07/01/18, 9:53:26 AM: +91 94411 78068: అందరికి శుభోదయం.
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
తా: సభలందుగాని, తల్లి-తండ్రి, అధికారుల యెదుట గాని, ఇతరుని భార్యతోగాని, సద్విజులను గూర్చిగాని నవ్వకు. ఇది నీతిగాదని తలంపుము.
No comments:
Post a Comment