Friday, January 12, 2018

11/01/18, 7:16:12 AM: ‪+91 94411 78068‬: భార్య యనెడు నొక్క భారమ్ము లేనిచో
పుల్లియాకువోలే పురుషుడెగురు
దారి తప్పనీని దైవమ్ము భార్యరా
విశ్వదాభి రామ వినుర వేమ

వేమనను అనుకరిస్తూ భార్య గొప్పదనం గురించి బేతవోలు  రామబ్రహ్మం గారు చెప్పిన పద్యమిది.

భర్త ఎంగిలి విస్తరాకు వంటి వాడు, దానిపై బరువు వంటిది  భార్య ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరి పోతుంది స్థిరంగా వుండదు. అలాగే భార్య లేకపోతె మగవాడు స్థిర త్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గం లో వుంచే దైవమే భార్య. (జీవితాన్ని  చక్క దిద్దే దేవతే భార్య)

No comments:

Post a Comment