Saturday, October 28, 2017

28/10/17, 4:19:31 PM: ‪+91 98660 49721‬: ధ్యానం.

మన ఋషులు ,ప్రవక్తలు అందరూ తరతరాలుగా చెప్తుంది ఒకే ఒక్కటి. ధ్యానం చేయండి.అన్నీ సర్దుకుంటాయి.

అంతటా  ప్రశాంతత ని అనుభూతి చెంద వచ్చు.

ధ్యానం.

మనస్సు రకరకాల పౌనపున్యం తొ కంపించే ఒక శక్తి  ప్రవాహం.

చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తిని మనకు అందనివ్వకుండా ఈ మానసిక శక్తి ప్రవాహం,ఒక నిరోధం లాగా పనిచేస్తుంది.

ఎప్పుడైతేఈ నిరోధాన్ని మనం తగ్గించగలమో,అప్పుడే కాస్మిక్ శక్తి మనలోకి ప్రవహించి మన చైతన్యాన్ని విశ్వ స్థాయికి వ్యాపింప చేస్తుంది.
చైతన్యాన్ని మనం శివ అంటాము.
కాస్మిక్ శక్తిని అమ్మా అంటాము.

మనస్సుని తరంగాలు లేకుండా చేయడ మెలా?

మనస్సు కున్న ఒక లక్షణం అది దేనినైతే చూస్తుందో దాని లా మారిపోతుంది.ఒక స్వీట్ ని చూసి దనిపై తదేక దీక్ష పెడితే

అది ఆ తీపి మిటాయి లక్షణాలను సంతరించు కొంటుంది. నీరు ఏ పాత్రలో పొస్తే ఆయా పాత్రల ఆకారాన్ని  పొందుతుంది గదా.

అందుకే,మానసిక శక్తి పౌన పున్యాన్ని తగ్గించుకొంటూ శూన్య స్థాయికి తెసుకెళ్ళాలంటే,శూన్యం పై మనస్సుని కేంద్రీకరిస్తే కొంత కాలానికి మనస్సు శూన్యం లాగా,అంటే శూన్యమై పోతుంది.

.దేవుడు అనే భావం ఎలా ఉంటుంది?ఎలాంటి లక్షణాలు,వికారాలు లేని అంటే ప్రకంపనలు లేని భావం.అందుకే సగుణాకార ఆరాధన కన్నా శూన్యారాధన త్వరగా మనస్సుని శూన్య స్థితికి మారుస్తుంది.

మానసిక శక్తి ధర్మాలు అచ్చం నీటి ధర్మాల లాగా ఉంటాయి.అందుకే జ్యోతిష శాస్త్రం లో కూడ జలాధి పతి ఐన చంద్రుణ్ణి మనస్సుకి కారకుడు గా వ్యవహారిస్తారు.

మనస్సు ఇంకో శక్తితో కూడ ముడిపడి ఉంటుంది. అదే ప్రాణ శక్తి. మనం ఒక క్రమ పద్దతిలో ఊపిరి తీస్తూ వదులుతూ నెమ్మదిగా ఊపిరి పై కంట్రోల్ సాధిస్తే,మనస్సు పై కూడ మనం కంట్రోల్ సాధించ వచ్చు.
ధ్యానం అంటే

ఒక వస్తువు- అది బయట ప్రపంచం లొ ని ఏదైనా కావచ్చు , లేదా అంతర్ ముఖంగా -ఒక అనుభూతి ,ఆలొచన, ఒక ద్రుశ్యం , ఒక మంత్రం ,ఒక భావన ,ఒక స్పందన - ఏదైనా కావచ్చు , దానిపై మన మనస్సుని ,ఇంద్రియాలతొ సహా లగ్నం చేయటం .

ఏకాగ్రత ,ధారణ ,ధ్యానం -- ఎందుకు ?

ఇంద్రియాలను ,మనస్సు ని కేంద్రీకరించడ మే ఏకాగ్రత . దానిని ఎక్కువ సేపు అవిచ్చిన్నంగా చేయడ మే ధారణ .

ఒక విషయాన్ని ,అది ఏదైనా సరే ,పరిశీలన ,పరిశోధన , చేసి నిజం రాబట్ట కలగాలి . అంటే సత్యాన్ వేషణ కోసం ధ్యానం చేయాలి .

మెడీటేషన్ అంటే ఏమిటి ?

