Thursday, February 28, 2019

*****పరమశివనామాలు*****
        (గోవింద నామాలవలే)
రచన-సమర్పణ:గురుమంచిరమేశ్

జయజయశంకర   -పరమశివా
హరహరశంకర      -పరమశివా
శివశివశంకర         -పరమశివా
జయశివ శంకర     -పరమశివా
                           !!జయజయ!!
కైలాసనిలయా       -పరమశివా
కారుణ్య రూపా      -పరమశివా
గిరిజా రమణా       -పరమశివా
గంగాధర హర       -పరమశివా
                            !!జయజయ!!
భక్తవత్సలా           -పరమశివా
భవభయహారీ       -పరమశివా
భోళాశంకర           -పరమశివా
భక్తవశంకర           -పరమశివా
                            !!జయజయ!!
త్రిశూలధారీ         -పరమశివా
త్రిపురాసురహర   -పరమశివా
త్రయంబకేశ్వర     -పరమశివా
త్రిగుణాతీతా        -పరమశివా
                           !!జయజయ!!
సోమనాథేశ్వర     -పరమశివా
శ్రీ శైలేశ్వర            -పరమశివా
మహాకాళేశ్వర      -పరమశివా
ఓంకారేశ్వర         -పరమశివా
                          !!జయజయ!!
పరళీవాసా          -పరమశివా
శ్రీవైద్యనాథా        -పరమశివా
భీమాశంకర         -పరమశివా
జ్యోతిస్వరూపా    -పరమశివా
                          !!జయజయ!!
ఉమామహేశ్వర   - పరమశివా
అర్ధనారీశ్వర        -పరమశివా
కరుణామయశివ  -పరమశివా
కైవల్యమీయర     -పరమశివా
                         !!జయజయ!!
ఈశానముఖా      -పరమశివా
తత్పురుషముఖా -పరమశివా
అఘోరమూర్తీ      -పరమశివా
వామదేవ ముఖ   -పరమశివా
                          !!జయజయ!!
సద్యోజాతా          -పరమశివా
భవ్యస్వరూపా     -పరమశివా
మన్మథ హారీ        -పరమశివా
చిన్మయరూపా     -పరమశివా
                           !!జయజయ!!
సూర్యేందునయనా-పరమశివా
పశుపతీశ్వరా       -పరమశివా
దక్షిణామూర్తీ        -పరమశివా
సత్యస్వరూపా     -పరమశివా
                           !!జయజయ!!
మృత్యుంజయహే -పరమశివా
అంధకాంతకా       -పరమశివా
పాపవిమోచన      -పరమశివా
పార్పతీపతే          -పరమశివా
                           !!జయజయ!!
               (ఇంకా ఉంది)
*లక్ష్మణవ్రతం*:

శ్రీ రాముడి ఎడల హనుమంతుని నిస్వార్ధ
భక్తి రామాయణంలో
కీర్తింపబడినది. అదేవిధంగా లక్ష్మణుని భాతృ భక్తి కూడా అసమాన్యం.లక్ష్మణుని భక్తి శ్రధ్ధలను అర్ధం చేసుకోలేకపోతే
రామాయణం చదివామని అనుకోవడంలో అర్ధమేలేదు.
శ్రీ రాముని పట్టాభిషేకానంతరం
అగస్త్య మహర్షి అయోథ్య నగరానికి విచ్చేసి శ్రీరాముడిని దర్శించారు. రావణుని సంహారం, కుంభకర్ణునితో యుధ్ధం మొదలైన సమర విషయాలు గురించి శ్రీరాముడు అగస్త్య మహర్షికి వివరించాడు. మౌనంగా, శ్రధ్ధగా ఆలకిస్తున్న అగస్త్య మహర్షి 'మేఘనాధుని' సంహారం రామ-రావణ యుధ్ధ ముగింపు  కారకమైనది." అని వ్యాఖ్యానించారు.
అందరూ ఆయన వంక
ఆశ్చర్యంగా చూశారు.
"అవును, రావణ-కుంభకర్ణులు వీరాధివీరులే. వారి సంహారం
శ్రీరాముని వలనే జరగాలి. సీతాదేవిని తీసుకుని రావాలంటే రావణ వధ ఆవశ్యకం. అయితే, మేఘనాధుని
సంహారం కూడా అతి ముఖ్యమైనది. దేవేంద్రుని జయించి, బంధించి లంకకు తీసుకుని వచ్చిన వీరుడు మేఘనాధుడు. ఇంద్రుని జయించి 'ఇంద్రజిత్' అని పేరు పొందాడు. బ్రహ్మదేవుడే స్వయంగా లంకకు వచ్చి ఇంద్రుని దానంగా స్వీకరించి మరల స్వర్గానికి తీసుకుని వెళ్ళవలసి వచ్చినది.
అటువంటి వీరుని సంహారం అతి ముఖ్యం.
రావణ వధకు శ్రీ రాముడు
అవతరించినట్లే, మేఘనాధుని సంహారం లక్ష్మణుని వల్లనే సాధ్యం. మేఘనాధుడు పొందిన వరం అటువంటిది. అసాధారణ మైనది. మేఘనాధుని సంహరించే వీరుడు మూడు నిబంధనలను పాటించిన వాడైవుండాలి.           మొదటిది: పదునాలుగు సంవత్సరాలు నిదురించకుండా వుండాలి.                     రెండవది: పధ్నాలుగు సంవత్సరాలు స్త్రీ సహచర్యం
వుండకూడదు.          మూడవది: పధ్నాలుగు సంవత్సరాలు  అన్న ఆహారాలు మాని వుండాలి. ఇటువంటి కఠినమైన నిబంధనలను
లక్ష్మణుడు తన పధ్నాల్గేళ్ళ వనవాసంలో చాలా కఠినంగా పాటించాడు." అన్న అగస్త్య మహర్షినే అందరూ చూస్తూ వుండి పోయారు.
శ్రీ రాముడు...
"మునివర్యా! చిత్రకూటంలో, నేను సీతాదేవి ఒక కుటీరంలో
వున్నాము. ప్రక్కన వున్న
కుటీరంలో లక్ష్మణుడు
వున్నాడు. రాత్రుళ్ళు
లక్ష్మణుడు నిద్రలేకుండా మాకు రక్షణగా కాపలా కాశాడు. నిద్రలేకుండా వుండి వుండవచ్చును ,వదినగారనే గౌరవభావంతో, సీతాదేవి
ముఖం కూడా చూసి
వుండక పోవచ్చును,
నేను గమనించాను.         అతని భాగంగా నిత్యం కందమూలాలను ఫలాలను యీస్తూ వచ్చాను. మరి అతను ఆహారం తీసుకోలేదని
యెలా చెపుతారు ? అని అడిగాడు. అగస్త్య మహర్షి నవ్వుతూ, రామచంద్రా! లక్ష్మణుని ఔన్నత్యం అందరికి తెలియాలని యీ ప్రశ్న
అందరి ముందూ వుంచారని నాకు అర్ధమయింది.
తన చెంతనేవున్న తన సోదరుడు సౌమిత్రిని చూసి " ఈవిషయమై నీ సమాధాన మేమిటి లక్ష్మణా!? అని శ్రీరాముడు అడిగాడు.
"అన్నా! మీకు గుర్తు వుండే
వుంటుంది. మనం సీతమ్మవారిని వెదుకుతూ
ఋష్యమూక పర్వతం మీదకు వెళ్ళినపుడు
సుగ్రీవుడు సీతాదేవి ఆభరణాలు చూపించాడు
కదా! అవి రావణాసురుడు
సీతాదేవిని ఎత్తుకు పోతూంటే సీతాదేవి క్రిందికి విసిరిన ఆభరణాలు. వాటిలో కాలి మువ్వల పట్టాలు తప్ప మిగతావాటిని గుర్తించ లేక పోయాను. కారణం, సదా నేను సీతమ్మ వారి పాదాలుమాత్రమే
నిత్యం గమనించే వాడిని.
మీరు రాత్రి నిద్రపోయే వేళలో, విల్లుఅంబులతో
నేను వాకిలి వద్ద కాపలాకాస్తూ వున్నాను. నిద్రాదేవి నన్ను ఆవహించాలని వచ్చింది నా అస్త్రాలతో ఆవిడ
ప్రయత్నాలను తిప్పి కొట్టాను. ఓడి పోయిన నిద్రాదేవి పధ్నాలుగు సంవతరములు నాదగ్గిరకు రానని వరం యిచ్చింది. పధ్నాల్గేళ్ళు ముగిసిన తరువాత రామపట్టాభిషేకం రోజున వస్తానని వెళ్లి పోయింది. మీకు జ్ఞాపకం వుండే వుంటుంది. నేను చామరం వీస్తూండగా నా చేతినుండి అది జారిపోవడం; నేను సద్దుకుని దానిని మరల సర్ది పట్టుకోవడం...శ్రీరాముడు చిరునవ్వు తో సరే, నేను నీకు పంచిన ఫలాలు భుజించకుండా ఏమి చేశావు? కాని పండ్లు నావద్ద నుండి తీసుకొన్నావుగా...              మరి పధ్నాలుగు ఏళ్ళు ఆహారం లేకుండా వున్నానని ఎలా చెప్పావని అడిగాడు.
అన్నా! ఆకలి దప్పులు దరిచేరని మంత్రాలను మహర్షి విశ్వామిత్రుడు మనకు ఉపదేశించారు కదా!               ఆ ఉపదేశ కారణం
ముందే గ్రహించారు వారు. ఆ మంత్ర ప్రభావంతో నేను ఆకలిని నియంత్రించాను.
మీరు యిచ్చిన ఫలాలు శబరి ఆశ్రమంలో బుట్టలో భద్రపరిచాను అన్నాడు.
శ్రీ రాముడు హనుమంతుని వైపు చూశాడు. ఆయన భావమును అర్థం చేసుకొన్న హనుమంతుడు తన భూత దేహంతో శబరి ఆశ్రమానికి
వెళ్లి కొద్ది క్షణాలలోనే ఎండిపోయిన  పళ్ళ బుట్టతో తిరిగి వచ్చాడు.
వాటిని గమనించి లెక్క
చూసిన వారు, కొన్ని పండ్లు తగ్గినట్లుగా శ్రీరామునికి నివేదించారు.
శ్రీ రాముని దృష్టి లక్ష్మణుని మీద పడినది."
అన్నా! సీతాదేవిని రావణాసురుడు ఎత్తుక
పోయిన రోజు ఆకలి దప్పులు లేకుండా యిద్దరం వెతకి వేసారాము.
సముద్రము మీద సేతువు
నిర్మించినప్పుడు వ్రత దీక్ష వలన పండ్లు యివ్వలేదు.
మేఘనాధుని వధించే
ముందు ఇద్దరం వ్రతంలో
వుండడం వలన పండ్లు
తీసుకోలేదు. రావణుని
వధించిన రోజు వ్రతం రోజని పళ్ళు తీసుకోని కారణాన్ని, అవి బుట్టలో లేకపోవడానికి కారాణాన్ని సాహేతుకంగా లక్ష్మణుడు వివరించాడు.
అందరూ జవాబు విని
నిశ్చేష్టులై లక్ష్మణుడినే చూస్తూ వుండి పోయారు.

