Monday, January 29, 2018

4/01/18, 7:13:03 AM: Mouli: _*మాఘపురాణం - 8వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉



_*యమలోక విశేషములు*_



☘☘☘☘☘☘☘☘



మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.
యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.

23/01/18, 10:59:29 PM: Sivananda Nirmala: సూర్యుని ఎందుకు ఆరాధించాలి?

1. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

2. ప్రపంచవ్యాప్తంగా సూర్యారాధన

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడు కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షినాయనం ముగించుకుని ఉత్తరాయనం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు.

3. సూర్యుడికి సంబంధించిన పురాణ కథలు

సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

4. సూర్యుడే జ్ఞానానికి ఆది దేవుడు

వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు

5. సూర్యారాధన ప్రాముఖ్యత

ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.

6. సూర్య చికిత్స ప్రతిభ

సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని అర్థమవుతుంది.
25/01/18, 7:26:11 AM: MVMRAO: ఓం శాంతి శాంతి శ్శాంతి:

మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు?

ఏ ప్రార్థన చివరిలోనయిన మన ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.
ఓం శాంతి: (ఆధ్యాత్మిక తాపం చలారుగాక)
ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లరుగాక)
ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లరుగాక)
1. ఆధ్యాత్మిక తాపం అంటె, శరీరానికి సంబంధించి నటువంటి వివిధ రకాలయిన రుగ్మతలు (రోగాలు మొదలైనవి) తొలగాలని
2. అధి భౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.
3. అధి దైవికతాపం అంటే, దైవవశంవల్ల కలిగే బాధలు – యక్షులు, రాక్షసులు మొదలైనవారివల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు – ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడమన్నమాట.ఇ
‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’ అని మూడుసార్లు చెప్పడంలో ఇంత అర్థం దాగివుంది.

25/01/18, 7:26:12 AM: MVMRAO: Parashu Rama Hindu

🕉🕉🕉🕉🕉🕉

🌸గాయత్రి మాత అనగా ఎవరు…..!!🌸

ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు

10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.

17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.

20. వరుణుడు:
భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.

* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’

గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి..

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
25/01/18, 10:32:51 AM: ‪+91 79811 59026‬: *స్వల్ప స్నాయు వసావసేక మలినం నిర్మాంసమప్యస్థి గోః*
*శ్వా లబ్వ్ధా పరితోషమేతి న తు తత్తస్య క్షుధా శాంతయే ।*
*సింహో జంబుకమంకమాగతమపి త్యక్వ్తా నిహంతి ద్విపం*
*సర్వః కృచ్ఛ్రగతో-పి వాంఞ్చతి జనః సత్వ్తానురూపం ఫలమ్॥*
🥀
కుక్క తన స్థాయికి తగినట్లుగానే... చిన్నపాటి ఎముక దొరికినా కూడా, అందులో మిగిలిన మాంసాన్ని నాకుతూ తృప్తిపడుతుంది. అయినా పాపం దాని ఆకలి తీరదయ్యే! కానీ సింహం అలా కాదు. తన ఎదురుగుండా నక్కలు, కుక్కలు తిరుగుతున్నా కూడా వాటిని వదలి ఏనుగు కోసం వేటాడుతుంది. మనుషులూ అంతే! ఎంతటి కష్టసమయంలో అయినా తమ శక్తికి తగిన ఫలితాన్ని ఆశిస్తారే కానీ, తక్కువ ఫలితంతో తృప్తి చెందరు.

26/01/18, 12:04:44 PM: Mani: ఏ దేవుడికి తమలపాకు పైన ఏది పెట్టి సమర్పిస్తే ఎటువంటి శుభ ఫలితాలు జరుగుతాయో మీరే చూడండి

1. మేషం – తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు.

2. వృషభం – తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి.


3. మిథునం – తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

4. కర్కాటకం- తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.

5. సింహం – తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.

6. కన్యారాశి – తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది.

7. తులాం రాశి- తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.


8. వృశ్చికం- తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

9. ధనుస్సు – తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

10. మకరం – తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి.

11. కుంభం – తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.

12. మీనం – తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

వినాయకుడినే గణపతి, గణేశుడు, బొజ్జ గణపయ్య అని పిలుస్తారు. ఆది దేవుడిగా, మొదట పూజలు అందుకునే దేవుడిగా వినాయకుడికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. భక్తులు కోరుకునే సంపద, శ్రేయస్సు అందించే గొప్ప దేవుడు వినాయకుడు.


హిందూ పురాణాల ప్రకారం.. ఏ పూజ అయినా, ఎలాంటి కార్యమైనా.. ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. చాలామంది ఇంట్లో లేదా ఆఫీస్ లో వినాయకుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. అయితే చాలామందికి ఎలాంటి విగ్రహం లేదా ఎలాంటి ఫోటో లేదా ఏ రంగు విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం తెలియదు. సరైన పద్ధతిలో, సరైన వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహం లేదా ఫోటోని పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మరింత మిన్నగా ఉంటుంది. సరైన ప్లేస్ లో వినాకుడి విగ్రహం పెట్టుకుంటే.. సంతోషం, సక్సెస్, సంపద జీవితంలో పొందుతారు. మరి ఎలాంటి విగ్రహం, ఎక్కడ పెట్టుకోవాలో చూద్దామా..

సంతోషం


సంతోషం, ప్రశాంతత, ఐశ్వర్యం పొందాలనుకునేవాళ్లు తెలుపు వర్ణంలోని వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలి.
పూజ గదిలో మీ పూజ గదిలో కేవలం ఒక వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. రెండు లేదా అంత కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలను పెట్టుకుంటే.. ఆయన భార్యలైన రిధి, సిద్ధిలకు ఆగ్రహం వస్తుంది.

గరిక వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరిక గడ్డిని.. వినాయకుడి విగ్రహానికి ప్రతిరోజూ సమర్పించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. అలా ఓం గం గణపతయే నమ: అని మంత్రం జపించాలి.
7/01/18, 7:28:43 AM: Mouli: _*మాఘపురాణం - 11వ అధ్యాయం*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉



_*మార్కండేయుని వృత్తాంతము*_


☘☘☘☘☘☘☘☘



వశిష్ఠుడుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి –
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈవిధంగా చెప్పదొడగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను, గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పిరి.
అటుల పదిహేను సంవత్సరములు గడిచిపొయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెననీ తలచి మహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
అంత వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవు కమ్ము” అని దీవించితిరి గదా! అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి. అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి. “చిరంజీవివై వర్ధిల్లు”మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాన్తరము లేదా? యని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! వినుడు. మనమందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు పోవుదము.రండి” అని పలికి తమవెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి.
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా”యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయును గాక”యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగనేరదు.అని పలికి, వత్సా! మార్కండేయా! నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకేయాపదకలుగదు. గాన నీవట్లు చేయుము.
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వచ్చెదను. అనుజ్ఞ నిమ్మని కోరగా మృకండుడు అతని భార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితంగా కాశీకిపోయి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగడనే యుండెను. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు తన భటులతో “మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునా కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించు సరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మ పాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా! గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావలదుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.
పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి తానూ చేసిన మాఘ మాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను.

27/01/18, 7:52:56 AM: ‪+91 79811 59026‬: *జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః ।*
*నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్‌ ॥*
🥀
సద్గ్రంథాలను రాసిన కవీశ్వరులు, చిరకాలం ఈ లోకంలో నిలిచిపోతారు. శరీరానికి అతీతమైన కీర్తితో వారు మృత్యువుని జయిస్తారు. యోగులు ఎలాగైతే జరామరణాలకు అతీతంగా ఉంటారో... కవీంద్రులు సైతం తమ గ్రంథాల ద్వారా అలాగే చిరస్థాయిగా మిగిలిపోతారు.


27/01/18, 3:36:33 PM: Mani-TTE-Tenali: #భీష్మఏకాదశి 27-01-2018
#తండ్రి మాటకు తలొగ్గి #శ్రీరాముడు  ఆదర్శ పురుషుడైతే,  తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు #భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి
స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేర
బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.

