17/01/18, 7:02:12 AM: MVMRAO: 🕉🕉🕉🕉🕉🕉
🌸మాఘ మాసం -🌸
💐 వసంతోత్సవాలు / శారదా నవరాత్రులు 💐
మాఘ
శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు శారదా నవరాత్రులు గ
జరుపుకుంటాము. ఇక్కడ నుండి వసంత కాలవాతావరణం కనిపిస్తుంది కనుక ,ఇతర
ప్రాంతాలలో వసంతాధి దేవతలు అయినటువంటి రతి మన్మధులను పూజిస్తారు. రతి
,మన్మధుల అనుగ్రహం చేత జీవితం లో సర్వాభీష్టాలు తీరి, ఆనందమయం గ ఉండి, ఎమైన
అవరోధాలు ఉంటే తొలగిపోతాయి అని శాస్త్రవచనం. ఈ మాఘమాసం మొదలు..అంటే ఈ నెల
నుండి, ఉత్తరాయణ పుణ్యకాలంలో రతి,మన్మధ ఉత్సవాలు,లేక వసంత ఉత్సవాలు అనేవి
అనేక విధాలుగ జరపబడుతుంతే,మన ప్రాంతంలో ఈ కాలంలో శారదా నవరాత్రులు గ పండుగ
జరుపుకుంటాము.
విద్యాధిదేవీ, ఙ్ఞానాధిదేవీ అయిన శ్యామల దేవి కి సంబందించినటువంటి రోజులు ఈ శారదా నవరాత్రులు.
ఇవి ఙ్ఞానప్రధానమైన నవరాత్రులు. ఈ రోజుల్లో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, వారికి ఙ్ఞానం లభిస్తుంది.
తొమ్మిది రోజులు వీలుకాని వారు, మాఘ శుద్ధ పంచమి, అనగా శ్రీ పంచమి రోజున మాత్రం ఆ శారదా దేవిని తప్పనిసరిగా పూజించాలి.
ఇది ఒక నియమముగా పెట్టుకోవాలి. ఇది భారతీయులకు ఒక పండుగ.
అక్షరములు
అంతా శారదా మయం,కనుక అసలు ఏ రంగమైన సరే//ఒక ఆధ్యాత్మిక రంగము లో
సిద్ధించాలంటే ఆ శారదా అనుగ్రహం పొందాలి. ఆవిడే చైతన్య స్వరూపిణి.
ఆ అమ్మే జగము అంతా వ్యాపించి, ఆవిడ శక్తిని ప్రసరింపచేస్తోంది.
అలాంటి తల్లిని ఈ నవరాత్రులలో పూజించి, మనము అందరము అమ్మ కటాక్షమునకు పాత్రులము అవ్వుదాము.
భజే శారదాంబ మజస్రం మదంబాం!
No comments:
Post a Comment