శ్రీ రాముడు అతిశయించిన
ప్రేమానురాగాలతో లక్ష్మణుని ఆలింగనం చేసుకున్నాడు.
లక్ష్మణుడి వ్రతదీక్ష, ఆయన భాతృభక్తి , ఔన్నత్యం అగస్త్యమహర్షి ద్వారా లోకానికి వెల్లడయింది.
యంత్రములు - ఫలితాలు

యంత్రము అనగా ముందుకు వెళ్లేవి, ముందుకు నడిపించునవి అని అర్ధం. అంటే ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారికి భగవదానుగ్రహం కలిగించును. అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనా లని అమ్మవారి నామాలకి చెప్పబడుచున్నది అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి అమ్మవారే.

ఇక భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగా ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం యంత్రానికి ఉండే అమోగమైన శక్తి ఆ దేవతామూర్తిలో ప్రవేశించి అమోగమైన చైతాన్యాన్ని కల్గిస్తున్నది.

భారతదేశమున ఆదిశంకరాచార్యుల వారు అనేక దైవక్షేత్రాలలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన చేయబట్టి లోకం అంతా శాంతి సుభిక్షాలతో పాడిపంటలతో వర్ధిల్లిచున్నది అటువంటి శక్తి ఒక యంత్రానికి ఉన్నది.
అయితే అట్టి యంత్రాలు ఏమేం రకాలు ఉన్నాయో వాటి ప్రయోజనములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

యంత్రములు ప్రయోజనములు
సంకట హర గణీశయంత్రము సర్వకార్యసిద్ధి
వాహనరక్షణ,వాహనసౌఖ్యము
నరగోష నివారణ యంత్రము దృష్టిదోష,నరగోష నివారణ
సరస్వతీ యంత్రము విద్యా ఉన్నతి
సంతాన గోపాల యంత్రము సంతానప్రాప్తి
కళ్యాణ గౌరీ యంత్రము వివాహప్రాప్తి
జనాకర్షణ యంత్రము సర్వజనవశ్యము
ధనాకర్షణ యంత్రము ధనప్రాప్తి
విద్యాభివృద్ధికర యంత్రము సర్వవిద్యాభివృద్ధి
ఉద్యోగప్రాప్తి యంత్రము ఉద్యోగప్రాప్తి
మత్స్య యంత్రము గృహదోషశాంతి
వాస్తుదోషహర యంత్రము వాస్తుదోష నివారణ
కూర్మ యంత్రము వాస్తుదోష నివారణ
అష్ట ధిక్పాలక యంత్రము దృష్టి దోషాది శాంతి
కార్యసిద్ధి యంత్రము సర్వకార్య సిద్ధి
మంగళ యంత్రము కుజదోష నివారణ
లక్ష్మీ ప్రాప్తి యంత్రము ధనాభివృది.
కనక ధారా యంత్రము ఐశ్వర్యప్రాప్తి
వైభవ లక్ష్మీ యంత్రము సర్వశుభకార్యసిద్ధి
కాత్యాయనీ యంత్రము వివాహప్రాప్తి
సుఖసమ్యద్ధి యంత్రము ఇష్టప్రాప్తి
గాయత్రి యంత్రము సద్బుద్ధిప్రసిద్ధి
దుర్గా సప్తశతీ యంత్రము జగన్మాత అనుగ్రహం ఉపాసనాసిద్ధి
రామ రక్షా యంత్రము సర్వదా రక్షణ
శతృ విజయ యంత్రము కార్యజయం
పుత్రే వివాహ యంత్రము వివాహ ప్రాప్తి
దత్తాత్రేయ యంత్రము దుష్టగ్రహబాధా నివారణ
సాయిరక్షా యంత్రము బాబా అనుగ్రహం
గర్భ ధారణ యంత్రము సంతాన ప్రాప్తి
శుభవాభ యంత్రము సర్వశుభప్రాప్తి
సర్వకార్య సిద్ధి యంత్రము కార్య సిద్ధి
బీసా యంత్రము విదేశీయానం
స్వస్తిక్ యంత్రము శుభప్రాప్తి
విజయ యంత్రము సర్వత్రావిజయం
శారదా యంత్రము విద్యాసక్తి
లగ్న యోగ యంత్రము వివాహప్రాప్తి
వాస్తు గణపతి యంత్రము వాస్తుదోష నివారణ
కుబేరయంత్రము ధనప్రాప్తి,ఆరోగ్యము
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రము ధనప్రాప్తి
అష్ట లక్ష్మీ యంత్రము సౌభాగ్యము
వ్యాపారాకర్షణ యంత్రము సకలవ్యాపారవృద్ధి
స్ధిర లక్ష్మీ యంత్రము ధనము స్ధిరమగును
సౌభాగ్య లక్ష్మీ యంత్రము సౌభాగ్యప్రాప్తి
మహసౌర యంత్రము ఆరోగ్యసిద్ధి
నవగ్రహ యంత్రము నవగ్రహశాంతి
సర్వకార్య సిద్ధి యంత్రము కార్యసిద్ధి
మన్యు యంత్రము శతృపలాయనము.
మృత్యుంజయ యంత్రము అపమృత్యు భయనివారణ
ధన్వంతీరా యంత్రము ఆరోగ్యసిద్ధి
మహకార్తికేయ యంత్రము శతృజయం
మహ సుదర్మన యంత్రము ఆరోగ్యము,భయనివారణ
వాహనదుర్ఘటన నివారణ యంత్రము
Iదారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం! సితైక దంత బంధురం !!

గృహీత పాశ మంకుశం !వరప్రదా భయప్రధం !!
చతుర్భుజం త్రిలోచనం! భుజంగ మోపవీతినం!!
ప్రపుల్ల వారిజాసనం భజామి!!

సింధురాననః
కిరీట హార కుండలం! ప్రదీప్త బాహు భూషణం!!
ప్రచండ రత్న కంకణం! ప్రశోభితాంఘ్రి యష్టికం!!

ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం!
సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం!!
సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం !

గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం!
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం!!
షడక్షర స్వరూపిణం

భజే గజేంద్ర రూపిణం!
విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం!!
గిరీశ దర్శనేచ్చయా సమార్పితం! పరాంబయా
నిరంతరం!!

సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం!
మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం!!

ప్రబుద్ధ చిత్తరంజకం! ప్రమోద కర్ణచాలకం !
అనన్య భక్తి మాననం! ప్రచండ ముక్తిదాయకం!!
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం!
దారిద్ర్య విద్రావణ మాశు కామదం !!

స్తోత్రం పఠెదేత
 దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్!!

ఇతి శ్రీ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం
ఓం గం గణపతయే నమః!!

Tuesday, February 26, 2019

*వారణాసి కాశి వైభవం*

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ బుభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం

ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని

ప్రపంచ సాంస్కృతిక నగరం

స్వయంగా శివుడు నివాసముండె నగరం

ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలంతో కాశీిని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది

పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు.

కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది

ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశి ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశిలోని కొన్ని వింతలు...

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పూలచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి

అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు

అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశి విషవేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

కాశిలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది.

కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

 ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి
అందులో కొన్ని

1) దశాశ్వమేధఘాట్

 బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయకాలం విశేషమైన గంగామా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్

చంద్రుడు చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్

సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్

 పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్

 ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు

ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు

ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది

ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి
జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్

ఇప్పుడు సిందియా ఘాట్ అంటారు

ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది

ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్

 ఇక్కడే బూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్

 తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్

 ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు

ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లబచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్

 సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు

నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్

ఇక్కడ కైలాసపర్వతం నుండి బూగర్భ జలధార కలుస్తున్నది

ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లబిస్తున్నది.

15) నారద ఘాట్

 నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్

 ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం...

ఇక్కడ స్నానం చేస్తే పాపలు తొలిగి 64 యోగినిలు శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్

ఇక్కడే పూర్వం బ్రమ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞాలను తొలగించమని వక్రతుండ వినాయకున్నీ తపస్సు చేసి ప్రసన్నున్ని చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశి
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము

కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి

పూర్వం కాశిలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మొహమ్మదియ దండ యాత్రికులు కాశిని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము

విశ్వనాథ ,బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మజిదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞ్యాన వాపి తీతం బావి ఉంటుంది

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ కట్టించారు

కాశి స్మరణం మోక్షకారకం

Saturday, February 23, 2019

భోజనం  చేసే విధానము .

భోజనం బల్ల మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.

తిండేదైనా ఫోర్క్ ఖచ్చితం అయి కూర్చుంది ఈ వేళ..?

భోజనశాల లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.

ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.

దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.

అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే శాస్త్రీయ లాభాలను ఓ సారి చూద్దాం.

ఇది చదివాక ఎక్కడున్నా…?
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయి.

🍴🍴🍴🍴🍴🍴🍴

3.అహారాన్ని చేతితో  ముట్టుకో గానే, ఆహారం తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

🍴🍴🍴🍴🍴🍴🍴

6.మన ఆహారం లో నూనె  ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

7.వ్రేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

8.చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

🍴🍴🍴🍴🍴🍴🍴

9.ఇంకా చేతివ్రేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల ప్రకారంగా ....

*చేతిలో ఉండే ఒక్కో వ్రేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది.
🍽🍽🍽🍽🍽🍽🍽

*బొటన వ్రేలు: అగ్నితత్వం
--------------

*చూపుడు వ్రేలు: వాయుతత్వం
--------------

*మధ్యవ్రేలు: ఆకాశం
--------------
*ఉంగరపు వ్రేలు: భూమి
--------------
*చిటికిన వ్రేలు: జలతత్వం..
--------------
ఈ అయిదు వ్రేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.
🍃🍍🍎🌿🍐🍊🍑🍒🌽🍆🍌🍃

ఇది  నిజం .....
భారతదేశంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసి, మనిషి నియమబద్దమైన జీవనం సాగించి మోక్షమార్గం పొందగలిగే ధర్మసుక్ష్మాలను తెలియజేసేవి పురాణాలు. వేదవిద్య కష్టసాద్యమైనది. సర్వజనులకు అది అభ్యాస సాధ్యం  కాదు. కనుక అందలి విషయాలను, ధర్మాధర్మాలను విపులంగా, సరళంగా, కధల రూపంలో రాజవంశాలను, వారి చరిత్రను పామరజన రంజకంగా వివరించినవి పురాణాలు.      
 వ్యాస భగవానుడు అలా 18 పురాణాలను రచించాడు. వాని వివరాలను సుక్ష్మంగా పరిశీలిద్దాం.
"సమాధి" ఒక సమున్నత అవస్థ :

 ఆది వ్యాధులు సమమైన, స్థిత ప్రజ్ఞుడైన  సాధకుడికి సమాధి అవస్థ ప్రాప్తిస్తుంది.  ఆది వ్యాధులు సమమగుట  కఠినమైన పని. ప్రయత్నం వల్ల కూడా  దుర్లభము. అటువంటి అవస్థ ఎప్పుడో ఒకప్పుడు పరిణతి చెందిన సాధకుడికి దానంతట అదే లభిస్తుంది. సమాధి ప్రముఖంగా రెండు(2) రకములు. మొదటిది సగుణ లేదా సబీజ సమాధి. రెండవది నిర్బీజ లేదా నిర్గుణ సమాధి. కోట్లలో  ఒక్కరికి అవస్థా రహిత అవస్థ అయిన నిర్బీజ సమాధి ప్రాప్తిస్తుంది.
      సబీజ సమాధి నాలుగు రకములు. 1.సబీజ ,2.సగుణ ,3.సవిచార,4.సవితర్క సమాధులు. అష్టవిధ  ప్రకృతి ప్రకారము సబీజ సమాధి 8 రకములు. కృష్ణభగవానునికి, అందుకే ఈ కారణంగానే ఎనిమిది మంది పత్నులు అని చెప్పబడింది. ఆయన కూడా స్వయంగా అష్టమ గర్భుడు. అష్టమి నాడే జన్మించాడు. ఈ కథలన్నీ యోగ రహస్యముల తో నిండి ఉన్నాయి. ప్రయత్నము చేసినచో నరుడు నారాయణుడిగా మారవచ్చును.  ప్రతి సాధకుడు స్వయంగా శ్రీ కృష్ణభగవానుడు కాగలడు.