అది ద్వాపరయుగం శోభకృతు నామ సంవత్సరం.
మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా  ఆ మిట్టమధ్యాహ్నం
వేళ  శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో
ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు
మరణించిన రోజే #భీషాష్టమి. మరణించే ముందు
కృష్ణుడు  ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల
తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. ఎన్నికష్టాలెదురైనా చలించక తుదివరకు ధర్మానికి మాత్రమే కట్టుబడిన ఆదర్శప్రాయుడు మరియు అంత్యకాలంలో వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు
భీష్ముడు. అవే తరువాత విష్ణు సహస్రనామాలుగా
ప్రసిద్ధికెక్కాయి. అందుకే  ఏకాదశినాడు
విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు
చేకూరుతాయి.
28/01/18, 7:23:15 AM: MVMRAO: “ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి?

ఒక మగవాని వంశం కేవలం వారి తండ్రిదే, తల్లిది కాదు ఎందుకని?
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchial society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది. మన ఋషులు ఎంతో ఆలోచించి ఈ విషయం నిర్ధారించి నిర్దేశించారు. నేటి శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా కొన్ని మనం నిరూపించగలుగుతున్నాము నేడు. దీనిలో శాస్త్రీయత ఒకసారి పరిశీలిద్దాము.

ప్రతీ జీవిలోనూ DNA లో ఎన్నో chromosomes ఉంటాయి. కానీ మానవులలో ఉన్న 23 జతల chromosomes లో  సదరు స్త్రీకి X chromosomes అలాగే పురుషునికి Y chromosomes వుండడం సహజం. XX chromosome ఉంటె అమ్మాయి లింగ నిర్ధారణ అని, XY ఉంటె పురుష లింగ నిర్ధారణ చేస్తారు chromosome ఆధారంగా. పిండం ప్రాణం పోసుకుంటూ ఉండగా ఈ Y chromosome ఆడ లక్షణాలను అడగదోక్కి పురుష లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ Y chromosome అన్నది తల్లికి ఉండదు అందుకు కేవలం తండ్రి వలన మాత్రమె సంక్రమిస్తుంది ఆ పుత్రునికి. అదే అమ్మాయికి XX chromosome pair తల్లి నుండి తండ్రి నుండి సిద్ధిస్తాయి. ఈ XX chromosome కలిసినప్పుడు ఇద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. కానీ XY కలిగినప్పుడు Y అన్నది కేవలం తండ్రి నుండి మాత్రమె అందునా పెద్దగా మార్పు లేకుండా సంక్రమిస్తుంది.

అందుకే మన వేదం లో చెప్పారు “ ఆత్మావై పుత్ర నామాసి” అని. అంటే తండ్రే అదే రూపంలో కొడుకు అవుతున్నాడు అని. అదే లక్షణాలు మనవడి దగ్గరకు, అలా వారి వంశం అంతా కేవలం వారి తండ్రి, తాత, ముత్తాతల దగ్గరనుండి వస్తుంది. అందుకే మగవారిని వంశోద్ధారకుడు అనేది.  మన గోత్ర, ప్రవర పద్ధతి ఇదే విషయాన్ని చాలా అందంగా శాస్త్రాన్ని తనలో ఇముడ్చుకుంది. ప్రవరలో మన వంశంలో ఉన్న ముఖ్య ప్రముఖులైన మహర్షుల గురించి ఉంటుంది. ఉదాహరణకు
భార్గవస  గోత్రానికి ప్రవర భ్రుగు, చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని  పంచార్షయము అని చెబుతాము. అంటే భ్రుగుమహర్షి నుండి ఆ lineage లో జమదగ్ని వరకు ఉన్న మహర్షుల సంతానం ఆ గోత్రీకులది అని తెలుస్తోంది. అంటే ఈ గోత్రీకులకు సంబంధించిన Y chromosome భ్రుగు మహర్షి వద్దనుండి వస్తున్నది అన్న అర్ధము. అదే ఆడవారికి రెండు chromosomes ఉండడం వల్ల వారి వంశం పెళ్లి చేసుకున్నాక భర్త వంశం అవుతోంది.

కొన్ని లక్షల, వేల సంవత్సరాల నుండి ఇలా వస్తున్న ఈ chromosomes ఎన్నో మార్పులకు లోనయ్యాయి. Y chromosome పరిమాణం కూడా X chromosome కి మూడవ వంతు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే పరిమాణంలో ఉన్న ఇది రాను రాను చిన్నదయిందని శాస్త్రజ్ఞుల వాదన. XX chromosomes లో ఒక x కి  ఏమైనా లోపాలుంటే మరొక దానినుండి అది తెచ్చుకుంటుంది. దీన్ని క్రాస్ఓవర్ అంటారు. అదే XY కి ఈ అవకాశం లేదు ఎందుకంటె నిర్మాణ పరంగా ఇవి పూర్తిగా విభిన్నమైనవి. ఇవి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఒకే గోత్రం/ప్రవర లో ఉన్న వారి మధ్య వివాహాలు జరపకూడదు అని చెప్పారు మన మహర్షులు.. అంతేకాక ఈ XX లో మరి XY లో X లలో ఉన్న ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ మరింత పెచ్చరిల్లే అవకాశం ఉండి, వీటిని పూర్తిగా నిషేధించారు. ఇలా దగ్గర దగ్గరలో ఉన్న XY XX లు కలుస్తూ పోతే మొత్తానికి ఆ వంశంలో y chromosome కనుమరుగయ్యే అవకాశం కూడా హెచ్చు.  మన మహర్షులు ఎంతో దూరదృష్టి ఉన్నందున వారు ఈ సగోత్రీకుల వివాహం వద్దన్న నియమం పెట్టారు. అది కూడా ఈ జనరేషన్ నుండి ఆరు తరాలు పూర్వం వరకు అలా కలిసి ఉండకూడదు అని. దానివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, మరింత తెలివయిన వారు పుడతారు అని వారి విశ్లేషణ. నేడు మనకు సైన్సు వారు చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తోంది.

మన వేదవాంగ్మయం చెప్పిన విషయాలు నేటి శాస్త్రీయ విజ్ఞానం అందుకోవాలంటే మరి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టవచ్చు, అప్పుడు నిజమే ఈ విషయం కేవలం సనాతన ధర్మం చెప్పిందని అప్పటికి అనిపిస్తుంది. మనకు కావలసినది నమ్మకం. నేడు మనం నిరూపించగలిగే స్థాయిలో, పరిపక్వతలో లేము మనం అంత మాత్రాన పెద్దలు చెప్పిన శాసనాలను ధిక్కరించి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు?
!!
28/01/18, 7:23:16 AM: MVMRAO: నెలవంక తలపాగ,నెమలి ఈకగ మారె తలపైన గంగమ్మ తలపులోనికి బారే...నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే... బూది పూతకు మారు,పులితోలు వలువాయే....ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి మారె,తాను ఎరుకతగా...ఓం కార ధనువు గా ఒదిగె త్రిశూలంబు...కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
28/01/18, 8:12:57 AM: Mouli: _*మాఘపురాణం - 12వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*పుణ్యక్షేత్రములలో మాఘస్నానము*

☘☘☘☘☘☘☘☘

ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను.
దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.
మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.
ఇక త్రయంబకమను నొక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోడావరియండు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి వున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలడు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా! బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్ప వాదనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హత్యాపాతము చుట్టుకున్నది.
శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుశాత్వము నశించుగాక అని శపించెను.
ఈశ్వరుడు చేయునది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? యన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండీ లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుచున్నారు.
28/01/18, 7:23:14 AM: MVMRAO: “ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి?

ఒక మగవాని వంశం కేవలం వారి తండ్రిదే, తల్లిది కాదు ఎందుకని?
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchial society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది. మన ఋషులు ఎంతో ఆలోచించి ఈ విషయం నిర్ధారించి నిర్దేశించారు. నేటి శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా కొన్ని మనం నిరూపించగలుగుతున్నాము నేడు. దీనిలో శాస్త్రీయత ఒకసారి పరిశీలిద్దాము.

