Monday, December 30, 2019
Wednesday, December 25, 2019
Wednesday, December 11, 2019
శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం :
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే
మూడు శిరస్సులు:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
నాలుగు కుక్కలు:
నాలుగు వేదములు ఇవి.
శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
ఆవు:
మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
మాల:
అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
త్రిశూలము :
ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
చక్రము:
అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
డమరు:
సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
కమండలము:
సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి,అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.
పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.Forwarded by MVMRAO

Friday, December 6, 2019
శివపురాణం -8 వ భాగం:
హాటకేశ్వరం :
శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.
శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసిందిForwaded By Seetha Prasanna . ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.
అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు.కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపువాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది.వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.
మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు.పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు.నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు.కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు.ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.
అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు.ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.
'అదేంటి బావా?ఇది చేదు దోసకాయ.కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.
దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.
ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు.ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.
మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు.అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి.ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు.అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు.ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు.జ్ఞానసిద్ధిని పొందారు.Forwarded by MVMRAO

*బ్రహ్మ సూత్రాలు*
భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. ఈశ్వరీయమైన జ్ఞానాన్ని తపస్సంపన్నులైన రుషులు దర్శించి ప్రకటించారు. ప్రతి వేదంలో మూడు విభాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు. తరవాత ఉపని షత్తులు వెలువడ్డాయి. రుషులకు చాలా సందేహాలుండేవి. భిన్నమైన అభిప్రాయాలుండేవి. వారి సందేహాలను తొలగించేందుకు అనేకచోట్ల నుంచి రుషులను పిలిపించి పెద్దసత్రాన్ని ఏర్పాటు చేశాడు వ్యాసుడు. భారీ యాగం జరిగింది. దాన్ని ‘సత్రయాగం’ అన్నారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. ప్రతిరోజూ ఆరాధన అనంతరం రుషులు వేదాంతవిషయాలు చర్చించేవారు. వారివారి అభిప్రాయాలు విని ఆరణ్యకాలు, ఉపనిషత్తుల సారాన్ని జోడించి వేద వ్యాసుడు కొన్నిసూత్రాలు రూపొందించాడు. ఇందులో నాలుగు అధ్యాయాలు, 545 సూత్రాలు ఉన్నాయి. ఉపనిషత్తులు శ్రవణ ప్రధానమైతే, బ్రహ్మసూత్రాలు మనన ప్రధానమైనవి.
సూత్రం అంటే దారం. ఉపనిషత్తుల్లోని వేదాంతవిషయాలు పుష్పాల్లాంటివైతే- సృష్టి, సృష్టికర్తలను గురించిన బ్రహ్మజ్ఞానాన్ని దర్శించే బ్రహ్మసూత్రాల సంపుటి ఒక పూలదారంలా సాక్షాత్కరిస్తుంది. పద్మపురాణంలో సూత్రం లక్షణాలు ఉన్నాయి. సంక్షిప్తం,
బ్రహ్మ సూత్రాలు
సమగ్రం, విస్పష్టం అయి ఉండి దోషరహితంగా, పునరుక్తులు లేకుండా ఉండేది సూత్రం. వేదాధ్యయనం తరవాత బ్రహ్మను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. ఈ భావాన్ని వ్యక్తం చేసే శ్లోకంతో బ్రహ్మసూత్రాలు ఆరంభమవుతాయి.
సృష్టినిబట్టే సృష్టికర్తను గ్రహించాలని ప్రపంచ సృష్టికి బ్రహ్మే కర్త అని వ్యాసుడు చెప్పాడు. కపిలుడు సృష్టికి ప్రకృతే కారణమన్నాడు. పరమాణువులే కారణమన్నాడు కణాదుడు. అంతకుముందు ఈ ప్రపంచం లేదుగనుక అభావమే కారణమన్నారు బౌద్ధులు. దానిపాటికది సహజంగానే తయారైందన్నారు స్వభావవాదులు. వాటన్నింటినీ పూర్వపక్షం చేశారు బాదరాయణులు.
