Wednesday, December 4, 2019

Kalwa Badrinath:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దేవుని పటం జారి కింద పడితే అది అపశకునం కాదు.,

 ఆ దేవుని పటం--
" నేను జడం కాదు, చైతన్యాన్ని" అన్న సందేశాన్ని ఇస్తుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
✳ నాటకం అని తెలిస్తే మోక్షం

✳ నాటకం అని మరిస్తే బంధం

విచిత్రమైన విషయం ఏమిటంటే--
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
👉 'బంధం' అస్సలు లేనేలేదు., ఉందనుకుంటున్నాము.
👉 'మోక్షం' అనేది సదా ఉంటుంది., లేదనుకుంటున్నాము.
🌷🌷🌷🌷🌷🌷🌷🌴🌴🌷🌷🌷🌷🌷
ఏ బోధన వల్లనైనా ఒక్కడంటే ఒక్కడే ఉద్ధరింపబడతాడు.,
 ఆ ఒక్కడు ఎవరో కాదు సాక్షాత్తు ఆ బోధించినవాడే.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌷🌻🌻🌻🌻🌻
అగ్గిలో బూడిద అయ్యే ఈ అతుకుల బొంత గురించి ఎందుకు ఇంత విచారం.,

 ఈ బొంతలో అగ్గిలా మండే 'ఆత్మ' గురించి విచారించు...!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గాఢ నిద్రకు - మెలకువకు మధ్య "ఉన్నదే" అర్ధనారీశ్వర తత్త్వం.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

తారక రామా రావు దేవంభొట్ల:
పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి.

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ!
అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః!!
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః!
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా!!
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః!
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ!!
 త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః!
క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః!!

ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.

P Seshasri:
🌳చిన్నమస్తా దేవి🌳

🚩🚩

కాళికాదేవి పది రూపాలలో
ఉగ్రరూపిణి చిన్నమస్తా
దేవి.
చిన్నమస్తాదేవి ఆలయం
జార్ఖండ్ రాష్ట్రం,
రామ్ఘడ్  జిల్లాలో
రాజ్ రబ్బా  అనే ఊరు లో వున్నది.
ఈ ఆలయం  ఒక కొండ శిఖరాన వున్నది.  ఆ ప్రదేశంలోనే
దామోదర్ నది,  భైరవీ
నదీ ప్రవహిస్తూంటాయి.
భైరవీ నది   పై నుండి క్రింద కి ప్రవహిస్తూ వుంటే క్రింద దామోదర్ నది ప్రవహిస్తున్నది.
అక్కడే రాజ్ రబ్బా జలపాతము కూడా వున్నది.
భైరవి నదిని  స్త్రీ స్వరూపంగా ,  దామోదర్
నదిని పురుష రూపంగా  వర్ణించడం జరిగింది.

చినమస్తాదేవికి శిరస్సు
వుండదు.  తెగిన శిరస్సు
ఎడమ చేతిలో ,
తలను కోసిన కత్తి కుడిచేతిలో ధరించివుంటుంది.
ఈ దేవి  సర్పాన్ని జంధ్యంగా
ధరించింది.  కంఠాన కపాలమాల ధరించి దిగంబర రూపిణిగా దర్శనమిస్తుంది. దేవి వెనుక  శ్మశానం
కనిపిస్తుంది. ఈ దేవిని
' ప్రచండ చండిక'గా  కూడా ఈ దేవి
పిలవబడుతున్నది.
తెగిన  మెడ నుండి మూడు రుధిర ధారలు  బయటికి వస్తూ కనిపిస్తుంది.  వెలుపలికి వచ్చే మూడు ధారలలో ఒక ధార
చినమస్తాదేవి, మిగతా రెండు ధారలను,  దేవి చెలికత్తెలైన
ఢాకిని, వారుణి, పానం
చేస్తారని పురాణ కధనం.

దేవతలకు దానవులకు
యుధ్ధం జరిగే సమయంలో
 దానవులను ఆవేశంతో
సంహరించిన ఈ దేవి
ఆగ్రహావేశాలతో
తన శిరస్సును
తానే ఖండించుకొని రుధిరపానం చేసినట్లు గాధ.
చిన్నమస్తాదేవి నుండి నరసింహావతారం ఆవిర్భవించినట్లు మరి యొక కధ ప్రచారంలోవుంది.

లక్ష్మీంకరై  అనే రాజ కుమారి శిరస్సు ఖండించబడి,  ఆమె మొండెము మాత్రము
నగరంలో తిరిగినట్టు,
ఆమె పిదప,'చిన్న ముండావజ్వరాగి ' అనే  మరో పేరు
పొందినట్లు మరో కధ వుంది.

ఆత్మస్ధైర్యం, విద్య విజ్ఞానం
మొదలైనవాటికి మారు
రూపం చిన్నమస్తాదేవి.

