Wednesday, May 22, 2019

*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం —32*
🕉🌞🌎🌙🌟🚩                                                  *శని వార మహిమ -2*

 సాధారణంగా శని బాధ
 తట్టుకోవటం చాలా కష్టం.
 అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. అయితే పేద వారు చేయ లేరు కదా. నూనె తో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండకపోవచ్చు.
 ఇలాంటి వారి కోసం శ్రీ మద్రామాయణంలోని సుందర కాండలోని 48 వ సర్గను
 శనివారం ఉదయం,
 సాయంకాలం పఠిస్తే,
 శనిదేవుని అనుగ్రహం
పొందగలరు. ఖర్చులేని పని.
ఇప్పుడు ఆ సర్గలో ఉన్న విషయాన్ని తెలుసుకొందాం

ఆంజనేయుడు లంకలో ఉన్న రాక్షసులను కాలితో ,చేతులతో కొండలతో, తోకతో చంపి పారేస్తున్నాడు. రావణుడు పంపిన అక్షకుమారుణ్ణి, ససైన్యంగా హతమార్చాడు.
 చేసేది లేక, రావణుడు, ఇంద్రుని జయించి, ‘’ఇంద్ర జిత్ ‘’అనే బిరుదు పొందిన, తన పుత్రరత్నం మేఘనాదుడిని, సైన్యం తోడు ఇచ్చి, హనుమ పైకి యుద్ధానికి పంపించాడు.
పంపిస్తూ, కొడుకుతో ఇలా చెప్పాడు ‘’నాయనా !నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు .రణ వేత్తవు .ఇoద్రుడిని సునాయాసంగా గెలిచి, రాక్హస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు. బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది, అనేక దివ్యాస్త్రాలను సాధించు కొన్నావు. నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడలేరు .మూడు లోకాల్లో, నిన్ను జయించగల మగాడు లేడు. నీ చేత
 ఓడిoపబడనివాడూ లేడు.
నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది. ఏయే కాలాలలో ఏయే ప్రదేశాలలో ఏమి చేయాలో, నీకు బాగా తెలుసు. నీకు యుద్ధంలో అసాధ్యమైనది లేదు. సూక్ష్మ బుద్ధితో ఆలోచించి, కార్యసాధన చేయ గల సర్వ సమర్దుడవు .
 నీ భుజ, వీర్య ,తపోబలాలు నాతో సమానమైనవి .యుద్ధ సమయంలో నేను
 నిర్ణయించిన పని చిటికెలో, నువ్వు చేయగల వాడివి.
నువ్వు అండగా ఉండబట్టే, నేను ఇంత నిక్షేపంగా లంకా రాజ్య పాలన చేస్తున్నాను.
ఎవడో కోతి, మన మహా
 వీరులందర్నీ అశోకవనం దగ్గర ఉండి, మట్టు పెడుతున్నాడు.
అక్షయ కుమారుడిని
చంపేశాడు.
 జంబుమాలి, పంచసేనాగ్ర నాయకులు, వాడి చేతిలో మరణించారు . మన సైన్యం, దాదాపు అంతా క్షీణించి పోయింది. నువ్వే ఇప్పుడు, లంకా రాజ్యాన్ని, రక్షించ గల, ఏకైక వీరుడివి. ఎంత మంది సైనికుల్ని పంపినా, ఆ కోతి, సునాయాసంగా చంపేసి, భయం కలిగిస్తున్నాడు. వారి వల్ల, ఇక కార్యం, సానుకూల పడదు .ఆ కోతి పరాక్రమం ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఆతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో, తెలుసుకో.
 దాన్ని బట్టి, నీ దగ్గర ఉన్న సర్వాస్త్రాలను, ధైర్యంగా ప్రయోగించు. వాడిని వదించటం,తక్షణ కర్తవ్యం.
నువ్వే తగినవాడివి. నిన్ను పంపటం, నాకు సుతరామూ ఇష్టం లేకపోయినా తప్పనిసరి గా పంపువలసివస్తోoది. లంకా రాజ్య భవిష్యత్తు అంతా, నీ చేతిలో ఉంది. విజయం సాధించి, తిరిగి రా. నా ఆశీస్సులు, లంకావాసుల ఆశీస్సులు, నీకు లభించుగాక" అని చెప్పి, ఉత్సాహ పరచి, ఇంద్రజిత్ను పంపాడు

  రెట్టించిన ఉత్సాహంతో ,
ఉప్పొంగిన పరాక్రమంతో, ఇంద్రజిత్, సకలసేనా సమేతుడై, మారుతి మీదకు, యుద్ధానికి, తండ్రి ఆశీస్సులు గ్రహించి, ప్రణామం చేసి, బయల్దేరాడు. ఉప్పొంగే సముద్రంలా ఉన్నాడు.
 గరుత్మంతుని వేగంతో కదిలాడు. నాలుగు ఏనుగులున్న రధాన్ని ఎక్కాడు. సుశిక్షితులైన విలుకాoడ్రను, వెంట బెట్టుకొన్నాడు. హనుమ ఉన్న ప్రదేశానికి, క్షణాల్లో చేరాడు. అప్పడు పది దిక్కుల్లో, దుశ్శకునాలు కలిగాయి. కృూరమృగాలు అరిచాయి. వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని, మునులు,
 సిద్ధులు, సాధ్యులు, దేవతలు, అందరు, ఆకాశవీధిలో, ఉత్కంఠగాచేరి, చూస్తున్నారు .

