖదుఃఖంలను సహించుట),
శ్రద్ధ (దేనిచేత సద్వస్తువు తెలియబడునో అట్టి శాస్త్రంనందును, గురువాక్యంలందును సంపూర్ణ విశ్వాసం),
సమాధానం (చిత్తంను ఏకాగ్రతలో ఉంచుట),
ముముక్షత్వం (మోక్షం కావాలనే తీవ్ర కోరిక) భక్తి (స్వ స్వరూప అనుసంధానం అంటే నిదిధ్యాస), ధ్యానం (సత్యమైన ఏకవస్తువును  చింతించడం),
సేవ (పరోపకారజీవనం),
సమత్వం (శత్రుమిత్రులయందు, మానావమానములయందు, సుఖదుఃఖంలయందు, సర్వ పరిస్థితులయందు సమభావంతో ఉండుట),
శౌచం (జ్ఞానవైరాగ్యంలనెడి మృత్తిక చేత మదిని క్షాళ నం కావించి, వాసనాత్రయంను నశింపచేసుకోవడం),
దయ (దుఃఖితులయందు కృప),
సజ్జనసాంగత్యం (భగవత్తత్త్వాన్ని గ్రహించే వారితో సాంగత్యం),
ఋజువర్తనం (చక్కటి నడవడిక)
ఏకాత్మభావన (అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం) అభ్యాసం చేయాలి.

ఈ అభ్యాస సమయంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధన.
● బంగారానికి పుటం పెడితేగానీ ఆభరణం తయారుకాదు.
● పాత్రశుద్ధి ఉంటేగానీ పాలు కాచలేం.
● ఉలిదెబ్బలు పడితేగానీ విగ్రహం చేయడం కుదరదు.

అలానే అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు.
ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను
అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి.
అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.

◆◆  *సాధకులు* ◆◆

త్రికరణశుద్ధిగా పై సాధనను ఆచరించినవారే సాధకులు. సదా సర్వప్రాణులను స్వాత్మ(తన ఆత్మ) యందు చూచునో, సర్వప్రాణులయందు ఆత్మను చూచునో వారే సాధకులు.  అనంతుని స్మరణ, ఆధ్యాత్మికతత్వ అవగాహన, అన్యవిషయ విస్మరణ, అనన్య చింతన, ఆత్మ విచారణ, అంతా ఆత్మయేనన్నఅచంచల భావనలను అలవర్చుకొని, అవరోధాలను అధిగమిస్తూ ఆజన్మ సాధన అహర్నిశలు చేసేవారే నిజమైన సాధకులు.  సత్కర్మలు, సదాచారణములు, సత్ శీలం , సత్ప్రవర్తన, సత్ వాక్కు, సన్మార్గం, సాత్వికాహారం, సమదృష్టి, సంయమనం, సందేహరహిత సాధన సాధకునికి అవసరం.

సత్ సంకల్పంతో, సద్గ్రంధంలు పఠనం  శ్రవణం మననం చేస్తూ,  సదా సత్యవస్తువుస్మరణ తోడుగా సద్గురువు సన్నిధిలో సాధన సక్రమంగా సాగించే సాధకునికి ఆత్మసాక్షాత్కారము సంప్రాప్తిస్తుంది.
  By Mallikharjun.
■■■

By Ravishankar mudigonda
శివానుగ్రహ ప్రాప్తిరస్తు.......

సురపతి మకుటాగ్రా బధ్ధ చింతామణేస్తత్
శివనిలయ పథస్థ ప్రస్తర స్సుప్రశస్త:
ధన దనవని ధేర్వాఖండలాఖండ భూతే
రమృతసుఖకృదీడ్యాచాది భిక్ష్వంఘ్రి ధూళి:

