🌸 *శ్రీమద్భాగవతము* 🌸by MVMRAO
🌻 మగవాని దేహమును ధరించిన జీవుడు నిరంతరముగా స్ర్తీ సాంగత్యమును అనుభవించినచో స్ర్తీయై పుట్టును. స్ర్తీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకు డబ్బు సంపాదించును కుటుంబ వస్తువులు సమకూర్చుకొనును. స్ర్తీ వలన సంతతి కలుగును. వీరందరు ఉండుటకు గృహము ఆవశ్యకము. ఇన్నిటికిని కారణము కాంతయే.
స్ర్తీ దేహము ధరించిన జీవుడు మరల నా మాయచే పురుషుడుగా పుట్టి ధన సంపాదనాదులను చేయును. స్ర్తీ కూడ భర్త కొరకే అన్నిటిని సమకూర్చుకొనవలెను. కనుక పురుష రూపధారియైనవాడు భర్త అనబడి స్ర్తీకి సంసారబంధ కారణమగును. సంసార బంధమే మృత్యువు.
లింగదేహము జీవునకు ఆధారముగా నిలిచి యున్నది. (లింగదేహమనగా తన నామము, రూపము, బంధుత్వము, ఆస్తి మొదలగు వాని స్మరణరూపమైన దేహము Identities Consciousness. ఇచ్చట లింగమనగా చిహ్నమని అర్థము. తనను గూర్చి తానెరిగిన స్మృతులన్నియు ఒక ముడివలె ఏర్పడినదే లింగదేహము)
దాని వలన పాంచభౌతిక శరీరమున ఉండి ప్రజ్ఞ అనేక లోకములలో విహరించును. కూడబెట్టుకొనిన కర్మఫలము అనుభవించుచుండును. ఈ అనుభవముల వలన మరల కర్మల యందు ఆసక్తి పుట్టుచుండును. జీవునకు మనస్సు, ఇంద్రియములు, పంచభూతములతో నిండిన దేహము సుఖములను అనుభవించుటకు సాధనమైనను ఆ సుఖాసక్తి వలననే మృత్యువును కలిగించును.
ఏ దేహము సుఖములను ఇచ్చునో ఆ సుఖముల వలన ఆ దేహమే శుష్కించుటయు నశించుటయు జరుగును. అడవిలో వేటకాడు జంతువులకు సదుపాయములైన ఆకర్షణలను సమకూర్చి ఆ జంతువులను చంపుచున్నాడు కదా! ఇట్టి దేహము తొలగుటయే మరణము. పుట్టుటయే జననము. (అంతకన్న జీవికి జనన మరణములు లేవు.)
కన్ను యొక్క పరిమితిని బట్టియే చూడగగలుగుట యుండును. (కొందరిలో చూచినదానిని చూచినంత వరకే గ్రహింపగలరు. మరికొందరు చూచి అనేక విషయములను గ్రహింపగలరు.) చూడగలిగిన యోగ్యతను అనుసరించి జీవునకు మరణము లేదని తెలియును.
(దేహము వరకే చూడగలిగినచో జననమరణములు ఉన్నవని తెలియును. దేహము యొక్క వృత్తాంతమును దర్శింపగలిగినచో జనన మరణములు లేవని తెలియును.) కనుక భయము, లోభము, దీనత అనావశ్యకములు. కంగారుపడనక్కర లేదు. జీవుని వృత్తాంతమును సమగ్రముగా తెలిసి, జీవుడు ధీరుడై సంగమును విడుచును. యోగాభ్యాసముతో వైరాగ్యము ఆర్జించి, సక్రమమైన సంపూర్ణజ్ఞానమును పొంది వర్తింపవలెను.
మాయచే ఏర్పడిన లోకమున పుట్టి పోవుచుండు దేహాదుల యందు ఆసక్తి మాని జీవింపవలెను.............
🌻 నిర్మలమైన అనంతుడు అనబడు ఆది శేషుని శయ్యపై యోగ నిద్రలో హరి ఉన్న వేళ సర్వలోకములును వాని యందు లయమై ఉండును. అట్టి సర్వేశ్వరుని గూర్చియే మహానుభావులు ధ్యానింతురు.