ప్రతీ జీవిలోనూ DNA లో ఎన్నో chromosomes ఉంటాయి. కానీ మానవులలో ఉన్న 23 జతల chromosomes లో  సదరు స్త్రీకి X chromosomes అలాగే పురుషునికి Y chromosomes వుండడం సహజం. XX chromosome ఉంటె అమ్మాయి లింగ నిర్ధారణ అని, XY ఉంటె పురుష లింగ నిర్ధారణ చేస్తారు chromosome ఆధారంగా. పిండం ప్రాణం పోసుకుంటూ ఉండగా ఈ Y chromosome ఆడ లక్షణాలను అడగదోక్కి పురుష లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ Y chromosome అన్నది తల్లికి ఉండదు అందుకు కేవలం తండ్రి వలన మాత్రమె సంక్రమిస్తుంది ఆ పుత్రునికి. అదే అమ్మాయికి XX chromosome pair తల్లి నుండి తండ్రి నుండి సిద్ధిస్తాయి. ఈ XX chromosome కలిసినప్పుడు ఇద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. కానీ XY కలిగినప్పుడు Y అన్నది కేవలం తండ్రి నుండి మాత్రమె అందునా పెద్దగా మార్పు లేకుండా సంక్రమిస్తుంది.

అందుకే మన వేదం లో చెప్పారు “ ఆత్మావై పుత్ర నామాసి” అని. అంటే తండ్రే అదే రూపంలో కొడుకు అవుతున్నాడు అని. అదే లక్షణాలు మనవడి దగ్గరకు, అలా వారి వంశం అంతా కేవలం వారి తండ్రి, తాత, ముత్తాతల దగ్గరనుండి వస్తుంది. అందుకే మగవారిని వంశోద్ధారకుడు అనేది.  మన గోత్ర, ప్రవర పద్ధతి ఇదే విషయాన్ని చాలా అందంగా శాస్త్రాన్ని తనలో ఇముడ్చుకుంది. ప్రవరలో మన వంశంలో ఉన్న ముఖ్య ప్రముఖులైన మహర్షుల గురించి ఉంటుంది. ఉదాహరణకు
భార్గవస  గోత్రానికి ప్రవర భ్రుగు, చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని  పంచార్షయము అని చెబుతాము. అంటే భ్రుగుమహర్షి నుండి ఆ lineage లో జమదగ్ని వరకు ఉన్న మహర్షుల సంతానం ఆ గోత్రీకులది అని తెలుస్తోంది. అంటే ఈ గోత్రీకులకు సంబంధించిన Y chromosome భ్రుగు మహర్షి వద్దనుండి వస్తున్నది అన్న అర్ధము. అదే ఆడవారికి రెండు chromosomes ఉండడం వల్ల వారి వంశం పెళ్లి చేసుకున్నాక భర్త వంశం అవుతోంది.

కొన్ని లక్షల, వేల సంవత్సరాల నుండి ఇలా వస్తున్న ఈ chromosomes ఎన్నో మార్పులకు లోనయ్యాయి. Y chromosome పరిమాణం కూడా X chromosome కి మూడవ వంతు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే పరిమాణంలో ఉన్న ఇది రాను రాను చిన్నదయిందని శాస్త్రజ్ఞుల వాదన. XX chromosomes లో ఒక x కి  ఏమైనా లోపాలుంటే మరొక దానినుండి అది తెచ్చుకుంటుంది. దీన్ని క్రాస్ఓవర్ అంటారు. అదే XY కి ఈ అవకాశం లేదు ఎందుకంటె నిర్మాణ పరంగా ఇవి పూర్తిగా విభిన్నమైనవి. ఇవి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఒకే గోత్రం/ప్రవర లో ఉన్న వారి మధ్య వివాహాలు జరపకూడదు అని చెప్పారు మన మహర్షులు.. అంతేకాక ఈ XX లో మరి XY లో X లలో ఉన్న ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ మరింత పెచ్చరిల్లే అవకాశం ఉండి, వీటిని పూర్తిగా నిషేధించారు. ఇలా దగ్గర దగ్గరలో ఉన్న XY XX లు కలుస్తూ పోతే మొత్తానికి ఆ వంశంలో y chromosome కనుమరుగయ్యే అవకాశం కూడా హెచ్చు.  మన మహర్షులు ఎంతో దూరదృష్టి ఉన్నందున వారు ఈ సగోత్రీకుల వివాహం వద్దన్న నియమం పెట్టారు. అది కూడా ఈ జనరేషన్ నుండి ఆరు తరాలు పూర్వం వరకు అలా కలిసి ఉండకూడదు అని. దానివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, మరింత తెలివయిన వారు పుడతారు అని వారి విశ్లేషణ. నేడు మనకు సైన్సు వారు చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తోంది.

మన వేదవాంగ్మయం చెప్పిన విషయాలు నేటి శాస్త్రీయ విజ్ఞానం అందుకోవాలంటే మరి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టవచ్చు, అప్పుడు నిజమే ఈ విషయం కేవలం సనాతన ధర్మం చెప్పిందని అప్పటికి అనిపిస్తుంది. మనకు కావలసినది నమ్మకం. నేడు మనం నిరూపించగలిగే స్థాయిలో, పరిపక్వతలో లేము మనం అంత మాత్రాన పెద్దలు చెప్పిన శాసనాలను ధిక్కరించి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు?
!!
28/01/18, 7:23:15 AM: MVMRAO: నెలవంక తలపాగ,నెమలి ఈకగ మారె తలపైన గంగమ్మ తలపులోనికి బారే...నిప్పులుమిసే కన్ను నిదురోయి బొట్టాయే... బూది పూతకు మారు,పులితోలు వలువాయే....ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి మారె,తాను ఎరుకతగా...ఓం కార ధనువు గా ఒదిగె త్రిశూలంబు...కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు
28/01/18, 3:38:20 PM: M L MURTHY: అంతర్జాలేనాత్మనాశో
            గూగుల్ తు గుణనాశినీ, చరవాణ్యా చిత్తనాశో
            ఐటీ సద్బుద్ధి భేదినీ, సంగణకస్సంఘ వైరీ,
                మీడియా మిత్ర ఘాతినీ,
చలత్చిత్రేణార్థనాశో,
                  పత్రికా:ద్వేష వాహకా:,
ఉద్యోగధ్వంసినీ వార్తా,
                ఛానెల్స్ ఛల ప్రబోధకా:
సీరియల్సర్వనాశాయ
                సుమిత్రం శరణంసదా.....
28/01/18, 4:40:27 PM: Mani-TTE-Tenali: 🌿🌠 .....30 రకాల శివలింగాలు.....🌠🌿
🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹
                    🌷🌷.....సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే .....అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం .....కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి..... అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి ......అపూరూపమైనవి..... ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..... అందుకే వాటి గురించి తెలుసుకుందాం.....రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి.... ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి.....🌷🌷
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
                ....1) గంధపు లింగం....

              .రెండు భాగాలు కస్తూరి  , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
          ....2) నవనీత లింగం....

              .వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
        .....3) పుష్పలింగం....
          .నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
        .....4) రజోమయ లింగం.....
          .పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
      .....5) ధ్యాన లింగం.....

      .యవలు , గోధుమలు  , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
    .....6 ) తిలిపిస్టోత్థ లింగం....

          .నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
      .....7) లవణ లింగం....

            .హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
    .....8 ) కర్పూరాజ లింగం .....

      ముక్తి ప్రదమైనది.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
    .....9) భస్మమయ లింగం....

        .భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠
      .....10) శర్కరామయ లింగం....

          .....సుఖప్రదం.....
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
    .....11) సద్భోత్థ లింగం.....

        ప్రీతికరని కలిగిస్తుంది.
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
      .....12) పాలరాతి లింగం.....

          ఆరోగ్యదాయకం.
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
      .....13) వంకాకురమయ లింగం.....

        వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
    .....14) కేశాస్థి లింగం .....

        .వెంట్రుకలు , ఎముకలతో  తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
    ......15) పిష్టమయ లింగం....

          .ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
    .....16) దధిదుగ్థ లింగం .....

          కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
    .....17) ఫలోత్థ లింగం.....

      ఫలప్రదమైనది.
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
    ..... 18) రాత్రి ఘజాత లింగం....

      .ముక్తి ప్రదం
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  .....19) గోమయ లింగం....

          కపిల గోవు  పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి  కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
  .....20) దూర్వాకాండజ లింగం.....

        గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
    .....21) వైడూర్య లింగం....

    శత్రునాశనం , దృష్టి దోషహరం
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  .....22) ముక్త లింగం ....

      ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  .....23) సువర్ణ నిర్మిత లింగం.....

      .బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  .....24) ఇత్తడి - కంచు లింగం....

  ముక్తిని ప్రసాదిస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
    .....25) రజత లింగం.....

      సంపదలను కలిగిస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  ......26) ఇనుము - సీసపు లింగం......

      శత్రునాశనం చేస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  ......27) అష్టధాతు లింగం.....

    చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
......28) స్ఫటీక లింగం.....

    సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  ....29) తుష్టోత్థ లింగం.....

    మారణ క్రియకు పూజిస్తారు
🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
  .....30) సీతాఖండ లింగం.....

        ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂🌹🌠🎂
🌿🌷🌠🌿🌷🌠🌿🌷🌠🌿🌷🌠🌿
      ....పరమేశ్వర పూజా పుష్పఫలము ....
👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏
* శివున్ని దర్భలతో పూజిస్తే  - దీర్ఘాయుస్సు!
* ఉమ్మెత్తలతో పూజిస్తే  - సుతప్రాప్తి!
* జిల్లేడు పూలతో పూజిస్తే  - శౌర్యము !
* కలువ పూలతో పూజిస్తే  - విక్రమ వృద్ధి !
* బంధూక సుమములతో పూజిస్తే  - భూషణ ప్రాప్తి !
* జాజి పూలతో అర్చిస్తే  - వాహన ప్రాప్తి !
* మల్లెపూలతో పూజిస్తే  - భోగము ప్రాప్తిస్తాయి !
* అవిసె పూలతో పూజిస్తే  - పరమేశ్వర ప్రాప్తి !
* కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !
* నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !
* తుమ్మి పువ్వులతో అర్చిస్తే  - మోక్ష లాభం !
* నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !
🌠👏🌹🌠👏🌹🌠👏🌹🌠👏🌹🌠
🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂🌠🌹🎂
లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు
🌻🌠🌻🌠🌻🌠🌻🌠🌻🌠🌻🌠🌻
          .....ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు..... ఈ విషయంపై శివపురణం ఓసారి తిరగేస్తే .... అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది.... అవేంటంటే....

* రుద్రుడు !
* భవుడు !
* శర్వుడు !
* ఉగ్రుడు !
* భీముడు !
* పశుపతి !
* ఈశానుడు !
* మహాదేవుడు !
🍑🌠🌺🍑🌠🌺🍑🌠🌺🍑🌠🌺🍑
1) రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!

2) శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!

3) భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

4) ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!

5) భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!

6) పశుపతి : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!

7) ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!

8) మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!
🎂🌹👏🎂🌹👏🎂🌹👏🎂🌹👏🎂
🌿🍑🌺🌿🍑🌺🌿🍑🌺🌿🍑🌺🌿
            !! ఓం నమః శివాయ !!
🌷🌻🌠🌷🌻🌠🌷🌻🌠🌷🌻🌠🌷
🍑🌻🌠🍑🌻🌠🍑🌻🌠🍑🌻🌠🍑
నా ప్రియ మిత్రులందరికి శుభ శుభోదయం
29/01/18, 8:27:55 AM: ‪+91 79811 59026‬: *శాస్త్రోపస్కృత శబ్ద సుందర గిరః శిష్య ప్రదేయాగమా*
*విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః ।*
*తజ్జాడ్యం వసుధాదిపస్య సుధియస్వ్తర్థం వినా-పీశ్వరాః*
*కుత్స్యాః స్యుః కుపరీక్షకై ర్నమణయో యైరర్ఘతః పాతితాః ॥*
🥀
మహా శాస్త్రాలను సుందరంగా శిష్యులకు బోధించే పండితులు సైతం ప్రభువుని ఆశ్రయించినా కూడా ధనహీనులై ఉంటే... అది ఆ ప్రభువు మూఢత్వమే కానీ మరొకటి కాదు. అమూల్యమైన రత్నాన్ని వెలకట్టే వర్తకుడు దాని వెలని తక్కువగా చెబితే... ఆ లోపము వర్తకునిదే కానీ రత్నానిది కాదు కదా!


29/01/18, 7:26:06 AM: Mouli: _*మాఘపురాణం - 13వ అధ్యాయం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉



_*శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట*_


☘☘☘☘☘☘☘☘



వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.
“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను.
మున్ను పార్వతీ దేవిని శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని వున్నా సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నకస్కరించి “స్వామీ! మీవలనననేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలెననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన!”నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను.
దేవీ! నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు వుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు వుండగా, ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియే గాదు, జీవనది వున్నాను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్నచోట గాని తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయే గాక సమస్తపాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మమనునది వుండదు.
దేవీ! మాఘ మాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసంనందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో వున్న అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివలాయమున గాని విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.
ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటియందైనను కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ వాని కష్టములు మేఘమువలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును గాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె తానూ బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరం గదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం గాన ఓ పార్వతీ! ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును. సలసల కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములూ అనుభవించును. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.
మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది. “ పార్వతీ! దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన యెడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దు గడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించు వాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించు వాడును, రాజ ద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్ప వాడనను అహంభావంతో దైవకార్యాలను, ధర్మకార్యాలను, చెడగొట్టుచూ దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయు వాడును, ఇండ్లను తగులబెట్టువాడునూ, చెడు పనులకు ప్రేరేపించు వాడునూ, ఈవిధమైన పాప కర్మలు చేయువారలు, ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన యెడల వారందరూ పవిత్రులగుదురు.
“దేవీ! ఇంకనూ దాని మహాత్యంబును వివరించెదను. వినుము. తెలిసియుండియూ పాపములు చేయు వాడునూ, క్రూర కర్మలు ఆచరించు వాడునూ, సిగ్గు విడిచి తిరుగు వాడనూ, బ్రాహ్మణ దూషకుడూ, మొదలగు వారు మాఘ మాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏమానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటినుండి ఆఖరు పర్యంతమూ స్నానమును చేసెదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడు అగును.
శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్ఠమైనదగుటచే ఆమాసమునందు ఆచరించే ఏ స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా వున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా వున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించినయెడల ఆస్నాన ఫలం పొందగలరు. అదియునూ గాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్ని దేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసినయెడల మంచి ఫలితము కలుగును.
ఈవిధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైననూ అపహాస్యంగా చూచిననూ లేక అడ్డు తగిలిననూ మహాపాపములు సంప్రాప్తించును. మాఘ మాసం ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రినీ, తల్లినీ, తన భార్యనూ లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించునటుల ఏమానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆవిధంగానే బ్రాహ్మణునిగానీ, వైశ్యుని గానీ, క్షత్రియుని గానీ శూద్రుని గానీ, మాఘ మాసస్నానం చేయమని చెప్పినయెడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులూ ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గానీ ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుఃక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును.
నడుచుటకు ఓపిక లేని వారలు, మాఘమాసంలో కాళ్ళూ, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్ళు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గానీ, వినుట గానీ చేసిన యెడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము, నశింప వలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ మాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్య మహాపాపములు చేసిన మనుజుడైననూ మాఘమాసమంతయూ కడునిష్ఠతో నున్నఎడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.
కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరించుము.

Tuesday, January 23, 2018

09/01/18, 3:40:01 PM: ‪+91 94411 78068‬: శ్లో. పితృభిః తాడితః 
      పుత్రః,
      శిష్యస్తు         
      గురుశిక్షితః,
      ధనాహతం   
      సువర్ణం చ 
      జాయతే   
      జనమండనమ్.
తాత్పర్యం: తండ్రితో దండితుడైన కొడుకు, గురువు వద్ద శిక్షణ పొందిన శిష్యుడు, సుత్తి దెబ్బలు తిన్న బంగారం లోకానికి అలంకారం కావడం తథ్యం.

శ్లో. సుశీలో మాతృపుణ్యేన, పితృపుణ్యేన చాతురః
ఔదార్యం వంశపుణ్యేన, ఆత్మపుణ్యేన భాగ్యవాన్.
తా. తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం పొందుతాము. అలాగే వంశపుణ్యాన ఉదారత్వం లభిస్తుంది, కానీ స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి.