మన ధ్యాసను అంటే మనస్సుని ఒక్క విషయం పైన కేంద్రీకరిస్తే దానిని ఏకాగ్రత అంటాము . ఒక బిందువు మీద గానీ , ఒక వస్తువు మీద గానీ - అంటే ప్రాపంచిక విషయాలు -  తినే పదార్ధం లేదా ఒక వ్యక్తి లేదా ఒక పని లేదా డబ్బు - వీటి పైన మన మనస్సుని పెడితే దానిని ఏకాగ్రచిత్తం అని అంటాము .

అలాకాక , ధ్యాసని శూన్యం పైన - అంటే ఏమీ లేని -భౌతిక నిర్వచనం లేని -విషయం పై కేంద్రీకరిస్తే దానిని మెడీటేషన్ అని చెప్పికొంటాము .

భౌతిక వస్తువులలో , విషయాలలో శూన్యాన్ని చూడకలిగితే - అనుభూతిస్తే -అదీ మెడీటేషనే !

మెడీటేషన్ లో మనస్సుని అంటే ఆలోచనా ధారని తగ్గించుకొంటూ మనస్సు లేని దశకు  చేరుకొని కాల ప్రదేశాలను మరిచి ఉంటాము .
శూన్యం అంటే ఏమిటి?
పూర్తిగా లేకపోవడం కాదు. ఉన్నదానితో మమేకమవ్వక పోవడం అనగా అహం తో వ్యవహరించ కుండా గమనించడం .

రోజుకి 60000 ఆలోచనలు కలిగే మనస్సుని కంట్రోల్ ఎలా చేయాలి ?

శారీరక స్వస్థత

జ్ఞానేంద్రీయాల స్థబ్దత

కర్మేంద్రీయాల నిబద్దత

చిత్త శుద్ది - చిత్త నిరోధం - నిర్మల చిత్తం ---- వీటిని సాధించాలంటే --- క్రింది నియమాలను అలవాటు చేసుకోవాలి .

నీతి ,నిజాయితీ - అంటే సంఘానికి చెరుపు చేయకుండుట ,ప్రక్రుతి రక్షణ  ,

అహిన్స , అపరిగ్రహం ,  - అంటే సంఘానికి మేలు చేయని హింస , పనేమీ చేయకుండ వస్తు స్వీకారం చేయకుండుట .

సేవ , త్యాగం , వైరాగ్యం - సమ పాళ్ళలో అలవాటు చేసుకొనుట ,

ప్రేమ , సత్యం -ప్రతిఫలమేమీ ఆశించని దానం , అనుభూతి చెందిన దాన్ని  మాత్రమే పలుకుట.

అంటే మనిషికి సహజంగా ఉండే అరిషద్వర్గాలను అదుపులో ఉంచి మెల్ల మెల్లగా వాటిని చిత్తం నుండి తీసివేయాలి.

