15/01/18, 7:27:32 AM: BADRI: శుభోదయం
ఈ
మకర సంక్రాంతి పర్వదిన శుభ సందర్భంగా మీ ఇంటిల్లిపాదీ ఆయురారోగ్య సుఖ
సంతోషాలతో, అనందోత్సాహాలతో ఉండాలని, మీ జీవితాలలో సకల శుభాల వెలుగులు
నిండాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక
సంక్రాంతి శుభాకాంక్షలు.
WISH YOU ALL HAPPY MAKARA SANKRANTHI
హిందూ బంధువులందరికీ మరియు విశ్వ జనులందరకీ " #మకరసంక్రాంతి " పండుగ శుభాకాంక్షలు !!
ఇది " #ప్రకృతి - #పండుగ " !!
ఇది అందరి పండుగ !!
మన ప్రాచీన #భారతీయకాలగణనం ' లో ప్రధానంగా మూడు రకాల కాల గణన పద్దతులున్నాయి !!
1- చాంద్ర మానం అంటే చంద్రుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క గట్టే పద్దతి !!
2- సౌర మానం అంటే సూర్యుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్క గట్టే పద్ఘతి !!
3- బృహస్పతి మానం అంటే గురు గ్రహం యొక్క గమనాను సారం కాలాన్ని లెక్క గట్టే పద్ధతి !!
* మనం జరుపుకునే " #మకరసంక్రాంతి " పండుగ #సౌరమానం ప్రకారం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ !!
* సూర్యుడు ఒక రాశిలో ఒక నెల వుంటూ 12 రాశులు - 12 నెలలు మారుతూ వుంటాడు !!
ఒక సంవత్సరములో 12 సంక్రమణలు
జరుగుతాయి!!
అలా సూర్యుడు ధనుస్ రాశి నుండి మకర రాశిలో ప్రవేశించటమే "#మకరసంక్రమణ" #పుణ్యకాలము!!
ఇప్పటి నుండి సూర్యుడు ఉత్తరాభి ముఖంగా ప్రయాణం సాగుతుంది కనక దీనిని ' ఉత్తరాయణ పుణ్యకాలం ' అని కూడా
అంటారు !!
పగలు ఎక్కువ రాత్రులు తక్కువగా మారతాయి!!
#ప్రకృతి లో మార్పు #కాలం లో మార్పు వచ్చి చలి క్రమంగా తగ్గి ఎండ తీవ్రతలు పెరుగుతాయి !! ఇది మనందరకీ తెలుసు !!
మన ప్రాచీన ఋషుల గొప్పతనం!!
#కాలగణన- #కాలవిభజన!!
ఒక రోజును 2 భాగాలు చేశారు!!
#పగలు - #రాత్రి!!
ఒక నెలను 2 భాగాలు చేశారు!!
#శుక్లపక్షము - #కృష్ణపక్షము!!
ఒక సంవత్సరాన్ని 2 భాగాలు చేశారు!!
#ఉత్తరాయణం - #దక్షిణాయనం!!
మనకు పగలు-రాత్రి ఒకరోజుకదా!!
మనకు సంవత్సరము దేవతలకు ఒకరోజు!!
ఉత్తరాయణము దేవతలకు పగలు!!
దక్షిణాయనము దేవతలకు రాత్రి!!ఇదీసంగతి
ఈరోజునుండి #సూర్యుడుఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తాడు కనుక ఇది #ఉత్తరాయణం అయింది!! దేవతలకు పగలు ప్రారంభమైంది!!
ఉత్రరాయణములో మరణిస్తే ఉత్తమలోకాలు
ప్రాప్తిస్తాయి కనుక #భీష్ముల వారు
మహాభారతయుద్దములో దక్షిణాయనములో
నేలకొరిగినా #ఇచ్ఛామరణవరసిద్దులు
కనుక తన ప్రాణాలను నిలిపి ఉత్తరాయణంలో
ప్రాణాలు వదిలారు.ఇదిమనందరికి తెలుసు!!
ఇది పంటల పండుగ !!
ఇది పాడి పశువుల పండుగ !!
ఇది ముగ్గుల పండుగ -
ముత్తైదువల పండుగ !!
ఇది పడచు పిల్లల పండుగ -
ఇది పతంగుల పండుగ !!
ఎటుచూసినా #ధాన్యరాశులతో
#పౌష్యలక్ష్మి కలకలలాడుతుంది!!
ప్రకృతి పరవశించిపోతుంది!!
రైతన్నల గుండెలలో ఆనందం వెల్లివిరుస్తుంది!!
#గంగిరెద్దులవిన్యాసాలు!!
#హరిదాసులసంకీర్తనలు!!
#ఇంటిముంగిటముత్యాలముగ్గులు!!
#ముగ్గల్లోగొబ్బెమ్మలుపసుపుకుంకుమలు!!
చిన్నపిల్లలకు #భోగిపండ్లు పోస్తారు!!
#రేగుపండ్లనే #బదరీఫలాలు అంటారు!!
బదరీక్షేత్రములో #నరనారాయణలచే
స్పృశించబడి వారి ఆకలిని తీర్చాయి కనుక
అవి పవిత్రమైనవి మనకు దీర్ఘాయువును
కలిగిస్తాయి!!
ఈ రోజు అన ేక రకాల పిండి వంటలు చేసుకున్నాఅందులో ముఖ్యమైనది
" #నువ్వులలడ్డులు" !!
తీపికి మధురమైనస్నేహానికి ప్రతీకం!!
ఈ గజ గజ వనికే చలికాలములో నువ్వులు- బెల్లముతో చేసినలడ్డూలు ఒంటిలో వేడిని కలిగిస్తాయి!!
#నువ్వులుతింటేనవ్వులువిరబూస్తాయి!!
తెలంగాణా ప్రాంతములో #అరిసెలు #సకినాలకు ఈ పండుగ ప్రసిద్ధి!!
ఇవినెలల పాటు నిల్వ చేసుకుంటారు!!
#మకరసంక్రమణపుణ్యకాలము
*
శ్రీ హేవలంబినామ సం!!ర పుష్యమాస బహుళ త్రయోదశి భానువారము, మూల నక్షత్ర,
ధృవయోగ, వనజికరణ, కర్కాటకలగ్న శుభ సమయములో 14-1-2018 తేది రాత్రికాలము
గం!! 7 - 18 ని!!లకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును!!
#సర్వకాలేషుసర్వేషాంశుభమ్భవతు!!
ఈ "మకర సంక్రాంతి" పుణ్యకాలము మకర
ప్రవేశానికి ముందు 2గం!!లు తరువాత
2గం!!లు వుండును!!
ఈ రోజు #పితృదేవతలను ఆరాధించాలి!!
ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజించాలి!!
#గోమాతను పూజించాలి!!
#విశేషంగా #దానధర్మాలు చేయాలి!!
మంత్ర జప ధ్యాన సాధనలు పారాయణాలు చేస్తే అనంత ఫలితాన్నిస్తాయి !
" #సూర్యారాధన " విశేష ఫలితాలనిస్తుంది !!
మరోసారి మిత్రులందరికీ సంక్తాంతి-పండుగ
శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.....
.
శుభమ్ భూయాత్ !విశ్వశాంతి వర్ధిల్లునుగాక!
----మీ సామర్ల వేంకటేశ్వరాచార్య!!HYD!!
No comments:
Post a Comment