15/01/18, 6:31:06 AM: ‪+91 94408 97850‬: 🔔 *లక్ష్మి నివాసం* 🔔

భగవద్భక్తులపై కోపగించేవారి గృహంలో లక్ష్మీదేవే కాదు. శ్రీ హరి కూడా ఉండడు. అతిథులకు భోజన సత్కారాలు జరగనిచోట. లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళ లాడుతూ ఉండనిచోట, ఇల్లాలు కంటతడి పెట్టినచోట, హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరంగా గడ్డిపరకలను తెంచినా, పచ్చటి చెట్లను పడగొట్టినా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో భోజనం చేసే వారిని లక్ష్మి వరించదు. పశుపక్షులను హింసించే చోట వుండనే వుండదు. సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు. మరి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ వుంటుందంటే, శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్నచోట, కష్టపడి పని చేసే వారి ఇంట, ఆశావాదుల ఇంట, ధనాత్మకమైన ఆలోచనలు చేసే వారి ఇంట, ప్రేమానురాగాలతో పిలుచుకునే వారి ఇంట, అతిథులతోనూ, తోటివారితోనూ ఆత్మీయంగా మసలుకునే వారి ఇంట లక్ష్మి విరాజిల్లుతుంది.

అన్నిటి కంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళలా  శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన అధీనంలో ఉండాలి కాని, మనం సంపద అధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. లక్ష్మి అంటే, ఒక వృత్తిదారుడికి చేతినిండా పని దొరకడం, కష్టపడి పని చేసేవారికి తగిన ప్రతిఫలం లభించడం, పండితులకు వారి పాండిత్యానికి, ప్రతిభా సంపత్తులకు తగిన గౌరవం దొరకడం ఆరోగ్యం, విద్యార్థులకు తగిన సీట్లు లభించడం, ఇల్లాలికి భర్త అనురాగం, పిల్లల ప్రేమ లభించడం కూడా లక్ష్మే !
...✍ *హిందూ ధర్మచక్రం*
15/01/18, 7:27:32 AM: BADRI: శుభోదయం
ఈ మకర సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా మీ ఇంటిల్లిపాదీ ఆయురారోగ్య సుఖ సంతోషాలతో, అనందోత్సాహాలతో ఉండాలని, మీ జీవితాలలో సకల శుభాల వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

WISH YOU ALL HAPPY MAKARA SANKRANTHI
హిందూ బంధువులందరికీ మరియు విశ్వ జనులందరకీ  " #మకరసంక్రాంతి " పండుగ శుభాకాంక్షలు !!

ఇది  " #ప్రకృతి - #పండుగ " !!
ఇది అందరి పండుగ !!

మన ప్రాచీన #భారతీయకాలగణనం ' లో ప్రధానంగా మూడు రకాల కాల గణన పద్దతులున్నాయి !!

1- చాంద్ర మానం అంటే చంద్రుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క గట్టే పద్దతి !!

2- సౌర మానం అంటే  సూర్యుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క గట్టే పద్ఘతి !!

3- బృహస్పతి మానం అంటే గురు గ్రహం యొక్క గమనాను సారం కాలాన్ని లెక్క గట్టే పద్ధతి !!

* మనం జరుపుకునే " #మకరసంక్రాంతి " పండుగ #సౌరమానం ప్రకారం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ !!

* సూర్యుడు ఒక రాశిలో ఒక నెల వుంటూ 12 రాశులు - 12 నెలలు  మారుతూ వుంటాడు !!
ఒక సంవత్సరములో 12 సంక్రమణలు
జరుగుతాయి!!

అలా సూర్యుడు ధనుస్ రాశి నుండి మకర రాశిలో ప్రవేశించటమే "#మకరసంక్రమణ" #పుణ్యకాలము!!

ఇప్పటి నుండి సూర్యుడు ఉత్తరాభి ముఖంగా ప్రయాణం సాగుతుంది కనక దీనిని ' ఉత్తరాయణ పుణ్యకాలం ' అని కూడా
అంటారు !!
పగలు ఎక్కువ రాత్రులు తక్కువగా మారతాయి!!
#ప్రకృతి లో మార్పు #కాలం లో మార్పు వచ్చి చలి క్రమంగా తగ్గి ఎండ తీవ్రతలు పెరుగుతాయి !! ఇది మనందరకీ తెలుసు !!

మన ప్రాచీన ఋషుల గొప్పతనం!!
#కాలగణన- #కాలవిభజన!!

ఒక రోజును 2 భాగాలు చేశారు!!
#పగలు - #రాత్రి!!

ఒక నెలను 2 భాగాలు చేశారు!!
#శుక్లపక్షము - #కృష్ణపక్షము!!

ఒక సంవత్సరాన్ని 2 భాగాలు చేశారు!!
#ఉత్తరాయణం - #దక్షిణాయనం!!

మనకు పగలు-రాత్రి ఒకరోజుకదా!!
మనకు  సంవత్సరము దేవతలకు ఒకరోజు!!

ఉత్తరాయణము దేవతలకు పగలు!!
దక్షిణాయనము దేవతలకు రాత్రి!!ఇదీసంగతి

ఈరోజునుండి #సూర్యుడుఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తాడు కనుక ఇది #ఉత్తరాయణం అయింది!! దేవతలకు పగలు ప్రారంభమైంది!!

ఉత్రరాయణములో మరణిస్తే ఉత్తమలోకాలు
ప్రాప్తిస్తాయి కనుక #భీష్ముల వారు
మహాభారతయుద్దములో దక్షిణాయనములో
నేలకొరిగినా #ఇచ్ఛామరణవరసిద్దులు
కనుక తన ప్రాణాలను నిలిపి ఉత్తరాయణంలో
ప్రాణాలు వదిలారు.ఇదిమనందరికి తెలుసు!!

ఇది పంటల పండుగ !!
ఇది పాడి పశువుల పండుగ !!
ఇది ముగ్గుల పండుగ -
ముత్తైదువల పండుగ !!
ఇది పడచు పిల్లల పండుగ -
ఇది పతంగుల పండుగ !! 

ఎటుచూసినా #ధాన్యరాశులతో
#పౌష్యలక్ష్మి కలకలలాడుతుంది!!
ప్రకృతి పరవశించిపోతుంది!!
రైతన్నల గుండెలలో ఆనందం వెల్లివిరుస్తుంది!!

#గంగిరెద్దులవిన్యాసాలు!!
#హరిదాసులసంకీర్తనలు!!
#ఇంటిముంగిటముత్యాలముగ్గులు!!
#ముగ్గల్లోగొబ్బెమ్మలుపసుపుకుంకుమలు!!

చిన్నపిల్లలకు  #భోగిపండ్లు పోస్తారు!!
#రేగుపండ్లనే  #బదరీఫలాలు అంటారు!!
బదరీక్షేత్రములో #నరనారాయణలచే
స్పృశించబడి వారి ఆకలిని తీర్చాయి కనుక
అవి పవిత్రమైనవి మనకు దీర్ఘాయువును
కలిగిస్తాయి!!

ఈ  రోజు అన ేక రకాల పిండి వంటలు చేసుకున్నాఅందులో ముఖ్యమైనది
" #నువ్వులలడ్డులు" !!
తీపికి మధురమైనస్నేహానికి ప్రతీకం!!
ఈ గజ గజ వనికే చలికాలములో  నువ్వులు- బెల్లముతో చేసినలడ్డూలు ఒంటిలో వేడిని కలిగిస్తాయి!!

#నువ్వులుతింటేనవ్వులువిరబూస్తాయి!!

తెలంగాణా ప్రాంతములో #అరిసెలు #సకినాలకు ఈ పండుగ ప్రసిద్ధి!!
ఇవినెలల పాటు నిల్వ చేసుకుంటారు!!

          #మకరసంక్రమణపుణ్యకాలము
* శ్రీ  హేవలంబినామ సం!!ర పుష్యమాస బహుళ త్రయోదశి భానువారము, మూల నక్షత్ర, ధృవయోగ, వనజికరణ, కర్కాటకలగ్న శుభ సమయములో 14-1-2018 తేది  రాత్రికాలము గం!! 7 - 18 ని!!లకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును!!
#సర్వకాలేషుసర్వేషాంశుభమ్భవతు!!

ఈ "మకర సంక్రాంతి" పుణ్యకాలము మకర
ప్రవేశానికి ముందు 2గం!!లు తరువాత
2గం!!లు వుండును!!

ఈ రోజు #పితృదేవతలను ఆరాధించాలి!!
ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజించాలి!!

#గోమాతను పూజించాలి!!
#విశేషంగా #దానధర్మాలు చేయాలి!!

మంత్ర జప ధ్యాన సాధనలు పారాయణాలు చేస్తే అనంత ఫలితాన్నిస్తాయి !

" #సూర్యారాధన " విశేష ఫలితాలనిస్తుంది !!