భావము:- దేవేంద్రుని కిరీటములో అతికిన చింతామణికంటే, శివాలయమునకు వెళ్ళు మార్గములో అతికిన రాయి అతి ఉత్తమమైనది. కుబేరుని నవరత్న నిధులకంటే , ఇంద్రుని ఐశ్వర్యముకన్నను, అమృత సుఖముకన్నను.. మోక్షమిచ్చే ఆ ఆది భిక్షువు ( శివుని ) పాదధూళి అత్యంత శ్రేష్ఠమైనది..................ఇందు ఎట్టి సందేహము లేదు.........
ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తమైన శ్వేత శంఖాలు రెండు నిత్యపూజలు అందుకుంటూ ఉంటాయో ఆఇంటి యజమాని సదా ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఏకార్యం చేట్టినా అందులో విజయం సాధిస్తాడు. అపజయాలు, దుర్దశలు ఆవ్యక్తి దరిదాపుల్లోకి కూడా రావని ప్రజల నమ్మిక. శాస్త్ర ప్రకారం శంఖం లక్ష్మీ స్వరూపం.
"మహాభషేకం సర్వత్ర శంఖేనైవ ప్రకల్పయేత్!
సర్వత్రైవ ప్రశస్తోబ్జః శివ సూర్యార్చనం వినా!!"(తిథి తత్త్వే బ్రాహ్మే)
సర్వదేవతా పూజల్లోనూ శంఖంతో మహభిషేకం చేయాలి. శంఖంతో శివ సూర్యులను మాత్రం అభిషేకించరాదు. శంఖ ద్వారా ఇచ్చే తీర్థాన్ని ఎలా స్వీకరించాలంటే
చతుర్గుణీ కృత వస్త్రే పాణిం నిధాయ తేనాదౌ శంఖతీర్థం శిరసి ధారయేత్!
శంఖ మధ్య స్థితం తోయం భ్రామితం కేశవోపరి! అంగ లగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దహేత్!! (నిత్య కర్మాష్టకే)
నాలుగు మడతలు పెట్టిన వస్త్రం మీద కుడి చేతిని ఉంచాలి. ముందుగా అందులోకి శంఖ తీర్థాన్ని తీసుకొని, శిరస్సున జల్లుకోవాలి. శంఖమధ్యమున ఉండేదీ, విష్ణు ప్రదక్షిణం చేసినదీ అయిన ఈశంఖం తీర్థం మానవుల శరీరాన్ని స్పృశించి, బ్రహ్మ హత్యల వల్ల కలిగే పాపాన్ని సైతం పోగొడుతుంది. శంఖాన్ని చెవిదగ్గర ఉంచుకొన్నప్పుడు మంద్రమైన శబ్దాలు వినిపిస్తే అది ఉత్తమమైన శంఖం.
ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉండాలనుకుంటారో, ఋణబాధలు, దరిద్రం లేకుండా సిరిసంపదలతో తులతూగాలనుకుంటారో అలాంటి వాళ్ళు దక్షిణావర్త శ్వేత శంఖాన్ని(కుడివైపు తెరుచుకొని ఉండే తెల్లటి శంఖాన్ని) పూజగదిలో పెట్టుకోవాలి. ఈవిషయాన్ని పులస్త్య సంహితలో మహర్షి పులస్త్యుడు, లక్ష్మీ సంహితలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పారు. దక్షిణావర్తమైన తెల్లటి శంఖం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోనట్లయితే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆశంఖం మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.  By - I. Umashankar 



శ్రీ శివలింగము- అభిషేక ఫలం By _I. Umashankar

గంథ లింగం.    -  సౌభాగ్యం
వజ్ర లింగం.      - ఆయుష్యం
వైడూర్య లింగం:కుష్టు నివార‌‌‌‌‌‌‌‌‌‌ణ
పుష్యరాగలింగం: సర్వసుఖం
పద్మరాగ లింగం: లక్ష్మీ ప్రాప్తి
మరకత లింగం : పుష్ఠి
స్పటిక లింగం : సర్వకామప్రాప్తి
ఇంద్రనీల లింగం: యశస్సు,కీర్తి
రజిత లింగం : రాజ్యము, ముక్తి
 
మరిన్ని వివరాలు .........
     ‌

Thursday, May 23, 2019


2. అభిషేకములు - విశేషాలు.

భస్మజలం.        :  పాపవిముక్తి
నువ్వుల/తైలా-    అపమృత్యు
భిషేకము.         :  దోషనివారణ
కస్తూరిజలం.     :  సర్వాధికారం
ఖర్జూరజలం.    :  వైరాగ్యప్రాప్తి
నవరత్నజలం   :  నవగ్రహదోష   ‌‌‌                           నివారణ/గృ  ‌‌‌‌‌‌‌‌                          హ,వాహనప్రా                ‌‌‌‌                          ప్తి,‌ సౌలభ్యం
పసుపుజలం.   : సౌభాగ్యం
కుంకుమ జలం : అలంకారప్రాప్తి
అన్నాభిషేకం   : ధనధాన్యప్రాప్తి
రుద్రాక్ష జలం.  : సకలైశ్వర్యము
ద్రాక్ష రసం.      :  సర్వకార్యసిద్ది.

