Sunday, May 12, 2019

🌺ఓం నమో నారాయణి🌺 forwaded by MVMRAO

భక్తుడు ఇలా అడిగారు....

  అమ్మా! కొందరు కోరతారు, వారికి లభించదు. కొందరు దానిని (భగవదనుగ్రహం) గురించి వ్యాకులత చెందనప్పటికీ వారికి లభిస్తుంది. దీని అర్థం ఏమిటి?

మాతృదేవి ఇలా సెలవిచ్చారు...

    నాయనా! భగవంతుడు చిన్నబిడ్డ లాంటి నైజం గలవారు. కొందరు అర్థిస్తారు కానీ, వారికి ఇవ్వరు. కొందరు కోరనప్పటికీ వారికి బలవంతంగా కట్టబెడతారు.

    "బహుశా వీరు గతజన్మలలో ఎన్నో సత్కర్మలు చేసి ఉంటారు. అందుకే వీరికి భగవదనుగ్రహం కలిగి ఉంటుంది".

🌺శ్రీ శారదామాత వచనామృతం🌺

 🌺ఓం నమో నారాయణి🌺

భక్తుడు: అమ్మా! అలా అయితే భగవదనుగ్రహంలో కూడా పక్షపాతం ఉన్నట్లే కదా?

మాతృదేవి: లేకేం! నాయనా! ఉంది. ప్రారబ్ద కర్మ ననుసరించే అది ఉంటుంది. కర్మఫలం తీరగానే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. అదే ఆ వ్యక్తి ఆఖరి జన్మ.

🌺శ్రీ శారదా మాత వచనామృతం🌺


🌺ఓం నమో నారాయణి🌺

భక్తుడు: అమ్మా! అనుభూతి పొందడానికి సాధనలు, కర్మఫలం, సముచిత తరుణం అనేవి అవసరమని నేను అంగీకరిస్తాను. కానీ, భగవంతుడు మన సొంతమైనప్పుడు ఆయన ఇష్టపడితే దర్శనం ఇవ్వవచ్చు కదా!

మాతృదేవి: అది సరే నాయనా! కానీ, భగవంతుడు నా సొంతమనే ప్రగాఢ విశ్వాసం ఎందరికి ఉంది? ఒకటి కాకపోతే మరొకటి అందరూ చేసే తీరాలి. అందువలన సాధనలు అనుష్టిస్తారు. కానీ భగవంతుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది?

 🌺శ్రీ శారదామాత వచనామృతం🌺* తల్లితండ్రుల గొప్పతనం

తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం

01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.

02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0

03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.

04. సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.

05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.

06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం

08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.

09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే  అని ధర్మశాస్త్రం చెబుతోంది.

10. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.🍁🍁

No comments:

Post a Comment