మరోసారి మిత్రులందరికీ సంక్తాంతి-పండుగ
శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.....
.
శుభమ్ భూయాత్ !విశ్వశాంతి వర్ధిల్లునుగాక!
----మీ సామర్ల వేంకటేశ్వరాచార్య!!HYD!!
5/01/18, 8:45:35 AM: ‪+91 79811 59026‬: _వరిధాన్యరాశియై వసుధయే వర్ధిల్ల_
_సిరిసంపదలతోటి శ్రీరూపమును దాల్ప_
_వరమీయుమోతల్లి వరలక్ష్మి సంక్రాంతి!_
_దరిజేర్చి కరుణించు కరుణాభ్ది సంక్రాంతీ!_

🌸నవ్య దివ్య భవ్య క్రాంతి.. సంక్రాంతి🌸
🌼సంక్రాంతి శుభాకాంక్షలు🌼
06/01/18, 7:41:50 AM: ‪+91 83330 99902‬: మన కాయగూరల సంస్కృతం పేర్లు

-అవాక్పుష్పీ (బెండకాయ)
-జంబీరమ్ (నిమ్మకాయ)
-ఆలుకమ్ (బంగాళదుంప)
-ఉర్వారుక (దోసకాయ)
-కారవేల్ల (కాకరకాయ)
-కోశాతకీ (బీరకాయ)
-బృహతీ (ముళ్ళవంకాయ)
-మరిచకా (మిరపకాయలు)
-రాజకోశతకీ (కాప్సికం)
-లశున (వెల్లుల్లి)
-వార్తాక (వంకాయ)
-బింబమ్ (దొండకాయ)
-శీతలా (సొరకాయ)
-క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)
-పలాండు (ఉల్లిగడ్డ)
-కూష్మాండ (గుమ్మడికాయ)
-తౄణబిందుక (చేమదుంపలు)
-మూలకమ్ (ముల్లంగి)
-రంభాశలాటు (పచ్చి అరటికాయ)
-సూరణ (కంద)
.
#నోట్:: వీటిని గుర్తుపెట్టుకోవాలంటే
వీటిని తిట్లుగా వాడాలి అలా అయితేనే
ఈజీగా గుర్తుపెట్టుకోగలం 😂😂😂
16/01/18, 7:00:55 AM: MVMRAO: 🙏      శుభోదయం      🎇
          ------------------
      మహనీయుని మాట
        --------------------------
" మన పరిసరాల నుంచి
        బాంధవ్యాల నుంచి
ఎక్కడికో పారిపోవడం కాదు....
      ఉన్న చోటనే ఉండి,
ఎదురయ్యే క్షణంలోని
సమస్యను అవగాహన
చేసుకోవాలి".........!!!
            -జిడ్డు కృష్ణమూర్తి
----------------------------------------
🤓      నేటి మంచిమాట  🤓
----------------------------------------
చావును కూడా చంపాలంటే
నలుగురి కోసం బ్రతికి చూడు.
ఓటమిని ఓడించాలంటే..
గెలిచే వరకు పోరాడి చూడు...!
16/01/18, 9:26:53 AM: ‪+91 79811 59026‬: *సుశీలోమాతృపుణ్యేన* *పితృపుణ్యేన చాతురః*
*ఔదార్యం వంశపుణ్యేన*
*ఆత్మపుణ్యేన భాగ్యవాన్*
🥀
తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం పొందుతాము. అలాగే వంశపుణ్యాన ఉదారత్వం లభిస్తుంది, కానీ స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి.


16/01/18, 2:19:11 PM: Rajeswararao: ఉత్తర శ్రీరంగంగా కీర్తిపొందిన నెల్లూరు శ్రీరంగనాయకుల ఆలయం కధాసారాంశం స్కాంద పురాణంలో ప్రస్తుతించారు. పెన్నానదీ ప్రాంతమైన పినాకిని నదీ తీరాన కొలువైన రంగనాథస్వామికి శయన నారాయణుడు (పళ్లికొండ పెరుమాళ్ళు)గాను ఈ ప్రాంతాన్ని శ్రీ వైకుంఠం (చిత్తరమేళ విణగళ్)గా చరిత్ర ప్రసిద్ధి చెందింది. పురాణ గ్రంథాల పుటలు తిరగవేస్తే వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ సమేతంగా భూలోక విహారమే సంకల్పించి ఆదిశేషుని క్రీడా శైలముగావలసినదిగా ఆజ్ఞాపించాడు. అంతట ఆదిశేషుడు పినాకిని నదీ తీరాన గంగా ప్రభవించ సత్యలోక పర్యంతం ప్రవర్థమానుడయ్యెను. శ్రీమన్నారాయణుడు గరుడవాహనదారుడై తన పాదంతో ఆ గిరి స్పృశించెను. ఆనాటి నుండి ఆ ప్రాంతం తల్పగిరిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తపస్సు చేసిన కశ్యప మహాముని పుండరీక యాగము చేయుచుండ ఏకాదశి పుణ్యదినాన కశ్యప ముని కోర్కె మేరకు కలియుగ శ్రీవైకుంఠంగా ఖ్యాతి చెందేలా శ్రీమన్నారాయణుడైన రంగనాథస్వామి ఈ క్షేత్రంలో వెలిశాడు. కశ్యప మహర్షి ప్రార్థన మేరకు ఆదిశేషుడు శేషసాయి కాగా శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సహితంగా శయనించెను. నాభి నుండి బ్రహ్మ ఉద్భవించెను. ఉత్తర ముఖుడైన శ్రీరంగనాథుడును సేవించిన భక్తులకు కోరిన వరాలిచ్చే భక్తవల్లభుడిగా కీర్తిపొందుతున్నాడు.
చరిత్ర పుటలు తిరుగవేస్తే ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు సింహపురి (నెల్లూరు) ప్రాంతాన్ని సందర్శించి దేవాలయ నిర్మాణం చేశారు. క్రీ.శ. 12వ శతాబ్దంలో రాజేంద్ర ఉభయకులోత్తన చోళ కాలంలో గర్భాలయాన్ని నిర్మించారు. 1849లో ఎర్రగుడిపాటి వెంకటాచలం పంతులు ఏడు అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించాడు. తొమ్మిది దశాబ్దాల పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యులు ఈ దేవాలయాన్ని బంగారు గరుడ వాహనం, అద్దాల మండపం, నగలు కానుకలుగా సమర్పించారు.
ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో భగవాన్ రామానుజాచార్యుల జన్మదినాన పూల పల్లకి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ‘ఎ’ గ్రేడ్ ఆలయంగా గుర్తింపు వున్న ఈ ఆలయంలో శ్రీరంగనాథస్వామి తెప్పోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని నీటిపారుదల శాఖను కోరామని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ప్రస్తుతం మంచికంటి సుధాకరరావు ఆలయ చైర్మన్‌గా భక్తుల సేవలో భాగం పంచుకొనగా కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వాహణాధికారిగా దేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భోగి పండుగ రోజున కళ్యాణం, కనుమ పండగ రోజున కనుమ పార్వేటి ఉత్సవం జరుపుతారు. ధనుర్మాసంలో స్వామివారికి అధ్యయనోత్సవం (పగల్‌పత్తు- రాపత్తు) అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సింహపురి వాసులకు ఇలవేల్పుగా పూజలు అందుకుంటూ ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతోంది.

16/01/18, 2:42:54 PM: ‪+91 79811 59026‬: వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

పీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.
మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటిగుడ్డుకి. ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV  తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. నేనొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలను. అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను. వాటితో పాటు నాకు noise కూడా వస్తుంది. నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా నేను వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను.

ఎలా అయితే  ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency నా మెదడుకు అందిస్తుంది. తద్వారా నా బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. అదే మంత్రం మరిన్ని సార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోఅలవాడను. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేనొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలనో అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమె కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నేను మరిన్ని పనులు చెయ్యగలను. అదే విధంగా కేవలం మంత్రోచ్చ్చారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాను. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః”. మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది. మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతనధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు 108 నామాలు జపించమని, లేదా మంత్రం కనీసంలో కనీసం 108 జపించమని కండిషన్ విధిస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతనం.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ  వేంకటేశ్వరార్పణమస్తు !!
16/01/18, 4:12:39 PM: ‪+91 94408 97850‬: 🕉🕉🕉🕉🕉🕉

* ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే …. ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 -620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది .

🌸* నిర్మాణ సోయగం :-🌸

ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిథా కృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి జోహార్లు ప్రతి యాత్రీక భక్తుడు వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతిఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోతున్నారు.