చేతనమైన పరమాత్మే కారణమన్నప్పుడు నిమిత్తం, ఉపాదానం రెండూ కారణాలవుతాయి. నిమిత్తమంటే చేతనం. ఉపాదానమంటే అచేతనం. కార్యమైన కుండకు చేతనుడైన కుంభకారుడూ (కుమ్మరి) కారణమే. అచేతనమైన మట్టీ కారణమే. కనుకనే కార్యరూపమైన ప్రపంచానికి నిమిత్త, ఉపాదానాలు రెండూ కారణమే. రెండూ పరమాత్మే. అందుకే ప్రపంచానికి ఎంత అతీతమో అంత దగ్గరగా ప్రపంచంలో ప్రతి అణువూ మృత్తికలాగా వ్యాపించి ఉంది. ఇది వ్యాసులవారి సమన్వయం.
బ్రహ్మ సూత్రాలకు ఎన్నో వ్యాఖ్యానాలు వెలశాయి. వాటికి అతి ప్రాచీన భాష్యం ఆదిశంకరులది. ఆ తరవాత యాదవప్రకాశ, భాస్కర, విజ్ఞాన, రామానుజ, నీలకంఠ, మధ్వ, వల్లభ, బల దేవాదుల రచనలు అవతరించాయి.
శంకరుడి ప్రకారం సృష్టికర్త మాత్రమే సత్యం. సృష్టి ఒక మాయ మాత్రమే. సృష్టికర్తను గ్రహించడంవల్ల మాత్రమే సృష్టి మాయ అనే విషయం తేటతెల్లమవుతుంది. బ్రహ్మజ్ఞానం పొందకుంటే తీర్థయాత్రలు, పూజలు, దానాలు మొదలైనవి ముక్తిని ప్రసాదించలేవని శంకరుల భావన.
రామానుజులు ఈ మాయా సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. సృష్టికర్తలాగే ఈ ప్రపంచం కూడా సత్యమేనన్నారు.
మధ్వాచార్యులు కూడా సృష్టి సత్యమేనంటూ అది సృష్టికర్త కన్నా భిన్నమైనదన్నారు. ఈ విధంగా బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకుని వ్యాఖ్యానించడంలో భేదం గోచరిస్తుంది. బ్రహ్మజ్ఞానం మనిషిని పశువుల నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి దైవత్వానికి ఎదిగేలా చేస్తుంది. పరబ్రహ్మను ధ్యానిస్తూ, తమ మనసులను ప్రక్షాళన చేసుకున్నవారు అమృతత్వాన్ని, బ్రహ్మానందాన్ని పొందగలరు.Forwarded by MVMRAO

Wednesday, December 4, 2019
Kalwa Badrinath:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని పటం జారి కింద పడితే అది అపశకునం కాదు.,
ఆ దేవుని పటం--
" నేను జడం కాదు, చైతన్యాన్ని" అన్న సందేశాన్ని ఇస్తుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
✳ నాటకం అని తెలిస్తే మోక్షం
✳ నాటకం అని మరిస్తే బంధం
విచిత్రమైన విషయం ఏమిటంటే--
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
👉 'బంధం' అస్సలు లేనేలేదు., ఉందనుకుంటున్నాము.
👉 'మోక్షం' అనేది సదా ఉంటుంది., లేదనుకుంటున్నాము.
🌷🌷🌷🌷🌷🌷🌷🌴🌴🌷🌷🌷🌷🌷
ఏ బోధన వల్లనైనా ఒక్కడంటే ఒక్కడే ఉద్ధరింపబడతాడు.,
ఆ ఒక్కడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ బోధించినవాడే.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌷🌻🌻🌻🌻🌻
అగ్గిలో బూడిద అయ్యే ఈ అతుకుల బొంత గురించి ఎందుకు ఇంత విచారం.,
ఈ బొంతలో అగ్గిలా మండే 'ఆత్మ' గురించి విచారించు...!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గాఢ నిద్రకు - మెలకువకు మధ్య "ఉన్నదే" అర్ధనారీశ్వర తత్త్వం.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
తారక రామా రావు దేవంభొట్ల:
పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి.
ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ!
అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః!!
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః!
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా!!
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః!
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ!!
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః!
క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః!!
ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.
P Seshasri:
🌳చిన్నమస్తా దేవి🌳
🚩🚩
కాళికాదేవి పది రూపాలలో
ఉగ్రరూపిణి చిన్నమస్తా
దేవి.
చిన్నమస్తాదేవి ఆలయం
జార్ఖండ్ రాష్ట్రం,
రామ్ఘడ్ జిల్లాలో
రాజ్ రబ్బా అనే ఊరు లో వున్నది.
ఈ ఆలయం ఒక కొండ శిఖరాన వున్నది. ఆ ప్రదేశంలోనే
దామోదర్ నది, భైరవీ
నదీ ప్రవహిస్తూంటాయి.
భైరవీ నది పై నుండి క్రింద కి ప్రవహిస్తూ వుంటే క్రింద దామోదర్ నది ప్రవహిస్తున్నది.
అక్కడే రాజ్ రబ్బా జలపాతము కూడా వున్నది.
భైరవి నదిని స్త్రీ స్వరూపంగా , దామోదర్
నదిని పురుష రూపంగా వర్ణించడం జరిగింది.
చినమస్తాదేవికి శిరస్సు
వుండదు. తెగిన శిరస్సు
ఎడమ చేతిలో ,
తలను కోసిన కత్తి కుడిచేతిలో ధరించివుంటుంది.
ఈ దేవి సర్పాన్ని జంధ్యంగా
ధరించింది. కంఠాన కపాలమాల ధరించి దిగంబర రూపిణిగా దర్శనమిస్తుంది. దేవి వెనుక శ్మశానం
కనిపిస్తుంది. ఈ దేవిని
' ప్రచండ చండిక'గా కూడా ఈ దేవి
పిలవబడుతున్నది.
తెగిన మెడ నుండి మూడు రుధిర ధారలు బయటికి వస్తూ కనిపిస్తుంది. వెలుపలికి వచ్చే మూడు ధారలలో ఒక ధార
చినమస్తాదేవి, మిగతా రెండు ధారలను, దేవి చెలికత్తెలైన
ఢాకిని, వారుణి, పానం
చేస్తారని పురాణ కధనం.
దేవతలకు దానవులకు
యుధ్ధం జరిగే సమయంలో
దానవులను ఆవేశంతో
సంహరించిన ఈ దేవి
ఆగ్రహావేశాలతో
తన శిరస్సును
తానే ఖండించుకొని రుధిరపానం చేసినట్లు గాధ.
చిన్నమస్తాదేవి నుండి నరసింహావతారం ఆవిర్భవించినట్లు మరి యొక కధ ప్రచారంలోవుంది.
లక్ష్మీంకరై అనే రాజ కుమారి శిరస్సు ఖండించబడి, ఆమె మొండెము మాత్రము
నగరంలో తిరిగినట్టు,
ఆమె పిదప,'చిన్న ముండావజ్వరాగి ' అనే మరో పేరు
పొందినట్లు మరో కధ వుంది.
ఆత్మస్ధైర్యం, విద్య విజ్ఞానం
మొదలైనవాటికి మారు
రూపం చిన్నమస్తాదేవి.
బౌద్ధ మతానికి చెందిన
మేఖలై, గంగలై అనే
ఇద్దరు సోదరీమణులు
తమ గురువుగారి ముందు నృత్యం చేసినట్లు, వారితో
చేరి 'వజ్ర యోగిని' అనే పేరుతో చిన్నమస్త కూడా నృత్యం చేసినట్లు చెప్తారు.
హిమాచల్ ప్రదేశ్ లో ని
చింతా పూర్ణి లో వున్న
చిన్నమస్తా ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతున్నది.
మన్మధుడు, రతీదేవి తామర పుష్పంలో శయనించి వున్నప్పుడు , వారి మీద
చిన్నమస్తా నిలబడిన రూపాన్ని, రాజ్ రబ్బా
ఆలయంలో మనము
దర్శిస్తాము.
