Saturday, January 13, 2018

13/01/18, 7:11:58 AM: Ivaturi Umashankar: #బోగి_పండ్లు

రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.
బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.
సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.
భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.
దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు.

రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
-----------------------------
రేగుపండులో సుగుణాలు

రేగు పండులో విటమిన్ డి, ఎ, కె పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేగు పండు మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల రకాల రేగు పండ్లు లభిస్తున్నాయి. ఎండిన రేగు పండులో కాపర్, బోరాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మూలకాలు ఆస్టియోపొరోసిస్ నివారణలో ప్రధానపాత్ర వహిస్తాయి. రేగు పండు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే మినరల్స్ బీపిని అదుపులో ఉంచడంలో తోడ్పడుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలమవుతుంది. మంచి యాంటిఆక్సిడెంట్ కూడా కావడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. రేగు పండులో బీ కాంప్లెక్స్‌లోని నియాసిన్, విటమిన్ బి6, ఫినోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కార్బోహైవూడేట్లు, ప్రొటీన్లు, కొవ్వుపదార్థాల జీర్ణక్షికియకు తోడ్పడుతాయి.

గుండె ఆరోగ్యానికి - రేగు పండులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా నిరోధిస్తుంది. అందువల్ల బీపి అదుపులో ఉండటం మాత్రమే కాదు గుండె కొట్టుకునే విధానం కూడా స్థిరంగా ఉంటుంది. రేగు పండులోని సాలిబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి తోడ్పడుతుంది. ఈ పండులోని అధిక పొటాషియం శరీర బరువును కూడా నియంవూతిస్తుంది.
కాన్సర్ ను నిరోధిస్తుంది - రేగు పండులోని బీటా కెరోటిన్ చాలా రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

కంటి ఆరోగ్యానికి - ఆరోగ్యవంతమైన కళ్లకి విటమిన్ ఎ ఎంతో అవసరం. రేగుపండులో విటమిన్ ఎ తో పాటు జియాక్సిథిన్ అనే ఒక ఫైబర్ కూడా రెటినా ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది, ఇది హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

మలబద్దకానికి - ఎండిన రేగు పండును ప్రూనే అంటారు. జీర్ణక్షికియకు తోడ్పడే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో ఉండే సార్బిటాల్, ఇసాటిన్ జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణక్షికియ సామర్థ్యం పెరిగి కడుపులో కదలికలు సరైనరీతిలో జరిగి మలబద్దక సమస్యకు మంచి పరిష్కారం రేగు పండు.

నిరోధక శక్తి పెంపొందించడానికి- రేగుపండు ద్వారా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
వృద్ధాప్యం వాయిదా -రేగు పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాలిక్ యాంటిఆక్సిడెంట్, లూటిన్, క్రిప్టోక్సాథిన్, జియాక్సిథిన్ వంటి యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో ప్రతినిత్యం జరిగే ఏజింగ్ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి వీలుంటుంది.


No comments:

Post a Comment