💐* మొదటి అంతస్తు :-💐

క్రింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గము , విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.

💐* రెండవఅంతస్తు :-💐

రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతి గా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.

* మూడవ అంతస్తు లోకి మెట్లమార్గం

💐చారిత్రక నేపథ్యం :-💐

ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయము. సాథారణం గా బౌద్ధ ,జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాథికారిగా పనిచేసిన మాథవరెడ్డి చేత ఈ అనంత పద్మనాభుని గుహాలయము నిర్మింపజేసినట్లుగా చెప్పబడుతోంది.

రెండవ అంతస్థుకు వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే ఉన్న కొండపై శాసనం ఒకటి శిథిలమై కన్పిస్తోంది. ఇక్కడ నుండి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించేవారని జనశృతి. ఈ విషయాన్ని “మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి” అనే వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. రాజులు యుధ్ధసమయాల్లో శతృరాజులకు తెలియకుండా సైన్యాన్ని ఈ సొరంగమార్గం ద్వారా తరలించేవారని ఒకరు వ్రాశారు. కాని ప్రస్తుత కాలంలో దాపురించే వివిథ ప్రమాదాలను నివారించడానికిగాను అథికారులు ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు.

🌸* శాసనం🌸

మూడవ అంతస్తు :- మూడవ అంతస్థులోనికి వెళ్లడానికి గుహను అందగా తొలిచి మెట్లమార్గాన్ని నిర్మించారు. మెట్లను మలిచిన విధానంలోనే ఈ అంతస్థు ప్రత్యేకతను ప్రకటించారు శిల్పులు. ఈ గుహాలయంలోకి ప్రవేశించడమే ఓ వింత అనుభూతిని కల్గిస్తుంది. రెండు వరుసల స్థంభాల మథ్యలో విశాలమైన మండపము విశ్రాంతిమండపంగా భక్తుల్ని ఆహ్వానిస్తుంది. ఆ స్థంభాలపై దశావ తారాలు, వివిథ దేవతామూర్తుల శిల్పాలు కొలువు తీరి చూడగానే పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం.

* మహా గణపతి

లంబోదరుని సహస్ర రూపాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పం లో దర్శింపజేయడం నాన్యతో దర్శనీయం.

🌸* ఉగ్రనరసింహుడు :-🌸

ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితో పాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి.

* శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి

స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు.

🌸* కుడ్యశిల్పం🌸

మరొకస్థంభం మీద కన్పించే శిల్పం ఉగ్రనరసింహుడు. ఇందాక చూచిన రెండు శిల్పాల కంటే పూర్తి వైవిథ్యం కల్గిన మనోహర శిల్పం ఇది. హిరణ్యకశిపుని సంహరిస్తున్న నరసింహునిలో మహోగ్ర రూపాన్ని చూస్తాం. కాని ఈ నారసింహుని వదనంలో ఒక మహోన్నతమైన ఆనందాన్ని ఎంత స్పష్ఠంగా ఆ శిల్పి చెక్కాడో మనం గమనించ వచ్చు. ఉగ్ర నరసింహుని ముఖంలో ఆనందాన్ని చూపించడానికి కారణం ఆ శిల్పి గొప్ప దైవభక్తుడు, ఉపాసనాపరుడై ఉండాలి. హిరణ్యకశిపుని సంహరించడం వలన తన ప్రియభక్తునికి విమోచనం కలిగించాననే ఆనందం ఆ పరమాత్మకు కల్గిందనేది ఆ శిల్పి భావన. అందుకే ఆ ఉగ్రమూర్తి ముఖంలోని ఆనందాన్ని అంత స్పష్టంగా ప్రదర్శింపచేశాడో.

ఆ ప్రక్కనే కన్పించేది వామనావతార ఘట్టం

వామనావతార ఘట్టము

మరొకస్థంభం మీద రూపుదిద్దుకన్నది హనుమత్సందేశం

హనుమత్సందేశ ఘట్టం

ఆ కొండ లోపలి గూడులో అంజనీసుతుడు.

🌸* శ్రీ అనంతపద్మనాభస్వామి :-🌸

మూడవ అంతస్తు చివరి మందిరంలో కొలువుతీరి ఉన్నాడు శ్రీ అనంతపద్మనాభుడు. చూడటానికి రెండు కళ్లు చాలవనేది మనలో మాట. నల్లని గ్రానైటు లో ఏకశిలా నిర్మితమై. పద్మపత్ర విశాలాక్షుడై, అనంతశయనుడై, పద్మనాభుడై, గగనచరులైన దేవతలందరూ ఆనందంనాట్యం చేస్తుంటే, జయ-విజయులు పాదాల చెంత కర్తవ్య పాలనలో ఉండగా, మహర్షులు తపోమగ్నులై యుండగా, ఆకాశంలో గరుడుడు నాట్యం చేస్తుంటే, దర్శనమిస్తున్నాడు శ్రీ అనంతపద్మనాభస్వామి. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించవలసిందే కాని వర్ణింపవలవికాదు. ప్రతిరోజు పూజారి గారు ఏడున్నరకు వచ్చి తొమ్మిదింటి దాక ఉంటారట. శనివారంనాడు దూరప్రాంతాల నుండి కూడ భక్తులు వస్తారు. భక్తులు చల్లే పసుపుకుంకాలతో ”నల్లనయ్య” రూపం ఎర్రగా మారిపోయి, ఎర్ర గ్రానైటుతో చెక్కిన శిల్పంలా కన్పిస్తోంది

* నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ

శ్రీ పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని ఒకేసారి మనం చూడగలిగితే, స్వామితో పాటు పద్మోద్భవుడైన బ్రహ్మ, ఆనందంలో సురేశుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో ఉన్న ఋషులు, ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడు ఇదీ దృశ్యం. ఈ అనంత శయనుణ్ణి చూడగానే ఈ శ్లోకం స్భురణ కొస్తుంది :
”శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగనసదృశం, మేఘవర్ణం, శుభాంగం,
లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం” ఈ శ్లోకమే ఈ శిల్పికి ప్రేరకమై, శ్రీ అనంతపద్మనాభుని రూపాన్ని భువన మోహనంగా మన ముందు రూపు కట్టించింది.

* ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు

🌸* నాగబంథం :-🌸

మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.

నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు

🌸* వేదపురుషులా?🌸

ఈ గుహాలయాల్లో నాల్గవ అంతస్తు కూడ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

🌸* రవాణాసౌకర్యాలు :-🌸

విజయవాడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. మంచినీళ్లు తీసుకువెళ్లడం మాత్రం మరచిపోవద్దు.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
16/01/18, 4:14:58 PM: ‪+91 94411 78068‬: 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
కనుమ పండుగ.
కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు
వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.

ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.

ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.

మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి  తెలియజేద్దాం.

చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది. 

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ{శివ కింకరుడు దగ్గొలుమునేంద్ర }ॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

16/01/18, 8:57:51 PM: Ivaturi Umashankar: శ్లో :      సుశీలోమాతృపుణ్యేన,

            పితృపుణ్యేన చాతురః

          ఔదార్యం వంశపుణ్యేన

          ఆత్మపుణ్యేన భాగ్యవాన్.

తాత్పర్యం :

                తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం                                                పొందుతాము. అలాగే వంశపుణ్యాన ఉదారత్వం లభిస్తుంది, కానీ స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి.

                              శివాయ గురువే నమః
17/01/18, 7:02:12 AM: MVMRAO: 🕉🕉🕉🕉🕉🕉

🌸మాఘ మాసం -🌸

💐 వసంతోత్సవాలు / శారదా నవరాత్రులు 💐

మాఘ శుద్ధ పాడ్యమి  నుండి మాఘ శుద్ధ నవమి వరకు శారదా నవరాత్రులు గ జరుపుకుంటాము. ఇక్కడ నుండి వసంత కాలవాతావరణం కనిపిస్తుంది కనుక ,ఇతర ప్రాంతాలలో వసంతాధి దేవతలు అయినటువంటి రతి మన్మధులను పూజిస్తారు. రతి ,మన్మధుల అనుగ్రహం చేత జీవితం లో సర్వాభీష్టాలు తీరి, ఆనందమయం గ ఉండి, ఎమైన అవరోధాలు ఉంటే తొలగిపోతాయి అని శాస్త్రవచనం. ఈ మాఘమాసం మొదలు..అంటే ఈ నెల నుండి, ఉత్తరాయణ పుణ్యకాలంలో రతి,మన్మధ ఉత్సవాలు,లేక వసంత ఉత్సవాలు అనేవి అనేక విధాలుగ జరపబడుతుంతే,మన ప్రాంతంలో ఈ కాలంలో శారదా నవరాత్రులు గ పండుగ జరుపుకుంటాము.