*మీ*
*ముత్యంపేట మల్లికార్జున శర్మ

26/10/17, 6:03:43 PM: Ivaturi Umashankar: 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉 Srj Gayathri Peethsm
      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*
పర్వదినాల పవిత్రమాసం 'కార్తీకం'
పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. అటు హరికి, ఇటు హరుడికి, మరోపక్క వారిద్దరితనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది. హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు, ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు. హరిపూజ హరునికి ఇష్టమైతే, శివపూజ కేశవునికి ప్రీతికరం. తులసీ పూజలు, వన భోజనాలు, సమారధాలు, ఉపవాసమలు, అభిషేకాలు, సహస్రనామ పారాయనలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైనా ఆస్తికభావానాలు కలుగజేసే మాసమిది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే..!
పాడ్యమి: కార్తీక శుద్ధ పాడ్యమి... తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయనికెళ్ళి, 'నేను చేయదలచిన కార్తీక వ్రతం నిర్విజ్ఞానం గా సాగేతట్లు అనుగ్రహింపు'మని ప్రార్దించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళు ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
తదియ: ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ది కలుగుతుంది.
చవితి: కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రమంఎస్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి.
పంచమి: దీనినే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు శుభ్రమంఎస్వర స్వామీ ప్రీత్యర్ధం అర్చనలు, అభిషేకాలు, చేయించుకున్నవారికి జ్ఞానవ్రుద్ది కలుగుతుంది.
షష్టి: నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి: ఈరోజు ఎర్రవస్త్రంలో గోదుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ది అవుతుందని శాస్త్రోక్తి.
అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే "గోపూజ" విశేష ఫలితాలనిస్తుంది.
నవమి: నేటినుండి మూడురోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజ రాత్రి విష్ణుపూజ చేయాలి.
దశమి: నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి, గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.
ఏకాదశి: ఈ ఏకాదశికే భోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికీ, ఉసిరికీ కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింప జేస్తుందని ప్రతీతి.
త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమౌతాయని శాస్త్రోక్తి.
చతుర్దశి: నేడు శనైశ్చర ప్రాత్యర్డం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు, మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభ దృష్టిని ప్రసాదిస్తాడు.
పౌర్ణమి: కార్తీక పూర్ణిమ, మహాపవిత్రమైన ఈరోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ darshanam చేసుకోవడం వల్ల పాపాలనీ పటాపంచలౌతాయి.
పాడ్యమి: (కార్తీక బహుళ పాడ్యమి) ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.
విదియ: వనభోజనం చేయటం విశేష ఫలాలనిస్తుంది.
తదియ: పండితులకు, గురువులకు తులసీమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ది అవుతాయి.
చవితి: పగలంతా ఉపవాసముండి, సాయంత్రం వేల గణపతిని గారిక తో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి.
పంచమి: ఈరోజు చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం తినిపించటం శుభ ఫలితాలనిస్తుంది.
షష్టి: గ్రామదేవతలకు పూజచేయటం వల్ల వారు సంతుష్టులై, ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు.
సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండనీ ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ది చెందుతాయి.
అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి: వెండి లేదా రాగి కలశం లో నీరు పోసి పండితునికి/బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
దశమి: నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరుతాయని పురాణోక్తి.
ఏకాదశి: ఈనాటి విష్ణ్యాలయం లో దీపారాదన, పురాణ శ్రవణం, పటనం, జాగరణ మున్నగునవి విశేష ఫలదాయకం.
ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించటం శుభప్రదం.
త్రయోదశి: నవగ్రహారాదన చేయటం వల్ల గ్రహదోషాలు తోలుగుతాయి.
చతుర్దశి: ఈమాస శివరాత్రినాడు ఈస్వరర్చన, అభిషేకం చేయటం వల్ల అపంరుత్యుదోశాలు, గ్రహబాడలు తొలగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులౌతారని పురాణోక్తి.
అమావాస్య: ఈరోజు పిత్రు దేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలచి వారికి భోజనం పెట్టాలి.లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్డం దీపారాదన చేసి, కొబ్బరికాయ కోటి నమస్కరించాలి.
ఉత్తమమైనది ఉత్థాన ఏకాదశి
ఈ కార్తీకమాసం లో అత్యంత విశేషమైనది ఉత్థానఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధఎకాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొన్న రోజుకే 'ఉత్థాన ఏకాదశి' అని పేరు.
విశిష్ట ఫలప్రదం తులసీ కల్యాణం
క్షీరాబ్ది ద్వాదశి నాడు ముప్పైరెండు మంది దేవతలలో శ్రీమహాలక్ష్మీ సమేతుడై స్వామీ తులసీ ధాత్రి వనం లో ఉంటాడని చెప్తారు. పూర్వం కృతయుగం
లో దేవదానవులు క్షీరమదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు ఒచ్చింది. పాల సముద్రాన్ని చిలికిన కారణం గా 'చిల్కు ద్వాదశి' అనికూడా పిలుస్తారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాదనలు చేసి షోడశోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి, లక్ష్మీనారాయణులను పూజిస్తారు.

సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత...?
కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. .........


27/10/17, 1:25:15 PM: Mani-TTE-Tenali: *రేపటి కార్తీకపురాణం 8 వ అధ్యాయము*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*


వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు
మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.

అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న  దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.
రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.
తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

*ఆజా మీళుని కథ*

పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై
మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొ డ౦గిరి.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*
*ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*

26/10/17, 10:51:08 PM: MVMRAO: WhatsApp sharing

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

మహాన్యాసము
నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

శ్రీరుద్రధ్యానమ్
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను.

రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి ( లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ) ఉంటుంది.

శ్రీ రుద్ర ప్రశ్నః
కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా
చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః

నమకం
మొదటి అనువాకము:
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||

శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||

తాత్పర్యము:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

రెండవ అనువాకము:
నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||

తాత్పర్యము:
స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.

మూడవ అనువాకము:
నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’‌உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||

తాత్పర్యము:
శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్స
పరమేశ్వరుని  ఉపాసించు వారు
ధన్యులు  కృతకృత్యులు  .........
వారి జన్మ సఫలమగును  !
వారి కులము ఉద్దరింపబడును  !
సదాశివ. శివ అంటూ  శివనామమును
జపించువానిని  చెదలు నిప్పుల వలె 
పాపములు  స్పృశించజాలవు  !
ఓ. శివ. ! నీకు నమస్కారము అని పలికే  నోరు
పాపములన్నింటినీ పోగొట్టే పవిత్ర తీర్థము  !