రుద్రాభిషేకసహిత,  సర్వదేవత లకు అభిషేకప్రార్థనలతో తరించండి. సర్వాభీష్టసిద్దిరస్తు.

Paper News AMARNATHSARMA garu


100th SANKARARADHYULA Vari vardhnti at Warangal




Wednesday, May 22, 2019

కాలభైరవుండు కార్యదక్షుడు తాను/
క్షేత్ర పాలకుండు క్షేమమొసగ/
నిలచెనిచట రిపుల నిగ్రహించుటకునై/
శివపురిశ దేవ చిద్విలాస/🙏
శుభమస్తు by I. Umashankar

అభిషేకములు - ప్రత్యేకతలు.

గోవు పాలు :  సంపద
"      పెరుగు:  రోగనివారణ/ఆ ‌                   ‌‌                     రోగ్యం
"      నెయ్యి :  సంపద
పంచదార.  :  సర్వదుఃఖనివార ‌‌‌‌‌‌‌‌‌                     ణ
తేనె.           :  వంశాభివృద్ధి
గంధజలం.  :  పుత్రలాభం/ఉష్ణ
                      వ్యాధి నివారణ
పుష్పజలం  :  భోగభాగ్యములు
గరికె/దూర్వ   మూత్రకోశరోగని
        జలం   :  వారణ,నష్టద్రవ్య
                      ప్రాప్తి
బంగారు జలం:  లక్ష్మీ ప్రసన్నం

సర్వదేవతారాధన పై అభిషేక ములతో చేసి తరించండి.  రేపు మరికొన్ని వివరములు.......
🕉 ఓం నమః శివాయ🤘👏🤘_*కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే.* by MVMRAO

🤘కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది .అది ఎవ్వరికీ day
అర్థం కాదు .మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను అనుభవించాలి .నిందిస్తే
ప్రయోజనం లేదు .రమణ మహాశయులు కాశీలో
ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవాడు
ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు
గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి ,తన వెనుకనున్న కృష్ణా  తో " కృష్ణా  ! నేను
కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు
కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .ఇంతలో ఒక
ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు
మీద పడినది .కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం
చేసుకున్నాడు .కృష్ణా అప్పుడు గ్రహించాడు .
వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో
"మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద
పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు .అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా
జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్పుడో
ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే .రుణం ఎంత తొందరగా
తీరిపోతే అంత మంచింది కదా ! "అని అన్నారు .
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే .

🕉 భోజరాజు🤘🛐🌹👏
*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం —32*
🕉🌞🌎🌙🌟🚩                                                  *శని వార మహిమ -2*

 సాధారణంగా శని బాధ
 తట్టుకోవటం చాలా కష్టం.
 అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. అయితే పేద వారు చేయ లేరు కదా. నూనె తో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండకపోవచ్చు.
 ఇలాంటి వారి కోసం శ్రీ మద్రామాయణంలోని సుందర కాండలోని 48 వ సర్గను
 శనివారం ఉదయం,
 సాయంకాలం పఠిస్తే,
 శనిదేవుని అనుగ్రహం
పొందగలరు. ఖర్చులేని పని.
ఇప్పుడు ఆ సర్గలో ఉన్న విషయాన్ని తెలుసుకొందాం

