🌸🌸 *ఉత్తములుండే ప్రదేశం*🌸🌸
ఉత్తములు ఎక్కడుంటే అక్కడ ఉల్లాస భరిత వాతావరణము ఉంటుంది. సాధుస్వభావులు ఉన్న చోట శాంతం మూర్తీభవిస్తుంది.
ఆ పరిసరాలూ ప్రశాంతంగా
వుంటాయి. దుష్టులకు దూరంగా వుండమనడంలో
అంతరార్ధం అదే. పూవుల
పరిమళం పూల చుట్టూనే
వున్నట్లుగాను. మనిషి తత్వం అతన్ని చుట్టి వుంటుంది. అ తనితో బాటే సాగుతుంది. మహానుభావుల
పాద ధూళి విలువ ఎప్పుడూ
పవిత్రమైనది. బుద్ధుడు యే
ఋతువు లో ఎక్కడికి వెళ్లినా
అతని పరిసరాలు ప్రకాశించేవి.
" శిశిరములో కూడా ఆకులు
రాలిన చెట్లు మోడు లయినా
బుద్ధుని పాదము అక్కడ
పెట్టిన. చెట్లన్నీ చిగురించి
పూలు పూచి కళ కళ లాడే
వట. అట్లాగే ధర్మరాజు శాంత మూర్తి. ధర్మానికి కట్టు
బడినవాడు. నెమ్మదితనం
ఉన్నవాడు. ఆయన ఉన్న
పరిసరం శాంతితో నిండి
పోయేది. భారత యుద్ధము
అనంతరం స్వర్గారోహణము
చేస్తూ ధర్మరాజు వెళుతున్నప్పుడు మార్గ మధ్యం లో నరకం పక్కగుండా ఆయన నడుస్తున్నా డు. నరకం చాలా దారుణంగా వుంది. చూడడానికి భయోత్పాతంగా వుంది.
మనుష్యుల్ని చిత్ర హింసలు
పెట్టడం, నూనెలోకాల్చడం,
మంటల్లో వేయడం వంటివి
అనేక దారుణాలతో నిండి
వుంది. అవన్నీ పాపులు
చేసిన కర్మలకు పాప ప్రతి
ఫలాలు. దాంతో నరకంలో
భరించలేని వేడి. ధర్మరాజు
నరకము ప్రక్కనుండి వెళుతూ ఉంటే ఆయన శరీరంలో నుంచి ఆ చలువదనం. ప్రసరించి నరకము
అంతా, పిల్లగాలి వ్యాపించి
వాతావరణంలో ఆహ్లాదాన్ని పాపులందరూ అనుభవించారు. ఎందుకిలా
జరిగిందని చూస్తే ప్రక్కగా
ధర్మరాజు వెళుతున్నాడు.
దాంతో నరక వాసులందరూ
పరుగెత్తుకుంటూ వచ్చారు.
స్వామీ! మీరు అడుగుపెడితేనే మేము ఇంత ఆహ్లాదం
పొందాము.చల్లనివాతావర
ణముతో ఈ పరిసరం నిండిపోయింది. దయచేసి
మీరు కొంతకాలం ఇక్కడ
ఉంటే మేము ఎంతో
ప్రశాంతతని అనుభవిస్తాము
స్వామీ! అనుక్షణం. చిత్రహింసలను అనుభవించే
వాళ్ళము . మీరు మమ్మల్ని
కరుణించి ఇక్కడ ఉంటే మా
పాపాల కు విముక్తి కూడా
కలుగుతుంది. అని వేడుకొన్నారు. ధర్మరాజు చిరు
నవ్వుతో వారి ప్రార్థన మన్నించి అక్కడ కొంత
కాలం ఉండుటకు అంగీకరించాడు. కానీ ఆయన అలా అక్కడ ఉంటే పరిస్థితులు తల్లక్రిందులవుతాయి కదా!
ఇంక స్వర్గానికి ,నరకానికి
తేడా వుండదు. పాపులకు
శిక్ష ఉండదు. ధర్మరాజు వల్ల
ధర్మమే తల కిందులయ్యే
ప్రమాదం ఏర్పడింది.యెంత
కాలానికి ఆయన రాకపోయే
సరికి దేవదూతలు అక్కడ కి
వచ్చారు. ధర్మరాజా ! మీరు
ఇక బయల్దేరండి , మనం
స్వర్గానికి వెళదాం అన్నారు.
అప్పుడు ధర్మ రాజు నేను ఇక
స్వర్గంలో అడుగు పెట్టలేను
నేను చేసిన పుణ్యమంతా
ఈ నరకవాసులకి ఇచ్చాను.
నేను ఇక్కడే ఉండిపోతాను.
అన్నాడు . దేవదూతలు
ధర్మరాజా! మీరు కడు పుణ్యాత్ములు, ధర్మాత్ములు.
మీరే పుణ్యం ఇచ్చినా అది
తరిగేది కాదు. ఇచ్చే కొద్దీ
పెరిగేది అది కొంతకాలం
మీ దయ వల్ల ఈ నరక
వాసులు. ప్రశాంతత పొందారు
ఇక చాలు. దయచేసి మీరు
బయల్దేరండి అన్నారు.
ధర్మరాజు సెలవు తీసుకుని
స్వర్గయాత్రకు వెళ్ళాడు.
సృష్టికి విరుద్ధంగా ఏ పని
చెయ్యకూడదు. కానీ కొంత
తను చెయ్య గలిగినది చేసాను అని తృప్తి పడ్డాడు
ధర్మరాజు. ఋష్య శృంగుని
పాదమహిమ అటువంటిదే.
ఆయన పాదము మోపిన
చోట కరువు కాటకములు
ఉండవు. వానలు కురిసి
సుభిక్షంగా ఉంటుంది.
మహానుభావు లందరికి నమో
వాకములతో.....
By MVMRAO
🙏🙏🙏👏👏👏

No comments:
Post a Comment