      అనేక జన్మల యందలి, అభ్యాసం వలన సమాధి అవస్థ ప్రాప్తిస్తుంది. శుద్ధమైన, ప్రకృతి సహజమైన శరీరము, అత్యంత శుద్ధము, మరియు స్థిరమైన మనో అవస్థలే సమాధి. నిరంతర అభ్యాసం వలన వైరాగ్యము ప్రాప్తించగలదు.

"అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే" (భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం)

అని భగవద్గీతలో చెప్పబడింది.
మనకు జ్ఞాన స్వరూపులైన దేవతలు ఉన్నారు. వారిలో శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన్ ప్రదాతలే. ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శీదక్షిణామూర్తయేనమ:

అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం.

Wednesday, February 20, 2019

Amarnath Sarma garu at Nacharam Temple


"త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం  వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ!
రుచీనాం వైచిత్ర్యాద్  ఋజుకుటిలనానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి
పయసామర్ణవ ఇవ!!🙏
కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..!💐శ్రీ💐
ఓం నమః శివాయ..!!🙏

కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం.
కాలభైరవుని దర్శనం
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం
వారాహి మాత గుడి
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది
ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి -
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ
లోలార్కఈశ్వరుని దర్శనం
దుర్గా మందిరము
గవ్వలమ్మ గుడి
తులసీ మానస మందిరము
సంకట మోచన హనుమాన్ మందిరం.
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.
తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం -
ఇది కొంత దూరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం -
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.
రిక్షా అయితే మంచిది.
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది.
స్వయంభూ లింగం.
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..💐
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు.
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,
మథుర,
గయ,
కాశి,
అవంతిక,
కంచి,
ద్వారక
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి,
కాంచి,
మాయ,
ఆయోధ్య,
ఆవంతిక,
మథుర మరియు
ద్వారవతి" లు
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.
ఓం నమః శివాయ..!!🙏

లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐

👍శ్రీ మాత్రే నమః💐

Monday, February 18, 2019

Bilwam




స్త్రీ నపుంసక పురుష మూర్తియునుఁ గాక,
తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక,
కర్మ గుణ భేద స దసత్ప్రకాశిఁ గాక,
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.

పైన చెప్పిన పద్యం ప్రకారం శివ లింగానికి కుంకుమ పెట్టినా పెట్టకపోయినా పెద్ద దోషం ఉండదు అని నా అభిప్రాయం, తప్పయితే మన్నించండి
శివుడు అర్థనారీశ్వరుడు. అర్థనారీశ్వర తత్వంలొ శివుడికి పూజ చేస్తున్నాము అంటే అమ్మవారికి కూడా చేసినట్లే భావించాలి. కాబట్టి శివలింగానికి కుంకుమ పెట్టడంలొ దోషం లేదని పెద్దల నిర్ణయం.

Om Namah Shivaya


Sunday, February 17, 2019

శివలింగానికి కుంకుమ ఎందుకు పెట్టకూఢదు ...?
శివ ఫూజలో ముఖ్యంగా సోమవారాల్లో శివలింగానీకి కుంకుమ పెట్టకుండా , కేవలం గంధం మాత్రమే పెట్టాలట ...
శివుడు భక్తి శ్రద్దలతో ధ్యానం చేస్తుంటాడు కాబట్టీ ఆయనకు కుంకమ సమర్పిస్తే ఎరుఫు రంగులోని కుంకుమ శరీరంలోని చల్లదానాన్నీ హరించి వేడీని పుట్టింస్తుందట ...
అందుకే శివుడికి గంధమే సమర్పించాలని అద్యాంత్శిక నిపుణులు ఛెప్తున్నారు ..అలాగే శివుడికి సంపెంగు  ఫువులు పెట్టకూడదుట .శివలింగ పూజలో బిల్వ పత్రం తప్పకుండా వుండాలట..!
పుష్పము లేకుండా కాయలు కాచే వృక్షము (మారేడు) బిల్వ వృక్షము. ఈ చెట్టు విష్ణు భగవానుని చేతిలో పుట్టినది. ఈ బిళ్వాలు అంతరింద్రియ, బాహ్య ఇంద్రియ సంబంధిత పాపాలు పోగొట్టు శక్తి గలదే గాక చక్కెరవ్యాధి వారికిది దివ్యఔషదము. శివునికి, విష్ణువుకు, లక్ష్మి ప్రీతిపాత్రమైనది. మాలిన్యదోషము లేనిది. ...,

*🌞🚩శ్రీ సూర్య మండల స్తోత్రం🌞🚩*
💫🌞🌎🌙🌟🚩
🕉ఓంశ్రీమాత్రేనమః🕉
అద్వైత చైతన్య జాగృతి
💫🌞🌏🌙🌟🚩
నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || 1 ||


యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్ర మనాది రూపమ్ |

దారిద్ర్య దుఃఖక్షయ కారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ||  2 ||


యన్మండలం దేవ గణైః సుపూజితం | విప్రైః స్తుతం భావన ముక్తికోవిదమ్ |

తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||


యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 4 ||


యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |

యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 5 ||


యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 6 ||


యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |

యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 8 ||


యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |

యత్కాల కాలాద్య మరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 8 ||


యన్మండలం విష్ణు చతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |

యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 9 ||


యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |

యస్మిన్ జగత్సం హరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 10 ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |

సూక్ష్మాంతరైర్యోగ
పథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 11 ||


యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 12 ||


సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||


*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||*...

🕉🌞🌎🌙🌟🚩

Saturday, February 16, 2019

*రాహు కేతువులు-ఆత్మవిద్య హేతువులు*
🕉ఓంశ్రీవిడ్యగనేశాయ నమః 🕉

ఆధునిక విఙ్ఞానం రాహు కేతువులను ఒప్పుకోదు, ఇవి గ్రహాలు కావు, గ్రహణం రోజున రాహువు మింగటం, కేతువు మింగటం ఇలాంటివి హాస్యాస్పదం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.మంచిదే!ఇవి గ్రహాలు అని శాస్త్రం కూడా చెప్పటం లేదు.జ్యోతిషం రవిని, చంద్రుని గ్రహాలుగా చెప్పటం ఏమిటి? రవి నక్షత్రం కదా, చంద్రుడు ఉపగ్రహం కదా అని అడిగే వాళ్లు ఉన్నారు. గ్రహించేది గ్రహం. ఇది ప్లానెట్, ఇది సేటలైట్ అనే విభజన వేరు. మహర్షులు మానవ జీవితం మీద ఏదైతే ప్రభావం చూపుతున్నదో అది గ్రహం అని గుర్తించారు. మనిషి కూడా గ్రహమే! వీడికీ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్నాయి.భూమి మీద ఏ పరిమాణంలో నీరు, గట్టి పదార్థాలూ ఉన్నాయో, మానవ శరీరంలో కూడా అదే పరిమాణంలో నీటికి సంబంధించిన పదార్థాలు, గట్టి పదార్థాలూ ఉన్నాయి. నదులు కొండలలోని రాళ్లలోంచి పుడుతున్నాయి. రక్తం బోన్ మేరో నుంచి పుడుతున్నది.ఒక కుమ్మరి వాడు కుండను తయారు చేసేటప్పుడు క్రిందనున్న మట్టి తిరిగి తిరిగి స్పందించి అందులోంచి కుండ పై భాగం అలా తయారవుతూ ఉంటుంది. అలాగే భూమి దక్షిన ధృవం స్పందించి, స్పందించి ఈ ఆకారానికి వచ్చింది. ఉత్తర ధృవం అందుచేత కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. భూమి ఎందుకు ఆగదు? ఆగితే ఒక వైపుకు పడిపోతుందా? అంటే ఒరిగిపోకూడదని బొంగరం లా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా? నిజమే! స్పందన వలన శక్తి, శక్తి నుంచి తిరిగి స్పందన…ఇదే సృష్టి యావత్తులోనూ ఉన్న రహస్యం.

ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రం యొక్క మరో పేరు ఆత్మ విద్య. జ్యోతి-స్థూలంగా చెప్పాలంటే లైట్, సూక్ష్మంగా చెప్పాలంటే ఙ్ఞాన జ్యోతి. దీనిని దర్శించే వాడు జ్యోతిష్కుడు! జ్యోతిషం కేవలం భవిష్యవాణి కాదు. కాలక్రమంలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందటం వలన జ్యోతిష్కుడు అనగానే కాల్ళూ చేతులూ చూసే వాడు అనుకుంటారు. కాదు. ఇది ఒక వైఙ్ఞానికపరమైన, తాత్వికపరమైన, ఉపాసన పరమైన సంక్లిష్టమైన శాస్త్రం. సృష్టికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంటుంది.కాలము, జ్యోతి (వెలుగు) ఈఓ రెండిటి యొక్క ప్రభావం ప్రాణ శక్తి మీదా, మనిషి జీవితం మీదా ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

చీకటి వెలుగులు జీవితం లోని భాగాలే కావు. సృష్టి ఆద్యంతం వెంట ఉండే విషయాలు. వీటి మధ్య ఎన్నో ప్రక్రియలు, ఎన్నో యుగాలు. ఒకటి లేకుండా మరొక దానిని అధ్యయనం చేయటం కుదరదు. ఆ చీకటి గృహాలె ఈ రాహు కేతువులనబడే అప్రకాశ గ్రహాలు.ఒక గ్రహణం సంభవించినప్పుడు మూడు వరుసలోకి రావటం మనం చూస్తాం. గణిత శాస్త్రం ప్రకారం రెండు వస్తువుల మధ్య అతి తక్కువ దూరం ఒక తిన్ననైన గీత! అంటే ఒక గ్రహణం సంభవించినప్పుడు ఈ మూడు-సూర్యుడు, చంద్రుడు, భూమి అతి తక్కువ దూరం లోకి వస్తాయి.అప్పుడు పరస్పరం శక్తులను ఇచ్చి పుచ్చుకుంటాయి. దీనినే సినర్జీ అంటారు. ఈ సమయంలో వీటి మధ్యనున్న నీడ ఈ ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియకు మార్గం అవటం వలన ఒక ఛార్జ్ లా ఆ గ్రహణ సమయంలో పని చేస్తుంది. దీనినే మహర్షులు రాహువు లేదా కేతువు అని చెప్పి దాని తాలూకు స్పందన-మంత్రాన్ని దర్శించి మనలో జరిగే స్పందనకు అనుగుణంగా జపించి యున్నారు. ఈ రోజు భాషలో దీనిని మనం మోడరేషన్ అంటాము! 1980-81 లో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయం లో రైలు వస్తున్నప్పటికీ చిన్న పిట్టలు పట్టాల మీద నుంచి కదలలేదు!…
గోచారంలో మరి గ్రహణం అని చెప్పిన రోజున ఆ రాశిలో రాహువో కేతువో ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. అంటే అసలు గ్రహణ నిర్ణయం మహర్షులు అంత సూటిగా ఎలా చెప్పారూ అంటే రాహు కేతువుల స్థానం బట్టి, వాటి సంచారాన్ని బట్టి, సూర్య చంద్రుల సంచారాన్ని బట్టి అని అర్థం!