ఆంజనేయుడు లంకలో ఉన్న రాక్షసులను కాలితో ,చేతులతో కొండలతో, తోకతో చంపి పారేస్తున్నాడు. రావణుడు పంపిన అక్షకుమారుణ్ణి, ససైన్యంగా హతమార్చాడు.
 చేసేది లేక, రావణుడు, ఇంద్రుని జయించి, ‘’ఇంద్ర జిత్ ‘’అనే బిరుదు పొందిన, తన పుత్రరత్నం మేఘనాదుడిని, సైన్యం తోడు ఇచ్చి, హనుమ పైకి యుద్ధానికి పంపించాడు.
పంపిస్తూ, కొడుకుతో ఇలా చెప్పాడు ‘’నాయనా !నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు .రణ వేత్తవు .ఇoద్రుడిని సునాయాసంగా గెలిచి, రాక్హస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు. బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది, అనేక దివ్యాస్త్రాలను సాధించు కొన్నావు. నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడలేరు .మూడు లోకాల్లో, నిన్ను జయించగల మగాడు లేడు. నీ చేత
 ఓడిoపబడనివాడూ లేడు.
నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది. ఏయే కాలాలలో ఏయే ప్రదేశాలలో ఏమి చేయాలో, నీకు బాగా తెలుసు. నీకు యుద్ధంలో అసాధ్యమైనది లేదు. సూక్ష్మ బుద్ధితో ఆలోచించి, కార్యసాధన చేయ గల సర్వ సమర్దుడవు .
 నీ భుజ, వీర్య ,తపోబలాలు నాతో సమానమైనవి .యుద్ధ సమయంలో నేను
 నిర్ణయించిన పని చిటికెలో, నువ్వు చేయగల వాడివి.
నువ్వు అండగా ఉండబట్టే, నేను ఇంత నిక్షేపంగా లంకా రాజ్య పాలన చేస్తున్నాను.
ఎవడో కోతి, మన మహా
 వీరులందర్నీ అశోకవనం దగ్గర ఉండి, మట్టు పెడుతున్నాడు.
అక్షయ కుమారుడిని
చంపేశాడు.
 జంబుమాలి, పంచసేనాగ్ర నాయకులు, వాడి చేతిలో మరణించారు . మన సైన్యం, దాదాపు అంతా క్షీణించి పోయింది. నువ్వే ఇప్పుడు, లంకా రాజ్యాన్ని, రక్షించ గల, ఏకైక వీరుడివి. ఎంత మంది సైనికుల్ని పంపినా, ఆ కోతి, సునాయాసంగా చంపేసి, భయం కలిగిస్తున్నాడు. వారి వల్ల, ఇక కార్యం, సానుకూల పడదు .ఆ కోతి పరాక్రమం ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఆతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో, తెలుసుకో.
 దాన్ని బట్టి, నీ దగ్గర ఉన్న సర్వాస్త్రాలను, ధైర్యంగా ప్రయోగించు. వాడిని వదించటం,తక్షణ కర్తవ్యం.
నువ్వే తగినవాడివి. నిన్ను పంపటం, నాకు సుతరామూ ఇష్టం లేకపోయినా తప్పనిసరి గా పంపువలసివస్తోoది. లంకా రాజ్య భవిష్యత్తు అంతా, నీ చేతిలో ఉంది. విజయం సాధించి, తిరిగి రా. నా ఆశీస్సులు, లంకావాసుల ఆశీస్సులు, నీకు లభించుగాక" అని చెప్పి, ఉత్సాహ పరచి, ఇంద్రజిత్ను పంపాడు

  రెట్టించిన ఉత్సాహంతో ,
ఉప్పొంగిన పరాక్రమంతో, ఇంద్రజిత్, సకలసేనా సమేతుడై, మారుతి మీదకు, యుద్ధానికి, తండ్రి ఆశీస్సులు గ్రహించి, ప్రణామం చేసి, బయల్దేరాడు. ఉప్పొంగే సముద్రంలా ఉన్నాడు.
 గరుత్మంతుని వేగంతో కదిలాడు. నాలుగు ఏనుగులున్న రధాన్ని ఎక్కాడు. సుశిక్షితులైన విలుకాoడ్రను, వెంట బెట్టుకొన్నాడు. హనుమ ఉన్న ప్రదేశానికి, క్షణాల్లో చేరాడు. అప్పడు పది దిక్కుల్లో, దుశ్శకునాలు కలిగాయి. కృూరమృగాలు అరిచాయి. వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని, మునులు,
 సిద్ధులు, సాధ్యులు, దేవతలు, అందరు, ఆకాశవీధిలో, ఉత్కంఠగాచేరి, చూస్తున్నారు .

