Friday, January 12, 2018

05/01/18, 8:45:28 PM: ‪+91 79811 59026‬: శ్లోకం:

అంబలి తారకం వందే.
చింతకాయ శుభ ప్రదం.
కూరగాయ కృత త్రాసం
పాలనేతి ప్రియం గవాం.

గమనించారుకదా యీ శ్లోకాన్ని.
ఈ శ్లోకం లో " అంబలి, చింత కాయ, కూరగాయ, పాల, నేతి, " యిత్యాది పదాలు మనకి తెలుగు పదాల్లాగా కనిపించి, తెలుగు పదాలతో కూడిన సంస్కృత శ్లోకం లాగా తోస్తుంది. ఐతే కొంచెం ఆలోచించి చూస్తే ఆ పదాలు తెలుగు పదాలు కావు. సంస్కృత పదాలే.ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం.


బలి తారకం =బలిని తరింపజేసిన వాడును,
చింతకాయ=చింతించు వారికి,
శుభ ప్రదం=శుభములు కలిగించు వాడును,
కు + ఉరగాయ= చెడ్డవాడయిన ఉరగమునకు {కాళీయునకు} ,త్రాసం=కష్టమును,
కృత= కలిగించిన వాడును,
గవాం= గోవులను,
పాలన+ఇతి= పరి పాలించుట యనిన,
ప్రియం= యిష్టము గల వాడును అగు,
అం= విష్ణువునకు,
వందే= నమస్కరించు చున్నాను.

అర్థం:  బలి చక్రవర్తిని అనుగ్రహించినవాడునూ,, తనను గూర్చి చింతించు వారికి శుభము లిచ్చువాడునూ,దుష్టుడయిన కాళీయునకు దండన  నొసగిన వాడును , గోవులను పరిపాలించుటయందు ఇష్టం గల వాడును అగు విష్ణువునకు నమస్కరించుచున్నాను.


No comments:

Post a Comment