రాహు, కేతువులు
విఙ్ఞానం మనకి బిగ్ బాంగ్ అని చెబుతుంది. ఈ అంతరిక్షం యావత్తూ ఒక విస్ఫోటనంతో ఏర్పడినదని ఒక అంచనా.మంచిదే! శాస్త్రం ఏమంటోందంటే నవగ్రహ కూటమి ఒక వృత్తాకారంలో జడత్వంతో ఉన్న సమయంలో ప్రకాశం ఒక దిశగా పయనిస్తూ ఈ కూటమిని తాకి ఆ వేగంలో వృత్తానికి అవతల ప్రక్కకు వెళ్లిపోయింది. ఆ తేజస్సుకు ఈ గ్రహాలన్నీ చేతనత్వాన్ని పొందాయి. స్పందిచటం ప్రారంభించాయి. ఆకారంలో పెరగటం మొదలు పెట్టాయి. ఒక నిర్దిష్టమైన వృత్తంలో తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి కాబట్టి వృత్తం ఏర్పడినది. కూటమికి ప్రకాశం ముందు తగిలిన చోట సర్పం ఆకారంలో కనిపించిన నీడను రాహువు అని, వృత్తం అటు వైపు-180 డిగ్రీల లో కనిపించిన అవతలి నీడను శిఖి (కేతువు) అని చెప్పారు. ఈ నీడలు రెండూ అపసవ్యంగా తిరిగాయి. కారణం ఏమిటంటే ఇవి గ్రహాలన్నిటి నీడలు కలబోసుకుని వాటికి భిన్నంగా కదులుతాయి. వీటి మధ్యన ఉన్న గ్రహాలన్నీ ఒక చక్రంలో బంధింపబడ్డాయి-అదే రాశి చక్రం. ‘ రాహువు ‘లోని మొదటి అక్షరం-రా, ‘ శిఖి ‘లోని మొదటి అక్షరం ‘ శి ‘ తీసుకుని రాశి చక్రం అన్నారు!
అంటే రాశి చక్రం అనేది కెవలం మన జన్మ కుండలి కాదు.ఇది సృష్టి యావత్తునూ ప్రదర్శించే 360 డిగ్రీల కుండలి! ఇదే సిమెట్రీ! ఒక వృత్తం ఎంత పెద్దదైనా కావచ్చును. దాని కేంద్రం ఒకటే! అది కూడా వృత్తమే! సృష్టిలోని అతి పెద్దది-అనంతం, అతి చిన్నది కూడా అనంతమే! మరి గణితం కూడా అదే చెబుతుంది. 1/10=10/100=100/1000… ఇలా నేను ఒకటి ప్రక్కన న్యూమరేటర్ లో అనంతమైన సున్నలకు ఒకటి తక్కువగా పెట్టి డినోమినేటర్ లో ఒకటి ప్రక్కన అనంతమైన సున్నాలు పెట్టినా ఆ ఫలం 1/10 మాత్రమే! అదే తమాషా! అటు అనంతం, ఇటు మనం. అది ఇందులో ఉంది-అణువులాగా! రాహు కేతువులు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి. ప్రస్తుతం మామూలుగా జ్యోతిష సాస్త్రం జాతకంలో వీరి పరిస్థితిని ఎలా వివరిస్తుందో చూద్దాం. దానికి ముందు ఈ ఇద్దరి గురించీ విపులంగా ఎక్కడ చెప్పారో పరిశీలిద్దాం. బృహత్ జాతకంలో రాహువును తమస్ అని, అగు అని, అసుర అని పేర్కొన్నారు. కేతువును శిఖి అని చెప్పారు. పరాశరుడు, యాఙ్ఞ్యవల్క్యుడు రాహు కేతువులను ఏడు గ్రహాలతో పాటుగా ప్రధానంగా పేర్కొన్నారు. వీరి ఉత్పత్తి, ప్రభావం,ఇలాంటివి మత్స్య పురాణంలో కూడా చెప్పి యున్నారు.రాహువును నల్ల రంగులో, రౌద్రాకారంలో,కత్తి ధరించి సింహారూఢుడై యున్నట్లు వర్ణించారు.కేతువు గద పట్టుకున్నట్లు,గృధ్ర వాహనునిగా వర్ణించారు.
శాస్త్రం రాహువుకు అధిదేవత దుర్గ యని, ప్రత్యధిదేవత నాగదేవతయని, కెతువుకు అధిదేవత చిత్రగుప్తుడని, ప్రత్యధిదేవత బ్రహ్మ యని చెబుతున్నది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతువు మహర్దశ 7 సంవత్సరాలని మనకు తెలిసినదే!
రాశి చక్రంలో రాహు కేతువుల గీత చాలా ప్రధానమైనది. వీరు 18 మాసములు అయిన తరువాత అపసవ్య మార్గంలో రాశులు మారుతారు. గోచారంలో గురు, శని తరువాత ప్రధానంగా గణించ వలసిన గ్రహాలు రాహు కేతువులు. రాహు కేతువులు ఏయే స్థానాలలో ఎటువంటి ఫలితాలనిస్తారనేది పరిశీలిద్దాం. ఒకరి జాతకంలో-రాశి చక్రంలో లగ్నాత్ రాహువు:
మొదటి స్థానం(లగ్నం లో)లో ఉంటే ధైర్యవంతులు,సహాయం చేయు వారు,కానీ కొద్దిగా ముఖం మీద మచ్చలు ఉండు వారు ఉంటారు. రెండులో ఉంటే ఎక్కువగా విందులు చేయు వారు,నల్లని వారుగానూ,వివాహేతర సంబంధాలు కోరు వారు కనిపిస్తూ ఉంటారు. మూడులో ధనవంతులు,మంచి క్రీడాకారులు, సాహసాలు చేయు వారు అవుతారు. నాలుగులో ఉన్నప్పుడు బహు భాషా కోవిదులు, అయిదులో ఉన్నప్పుడు క్రూర స్వభావం గల వారు, గర్భం విషయంలో సమస్యలు ఎదుర్కొనటం, ఆరులో ఉన్నప్పుడు పెద్ద బంధు వర్గం కల వారు,శత్రు రహితులు గానూ,ఏడులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఆరోగ్య భంగం,చక్కెర జబ్బు,మంచి భొజనం కలుగ చేస్తాడు. ఎనిమిదిలో సంకుచితమైన ఆలోచనలు,పోట్లాటలంటే ఇష్ట పడే వ్యక్తిత్వం,తొమ్మిదిలో భయపడే వ్యక్తిత్వం, పదిలో ఉన్నప్పుడు మంచి కళాకారులు,యాత్రికుదు,రచయితలు తయారవుతారు.పదకొండులో ధనవంతులు,సంఘంలో గౌరవం కల వారు,మంచి సంతానం కల వారు,వ్యవసాయదారులు ముందుకు వస్తారు. పన్నెండులో ఉన్నప్పుడు తాత్విక పరులు,కళ్ల జబ్బులు ఉన్నవారు ముందుకు వస్తారు.
కేతువు లగ్నంలో ఉంటే ఎక్కువగా చెమట పూయటం,మంచి ప్రజా సంబంధాలు ఉందటం, రెండులో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవటం, శాంత స్వభావం,మూడులో శక్తిమంతులు,పేరు గలవారు, నాలుగులో గొడవలు పెట్టుకునే వారు,అయిదులో పిల్లలకు ఇబ్బందులు కలుగచేయటం,ఆరులో మాటకారితనం,ఏడులో భాగస్వామికి సమస్యలు,ఎనిమిదిలో నిదానం, తొమ్మిదిలో చత్వారం, మంచి జీవిత భాగస్వామి,పదిలో తాత్విక చింతన,పదకొండులో మంచి హాస్యం,ధనం, పన్నెండులో విదేశ యానం ఇలాంటివి కనిపిస్తాయి.
సామాన్యంగా రాహు కేతువులు అప్రకాస గ్రహాలు కాబట్టి ఏ రాశిలో ఉంటాయో, ఆ రాశి యొక్క అధిపతి ఇచ్చు ఫలితాలని ఇస్తాయి.
ఇక్కడ చెప్పిన ఫలితాలు నామ మాత్రానివే. ఒక జాతకంలో అన్ని విషయాలనూ, గ్రహాలనూ పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రాకూడదు!
రాహు కేతువులు-ఆరోగ్యం:రాహువు దుర్ఘటనలను, ప్రయాణాలలో సమస్యలను, దుష్ట ప్రయోగాలను శాసిస్తాడు. సరీరంలోని కాళ్ల విషయంలో రాహు కెతువులు చాలా సక్రియంగా ఉంటారు.ఆరోగ్యం విషయంలో వీరిరువురు ఎవరితో కలసినా ఇబందే! ఆ గ్రహం , భావం లేదా రాశి పీడితమైనదని తెలుసుకోవాలి.కేతువు సామాన్యంగా స్త్రీల విషయంలో మాసిక సమస్యలను చంద్రునితో కలసి అంద చేస్తాడు. లగ్నాత్ అయిదులోనూ, ఏడులోనూ ఉంటే శరీరంలో ఏవో లంప్స్, ట్యూమర్లు ఇలాంటివి కనపడ వచ్చును. ఎనిమిదిలో చర్మ వ్యాధులు ఉందవచ్చును. రాహువు విష ప్రయోగాన్నీ, అర్థం కాని అనారోగ్యాన్నీ సృష్టిస్తాడు.కెతువు పుండ్లను శాసిస్తాడు. రాగువు కేతు నక్షత్రంలో (అస్విని, మఖ, మూల) ఉంటే దారుణమైన ఏక్సిడెంట్లను ఇస్తాడు. ఆ దశలో జాగ్రత్త వహించాలి. రాహువు ఆర్ద్ర 3, 4 పాదాలలో ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నాల్గవ పాదంలో ఉంటే చెడు అలవాట్లకు లోనవుతారు.అలాగే స్వాతి మొదటి, నాలుగు పాదాలలో రాహువు ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాహువు శతభిషం రెందవ పాదంలో ఉంటే కోపిష్ఠి, మూడవ పాదంలో ఉంటే కాలేయ సమస్యలున్నవారు ఉంటారు.కేతువు అస్విని మూడవ పాదంలో ఉంటే ఆరోగ్యం విషయం లో జాగ్రత్త వహించాలి.అలాగే మఖ 1,2,3 పాదాలలో ఉన్నా అనారోగ్యం,మూల 1,2 లో ఉన్నా జాగ్రత్త వహించాలి. రాహు కేతువులు ఎవరి దశలో ప్రవేశించినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి దశలలో ముఖ్యంగా గుండె విషయంలొనూ, విష జ్వరాల విషయంలొనూ జాగ్రత్త వహించాలి.