ఎవనియందు అత్యంత. శుభకరములగు
శివనామము  విభూతి  రుద్రాక్షలు అనే
మూడు ఉండునో అట్టివాని దర్శనం చేత త్రివేణి
సంగమములో స్నానము చేసిన ఫలము లభించును  !
వాని దర్శనము పాపములను పోగొట్టును  !

ఎవని లలాటముపై విభూతి లేదో 
ఎవని శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో
ఎవని పలుకులు శివనామ భరితములు  కావో
అట్టివానిని  అధముని వలె త్యజించవలెను  !
శివనామము గంగ వంటిది  !
విభూతి  యమున వంటిది  !
రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే 
సరస్వతి నది వంటిది  .......
ఈ మూడు ఎవని  శరీరమునందు గలవో 
వాని పుణ్యమును ఒకవైపు త్రివేణి  సంగమ
స్నానము  వలన లభించు పుణ్యమును
మరియొకవైపు  నుంచి విద్యాంసులే కాక.
పూర్వము  బ్రహ్మ కూడా  లోకరహితమును
కోరి పోల్చి  చూసెను  రెండింటి ఫలము
సమానముగా  నుండెను  .. కావున విద్వాంసులు
అన్నివేళలా  ధరించవలెను  .......
ఆనాటి నుండియూ బ్రహ్మ. విష్ణువు  మొదలగు
దేవతలు మూడింటిని  ధరించుచుండిరి  !
వీటి దర్శనము వలన పాపములను పోగొట్టును  !
శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే
పర్వతములు  తెలీకగా బూడిదయగునను
ఈ ....  మాట ముమ్మాటికి  సత్యము  !

సంసారమునకు  మూలమైన పాపములు
శివనామము అనే గొడ్డలితో  నిశ్చయముగా
నాశనము  పొందును  !
శివనామమునందు భక్తి కలిగిన మహాత్ములకు
ముక్తి  శీఘ్నముగా  లభించును  !
అనేక జన్మములు  తపస్సు చేసిన వానికి
పాపములన్నీ పోగొట్టే శివనామమునందు
భక్తి కుదురును  ....... ఓం నమః శివాయ. !!
  >>>>>  మీ  , గోపి దగ్గుమల్లి <<<<<
26/10/17, 8:47:08 PM: MVMRAO: దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది.!

మీరు తరచూ దేవాలయాల్లో హుండిలో కానుకలు సమర్పిస్తుంటారు. కానీ నిజానికి మన పురాణాల్లో ఎక్కడా ఇలా హుండీలో డబ్బులు వెయ్యమని చెప్పలేదు, దాన ధర్మాలే చెయ్యమన్నారు.

మీ మనసులో కోరిక కోరుకుని దేవుడికి లంచం రూపంలో హుండిలో లక్షలు లక్షలు వేసే రోజులివి. మళ్ళీ ఆ కోరిక నెరవేరాలంటూ అప్లై చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఆ దేవుడు కనికరిస్తాడా? మీరు అడిగిన వరాలను సమకూరుస్తాడా?
మరైతే మనం ఏం చేయాలి, ఇలా లక్షలు హుండీలో వేసే కన్నా దేవాలయంలో ఏం సమర్పిస్తే మీకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో చూద్దాం రండి.
ఐతే మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం
తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటవ అధ్యాయం మనకు వివరిస్తుంది.
దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది.
అందుకే ఎవరి చేతనైనంతలో వారు సమకూర్చుకోవాలి. దేవాలయాలకు సహాయ సహకారాలు అందిచాలని అంటున్నాయి పురాణాలు.
* దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి అలాగే ప్రాగంణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీమహావిష్ణువు లోకఫలాలను పొందుతారని పురణాలు చెప్తున్నాయి.
* ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతులుగానే పుడతారు.
* ఆలయానికి గంటను దానం చేస్తే మహ గొప్ప కీర్తివంతుడు అవుతాడు.
* గజ్జెలను, మువ్వలను  దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు.
* ఆలయ ప్రాంగణంలో చల్లధనం కోసం పందిళ్ళు  నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మ బుద్ది కలగడానికి కారణమవుతాడు.
* దేవాలయం పై రెపరెపలాడే జెండాలను దానం చేయువాడు సకల పాపాలనుండి విముక్తి పొందినవాడై వాయు లోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు.
* ఆలయ ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృధ్వీపతి అవుతారు.
* మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు.
* నాలుగు కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాలంత పరియంతం ఉన్న, భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు.
* కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు.
* వట్టి వేళ్ళతో తయారు చేసిన చాపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి.
* ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి, మరి అనేక రకాలైన సదుపాయాలను కల్పించినపాడికి పాపవిముక్తి కలుగును.
* కాపరాలను దానం చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు.
* ధ్వజ స్థంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు.
* దేవునికి ముఖలేపనాన్ని అంటే ముఖములను తొగిడు సుగంధ ద్రవ్యాలను సమర్పించినవాడు ఉత్తమ రూప సంపదత్తిని పొందుతాడు.