 ఇంద్రజిత్ విచిత్ర ధ్వని కలిగేటట్లు ధనుష్టoకారం చేశాడు. హనుమ ఇంద్ర జిత్తులు, యుద్ధం ప్రారంభించారు. అతి వేగంగా ఇంద్రజిత్ బాణ ప్రయోగం చేస్తున్నాడు. మహాకాయుడు అయిన ఆంజనేయుడు, వాటిని ముక్కలు చేస్తున్నాడు.
 ఆకాశ మార్గంలో సంచరిస్తూ, అతనికి అందకుండా అసహనాన్ని కలిగిస్తున్నాడు.
 ఎన్నో రకాల శరాలను, లాఘవంగా సంధిస్తున్నాడు రావణ పుత్రుడు. వాటిని అతి తేలికగా తప్పించు కొంటున్నాడు వాయుపుత్రుడు.
అతని బాణ ధ్వని ,రాధ ధ్వని భేరీల ధ్వని విని, ఆకాశంలోకి అందనంత ఎత్తుకు యెగిరి, తప్పించు కొంటున్నాడు మారుతి. ఒకరి కొకరు తీసి పోకుండా, యుద్ధం చాలా సేపు చేశారు. ఎంత చేసినా, హనుమ ఆంతర్యం ఏమిటో, అతనికి అర్ధం కాలేదు. అతని అతి శక్తివంత మైన బాణాలన్ని, వ్యర్ధమే అయ్యాయి .
 హనుమంతుని ,ఇసుమంతైనా ఏమీ చేయలేక పోయాయి.
 హనుమను వోడించటం అసాధ్యం అని, ఇంద్రజిత్ నిర్ణయానికి వచ్చాడు .మరి ఉపాయం ? బ్రహ్మాస్త్రం ప్రయోగించి, హనుమను బంధించాలి అని, నిశ్చయించు కొన్నాడు .

మంత్రపూతంగా, బ్రహ్మాస్త్రాన్ని, హనుమపై ఇంద్ర జిత్ ప్రయోగించాడు. అరి వీర భయంకరుడైన హరి వీరుడు, బ్రహ్మాస్త్రానికి లొంగి, బంధింప బడ్డాడు . ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం. అయితే అది తనను ఏమీ చేయదు అన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది . నమస్కరించి బద్ధుడయాడు.  ఈ బ్రహ్మాస్త్ర బంధనం, తనకు మేలే చేస్తుందని, రావణుడిని చూసే ఆవకాశం కలుగు తుందని, దానితో అతని పరాక్రమం,
 వ్యూహం తెలుసుకోవచ్చునని భావించాడు. రాక్షసులు, బలాత్కారంగా పట్టి, లాగుతున్నా , ఏమీ మాట్లాడ లేదు . తప్పించుకొనే ప్రయత్నమూ చేయలేదు.
 అతని నిర్విచేష్టతను గమనించి, రాక్షసులు, హనుమ ను గొలుసులతో, నార వస్త్రాలతో, కట్టేశారు .బ్రహ్మ వరం పని చేసింది.
 బంధింపబడగానే బ్రహ్మాస్త్ర ప్రభావం, విడిచి పోయింది. వేరే బంధం ఉంటె, బ్రహ్మాస్త్ర బంధం పని చేయదు. అది హనుమకు మాత్రమే తెలుసు.ఈ విషయం ఇంద్రజిత్ అర్ధంచేసుకొన్నాడు.
 తను కష్టపడి బంధించింది అంతా వ్యర్ధమైనదని, దుఃఖించాడు .ఇక ఈ మాయా కపి వల్ల, లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని, ఊహించాడు. ఏమీ చేయలేక మౌనంగా,తండ్రి దగ్గరకు,
 సైన్యం, హనుమను ఈడ్చుకొని వస్తుంటే, చేరాడు.
 విషయాన్ని అంతటిని, తండ్రికి వివరించాడు. హనుమను చూసి, రాక్షసులందరూ ‘’చంపండి, నరకండి ‘’అని, అరుస్తున్నారు .