లాభాలు
రాహువు మంచి కూడా చెస్తాడు. రాహువు మంచి స్థానంలో ఉండి గురువు చేత 5 లేదా 9 దృష్టి కలిగి యున్నప్పుడు రాజయోగం, సంఘంలో గౌరవం ఇస్తాడు. పన్నెండులో ఉన్నప్పుదు చక్కని తెలివి తేటలిస్తాడు. కేతువు ఆరులో ఉన్నప్పుడు కీర్తి, జ్యోతిష శాస్త్రం, జరిగేది తెలియటం ఇలాంటివి ఇస్తాడు. అలాగే రెండులో ఉన్నప్పుదు మార్కెట్ వలన లాభాలూ, పదకొండులో ఉన్నప్పుడు లాటరీలు ఇస్తాడు. కేతువు తాత్వికమైన గ్రహం. సంప్రదాయ బధ్ధమైన ఉపాసన ఇస్తాడు కేతువు.
కాలసర్ప దోషం:కాలసర్ప దోషం అనేది నిజానికి ఒక యోగం. నూటికి 70 మందికి ఇది ఉంటుంది. దీని వలన భయం ఏమీ లేదు.రాహు కేతువుల ఏక్సిస్ లోపల అటు కానీ ఇతు కానీ ల్గ్నం, చంద్రునితో పాటు అన్ని గ్రహాలూ ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ నీడలోకి చేరాయి కాబట్టి వాటి శక్తి బయటకు రాదని కాలసర్పదోషం అని నిర్ణయిస్తారు. శ్రీకాళహస్తిలో నివారణ చేయించుకుంటే ఇది యోగంగా మారుతుందని ప్రతీతి.
కొందరు మిత్రులు లగ్నం లెదా చంద్రుడు బయట ఉన్నప్పుడు ఈ దోషం ఉంటుందా అని అడిగారు. వివాహం విషయంలో దీనిని కూడా పరిగణించటం మంచిదని శాస్త్రం చెబుతున్నది. కారణం ఏమిటంటే యోగాలు చంద్రుని బట్టి ఎక్కువ గణన లోకి వస్తాయి కాబట్టీ, మరల గోచారం చంద్రుని నుంచి నిర్ణయిస్తాము కాబట్టీ నివారణ చేయటం అవసరం అవుతుంది.కొన్ని గ్రంథాలలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒక్కో స్థానాన్ని గణించి డిగ్రీలు కూడా లెక్క లోకి తీసుకుని ఆ స్థానం ఫలించనప్పుడు రాహు కెతువుల మధ్య వచ్చాయా అనే సంగతి కూడా చూడటం జరుగుతున్నది. అంత అవసరం లేకపోయినా ఇంత చాలు. తమిళ నాడులో ఒక ఆచారం ఉంది. దోషం ఉన్నా, లెకపోయినా వివాహ వయసు వచ్చిన కన్యలందరికీ నివారణ చేయిస్తారు…

శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి లోని ఈశ్వరుడు నవగ్రహ కవచ ధారి! ఆయనకు ఎదురుగా సూర్యుడు ఉంటాడు. శివాలయంలో ఇది అరుదు! శివుడు ఇక్కడ భక్తుల గ్రహ దోషాలన్నీ సూర్య్ని సాక్షిగా హరించి వెస్తాడు! అలాగే ఈ కాలసర్ప దోషాన్ని నివారించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరొక విశేషం కలదు. అమ్మవారు శ్రీ ఙ్ఞాన ప్రసూనాంబ ఎదురుగా ఉన్న ప్రాకారంలో నేల మీద ఒక పద్మం ఉంటుంది. దీని మీద నిలబడి చూరు పైకి చూస్తే రాహువు యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని చూస్తూ ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అలా చేస్తూ పేరు, నక్షత్రం, గోత్రం మన్సులో చెప్పుకుని అమ్మవారిని రాహువు నుంచి కాపాడమని కోరాలి. చాలు! ఈ జన్మకు మనలను రాహువు బాధించడు.
రాహువు దుర్గా ఉపాసన ఉన్న వారిని బాధించడు. దృష్టి దోషం సామాన్యంగా రాహువు డిపార్ట్మెంట్! దుర్గా సప్తశ్లోకీ, ఖడ్గమాలా స్తోత్రం, చండీ ధ్వజ స్తోత్రం చదువుకునె వారికి రాహువు బాధలు ఉందవు. సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్నవారికి, నాగ పూజ ఉన్నవారికీ, ఇంటిలో నాగ పడిగ ౠపు మీద పాలతో అభిషేకం చేయు వారికీ, కేతువు వలన ఇబ్బందులు ఉండవు. దశలో కానీ, గోచారంలో కానీ రాహువు సమస్య ఉన్న వారు 1800 గ్రాములు నల్ల మినుములు శివాలయంలో దానమిచ్చిన మంచి ఫలితాలను పొందగలరు.
రాహువు సంఖ్య 18. ఒకప్పుడు అయ్యప్ప యాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమయ్యేదని చెబుతారు. అయ్యప్ప గుడి మెట్లు 18.దీక్షలో రాహువు రంగు నలుపు వస్త్రాలు ధరిస్తారు. మహాభారత రణరంగం 18 రోజులు… సంఖ్యా శాస్త్రంలో 18 అంకె-రవి(1), 8(శని) కలసిన సంఖ్య ఇది.అనగా సూర్యోదయం-వెలుగు,పడమర దిక్కు, రిసైక్లింగ్ చేసే శనికి కలిగే సంయోగం ఇది. ఆది, అంతం కలసిన ఏమిటి? యుధ్ధం.
ఇదే వెలుగు నీడల యుధ్ధం.రాశి చక్రంలోని వెలుగు నీడల పర్యంతం మన జీవితం అలా సాగిపోతుంది.రాహువు నీడను-మృత్యువును గుర్తు చేస్తూనే ఉంటాడు. అటు చివర కేతువు ఉపాసన మార్గం ద్వారా మోహాన్ని జయించి అమృత తత్వాన్ని తెచ్చుకో మంటాడు.
రాహు కేతువులు ఇద్దరూ ఒక శరీరమే.పురాణం మనకు చెబుతుంది.ఒకరు తల భాగం, ఒకరు అధో భాగం. ఈ రెండిటినీ అధిగమించే సారమే అమృతం.అదే ‘తమసోమా జ్యోతిర్గమయ!’ అనే ప్రార్థన, వేదం లోని మహావాక్యం. అదే జ్యోతిషం!
🕉🌞🌎🌙🌟🚩

Thursday, February 14, 2019

గోమాతను చూడగానే తినడానికి ఏదైనా పెట్టి ఎంతో భక్తితో పూజించే సాంప్రదాయం మనది. అలాగే ఎక్కడైనా కనిపించినప్పుడు గోవును నిమురుతూ మనసులో ఏదైనా అనుకుంటే అవి నెరవేరుతాయని ఆస్తికుల నమ్మకం. అయితే ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి మీ కాలి బొటన వేలు కి కట్టి మీ ఒంట్లో ఏదైనా నొప్పి ఉన్నచోట ఆ బొటన వేలితో తొక్కుతూ ఉండడం వలన ఆ నొప్పి తగ్గుతుందని చాలా మంది గాఢంగా విశ్వసిస్తారు. కొందరు స్వామీజీలు, ఆధ్యాత్మిక పండితుల కరవాలం(చేతి)లో తాడు లేదా విసనకర్ర కు తెల్లటి దారాలు లాంటి వస్తువులు ఉంటాయి. ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాటితో వెన్నుపై తట్టి మరీ ఆశీర్వదిస్తారు. అయితే ఆ ఈకలు ఏమిటో చాలా మంది పరిశీలనాత్మకంగా చూసి ఉండరు.
I సర్వాన్ని ప్రసాదించే శివయ్య

ఒక మంత్రాన్ని ఉపదేశించడానికి లేదా స్మరించడానికి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. మంత్రాల విషయంలో నియమాలను ఉల్లంఘించకూడదని శాస్త్రం చెబుతుంది. ఇటువంటి నియమాలు, విధానాలు అవసరం లేకుండా సిద్ధించే మంత్రం "శివాయ గురవే నమః".

"శివాయ గురవే నమః" అనే మంత్రానికీ ఏ నియమాలూ అవసరం లేదు కనుక దీనిని "పరమమంత్ర సామ్రాట్" అంటారు.శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.
ఆ రూపాలు వరుసగా....
శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మి దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లని వాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచిబుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.
ప్రకృతిమాతయే నీలో సగమాయే
శీతల గంగాజలామృతమే నీశిరమున
నిలిచెనాయే
రుద్రాక్షలే నీ నేత్రానందబాష్పబిందువులాయే
మారేడే నీ మానసదళమాయే
పరమయోగమే నీ పరమాయే
పరమమే(పరమాత్మ) నీవాయే
పరమశాంతరూపము నీదాయే
సదానందరూపము నీదాయే
దీప్తి(కాంతి)యే నిన్నావరించి ఉందాయే
నాలోని శ్వాసయే నీవాయె
నా మనసే నీదాయే
విశ్వమంతా ఉన్న నీవే నాలో జేరితివాయె
అంతర్యాగము(మానసికపూజ)అందుకొంటి వాయే
నాలోని నేను నీవాయె
నేను నీలో లయమాయె
సదాశివా.

సదాశివార్పితం!

Wednesday, February 13, 2019

వినయం,విధేయత,సంస్కారం ఇవి లేనివాడు మృగంతో సమానం. ఒక్కచెడుభావపు మాట పది తూటాలకు సమానం.ఒక మంచి మాట వెయ్యేనుగుల బలాన్నిస్తుంది.
*అనంతవచనం*
నేనుఒక్కడనే యన్నప్పుడు నాకేమిభయము?జీవుడు నేనే👏🏻 ఈశ్వరుడు నేనే🙌🏻 బ్రహ్మము నేనే😃 అవిద్యతో నేనేజీవుడు😡 మాయతో నేనేఈశ్వరుడు🙂 అకర్త అభోక్తనైననేనే బ్రహ్మము👍🏻

Tuesday, February 12, 2019

నాకు తెలుసు శివయ్యా ..
నువ్వు కరుణాంతరంగుడివి నా కన్నీటికి చలిస్తావు. నువ్వు దయా సముద్రుడివి నా ఆవేదనను అడ్డుకుంటావు. నువ్వు బోళాశంకరుడివి
నా బాధలు తొలగిస్తావు. నువ్వు జగతికి తండ్రివి నా ఆర్తికి కరిగిపోతావు. నువ్వు పశుపతివి నా మూర్ఖత్వాన్ని తొలగిస్తావు.
నేను అశక్తుడనై నిస్సహాయుడనై అయోమయంతో అసహాయతతో
కదలలేని స్థితిలో ఉన్నపుడు పరుగులెత్తి నన్నేలవస్తావని. చాలు శివయ్యా ఈ తనువున నివసిస్తున్న జీవుని ఉద్దరించు.ఈ మనసుని
ఆవరించిన ఆత్మని అక్కున చేర్చుకో పరమ పవిత్రమైన పతిత పావనమైన నీ పాదాన్ని వేన వేలు జన్మలు ఎత్తి నీకోసం పరి తపిస్తున్న ఈ కింకరుని శిరమున ఉంచు ఈ ప్రాణాన్ని నీ హృదయంలో దాచుకో.. శివయ్యా.. మిగలలేవు కన్నీరు నీ ఆభిషేకాలకే ఉపయోగించాను ఈ కింకరుని ఇక జాగు చేయక
చేరదీయవయా .. శరణు శరణు శరణు
*🙏🙏🙏🙏🙏

Monday, February 11, 2019

ఏకాదశ రుద్రులు..!💐శ్రీ💐
ఓం నమః శివాయ..!!🙏

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును.

