09/01/18, 3:40:01 PM: +91 94411 78068: శ్లో. పితృభిః తాడితః
పుత్రః,
శిష్యస్తు
గురుశిక్షితః,
ధనాహతం
సువర్ణం చ
జాయతే
జనమండనమ్.
తాత్పర్యం:
తండ్రితో దండితుడైన కొడుకు, గురువు వద్ద శిక్షణ పొందిన శిష్యుడు, సుత్తి
దెబ్బలు తిన్న బంగారం లోకానికి అలంకారం కావడం తథ్యం.
శ్లో. సుశీలో మాతృపుణ్యేన, పితృపుణ్యేన చాతురః
ఔదార్యం వంశపుణ్యేన, ఆత్మపుణ్యేన భాగ్యవాన్.
తా.
తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం పొందుతాము. అలాగే
వంశపుణ్యాన ఉదారత్వం లభిస్తుంది, కానీ స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు
కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే
పుణ్యకార్యాలు చేయాలి.
No comments:
Post a Comment