ఈ ఆలయ సమీపంలో
మరికొన్ని ఆలయాలు వున్నాయి.
దక్షికై కాళి, అష్ట మాత్రికా
- తారా , షోడశి, భువనేశ్వరి,
భైరవి, బగళా , కమలా,
మాతంగి, ధూమావతి, మొదలైనవారి స్త్రీ దేవతల ఆలయాలు అవి.
చాలా పురాతనమైన ఈ చిన్నమస్తా ఆలయానికి
అస్సామ్, నేపాల్, బీహార్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలనుండి అనేక మంది భక్తులు తరలివస్తూంటారు.
దుర్గా సప్తశతి లో ఈ ఆలయం గురించి, వివరించబడినది.
మంత్ర, తంత్రాలకు ఈ ఆలయం ప్రసిధ్ధి
చెందింది.
అస్సామ్ లోని కామాఖ్యా
దేవి ఆలయంలానే చిన్నమస్తాదేవి ఆలయం కూడా ఖ్యాతిగాంచింది.
దశ మహావిద్యలలో ఈ దేవి ఒకరని గ్రంధాలలో వున్నది.
మంగళవారం, శనివారం నాడు కాళికా దేవి పూజలు జరుగుతాయి. ఆ సమయంలో రకరకాల బలులు కూడా ఇస్తారు.
కొన్నివేల మంది భక్తులు
ఆ పూజలలో పాల్గొంటారు.
పౌర్ణమినాడు ఈ ఆలయం చాలా రద్దీగా
వుంటుంది.
క్రొత్తగా పెళ్ళైన దంపతులు
తమ శిరోజాలను దేవికి
మ్రొక్కుబడిచెల్లిస్తారు.
చేతబడులతో బాధించబడినవారు
ఇక్కడి కి వచ్చి దేవిని
పూజి స్తే చేతబడినుండి
విముక్తి లభిస్తుందని
ధృఢంగా నమ్ముతారు.
"సంతాల్ ' జాతి ఆదివాసులు
ఈ ఆలయానికి వచ్చి
మరణించిన వారి అస్తికలను అక్కడ వున్న దామోదర్ నదిలో కలుపుతారు. అక్కడవున్న
"గోపీఘాట్" అనే స్నాన
ఘట్టంలో స్నానం చేస్తారు
తూర్పు, పశ్చిమ జార్ఖండ్ లలో చిన్నమస్తా దేవిని ,
'మనోకామనా దేవి'
అని పిలుస్తారు.
మనోవాంఛితాలు తీర్చే
దేవి అని అర్ధం.
జనవరి మాసంలో జరిగే
మకర సంక్రాంతి రోజున
లక్షల కొలది యాత్రీకులు వస్తారు. అలాగే విజయదశమి
నాడు కూడా దర్శనానికి అనేకమంది యాత్రీకులు వస్తారు. అక్కడ వేడినీటి గుండాలు వున్నాయి.యాత్రికుల
నదీవిహార వసతులు ఏర్పాటు చేశారు.
విష్ణుపురాణంలోను, భాగవత పురాణంలోను ఈ ఆలయం గురించిన
ఎన్నో వివరాలు విశద
పరచబడియున్నాయి.
ఈ ఆలయం ఒక్కటే కాకుండా
చిన్నమస్తా దేవికి కాశీ కి సమీపాన గల రామ్ నగర్ లోను, జార్ఖండులోని నందనా పర్వతం మీద, పశ్చమబెంగాల్ లోని
విష్ణుపూర్ లోను, నేపాల్ లోని పర్వత లోయలోను
ఆలయాలు వున్నాయి.
చిన్నమస్తా ఆలయానికి
వెళ్ళాలంటే ముందు
రాంచీకి వెళ్ళాలి. అక్కడ నుండి రాజ్ రబ్బాకు
అద్దె కారులోగాని, బస్సుల్లో గాని చేరుకోవచ్చును.
🚩🚩
🌿శేషశ్రీ🌿

Subscribe to:
Posts (Atom)