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకా య త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది.

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు
1. విశ్వేశ్వరుడు,
2.మహాదేవుడు,
3. త్రయంబకుడు ,
4.త్రిపురాంతకుడు,
5.త్రికాగ్నికాలుడు,
6.కాలాగ్నిరుద్రుడు,
7.నీలకంఠుడు,
8.మృత్యుంజయుడు,
9.సర్వేశ్వరుడు,
10. సదాశివుడు మరియు
11.శ్రీమన్మహాదేవుడు.

ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి.

1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3. త్రయంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు.

వాటి వివరణ.💐
1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం
(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు.
వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి
(శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగము కొరకు ఇంద్రుడు మేనకను పంపెను.
విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది.
అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను.
అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనము కలదు.
మేనకచే ప్రతిష్ఠింపబడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను.

3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ
(శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది.
అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు.
అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి.
రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను.

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక
(శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు.
దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు.
అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.

 5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు
(సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది.
శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను.
కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను.
రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.

పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని,
ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు.

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి
( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హాని కలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తము చేసికొని నీలకంఠుడైనాడు.

ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను.
తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు,
మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల
అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి,
యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను.

ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి
గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను.

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి):
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను.
వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను.
ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారము నందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు
(సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చిరి.
అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను.
విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను.
కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను.
ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్త ములచే ప్రతిష్ఠింపబడెను.

11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను.
పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది.
పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు.
వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.

ఏకాదశ రుద్రులకు సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు..స్వస్తి..!!

ఓం నమః శివాయ..!!🙏
సర్వేజనాః సుఖినోభవంతు..💐

                            💐శ్రీ మాత్రే నమః💐
పెద్దిరెడ్డి కొండారెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎం .ఏ. ఆస్ట్రాలజీ ,M.SC,B.Ed:
రుద్రాక్షధారణా మంత్రాలు..!💐శ్రీ💐

రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటా కు చెందిన చెట్టు.
దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు.

రుద్రాక్షలు ఎలా పుట్టాయో అంటే ఈశ్వరుడు మూడు నేత్రాలను మూసివేసి ధ్యానంలో చాల సంవత్సరాలు ఉన్నారు .

 ధ్యానం నుంచి ఈశ్వరుడు కళ్ళు తెరవగానే,
ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు
గౌడ,
మధుర,
అయోధ్య,
కాశీ వంటి క్షేత్రాల యందు –
మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.

ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలు స్వామి కంటి బిందువుల నుంచి ఏర్పడ్డాయి.
ఎడమకన్ను నుంచి 12,
కుడి కన్ను నుంచి 16,
మూడోకన్ను అగ్నినేత్రం నుంచి నల్లని రంగులో వున్న
10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి.

జపం చేసుకోవడానికీ – ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఫలవంతమైనవి.
గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు – ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.

రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు.
కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ –
పురుగులు ప్రవేశించినవీ –
గుండ్రంగా లేనివీ –
కండలేనివీ పనికిరావు.
వీటితో జపమైనా నిషిద్ధమే!
నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి.

మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక,
అదీ సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం!
పదకొండు వందల రుద్రాక్షలను ధరించినచో అతడు సాక్షాత్‌ శివస్వరూపుడు,
బ్రాహ్మణులు తెల్లనివీ –
క్షత్రియులు ఎర్రనివి,
వైశ్యులు పసుపు రంగువీ,
అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు! రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది.

వ్యాధులు – బాధలు ఉండవు.
మానసిక ప్రశాంతత లభిస్తుంది.
శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.
మామిడిచెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది.
ఫలం యొక్క పై పొర దళసరిగా ఉంటుంది.
పండు రూపంలో దీన్ని సేకరించగలిగితే మంచిదే! దానంతట అదే ఎండి, గట్టి పడుతుంది.
పండు పుల్లగా ఉంటుంది.
వాత – కఫ దోషాలను నివారిస్తుంది.
రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి.
నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసినదే!
అలాగే తేనెలో అరగదీసి మూర్చరోగాన్ని పోగొట్టవచ్చు! వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు.

ఏకముఖి రుద్రాక్ష:💐
దర్శనం మహాపాతక నాశనం ;
అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.

ద్విముఖి :💐
గోహత్యాపాతక నివారిణి,
సర్వాభీష్ట కారిణి.

త్రిముఖి :💐
కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.

చతుర్ముఖి :💐
బ్రహ్మస్వరూపం,
దర్శన – స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.

పంచముఖి:💐
కాలాగ్ని రుద్ర స్వరూపం.
మోక్షకారకం.

షణ్ముఖి :💐
కుమారస్వామి స్వరూపం.
సమస్తపాపహారిణి.

సప్తముఖి : 💐
మన్మధరూపిణి. వశీకరనణి.

అష్టముఖి :💐
దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ;
దీర్ఘాయుష్య కారకం.

నవముఖి :💐
నవదుర్గా స్వరూపం.
శివతుల్య వైభవదాయిని.

దశముఖి :💐
విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.

ఏకాదశముఖి :💐
రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.

12, 13, 14 ముఖాలు :💐
ఏవైనా ఒక ప్రత్యేకమైన ఇచ్చను హృదయ మందుంచుకొని, ఆరాధన చేయదగ్గవి.
మండలం (40)రోజుల్లో ఫలితాన్నివ్వగలవు.
పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షలు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.

ధారణకు మంత్రబీజాలు..💐
ఏకముఖ,
చతుర్ముఖ,
పంచముఖ,
దశముఖ,
త్రయోదశ ముఖాలకు :
 “ఓం హ్రీం నమః” అనే మంత్రంతో ధరించాలి.

ద్విముఖ,
చతుర్ముఖి,
చతుర్దశ ముఖాలకు :
 “ఓం హ్రీం నమః”

త్రిముఖ రుద్రాక్షకు :
 “ఓం క్లీం నమః” అని 108 సార్లు జపించాలి.

6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలకు :
“ఓం హ్రీం నమః”

సప్త,
అష్టముఖి రుద్రాలకు :
 “ఓం హుం నమః”

ద్వాదశ ముఖికి :
“ఓం క్రౌం నమః”
మంత్ర హీనంగా రుద్రాక్ష ధారణ ఫలితాన్నివ్వదు.

రుద్రాక్షలు వాటి విశిష్టతల.!💐

1) ఏకముఖి రుద్రాక్ష :💐
ఇది శివుని ప్రతిరూపం.
ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.

2) ద్విముఖి :💐
అర్ధనారీస్వర తత్వానికి సంకేతం.
దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.

3) త్రిముఖి :💐
ఇది అగ్నికి సంకేతం.
ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.

4) చతుర్ముఖి :💐
బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.

5) పంచముఖి :💐
గుండె జబ్బులున్నవారికి మంచిది.
శతృవులను సులభంగా జయించవచ్చు.
పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.

6) షణ్ముఖి :💐
కార్తికేయునికి ప్రతీక.
రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

7) సప్తముఖి :💐
కామధేనువుకి ప్రతీక.
అకాల మరణం సంభవించదు.

8.) అష్టముఖి :💐
విఘ్నేశ్వరునికి ప్రతీక.
కుండలినీ శక్తి పెరుగుతుంది.

9) నవముఖి : 💐
భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది.
దీనిని ఎడమ

చేతికి ధరించాలి.

10) దశముఖి :💐
జనార్ధనుడికి పరీక్ష.
అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

11) ఏకాదశముఖి :💐
11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక.
దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.

12) ద్వాదశముఖి :💐
12 మంది ఆద్యులకు ప్రతీక.
గౌరవం పెరుగుతుంది.

13) త్రయోదశముఖి :💐
కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక.
పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.

14) చతుర్దశముఖి :💐
14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.

15) పంచదశముఖి :💐
పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.

16) షోడశముఖి :💐
16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.

17) సప్తదశముఖి :💐
విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.

18) అష్టాదశముఖి :💐
18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.

19) ఏకోన్నవింశతిముఖి :💐
19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.

20) వింశతిముఖి :💐
20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.

జన్మ నక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు.!💐

నక్షత్రము         ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని   -         నవముఖి
భరణి     -         షణ్ముఖి
కృత్తిక    -         ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి     -       ద్విముఖి
మృగశిర    -     త్రిముఖి
ఆరుద్ర     -       అష్టముఖి
పునర్వసు   -    పంచముఖి
పుష్యమి   -      సప్తముఖి
ఆశ్లేష     -        చతుర్ముఖి
మఖ      -       నవముఖి
పుబ్బ     -      షణ్ముఖి
ఉత్తర     -       ఏకముఖి, ద్వాదశముఖి
హస్త    -        ద్విముఖి
చిత్త     -        త్రిముఖి
స్వాతి    -      అష్టముఖి
విశాఖ   -      పంచముఖి
అనురాధ  -   సప్తముఖి
జ్యేష్ఠ    -       చతుర్ముఖి
మూల    -    నవముఖి
పూర్వాషాఢ   -   షణ్ముఖి
ఉత్తరాషాఢ   -     ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం     -        ద్విముఖి
ధనిష్ట      -        త్రిముఖి
శతభిషం    -      అష్టముఖి
పూర్వాభాద్ర   -   పంచముఖి
ఉత్తరాభాద్ర    -   సప్తముఖి
రేవతి      -        చతుర్ముఖి.

నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు.

1) కెంపు – ఏకముఖి, ద్వాదశముఖి

2) ముత్యం – ద్విముఖి, ఏకాదశ ముఖి

3) పగడం – త్రిముఖి, అష్టాదశ ముఖి

4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి

5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి

6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి

7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి

8.)గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి

9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.

రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు

1)  ఏకముఖి రుద్రాక్ష –💐
ఈ రుద్రాక్ష చాలా విలువైనది.
ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా
తిప్పి కొట్టగలదు.
సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.

2)  ద్విముఖి –💐
ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం.
అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది

3)  త్రిముఖి –💐
ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు
సర్ప దోష నివారణ అగును.

4)  చతుర్ముఖి –💐
పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.

5)  పంచముఖి –💐
బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును
మరియు మలబద్దకం నివారణ అగును.

6)  షణ్ముఖి –💐
ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం,
శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

7)  సప్త ముఖి–💐
సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును.