బౌద్ధ మతానికి చెందిన
మేఖలై, గంగలై అనే
ఇద్దరు సోదరీమణులు
తమ గురువుగారి ముందు నృత్యం చేసినట్లు, వారితో
చేరి 'వజ్ర యోగిని'  అనే పేరుతో చిన్నమస్త  కూడా నృత్యం చేసినట్లు  చెప్తారు.

హిమాచల్ ప్రదేశ్ లో ని
చింతా పూర్ణి లో వున్న
చిన్నమస్తా ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతున్నది.

మన్మధుడు, రతీదేవి  తామర పుష్పంలో శయనించి వున్నప్పుడు , వారి మీద
చిన్నమస్తా నిలబడిన రూపాన్ని,  రాజ్ రబ్బా
ఆలయంలో మనము
దర్శిస్తాము.

ఈ ఆలయ సమీపంలో
మరికొన్ని ఆలయాలు వున్నాయి.
దక్షికై కాళి, అష్ట మాత్రికా
- తారా , షోడశి, భువనేశ్వరి,
భైరవి, బగళా , కమలా,
మాతంగి, ధూమావతి, మొదలైనవారి స్త్రీ దేవతల ఆలయాలు అవి.

చాలా పురాతనమైన  ఈ చిన్నమస్తా  ఆలయానికి
అస్సామ్, నేపాల్,  బీహార్
పశ్చిమ బెంగాల్  రాష్ట్రాలనుండి అనేక మంది భక్తులు తరలివస్తూంటారు.

దుర్గా సప్తశతి లో ఈ ఆలయం గురించి, వివరించబడినది.
మంత్ర, తంత్రాలకు ఈ ఆలయం ప్రసిధ్ధి
చెందింది.
అస్సామ్ లోని కామాఖ్యా
దేవి ఆలయంలానే చిన్నమస్తాదేవి ఆలయం కూడా ఖ్యాతిగాంచింది.

దశ మహావిద్యలలో  ఈ దేవి ఒకరని  గ్రంధాలలో వున్నది.

మంగళవారం, శనివారం నాడు  కాళికా దేవి పూజలు జరుగుతాయి.  ఆ సమయంలో రకరకాల బలులు కూడా ఇస్తారు.
కొన్నివేల మంది భక్తులు
ఆ పూజలలో పాల్గొంటారు.

పౌర్ణమినాడు   ఈ ఆలయం చాలా రద్దీగా
వుంటుంది.
క్రొత్తగా పెళ్ళైన దంపతులు
తమ శిరోజాలను దేవికి
మ్రొక్కుబడిచెల్లిస్తారు.

చేతబడులతో బాధించబడినవారు
ఇక్కడి కి వచ్చి దేవిని
పూజి స్తే చేతబడినుండి
విముక్తి లభిస్తుందని
ధృఢంగా  నమ్ముతారు.

"సంతాల్ '   జాతి  ఆదివాసులు
ఈ ఆలయానికి వచ్చి
మరణించిన వారి అస్తికలను అక్కడ వున్న దామోదర్ నదిలో  కలుపుతారు. అక్కడవున్న
"గోపీఘాట్" అనే స్నాన
ఘట్టంలో స్నానం చేస్తారు

తూర్పు, పశ్చిమ జార్ఖండ్ లలో  చిన్నమస్తా దేవిని ,
'మనోకామనా దేవి'
అని పిలుస్తారు.
మనోవాంఛితాలు తీర్చే
దేవి అని  అర్ధం.

జనవరి మాసంలో జరిగే
మకర సంక్రాంతి  రోజున
లక్షల కొలది యాత్రీకులు వస్తారు.  అలాగే విజయదశమి
నాడు  కూడా దర్శనానికి అనేకమంది యాత్రీకులు వస్తారు. అక్కడ వేడినీటి గుండాలు వున్నాయి.యాత్రికుల
నదీవిహార వసతులు ఏర్పాటు చేశారు.

విష్ణుపురాణంలోను, భాగవత పురాణంలోను ఈ ఆలయం గురించిన
ఎన్నో వివరాలు విశద
పరచబడియున్నాయి.

ఈ ఆలయం ఒక్కటే కాకుండా
చిన్నమస్తా దేవికి  కాశీ కి సమీపాన గల రామ్ నగర్ లోను,  జార్ఖండులోని నందనా పర్వతం మీద,  పశ్చమబెంగాల్ లోని
విష్ణుపూర్ లోను,  నేపాల్ లోని పర్వత లోయలోను
ఆలయాలు వున్నాయి.

చిన్నమస్తా ఆలయానికి
 వెళ్ళాలంటే ముందు
 రాంచీకి వెళ్ళాలి. అక్కడ నుండి  రాజ్ రబ్బాకు
అద్దె కారులోగాని,  బస్సుల్లో గాని చేరుకోవచ్చును.
🚩🚩
🌿శేషశ్రీ🌿

No comments:

Post a Comment