Friday, May 31, 2019

*హిందూ పురాణాలు - వాయు తత్వం - వైజ్ఞానిక విశ్లేషణ :*

వాయువు గురించి వేదం, పౌరాణిక సాహిత్యం చెప్తున్న మొత్తం సారం ఒక చోటికి చేర్చి చూస్తే..... అవన్నీ వాయువును ఒక పదార్ధ తత్వంగానే చూసి దాని లక్షణాల్ని అలంకారిక పరిభాషలో వర్ణిస్తున్నట్టు అర్ధం అవుతుంది - వాయుదేవుడు అని సంబోధించినప్పటికీ అక్కడి వర్ణనలు మానుష దేహానికి సరిపోనందువల్ల, అక్కడ వేదం మానుష దేహాన్ని కాక ఒక శక్తి స్వరూపాన్ని వర్ణిస్తున్నట్టు తెలిసిపోతూ ఉంటుంది.

వాయ వాయాహి దర్శతే మే సోమా అరంకృతాః తేషాం పాహి శ్రుధీ హవం
(ఋగ్వేదం 1వ మండలం 2వ సూక్తం 1వ మంత్రం)

ఇక్కడ వేదం వాయువును దేవతలలో ప్రథమాగామి అని సంబోధిస్తున్నది.అంటే, ఈశ్వర విభూతులైన పాంచభౌతిక జన్యమైన దృశ్యమాన ప్రపంచంలో వాయువు అనే ప్రాకృతిక శక్తికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నది. నిరుక్తం కూడా వాయు అనే పదానికి "గతికర్మణః గత్యర్ధక వాతేః వాగతి" అని నిర్వచిస్తున్నది.

వాయు పురాణం వాయువు గురించి మరికొంత విస్తరించి చెబుతుంది."ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, నివహ, పరివహ, పరావహ అనే ఏడు స్కంధములందు వాయుదేవుడు సదా సంచరించుచండును. సప్త మరుద్గణములు ఆయన అధీనమున ఉండును." అని చెప్పటంలో వాయువు యొక్క మానుష దేహాన్ని కాక ఏడు రకాల వాయు చలనాలను సూచించటమే ముఖ్యం, కదా!


   మన దేశపు మెకాలేయులకు అర్ధం కావాలంటే ఇక్కడ చెప్పినవి వాయువు అనే పదార్ధ తత్వం విశ్వంలో చూపించే ప్రభావాల యొక్క combinations and permutations అని చెబితే చాలు.

"అగ్ని, జల, పృధ్వి అనే మూడు భూతములచే రచించబడిన ప్రాణుల శరీరమునకు ప్రాణము పోసి, ఆహారమును జీర్ణము చేయుటలో అగ్నికి సహకరించుచు ప్రాణులను ధరించుచున్నాడు" అని చెప్తున్న దాని ప్రకారం జీవులకీ నిర్జీవులకీ భేదాన్ని చాలా స్పష్టమైన రీతిలో గుర్తించవచ్చు.పరిమాణం పెరగడం తరగడం కొన్ని కారణాల వల్ల నిర్జీవులలోనూ సంభవమే, కానీ శ్వాస మాత్రం ఉండదు.వాయువు జీర్ణక్రియకు సహాయం చెయ్యడం అంటే ఆహారం కణస్థాయిలో ఆమ్లజనితో కలిసి మండడం - మోడర్న్ సైన్సు దీన్ని ఖండిస్తుందా?

ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టి చెబుతున్న ఎలెక్ట్రాన్ ఈ వాయువు యొక్క అన్ని లక్షణాల్నీ ప్రదర్శిస్తున్నది.గాలి వీచడం దగ్గిర్నుంచీ పిడుగులు పడటం వరకు ప్రకృతిలో కలిగే ప్రతి చలనం వెనక ఎలెక్ట్రాన్ ప్రమేయం ఉంటుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది.అన్నింటికన్న ముఖ్యం ఎలెక్ట్రాన్ ఏడు శక్తిస్థాయుల(orbitals)లోనే సంచరించడం వేదం యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది!మీరు చిన్నప్పుడు చదువుకున్న సైన్సును ఒకసారి గుర్తు చేసుకోండి:

1s2
2s2 2p6
3s2 3p6 3d10
4s2 4p6 4d10 4f14
5s2 5p6 5d10 5f14
6s2 6p6 6d10 6f14
7s2 7p6 7d10 7f14

పదార్ధవిజ్ఞానశాస్త్రం ఎప్పుడు చెప్పింది?వేదవిజ్ఞానశాస్త్రం ఎప్పుడు చెప్పింది?ఒక్క వాయువు గురించి ఇక్కడ చెప్పినది వేదంలో ప్రస్తావించబడిన ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది.వైదిక విజ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండింటిలోనూ సామాన్యుల సుఖజీవనానికి ఉపయోగపడే వస్తువులను తయారుచేసేది సాంకేతిక పరిజ్ఞానం - కానీ సూత్రాలు,విశ్లేషణ వంటివాటితో కూడిన శాస్త్రం  పునాదిగా ఉండి తీరాలి!వైదిక సాహిత్యం మొత్తం శాస్త్రం,దాన్ని as it is ఉపయోగించుకోలేకపోవటంలో వింత ఏముంది?

చలనానికి కారణమైన వాయువును ఎక్కడ చూసినా వాయుదేవుడు అని పిల్చారే తప్ప వాయుదేవత అని పిలవలేదు, ఎందుకని?సంపదకు కారణమైన లక్షిని దేవి అని పిల్చారే గానీ దేవుడు అని పిలవలేదు, ఎందుకని?మొదటిది dynamic energy రెండోది static energy కాబట్టి!లక్ష్మీ నారాయణుల్నే ఒక జంటను చెయ్యడం దేనికి? static lattice energy, dynamic combussion enerrgy విశ్వం యొక్క స్థిరత్వం అనే అంశానికి చెందిన రెండు పార్శ్వాలు కాబట్టి!బ్రహ్మ-సరస్వతి, శివుడు-పార్వతి, ఇంద్రుడు - శచి వంటి జంటల వెనక ఉన్నది కూడా అదే - ఇది తెలియని వాళ్ళు వాళ్ళకి మానుష దేహాలకి సంబంధించిన శృంగార వ్యభిచారాదులని అంటగడుతున్నారు. కధా రూపంలో ఉండే పౌరాణిక సాహిత్యం కొన్ని పాత్రల్ని ఇవే పేర్లతో సృష్టించటానికి ఉన్న కారణాల్ని తెలుసుకోవాలి తప్ప ఆ పాత్రలనే ఈ దేవతలని భావించి అవేశపడ రాదు - అందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు!By MVMRAO 

No comments:

Post a Comment