8.)అష్ట ముఖి –💐
ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

9)  నవముఖి రుద్రాక్ష –💐
ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది.
రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.

10)  దశముఖి రుద్రాక్ష –💐
విష్ణు స్వరూపమయినది.
గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా
కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.

11)  ఏకాదశ ముఖి –💐
ఇది శివాత్మకమయిన రుద్రాక్ష.
వైవాహిక జీవితంలో ఆనందమునకు,
గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.

ఇలా ఏకవింశతి ముఖ రుద్రాక్షలు అన్నియు
అనేక విధముల సత్ఫలితములు కల్గును.
(తప్పని సరిగా నియమ,నిభందనలు పాటించవలయును)
ఓం నమః శివాయ..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!!💐

                          💐శ్రీ మాత్రే నమః💐

ఓం శ్రీమాత్రే నమః

గ్రహ యుద్ధం --- ప్రకృతి పర్యావరణం .

నవ గ్రహాలు ఒక్కొక్కసారి ఒక్క భావములో రెండు లేక ఎక్కువగా కలసి ఉంటుంటాయి. ఒకే నక్షత్రం మీద లేదా ఒకే రాశిలో ఉండటం మనం గమనిస్తూ ఉంటాం .ఏవైనా రెండు గ్రహములు కలిసి ఉంటే వాటికి వివిధ నామములతో పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది కొన్ని పేర్లు తెలుసుకొని అన్నిటికీ అదే అన్వయింప చేస్తూ తాము కంగారుపడుతూ, ఎదుటివారిని కంగారు పెడుతూ ఉంటారు. కనుక, ఏ గ్రహాలు కలిస్తే వాటిని ఏమంటారు అనేది పరిచయం చేసుకుందాం.

కొన్ని పుస్తకాలను చదివినప్పుడు లేదా కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు లేదా మీడియాలో మిత్రులు చెప్తున్నట్లు గ్రహ యుద్ధం అనేది చాలామంది తరచుగా ఉపయోగించే మాట. నిజానికి మనం రోజువారి చూసుకునే జాతకాలలో ఆ మాట లేదా పదప్రయోగం ఉండదు.
గ్రహ యుద్ధం అనేది ప్రశ్న శాస్త్రంలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు.

రవి చంద్రుడు రాహుకేతువులు ఈ గ్రహ యుద్ధం పరిధిలోకి రారు.
కుజుడు శుక్రుడు శని గురుడు బుధుడు వీరిలో ఎవరైనా ఇద్దరు  కొన్ని డిగ్రీల పరిధిలో ఉంటే దానిని గ్రహ యుద్ధం అని అంటారు.( ఒక డిగ్రీ అంటే 3' 20''.).

ముందుగా అవసరమైన పదములు తెలుసుకుందాము.
రవి తో ఏ గ్రహం కలిసిన  అస్తంగత్వం అని అంటాము . సాధారణంగా బుధుడు ఎక్కువగా రవి తో సమానంగా సంచరిస్తూ ఉంటాడు దానివలన  బుధుని గుణాల కన్నా సూర్యుని ప్రభావం ఎక్కువగా ఫలితం చూపిస్తూ ఉంటుంది .రవి తో  బుధుడు కలవడం వలన తన ఉనికిని కోల్పోతాడు.
ఇవ్వవలసినంత ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. దీనిని అస్తంగత్వం చెందడం అంటారు.
చంద్రుడు అస్తంగత్వం చెందదు. ఎందుకంటే సూర్యకాంతి మీద ఆధారపడి ఉండే గ్రహము చంద్రుడు.
చంద్రునితో ఏదైనా గ్రహం  కలిస్తే దానిని సమాగమము అంటాం.

మిగిలిన గ్రహాల లో ఏ రెండు కలిసిన దానిని గ్రహ యుద్ధం అని అంటాము.
 ఉదాహరణ గా ఒక విషయం చూద్దాం
మేష లగ్నానికి పదవ స్థానం అయిన మకర రాశిలో 10 డిగ్రీల మీద కుజుడు 11డిగ్రీల మీద ఉన్నారు .వీరు ఇరువురు ఒకరి పట్ల ఒకరు శత్రు భావనతోనే ఉంటారు. కుజుడు ఎక్కువ డిగ్రీల మీద ఉండటం వల్ల శని ప్రభావాన్ని జయించి తన ఫలితాన్ని ఇస్తాడు. ఈ విధంగా లగ్నాధిపతి కర్మ అధిపతి కన్నా పైచేయి సాధించి జాతకునికి ఎక్కువ అనుకూల ఫలితాలు వచ్చేలా చూస్తాడు.

ఇలాగే ఒకవేళ గురు బుధుల కలయిక ఉంటే తెలివితేటలు గల వారు లేదా జ్ఞాని అవుతారా అన్నది ఆయా గ్రహములు ఉన్న డిగ్రీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బుధుడు ఎక్కువ డిగ్రీల మీద ఉంటే జ్ఞానం కన్నా అతి తెలివి ఎక్కువ ఉండి మాటల రాయుడు, కోతలరాయుడు అవుతాడు. అదే గురువు ఎక్కువ డిగ్రీల మీద ఉంటే తన జ్ఞానం వలన పదుగురిలో గౌరవం పొందుతాడు. అది గ్రహ కలయిక వల్ల మనం తెలుసుకోగలిగిన విషయం.

బృహత్ సంహిత అనే గ్రంథము
గ్రహ యుద్ధము నాలుగు విధములుగా తెలిపింది. అవి బేధ, ఉల్లేఖ, అంశుమర్దన మరియు అపసవ్య.

భేద: రెండు గ్రహాలు ఒకే దిక్కు వైపు సంచరిస్తున్నప్పుడు ఒకదానినొకటి కలిసినప్పుడు రెండు యుద్ధము చేసుకుంటాయి భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఆ రెండో గ్రహ ప్రభావాన్ని మొత్తానికి కనిపించనీయకుండా కప్పివేయడం ( ఓవర్ లాప్) చేయగలదు . దీనిని చాడనం అని కూడా అంటారు.

ఉల్లేఖ: రెండు గ్రహాల సంచారం చేస్తున్నప్పుడు వాటి దారులు కలుసుకుంటే దానిని ఉల్లేఖన అని అంటారు. అవి ఒకరినొకరు కప్పి ఉంచరు. గ్రహ బింబములు కలిసినట్లు ఉంటాయి గాని మొత్తము గ్రహములు స్పర్శించుకోరు. దీనిని రోదనం అని కూడా అంటారు.
అంశుమర్దన: రెండు గ్రహముల కిరణాలు ఒకదానితో ఒకటి అడ్డగించు ఉంటే దానిని అంశుమర్దనం అంటారు. దీనిని కిరణ సంఘటన లేదా రశ్మిమర్దనం అని కూడా అంటారు.
అపసవ్యం: ఒక గ్రహము తను సంచరించే దారిలో వ్యతిరేక దిశలో వస్తున్న గ్రహమును కలిస్తే దానిని అపసవ్యం అని అంటారు.
మామూలు మానవుల జాతకాలు చూసుకునే కన్నా ముందే ఈ విధమైన జాతక పరిశీలన గ్రహాల యుద్ధాలు మొదలగునవి వేదాలలో ఎప్పుడో రచించారు.
సరైన వానలు కురవనప్పుడూ అనగా కరువులు ఏర్పడిన నాడు,  రాజ కుటుంబాలలో అశాంతి ఉన్నప్పుడు ,ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న గ్రహ యుద్ధాలలో ఒకటైన భేద అనే గ్రహయుద్ధం జరుగుతోంది అని పండితులు చెప్తున్నారు.

సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేశ రాజకీయాలలో ప్రధానమంత్రి రాష్ట్రపతి ఇతర మంత్రులను మచ్చ అభిప్రాయభేదాలు ఏర్పడినప్పుడు అది  ఉల్లేఖా  అనే గ్రహ యుద్ధ  ఫలితం అని అంటారు.

రోగ భయంతో, పేదరికంతో దేశ ప్రజలు బాధపడితే దానిని
అంశుమర్దనం అనే గ్రహయుద్ధం వల్ల ఏర్పడే ఫలితం అని అంటారు.

పోరాటాలు యుద్ధాలు అది దేశంలో అంతర్గతంగా గాని లేదా ఇతర దేశాలతో గాని ఉంటే అది అపసవ్య గ్రహయుద్ధము అని అంటారు.

నిజానికి 50 పైగా గ్రహ యుద్ధములను గుర్తించినప్పటికీ పైన పేర్కొన్న నాలుగు మాత్రమే సామాన్యంగా చెప్పుకుంటారు.

కొన్ని గ్రహాలు చాలా తొందరగా సంచరిస్తూ ఉంటాయి కొన్ని అతి నెమ్మదిగా సంచరిస్తూ ఉంటాయి చంద్రుడు కేవలం రెండున్నర రోజులలో ఒక రాశి చప్పున నెల లోపే ఒక పరిక్రమ పూర్తి చేస్తాడు. అదే శనికి 30 సంవత్సరాల పైన పడుతుంది  కనుక గ్రహ సమయం అనేది ఆ గ్రహ సంచారం యొక్

క వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. గ్రహ వేగాలు అనుసరించి గ్రహ స్థానములు ఈ విధంగా ఉంటాయి .
చంద్రుడు బుధుడు శుక్రుడు  రవి, కుజుడు గురుడు మరియు శని..
ఒక్కొక్కసారి జాతకునికి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి గ్రహస్థితి అంతా బానే ఉంది ఈ విధంగా ఎందుకు జరిగింది అని ఇటువంటి ప్రశ్నలు వేస్తుంటారు .అలాంటప్పుడు ప్రశ్న శాస్త్రంలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. దశ అంతర్దశలలో జాతకుడు అంతా బానే ఉన్నా కంటికి కనిపించని ఈ సూక్ష్మమైన యుద్ధాల వలన వచ్చిన ఇబ్బంది అని వారు చెప్పగలరు.
సాంఘికమైన సామాజికమైన మార్పులను సూచించే గ్రహ యుద్ధం మామూలుగా సాధారణ జాతకునికి అంతగా వర్తింప చేయడం న్యాయం కాదు అని నా అభిప్రాయం. ఇటువంటి మాటల వలన చిన్న చిన్న విషయాలను కూడా తమకు అన్వయింప చేసుకొని సామాన్య ప్రజలు బాధపడిపోతున్నారు. అంత అవసరం ఉండదు .వ్యక్తిగతంగా కొన్ని కొన్ని విషయాలు తీసుకొనరాదు. ఇతరులను ఇటువంటి విషయాలపై సంప్రదించ రాదు.విషయ జ్ఞానం లేకుండా పద ప్రయోగాలు మంచివి కాదు. ప్రకృతి అనగా పంచభూతాలతో నిండిన ఈ విశ్వం, అలాగే పర్యావరణం మన చుట్టూరా ఉండే ప్రపంచ వాతావరణము  .సామాన్య మానవుని దృష్టి కన్నా  వీటి పరిధి చాలా పెద్దది. వాటి మీద గ్రహాయుద్ధ ప్రభావాలు ఉంటాయి గాని సామాన్య మానవుడు మీద కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాను..
శుభమస్తు
శ్రద్ధగా చదువుతున్నందుకు ధన్యవాదాలు
శుభాకాంక్షలతో
మీ
రాజేశ్వరి తటవర్తి .