(పై చెప్పిన ధూమ మార్గము వారు గాక మోక్ష మార్గము వారి ధ్యానము ఇచ్చట చెప్పబడినది. వారి మనస్సు భౌతిక జీవితము యొక్క సుఖదుఃఖముల సర్దుబాట్లను గూర్చి ఆలోచింపక వాని యందు అంతర్యామిగా వెలుగుచున్న నారాయణుని ధ్యానించును. దానికి ధూమలక్షణము ఉండదు.
పొగలో కూడ అంతర్యామిని ధ్యానించునపుడు పొగ అనునది వేరొక స్థితి కాదు. అట్లే దేహేంద్రియాదుల యందు అంతర్యామిని ధ్యానించినచో దేహేంద్రియాదుల మాలిన్యము ఉండదు. నిర్మల స్థితి ఉండును. ఆద్యంతములు ఉండవు. అదియే అనంతుడు లేక శేషుడు. దేహము శయ్యగా అంతర్యామి శయనించి యుండును. తన యందు తాను మేల్కొని యుండును కనుక ఇంద్రియములకు, మనస్సునకు నిద్ర వంటి స్థితి ఉండును. ఇదియే యోగ నిద్ర.
మనస్సుపై ఆధారపడి జీవించువానికి పూర్తి నిద్ర వచ్చును; దానినే సుషుప్తి అందురు. తన యందు మేలుకొని యున్నవానికి యోగ నిద్ర ఉండును. అట్టి స్థితిలో ఇంద్రియములు, మనస్సు, దేహప్రవృత్తులు తనలో భాగమై వేరుగా అస్తిత్వము లేకుండును కనుక వానికి అది లయస్థితి లేక ప్రళయస్థితి అందురు. ఈ సాధన చేయువారి ఆనందము లింగశరీరముపై ఆధారపడదు కనుక దేహజననము, దేహత్యాగము అనువానిపై ఆధారపడదు. అనగా వారికి జన్మలుండవు.)
సమస్త సంగములను పరిత్యజించి, ముక్తి పొందువారు తమ భక్తిసాధనలో సమస్త ధర్మములను విష్ణువునందు సమర్పణము చేయుదురు. శాంత మనస్సుతో ఉందురు. విష్ణుమూర్తి కన్నా ఇతరము నందు మనస్సు వారికి ప్రసరింపదు. సందులేని విష్ణుధ్యానమే వారి యందు నిలిచియుండును.
(దైత్యులు ఇంద్రియ మనః ప్రవృత్తులలో దుష్ట సంకల్పముగా పుట్టుచున్నారు. వారికి స్థానము ఉండదు కనుక విష్ణుని ధ్యానించుట దైత్యులను సంహరించు వాని ధ్యానమే అగును.)......
🌻 వారికి అహంకార మమకారములు లేవు. అయినను వారి కుతూహలము నారాయణునిపై వర్తించును. వారి దేవుడు అర్చనాది మార్గమున గోచరించువాడు. లోకమందలి మహనీయ చరిత్రములన్నియు వానివే.
అందరి ముఖములు వాని ముఖములే. కీర్తిమంతుల కీర్తి అతడే. సృష్టి స్థితి లయములు అతని యందే తోచుచున్నవి. అతడున్నాడు కాని పుట్టడు. అతడు ప్రకృతి యందును పురుషుని యందును ఉన్నాడు. వానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. ఈ అతీతుడే పురుషోత్తముడనబడును. ఇట్టి లక్షణములతో నారాయణుని అర్చించి, ఇక తిరిగి రాని మార్గమున దివ్యతేజస్సుతో వెలుగొందు చుందురు. వారికి జన్మములు లేవు. వారే నిత్యసూరులు.