    హనుమ రావణ సింహాసనం దగ్గరకు వెళ్లాడు .అక్కడి పెద్దలన్దర్నీ తేరిపార జూశాడు.
 రావణుడు మంత్రులతో, ‘’ఈ కోతి ఎందుకు వచ్చిందో, తెలుసుకొండి  ‘’ అని
 ఆజ్ఞాపించాడు. వారు, హనుమను, వివరాలు అడిగారు. అప్పుడు హనుమంతుడు, ‘’నేను రామ బంటును. హనుమ నామ దేయుడిని. సుగ్రీవుని మంత్రిని.
 సీతామాత శ్రీ రాముని ఇల్లాలు.                 నువ్వు అపహరించావని తెలిసి, మా రాజు, నన్ను వెదికి ఆమె జాడ, తెలుసుకోమని దక్షిణ దిక్కుకు పంపితే, ఇక్కడ ఉందని తెలుసుకొని లంక చేరాను. దుస్తరమైన సముద్రాన్ని, ఆవ లీలగా దాటాను .ఇది నా శక్తి కాదు. శ్రీ రాముని దివ్య విభూతి మాత్రమే ..’’అని చెప్పాడు. కనుక శని పీడా బాధితులు, శనివారం నాడు, సుందరకాండలోని ఈ నలభై ఎనిమిదవ సర్గను భక్తీతో పఠిస్తే ఆ పీడ నుంచి, విరగడ పొందుతారు.
By mv MVM RAO 🌟🚩
కైవల్యం, మోక్షం, రెండూ ఒకటేనా లేక వేరు వేరా?by MVMRAO
🕉🌞🌎🌙🌟🚩
ఆత్మ-సాక్షాత్కారాన్ని" కైవల్యం" అని అంటారు.పరమాత్మ సాక్షాత్ కారాన్ని
"మోక్షం" అని అంటారు. ఆత్మస్వరూప జ్ఙానముతో పరమాత్మను తెలుసుకొని
కర్మయోగాన్ని అవలంబిస్తే మోక్షం వస్తుంది. కాయ పక్వం చెంది పండు అయినట్లే,
జ్ఙానం పండి భక్తి, ప్రపత్తి అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యవిషయం మనం గమనించాలి. ఆత్మస్వరూప జ్ఙానం, ఆత్మసాక్షాత్కారం ఒకటి కాదు. ఆత్మస్వరూపం గురించి శాస్త్రాల ద్వారా, ఉపదేశం ద్వారా తెలుసుకోవడాన్ని
ఆత్మ స్వరూపజ్ఙానం అని పిలుస్తారు. దానినే అనుభవము ద్వారా ఎరిగి
ఉండడం ఆత్మసాక్షాత్కారం అవుతుంది‌.  అలాంటి అనుభవం కలిగినప్పుడే
దాన్ని "కైవల్యం" అని అంటారు.  అద్వైత సిద్దాంతంలో, ఆత్మ సాక్షాత్కారం అంటే
"అహం బ్రహ్మాస్మి" ~ నేను బ్రహ్మను అని తెలుసుకొని ఆ ఆనందంలో మునిగి
పోవడం. అదే కైవల్యం. ముక్తుడు పరమపదం చేరుకోవడం మోక్షం.

🕉🌞🌎🌙🌟🚩
🌺ఓం నమో  భగవతే శ్రీ రమణాయ🌻

          ఒక భక్తుడు ఇలా అడిగారు .....   By MVMRAO
     స్వామి! *"విధి"* అన్నది ఉందా ? ఏది ఎలా జరుగవలెనని ఉందో అలాగే జరిగేటట్లయితే మన ప్రార్థనలవల్లా, ప్రయత్నాలవల్ల ప్రయోజనం ఉందా ? మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండవలెనా ?

      *మహర్షి ఇలా సెలవిచ్చారు* .....
               
                రెండే మార్గాలు.
  ఒకటి       -  విధిని జయించడం.
  రెండవది  -  విధి నుంచి విడిగా,
                    స్వతంత్రంగా ఉండడం.
   
                      *మొదటిది :*
   ఈ విధి ఎవరికి? అని విచారించి, అహంకారం మాత్రమే విధికి లోబడి ఉన్నదని, ఆత్మకు విధి అన్నదే లేదని, నిజానికి అహంకారానికి అస్సలు ఉనికేలేదని తెలుసుకోవడం.

                      *రెండవది :*
   తన నిస్సహాయతను గుర్తించి ఎల్ల వేళలా “ప్రభూ! నీవే సర్వమూ! నేనుకాదు. అని అనుకుంటూ నేను, నాది అన్న భావాన్ని వదలి, నిన్ను ఆయనకు ఇష్టమైన విధంగా చేసుకోమని, అహాన్ని చంపి ఆయనకు పూర్ణ శరణాగతి చెందడం. దైవం దగ్గరనుంచి అది, ఇది కావాలి అని అనుకున్నంత కాలం ఆ శరణాగతి పూర్ణంకాదు పైగా దైవం ఎడల శరణాగతి పొందడం కుదరదు.