పరిహారాలు, నివారణోపాయాలు.

ఈ మధ్య కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయ దర్శనాలు చేసుకున్నాం. అక్కడ కొంతమంది హోమాలు చేసుకుంటున్నారు. కొంత మంది ఎగతాళి చేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటూ , ఇదంతా దేవాలయాల అర్చకులు ధనార్జనకు చేసే కుట్ర అని మాట్లాడారు.
దేవాలయ దర్శనం  సరదాగా వెళ్లే విహారయాత్ర లాగ మారిపోయింది. హిందుసమాజం తన వేలితో తన కన్ను పొడుచుకొంట్టున్నది.
వెేదపరిజ్ఞానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చి చాలా కాలమ్మయ్యింది. విశ్వాసం లేక దానిపైన దృష్టి పెట్టక అవగాహనా లేమితో కాలక్షేపానికి మాటలు మొదలు పెట్టీ అంతు తేల్చుకోలేక అయోమయంలో జీవనం గడుపుతున్నారు.

సరళమైన భాషలో, నేను అందిరివి చదివి నాకు అర్ధమైన భావాన్ని మీతో పంచుకుం టున్నాను.

కాలపరిజ్ఞానానికి కొలమానం జ్యోతిషం.
మన కర్మ ఫలితాలు కాలపురుషుని చక్రం ద్వారా తెలుసుకొని మనకు అందించేవారు జ్యోతిష్కులు.ఈ చక్రంలో విశ్వ శక్తి తరంగాలు ఇమిడి ఉన్నాయి.మన సుకర్మ, దుష్కర్మల ఫలితాలు దీని ద్వారా తెలుసుకోగలము.
ప్రతి పనికి ఒక ఫలితం అనేది ఉంటుంది అనేది అందరికీ తెలుసు. మంచి పనికి మంచి ఫలితం , అలాగే మనం తెలిసి ,తెలియక చేసే , లేదా చేస్తున్న, లేదా చేసిన దుష్కర్మ ఫలితాలు కూడా అనుభవించాలి.
తెలియక చేసిన దుష్కర్మ నివారణార్ధం పండితులు చెప్పే చిట్కాలు/ ఉపాయాలు ఈ హోమాలు, శాంతులు.
భగవంతునికి భక్తి శ్రద్ధలతో చేసేవే ఈ పరిష్కారాలు. అవి దానం, మంత్రం,యంత్రం, హోమం, జపం, తపం మొదలు ఏ మార్గం ద్వారా ఐన జరపవచ్చు.
మనకి ఆ విద్య తెలిస్తే స్వయంగా చేసుకోవాలి. లేదా వచ్చిన వారిని ఆశ్రయించాలి. ఇది మనః పూర్వకంగా క్షమార్పణ భగవంతుని అడగడం అని అర్థం చేసుకోవాలి.
ప్రతి వ్యక్తికి వారికి సంబంధించిన ,అనుకూలమైన తిథి, వార నక్షత్ర హోరా సమయాల్లో నిర్దేశిత పరిష్కారం చేసుకోవాలి.ఇవన్నీ ఒక నియమం ప్రకారం, కొన్ని నిబంధనలకు లోబడి ఉంటాయి.
ఇది మనలో ఒక శాంతి ప్రక్రియకు దారితీస్తుంది. సద్గుణాలు పెంపొందిస్తుంది.

ఇదంతా బూటకం అనుకునే వారికి ఏమి చెప్పలేము.
కువిమర్శ మంచిది కాదు. కానీ, కాలనిర్ణయ ఫలితాలు వాస్తవాలే కదా.ఆ కాలపురుషుని మహిమ తెలుసుకు మసలాలి.
పంచభూతాలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే
 ఓంకార ప్రణవనాదంతో 9 పచ్చని మొక్కలు పాతి నీరు పోసి సంరక్షించే శక్తి ఉన్న చాలు.
అన్నదాన మహిమ అందరికీ తెలిసిందే కదా !
విద్యాదానం గొప్పతనం వివరించాలా! ఆలయ , గో సంరక్షణ, రహదారులు, విశ్రాంతి గృహ నిర్మాణాలు అన్ని మంచివే. కావా ఇవి పరిహారాలు  .
మనసుంటే మార్గం ఉంటుంది.

రాజేశ్వరి తటవర్తి ( అచ్యుత్)
23--10--2018
విశాఖపట్నం.

విజయ్:
వెంకటేష్:
దశమహావిధ్యలు-10
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
9.మాతంగి
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
  మా మాతంగుడు  అంటే శివుడు. శివుడిశక్తియే మాతంగి. గృహస్థ జీవితము సరిగ్గా సాగడానికి, పురుషార్ధ సిద్ధికై  మాతంగి ఉపాసన చేయాలి.
    పూర్వకాలంలో మాతంగుడు అనే ముని కదంబవనం లో జనులను వశం చేసుకోవడానికి  కఠోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో త్రిపురాదేవీ నేత్రం నుండి వెలువడిన తేజస్సులోంచి ఒక శ్యామల నారీ విగ్రహం వచ్చింది.ఆ విగ్రహం మే రాజమాతంగి. అమ్మవారు దక్షిణ, పశ్చిమానికి చిందిన దేవి. రాజమాతంగి, సుముఖి,కర్ణమతంగి  అనే నామాలు కలవు. మతంగి యొక్క భైరవుడు మతంగుడు.బ్రహ్మయామలలోమాతంగముని  కూతురు, మతంగి అని చెప్పబడింది.
 
   వాక్శుద్ధి దీనికంటే మారోక తంత్రం లేదనే తెలియబడుతుంది.

  అమ్మవారి యొక్క  శ్యామవర్ణం, పరావాక్ బిందువే. త్రినేత్రాలు సూర్యుడు సోమ అగ్ని. నాలుగు చేతులు నాలుగు వేదాలు.
 పాశం ఆవిద్యను,అంకుశం విద్యను, కర్మ రాశి దండాన్ని సూచిస్తుంది.  కాదంబవనం బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. యోగ రాజోపనిషత్తులో, బ్రహ్మలోకం కదంభగోళాకారంగా ఉంటుందని చెప్పబడింది. ఆమె సింహాసనం-శివాత్మకం. అదే త్రికోణం.ఆమె సూక్ష్మరూపం మనం  కొలిచే యంత్రంలో ఉంటుంది.ఇక పరరూపం,  భావన మాత్రమే.

   దుర్గా సప్తశతి లోని ఏడో అధ్యాయంలో మాతంగీ ధాన్యం చెప్పబడింది.
రత్నమాయ సింహాసనం పై కూర్చుని చిలకల గానం వింటుంది. అమ్మవారు శరీరవర్ణం  శ్యామం. ఒక కాలు కమలం పై పెట్టి  ఉంటుంది. తలపై అర్ధచంద్రుడు, కంఠం లో    కల్హారపుష్పమాల. వీణ వాయిస్తూ వుంటుంది. అమ్మవారు ఎర్రని వస్త్రాలు ధరించి చేతిలో శంఖమయ పాత్ర  ముఖంలో మధుర మందహాసంతో  విరాజిల్లుతూ ఉండగా ఇక చిలుకలు హ్రీంకారాన్ని  ఉచ్చరిస్తూ ఉంటాయి. కమలం సృష్టికి గుర్తు. శంఖపాత్రం,
 బ్రహ్మరంధ్రాన్ని, అందు   జాలువారే అమృతాన్ని సూచిస్తుంది. అమ్మావారు  ధరించిన ఎర్రని వస్త్రం జ్ఞానానికి లేదా అగ్నికి గుర్తు. అమ్మవారు వ్యాకరణ రూపమైతే, చిలుకలు ఉపాసకులగా సూచిస్తారు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

వెంకటేష్:
దశమహా విద్యలు -1
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
ఆది శక్తి సృష్టి రక్షణ కోసం విభిన్న అవతారంలో  ఆవిర్భవించింది. వాస్తవానికి దశ మహా విద్యలు అమ్మవారి  అవతారాలు.

ఆది శక్తి ముఖ్యంగా మూడు రూపాలు.
🌹పార్వతీ దేవి
🌸 లక్ష్మి
🌼సరస్వతి.

పార్వతీ దేవియే కాళి.
ఈ ముగ్గురు దేవతలు  ధరించిన వివిధ అవతారాలే
 దశమహావిద్యలు అని పేరు లో ప్రసిద్ధి చెందింది, పూజలందుకున్నాయి.

కాలాంతరం ఉపసకులు దశమహావిద్యల సాధన విధానం రకాలుగా విభజించారు.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


దశమహావిద్యలు

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🌸కాళి
🍂తార
🌹షోడశి(త్రిపురసుందరి)
🌺భువనేశ్వరి
🌸ధూమావతి
🌺చిన్నమస్త
🌼త్రిపురభైరవి
🥀భాగళాముఖి
🍁మతంగి
🌼కమల

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
దశమహావిద్యలను 2 రకాలుగా విభజించారు.

🌹కాళీకులం.
🍁శ్రీ కులం.

దశమహావిద్యలు ఈ రెండు రకాలలో అంతర్గతమై  ఉంటాయి.

🌸🌸కాళీకులం🌸🌸

🍁కాళి
🌸తార
🌼భువనేశ్వరి
🌺చిన్నమస్త

మహాకాళీమరికొన్ని అవతారాలు
🌸రక్తకాళి
🌼మహిషమర్ధిని
🌹త్రిపుర
🌺దుర్గ
🌷ప్రత్యంగిర...


🌼🌼శ్రీకులం🌼🌼

🌸 షోడశి(త్రిపురసుందరి)
🌺త్రిపురభైరవి
🌷ధూమావతి
🥀భగళాముఖి
🌹మాతంగి
🍁కమల

మిగితభాగం రేపటి రోజు సెండ్ చేస్తాను.

గుంటి వెంకటేష్
నల్గొండ
9703229189
_*రేపు 12.02.19 రధసప్తమి*_


🕉🕉🕉🕉🕉🕉


రధసప్తమి పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

_*"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"*_

ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.

1. ఈ జన్మలో చేసిన,
2. జన్మాంతరాలలో చేసిన,
3. మనస్సుతో,
4. మాటతో,
5. శరీరంతో,
6. తెలిసీ,
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి
నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

 తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు.

 ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.

Saturday, February 9, 2019

🍁🍁🍁🍁🙏🕉🌷🌷🌷🌷
➡ ఎప్పటికీ మారనిదే -
ఆధ్యాత్మికత

➡ ఎల్లప్పుడూ మారుతూ ఉండేదే - ప్రాపంచికత
🌺🌺🌺🌺☸🔯🌸🌸🌸🌸

మూర్తి అన్నది స్ఫూర్తి కోసం..,
 ఆరాధన కోసం కాదు.
🌹🌹🌹🌹🔯🕉🌻🌻🌻🌻
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్

సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!
జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!
ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!
చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!
స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!
మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!
రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!
అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!
భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!
రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!

SAMBHAVA Deeksha 9.2.2019













SAMBHAVA Deeksha ( LINGADHARANA ) 9.2.2019












































































At Sivapuri temple