27/01/18, 3:36:33 PM: Mani-TTE-Tenali: #భీష్మఏకాదశి 27-01-2018
#తండ్రి
మాటకు తలొగ్గి #శ్రీరాముడు ఆదర్శ పురుషుడైతే, తండ్రి సుఖం కోరి
సింహాసనాన్ని వదులుకుని ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు
#భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి
స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేర
బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.
అది ద్వాపరయుగం శోభకృతు నామ సంవత్సరం.
మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్టమధ్యాహ్నం
వేళ శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో
ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు
మరణించిన రోజే #భీషాష్టమి. మరణించే ముందు
కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల
తర్వాత
వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.
ఎన్నికష్టాలెదురైనా చలించక తుదివరకు ధర్మానికి మాత్రమే కట్టుబడిన
ఆదర్శప్రాయుడు మరియు అంత్యకాలంలో వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని
వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు
భీష్ముడు. అవే తరువాత విష్ణు సహస్రనామాలుగా
ప్రసిద్ధికెక్కాయి. అందుకే ఏకాదశినాడు
విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు
చేకూరుతాయి.
No comments:
Post a Comment