      కానీ శరణాగతి చెందడానికి పూర్వం
పూర్వజన్మల్లోనో, ఈ జన్మలోనో మనోనాశనానికి అవసరమయ్యే అన్నిరకాల సాధనలూ, శ్రమలూ పడి అహంకారాన్ని చంపినవారికే గురువు అనుగ్రహం లభిస్తుంది.

                    🌻ఓం తత్సత్🌺                   🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻

                         భక్తుడు :
   స్వామి ! మనసు + చిత్తు కలిపి జీవుడు. ఆత్మ సిద్దిని కోరేది ఏది? దారిలో ఏది అడ్డుపడుతోంది? ఆ ఆటంకము మనసు అని, చిత్తు సహాయ పడుతుందని అంటారే!

                         మహర్షి :
   మనము మనసు + ఆత్మ ప్రతిబింబమును కలిపి జీవుడని వర్ణిస్తున్నా నిజానికి జీవితం ఆ రెంటినీ వేరుచేయ వీలుకాదు కదా!

    తెల్లగుడ్డ నుంచి తెలుపును, ఎర్రగా కాలిన ఇనుమునుంచి అగ్నిని వేరు చేయలేము అని మనం అనుకున్నాం కదా!
   
                       అదే విధంగా
               
   మనసును, చిత్తును వేరు చేయలేము. మనసు తానుగా ఏమీ చేయలేదు. అది చిత్తులో కలిసే వెలుపలికి వస్తుంది. ఆ చిత్తు లేకుండా మంచిగానీ, చెడుగానీ చేయలేదు మనసు. మంచికిగానీ, చెడుకుగానీ మనసును ప్రవర్తింపజేస్తుంటే ఆ పనులవల్ల కలిగే సంతోషంగానీ, దుఃఖంగానీ, చిత్తు ఎప్పుడూ అలాగే ఉండడంవల్ల అది వేటినీ అనుభవించదు. "కాలిన ఇనుమును సుత్తితో కొడుతున్నపుడు సుత్తి దెబ్బలు ఇనుముకేగానీ అగ్నికి కాదుకదా!"

                   🌻ఓం తత్సత్🌺

Tuesday, May 21, 2019



శ్రీ కాశీక్షేత్ర విరాజిత చింతామణి శ్వేతార్కగణపతి ధ్యానం:

త్ర్యిక్షర ప్రణవాకారం, త్రిమూర్త్యాత్మక త్రిశక్తిమూలం,  త్రిలోకార్చితపరం,ఈశంత్రిగురు రూపజ్ఞానబీజం,మహాదేవానం‌‌‌‌‌‌ద స్వరూపం, అనంతానంద ప్రదాయకం, చిదానందవిగ్రహం వందే గుహాగ్రజ శ్వేతార్క మూలం !!

సకల కార్యసిద్ధి కొరకు పఠించవలసిన ధ్యాన శ్లోకం.By I Umashankar 

100th Vardhanti SANKARARADHYAULA VARU

శివయోగి ముదిగొండ శంకరారాధ్య గారు, ఆనాటి భిన్న మతాలు,అనుకూలంగా లేని  రాష్ట్ర పరిపాలనలో కూడా మన శ్రౌత శైవ విధానానికి ఒక రూపకల్పన విధానాన్ని ఏర్పరచి..దాదాపుగా ఆ కాలంలోనే లక్షా పదివేల గణార్చణలు చేసి ఎందరో శిష్యులకు ,భక్తులకు మార్గదర్శుడైన మహనీయులు..🙏ఆ మహనీయుని అంతిమ సంస్కారములో ఆయన పల్లకీకి అలంకరించిన వస్త్రాలను  ఎందరో భక్తులు తీసుకొని  ఆ వస్త్రాలను తాయతులలో పెట్టుకొని కట్టుకొని,  మరియు ఇంట్లో భధ్రపరచారంటే ఆయన  మహిమలు , ఆయనపై భక్తి మనకి అర్థం అవుతుంది...ఇలాంటి మహనీయుల గురించి మనకు ,మన భావి తరాలకు తెలుపాల్సిన అవసరం చాలావుంది🙏అన్ని సౌకర్యాలతో మన "పీఠం" ఏర్పాటు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకి అందరూ భాగస్వాములై ఆయనను స్మరించి ధన్యులు కావల్సిన అవసరం ఉంది......ఓం  శంకరారాధ్య  గురవే నమః🙏👌 మీ...ముత్యంపేట మల్లికార్జున శర్మ👍🏻I