విద్యాధిదేవీ, ఙ్ఞానాధిదేవీ అయిన శ్యామల దేవి కి సంబందించినటువంటి రోజులు ఈ శారదా నవరాత్రులు.
ఇవి ఙ్ఞానప్రధానమైన నవరాత్రులు. ఈ రోజుల్లో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, వారికి ఙ్ఞానం లభిస్తుంది.
తొమ్మిది రోజులు వీలుకాని వారు, మాఘ శుద్ధ పంచమి, అనగా శ్రీ పంచమి రోజున మాత్రం ఆ శారదా దేవిని తప్పనిసరిగా పూజించాలి.
ఇది ఒక నియమముగా పెట్టుకోవాలి. ఇది భారతీయులకు ఒక పండుగ.
అక్షరములు అంతా శారదా మయం,కనుక అసలు ఏ రంగమైన సరే//ఒక ఆధ్యాత్మిక రంగము లో సిద్ధించాలంటే ఆ శారదా అనుగ్రహం పొందాలి. ఆవిడే చైతన్య స్వరూపిణి.
ఆ అమ్మే జగము అంతా వ్యాపించి, ఆవిడ శక్తిని ప్రసరింపచేస్తోంది.

అలాంటి తల్లిని ఈ నవరాత్రులలో పూజించి, మనము అందరము అమ్మ కటాక్షమునకు పాత్రులము అవ్వుదాము.

భజే శారదాంబ మజస్రం మదంబాం!

17/01/18, 11:47:24 AM: Yes Pk: *ఈశ్వరుడి ప్రియ పుష్పాలు* 
మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటలోని పూలు తెద్దాం. అన్నట్టు ఈశ్వరు నికి  ఇష్టమైన పూలేంటో తెలుసా!
ఇవిగో.....👇

*అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః*
*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః*
*జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ* 
*సత్యం  అష్ట విధం  పుష్పో: శిహో  ప్రీతి కరం  భవేత్ !!*

*1.అహింసా పుష్పం:*
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

*2.ఇంద్రియ నిగ్రహం:*
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

*3.దయ:*
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

*4.క్షమ:*
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

*5.ధ్యానం:*
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

*6.తపస్సు:*
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

*7.జ్ఞానం:*
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

*8.సత్యం:*
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
 
అవి చాలా అరుదైన పుష్పాలు,అవి మా తోటలో *అన్ని లేవే* అంటున్నారా!మరేం పర్లేదు,ఇవాళే వాటిని నాటండి ఈ పూలు పూయించండి. మీరంతా ఏడాది పూజ వాటితోనే చేస్తారని ఆశిస్తూ

16/01/18, 9:34:32 PM: ‪+91 79811 59026‬: *మహాప్రాణాలతో అల్పప్రాణులపై మారణకాండ*
(కొన్ని ఉచ్చారణా/ముద్రణా వైపరీత్యాలు)

      1) శాకాహారమా? శాఖాహారమా?

‘శాకము’ అంటే కూరగాయ. ‘శాఖ’ అంటే కొమ్మ. చాలామంది రెండోదాన్నే వ్రాసేస్తుంటారు. ఇక హొటళ్ళ బోర్డులైతే సరే సరి. (ఒక్కోసారి పెద్దపెద్ద కొమ్మలవంటివి ప్లేటుల్లో కనిపించినపుడు ఈ మాట సార్థకం!)

      2) సింధూరమా? సిందూరమా?

కమర్షియల్ రచయితలు వ్రాసేవాటిల్లో మొదటిది సరైనదేమోగానీ, నిజానికి రెండవదే సరైనది. పైగా ‘సింధురము’ అంటే ఏనుగు అనే అర్థం ఉంది. సినిమాలలో కూడా ఇది రూపాంతరంచెంది, తరువాత మొదటిదిగా రూఢియైపోయింది! (సినారె వ్రాసినపుడు ‘కిలకిల నవ్వులు’ అనే పాటలో స్పష్టంగా ‘నీ పాదధూళి సిందూరము కాదా?’ అని పలకబడింది. తరవాత వచ్చిన పాటల్లోను, రచనల్లోను ఎందుకో ‘ద’కి మహాప్రాణం వచ్చేసింది!)

      3) ఆనందబాష్పాలా? భాష్పాలా?

  మొదటిదే సరైనది, నమ్మలేని నిజం!   

      4) ఎన్ని విధాలుగా పాఠకులను, శ్రోతలను ‘బాధించవచ్చు?’

      భాద
      భాధ
      బాధ
      బాద

      దురదృష్టవశాత్తు పైవాటిలో మూడవది మాత్రమే సరైనది. మొదటి రెండూ విపరీతప్రయోగాలే!
      నాలుగోదైతే మరీను!

      5) దురంధరుడా? ధురంధరుడా?

        ఇక్కడ మాత్రం రెండవదే సరైనది -  (‘ధుః ధుర్’ లకు సంబంధిచినది) - ‘భారాన్ని వహించే నాయకుడు’ అని అర్థం!

        6) బహుమతి ప్రదానమా? ప్రధానమా?

        గొప్పకు పోయి రెండవదాన్ని వాడుతూంటారు చాలామంది. నిజానికి మొదటిదే సబబైనది. ‘దాన’ అనే మాటకు ‘ప్ర’ అనే ఉపసర్గను చేర్చితే, ప్రకృష్టమైన (ప్ర) దానం - గొప్పగా ఇవ్వడం అవుతుంది. ఇక్కడ ‘ప్రధానమైనది’ ‘ప్రదానమే’గాని, ‘ప్రధానం’ కాదు.

        7) ‘కచ్చితంగా’ వస్తాను - ‘ఖచ్చితంగా’ వస్తాను - వీటిలో ఏది సరైన పదం?
       
          రెండవది సరైనదనిపిస్తుంది, కానీ మొదటిదే సరైనది. ఎందుకంటే అది ఆచ్ఛికం (అచ్చమైన తెలుగుపదం). అచ్చమైన తెలుగు పదాలలో పెద్ద అక్షరాలుండవు!

        8) ‘ఖర్మ కాలి  అక్కడికెళ్ళాను’ - అయ్యా! ‘ఖర్మ’ అనే మాట ఏ నిఘంటువులోనూ దొరకదు. కానీ పరిస్థితి బాగుండనపుడు నొక్కిచెప్పడానికి (emphasis) వాడేస్తూంటాము. ఇది ఎంతవరకూ పోయిందంటే, గీతలోని కర్మయోగాన్ని కూడా అదేదో తప్పులుచేసినవాళ్ళకు కలిగే శిక్షలు వగైరా అందులో ఉంటాయని ఎందరో పామరులు అనుకునేంతవరకు!

        9) అన్నట్లు ‘తెలుగు భాషా? తెలుగు బాషా?”

ఏదైనా పరవాలేదంటున్నారు పండితమ్మన్యులు కూడా! ‘బాషా’ అనే మాటకు ఉర్దూలో ‘రాజు’ అనే అర్థం ఉంది. ‘ఆసు, రాజు, మదాం’ - అని మనం అనేదానికి కొన్ని ప్రాంతాలవాళ్ళు ‘ఎక్కా, బాషా, రండీ’ అంటారు. సంస్కృతంలో ‘భాష్’ అనే ధాతువుకు ‘మాట్లాడు’ అని అర్థం. దానినుండే ‘భాషా’ అనే స్త్రీలింగరూపం సంస్కృతంలోను, దానినుండి మన పద్ధతి ప్రకారం ‘భాష’ అనే పదం తెలుగులోను ఏర్పడ్డాయి.

        10) చివరిగా ఇదంతా ‘పద్ధతి’గా ఉందా?/ ‘పద్దతి’గా ఉందా?

ఈ విషయమై మీకూ ఎన్నోసార్లు అనుమానం వచ్చిఉంటుంది - ఎందుకంటే ఏ డీటీపీ చేసే వ్యక్తికి ఇచ్చినా ఒత్తులేని ‘ద’నే కొట్టగా చూచానుగానీ ‘ద్ధ’ ఎవడిచేతిమీదుగానూ పడలేదు!