Thursday, May 9, 2019

*🍀అష్ట విధం బ్రాహ్మణ్యం🍀*

"మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్
అనూచానః తథాభౄణః ఋషికల్పః ఋషిర్మునిః"
 (స్కాంద పురాణం)

 *మాత్రకుడు*
1)బ్రాహ్మణోదరేజాతః అనుపనీతః క్రియాశున్యతం, జాతి మాత్రేణ మాత్రః
’మాత్ర’కుడు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, ఉపనయనం జరగనివాడు, సరియైన సమయంలో ఉపనయనం జరగని కారణం చేత సంధ్యావందనాది నిత్య కర్మలను చేయని కారణాన క్రియా శూన్యుడు, కేవలం జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడుగా తెలియబడేవాడు / లేదా పుట్టుకవలన మాత్రమే బ్రాహ్మణుడుగా తెలియబడుతున్నవాడు.

*ద్విజుడు*
2) సంస్కారేణ సంస్కృతః ద్విజముచ్యతే - పైన తెలిపిన బ్రాహ్మణుడు ఉపనయన సంస్కారముతో సహా అప్పటి వరకు అన్ని సంస్కారములను శాస్త్రోక్తంగా నిర్వహించి సంస్కరింబడినందున, ఉపనయనానంతరము రెండవజన్మగా సంస్కరింపబడినవాడగుట వలన ద్విజుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు.

*శ్రోత్రియుడు*
3)జన్మ సంస్కార విద్యాభి త్రిభః శ్రోత్రియః - పైన తెలిపిన రెండు విధములైన బ్రాహ్మణత్వమును పొంది వేదవిద్యను (శ్రుతిని చదువుకున్నవాడు) పొందిన తరవాత శ్రోత్రియుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు.

*అనూచానుడు*
4)వేదవేదాంగ తత్వజ్ఞః శుద్ధాత్మా, పాపవర్జితః, శ్రేష్ఠః ప్రాజ్ఞ అనూచానః - శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు వేదాలను ఉపాంగాలతో సహా నేర్చుకొని, అందులోని తత్త్వాన్ని తెలుసుకొని, నిర్మలమైన ఆత్మ కలవాడైనందువల్ల పాపములు లేనివాడై, అందరికీ శ్రేష్ఠుడై, ప్రాజ్ఞతను పొందినబ్రాహ్మణుడు అనూచానుడని తెలియబడుతున్నాడు.

*భౄణుడు*
5)అనూచానః, యజ్ఞస్వాధ్యాయ యంత్రతః భౄణః - అనూచానుడై, యజ్ఞములను స్వాధ్యాయములను దాటనివాడు భౄణుడని తెలియబడుతున్నాడు.

*ఋషి*
6)మంత్ర మంత్రార్థ విద్, ప్రాజ్ఞః, వానప్రస్థః, తపస్వీ ఋషిః - మంత్రమును తెలుసుకొని, దాని అర్థాన్ని అది ప్రతిపాదించే తత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, ప్రాజ్ఞ్యుడైనవాడు, వాన ప్రస్థాశ్రమమునందుండు వాడు, తపస్సు యందు మక్కువ కలవాడు ఋషి అని తెలియ బడుతున్నాడు,
వాళ్ళు మంత్ర ద్రష్టలుగా, మంత్రార్థముల ద్రష్టలుగా తెలియబడుతారు.

*అధిక్రాంతం*
7.తపసా మానుష్యం అధిక్రాంతం: ఋషులను మామూలు మనుష్యులకన్నా పై స్థాయిలో చూస్తారు, అందుకే దేవతలతో పాటు ఋషులకూ తర్పణలుంటాయి. తపస్సు చేత మనుష్యత్వాన్ని దాటి ఋషిత్వాన్ని పొందుతారు.
ఈ ఋషిలలో మళ్ళీ స్థాయీ భేదాలిలా ఉంటాయి... ఋషి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి.

*ముని*
8)ఆత్మత్వమననాత్ మునిః - ఇవన్నీ దాటి ఆత్మ తత్వమునే మననం చేసే స్థితి కలిగినవాడు ముని అని తెలియబడుతున్నాడు.

No comments:

Post a Comment