01/01/18, 11:12:28 AM: +91 94411 78068: శివానుగ్రహ ప్రాప్తిరస్తు
మిత్రులకు
ఎవ్వారి కరుణనొందె కిరీటి ఘనమైన
పాశుప తాస్త్రమ్ము బడయు వేళ,
ఎవ్వారి కృపనొందె ,విష్ణుండు యసమాన ,
చక్రంబు పొందెడి సమయమందు,
ఎవ్వారి దయనొందె, యింద్రాది వేల్పులు
దిక్పతులై నిల్చు, దరుణమందు,
ఎవ్వారి వాత్సల్య మెంతైన పొందెనో
ధనపతి సఖునిగా దనియు వేళ,
తే!!గీ!!
అట్టి హరునాత్మ గొల్చుచు, యార్తితోడ
పిలుచు నెవ్వాడు,భవదూరు పేర్మిమీర,
అట్టి తనభక్తు నార్తిదీర్పంగ వచ్చు,
అంబతో నరుదెంచి, తా, నభయమిచ్చు
No comments:
Post a Comment