కొందరు దేవుడను పేరుతో హిరణ్యగర్భుని కొలుచుచున్నారు. (దేవుని యీ సృష్టి యందు అంతర్యామిగా మాత్రమే కొలుచుచు దీనికి అతీతుడగు పురుషోత్తముని ఆశ్రయింపనివారు.) వారు సత్యలోకమున ఉండి చతుర్ముఖుని పరమాత్మగా ధ్యానించుచున్నారు. వారు చతుర్ముఖుడు బ్రతికియున్నంత వరకు వాని యందు సత్యలోకమున ఉందురు. రెండు పరార్థములు పూర్తియైన వెంటనే బ్రహ్మకు ప్రళయము వచ్చును. అంతవరకు వారు బ్రహ్మయందుందురు. ఇంతలో బ్రహ్మ లయమగుటతో పంచభూతములు, మనస్సు, ఇంద్రియములు, తన్మాత్రలు, వాని లోకములు కూడ సర్వేశ్వరుని యందు లీనమగును.
అపుడు వారు బ్రహ్మలోకము పైన అభిమానము వదలి బ్రహ్మతో కూడి, పురాణపురుషునిలో ప్రవేశించి లీనమగుచున్నారు.
(సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రము పూజింపగలవారు సృష్టియు, సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై యుందురు. అటుపైన సృష్టితో పాటు నారాయణుని యందు లీనమగుదురు.).......
🌻 (సృష్టిలో అంతర్యామిగా ఉన్న దేవుని మాత్రము పూజింపగలవారు సృష్టియు, సృష్టికర్తయు లీనమగు వరకు ప్రజ్ఞామయులై యుందురు. అటుపైన సృష్టితో పాటు నారాయణుని యందు లీనమగుదురు.
దీనికొక ఉదాహరణము. మన భూమిపైన ఒక మహానుభావుని దేహమున ఎములలో ఉన్న సున్నము కూడ మహానుభావునితో పాటు గౌరవింపబడును. అతడు దేహమును వదిలిన వెనుక అది భూమిలోని ఖనిజముల యందలి సున్నముతో కలియును. ఖనిజములలోని సున్నము అట్లుగాక ఎందరోమహానుభావుల ఎముకలుగా ఐనను సేవ చేయగలదు.
భూమిలోని సున్నము వంటి వారు పరబ్రహ్మమును ఆరాదించువారు. మహానుభావుని ఎముకలలోని సున్నము వంటి వారు హిరణ్యగర్భుని ఆరాధించువారు. ఈ భేదము తెలియుటకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగము ప్రసాదింపబడినది.)
కనుక నీవు సర్వజీవుల హృదయ పద్మముల యందున్న పరబ్రహ్మమునే సర్వభావములతో శరణాగతి చేయుము. అతని అనుభవము ఎల్ల యెడల వినబడుచుండును.
(వాక్కును ఉచ్చరించి విన్నచో అతడు వాక్స్వరూపుడై వినబడును. అందరి కంఠధ్వనులలో శబ్ద బ్రహ్మ స్వరూపుడై తనను ఉచ్చరించుచున్న మూర్తిగా దర్శనమిచ్చును.) అతనిని గూర్చి ఒక లోపము చెప్పుటకు వీలులేదు. కంటికి ఏ సాధనములు అక్కరలేకయే సూటిగా పొరలుదాటి అతడు సర్వ జీవులుగా దర్శనమిచ్చుచుండును. అతనికి సుఖదుఃఖములుగాని, జనన మరణములు గాని, వ్యక్తావ్యక్త స్థితులు గాని లేవు. అతనిని పురుషుడని భావించి శరణాగతి పొందుము.
(దేవహూతికి పురుషుడు తన భర్త. కనుక కర్దమ ప్రజాపతిని ధ్యానించి నారాయణుని మోక్షస్థితి పొందుమని అభిప్రాయము. కపిలాచార్యుడు గురువై సర్వమును ఉపదేశించినను, జీవునకు నారాయణునకు గల సంబంధము భార్యా భర్తల సంబంధము వంటిది. కనుక దేవహూతి కర్దమ ప్రజాపతినే ధ్యానించి మోక్షము పొందవలెను. కపిలాచార్యుని తనకు ఇచ్చినది కూడా కర్దముడే కదా!
దైవమును అందించువాడే గురువు.)....... b

No comments:
Post a Comment