Saturday, January 13, 2018

13/01/18, 9:50:35 AM: ‪+91 91776 98078‬: స్నేహితుల లక్షణాలను గురించి నీతిశాస్త్రములో ఇలా చెప్పారు.
శ్లో॥దదాతిప్రతిగృహ్ణాతిగుహ్యమాఖ్యాతిపృచ్ఛతి।భుంక్తేచభోజయత్యేవషడ్విదంమిత్రలక్షణమ్॥
ఒక స్నేహితుడు తన స్నేహితునికి అవసరసమయాల్లో ధన సహాయంగానీ వస్తు సహాయంగానీ చేయడం, అలాగే తన అవసర సమయాల్లో తీసుకోవడం, తను ఇతరులతో చెప్పుకోలేని బాధలను, రహస్యాలను స్నేహితునితో పంచుకోవడం, అలాగే స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు అతనిని అడిగి తెలుసుకొని సహాయం చేయడం, మిత్రుని ఇంట్లో అరమరికలు లేకుండా భోజనం చేయడం, అలాగే మిత్రునికి భోజనం పెట్టడం ఈ ఆరు లక్షణాలు మిత్రలక్షణాలని నీతిశాస్త్రంలో చెప్పబడినది. సుఖదుఃఖాలలో పాలు  పంచుకుంటూ, పరస్పరం సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు అండగా స్నేహితులు ఉండాలని భావం. ధన్యవాదాలు.


No comments:

Post a Comment