 ఇంద్రజిత్ విచిత్ర ధ్వని కలిగేటట్లు ధనుష్టoకారం చేశాడు. హనుమ ఇంద్ర జిత్తులు, యుద్ధం ప్రారంభించారు. అతి వేగంగా ఇంద్రజిత్ బాణ ప్రయోగం చేస్తున్నాడు. మహాకాయుడు అయిన ఆంజనేయుడు, వాటిని ముక్కలు చేస్తున్నాడు.
 ఆకాశ మార్గంలో సంచరిస్తూ, అతనికి అందకుండా అసహనాన్ని కలిగిస్తున్నాడు.
 ఎన్నో రకాల శరాలను, లాఘవంగా సంధిస్తున్నాడు రావణ పుత్రుడు. వాటిని అతి తేలికగా తప్పించు కొంటున్నాడు వాయుపుత్రుడు.
అతని బాణ ధ్వని ,రాధ ధ్వని భేరీల ధ్వని విని, ఆకాశంలోకి అందనంత ఎత్తుకు యెగిరి, తప్పించు కొంటున్నాడు మారుతి. ఒకరి కొకరు తీసి పోకుండా, యుద్ధం చాలా సేపు చేశారు. ఎంత చేసినా, హనుమ ఆంతర్యం ఏమిటో, అతనికి అర్ధం కాలేదు. అతని అతి శక్తివంత మైన బాణాలన్ని, వ్యర్ధమే అయ్యాయి .
 హనుమంతుని ,ఇసుమంతైనా ఏమీ చేయలేక పోయాయి.
 హనుమను వోడించటం అసాధ్యం అని, ఇంద్రజిత్ నిర్ణయానికి వచ్చాడు .మరి ఉపాయం ? బ్రహ్మాస్త్రం ప్రయోగించి, హనుమను బంధించాలి అని, నిశ్చయించు కొన్నాడు .

మంత్రపూతంగా, బ్రహ్మాస్త్రాన్ని, హనుమపై ఇంద్ర జిత్ ప్రయోగించాడు. అరి వీర భయంకరుడైన హరి వీరుడు, బ్రహ్మాస్త్రానికి లొంగి, బంధింప బడ్డాడు . ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం. అయితే అది తనను ఏమీ చేయదు అన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది . నమస్కరించి బద్ధుడయాడు.  ఈ బ్రహ్మాస్త్ర బంధనం, తనకు మేలే చేస్తుందని, రావణుడిని చూసే ఆవకాశం కలుగు తుందని, దానితో అతని పరాక్రమం,
 వ్యూహం తెలుసుకోవచ్చునని భావించాడు. రాక్షసులు, బలాత్కారంగా పట్టి, లాగుతున్నా , ఏమీ మాట్లాడ లేదు . తప్పించుకొనే ప్రయత్నమూ చేయలేదు.
 అతని నిర్విచేష్టతను గమనించి, రాక్షసులు, హనుమ ను గొలుసులతో, నార వస్త్రాలతో, కట్టేశారు .బ్రహ్మ వరం పని చేసింది.
 బంధింపబడగానే బ్రహ్మాస్త్ర ప్రభావం, విడిచి పోయింది. వేరే బంధం ఉంటె, బ్రహ్మాస్త్ర బంధం పని చేయదు. అది హనుమకు మాత్రమే తెలుసు.ఈ విషయం ఇంద్రజిత్ అర్ధంచేసుకొన్నాడు.
 తను కష్టపడి బంధించింది అంతా వ్యర్ధమైనదని, దుఃఖించాడు .ఇక ఈ మాయా కపి వల్ల, లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని, ఊహించాడు. ఏమీ చేయలేక మౌనంగా,తండ్రి దగ్గరకు,
 సైన్యం, హనుమను ఈడ్చుకొని వస్తుంటే, చేరాడు.
 విషయాన్ని అంతటిని, తండ్రికి వివరించాడు. హనుమను చూసి, రాక్షసులందరూ ‘’చంపండి, నరకండి ‘’అని, అరుస్తున్నారు .

    హనుమ రావణ సింహాసనం దగ్గరకు వెళ్లాడు .అక్కడి పెద్దలన్దర్నీ తేరిపార జూశాడు.
 రావణుడు మంత్రులతో, ‘’ఈ కోతి ఎందుకు వచ్చిందో, తెలుసుకొండి  ‘’ అని
 ఆజ్ఞాపించాడు. వారు, హనుమను, వివరాలు అడిగారు. అప్పుడు హనుమంతుడు, ‘’నేను రామ బంటును. హనుమ నామ దేయుడిని. సుగ్రీవుని మంత్రిని.
 సీతామాత శ్రీ రాముని ఇల్లాలు.                 నువ్వు అపహరించావని తెలిసి, మా రాజు, నన్ను వెదికి ఆమె జాడ, తెలుసుకోమని దక్షిణ దిక్కుకు పంపితే, ఇక్కడ ఉందని తెలుసుకొని లంక చేరాను. దుస్తరమైన సముద్రాన్ని, ఆవ లీలగా దాటాను .ఇది నా శక్తి కాదు. శ్రీ రాముని దివ్య విభూతి మాత్రమే ..’’అని చెప్పాడు. కనుక శని పీడా బాధితులు, శనివారం నాడు, సుందరకాండలోని ఈ నలభై ఎనిమిదవ సర్గను భక్తీతో పఠిస్తే ఆ పీడ నుంచి, విరగడ పొందుతారు.
By mv MVM RAO 🌟🚩

No comments:

Post a Comment