26/10/17, 11:25:01 PM: Bharani Kumar: --: అరుణాచలేశ్వరుడు :--
===============
మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.

అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,

సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.

కంచిలో పృథివీ లింగం,

జంబుకేశ్వరంలో జలలింగం,

అరుణాచలంలో అగ్నిలింగం,

చిదంబరంలో ఆకాశలింగం,

శ్రీకాళహస్తిలో వాయులింగం,

కోణార్కలో సూర్యలింగం,

సీతగుండంలో చంద్రలింగం,

ఖాట్మండులో యాజమాన లింగం –

ఈ ఎనిమిది అష్టమూర్తులు.

ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.

కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.

అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.

అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.

అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.

అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.

ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.

అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.

అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.

కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.

అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.

అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.

అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.

అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.

అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి
జననాత్ కమలాలే
స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది.

మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.

కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.

ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.

అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.

దాని పేరే అరుణాచలం.

అచలము అంటే కొండ.

దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.

ఆకొండ అంతా శివుడే.

అక్కడ కొండే శివుడు.

కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.

అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.

అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.

గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.

ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి  ఉంటుంది.

అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.

అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.

దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.

ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.

ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.

అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.

అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.

ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.

అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.

కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.

అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.

అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.

అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.

అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.

ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.

ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.

అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.

అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.

‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.

నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.

ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.

అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.

అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.

తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.

రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.

ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.

అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.

తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.

ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.

అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.

దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.

అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.

అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.

ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.

పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.

ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.

లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.

శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.

అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.

ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.

సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.

స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.

అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.

అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.

అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ.
ఓం నమః శివాయః
సర్వేఃజన సుఖినోభవంతు
:శివ నాగేశ్వరరావు
27/10/17, 6:23:43 AM: MVMRAO: Janardhan Thakur:
"కాశీ (వారణాశి)"

          "కాశీ" అంటే ప్రకాశము, వెలుగు, తేజస్సు, కాంతి అని అర్ధాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీలో ఉన్న "విశ్వనాథ లింగము" అత్యుత్తమైనదిగా భక్తుల అభిప్రాయము. మూడు రాత్రులు, 3 పగళ్ళు నగరం దాటకుండా కాశీలో ఉంటే "రాజసూయ యాగం + అశ్వమేధ యాగం" చేసిన ఫలితం వస్తుంది. కాశీ నగరం ద్వాదశ నామాలతో ప్రసిద్ధి చెందినది. అవి: "కాశీ, వారణాశీ, బెనారస్, శివపురి, క్షేత్రపురి, త్రిపురారి, రాజనగరి, ఆనందకాననం, గౌరీముఖి, అవిముక్తి, మోక్షపురి, జ్ఞానపురి."
      కాశీలోని "మణికర్ణిక తీర్ధం"లో స్నానం చేస్తే "యజ్ఞం" చేసిన ఫలితం వస్తుంది. పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన "భిందుమాధవుడు" కాశీలోనే ఉన్నాడు. అస్సీఘాట్ దగ్గర ఉన్న "లోలార్క్ కుండ్"లో సూర్య భగవానుడు ఉన్నాడు. లోలార్క్ కుండ్ లో ఎర్ర చందనం, ఎర్ర పువ్వులు వేసి నమస్కారం చేయాలి, ఆరోగ్యం బాగుంటుంది.
        కాశీలోని "అన్నపూర్ణ" అమ్మవారి చేతిలో అన్నపు భాండము, గరిటె ఉంటాయి. ఇక్కడ "విశాలాక్షి" అమ్మవారు త్రిశక్తి పీఠాలు (కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి)లో ఒకటిగా, అష్టాదశ పీఠాలలో ఒకటిగా, అష్టశత శక్తులు (108 శక్తి పీఠాలు)లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.
        సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ శబ్ధమును నిరూపించుకున్నది ఇక్కడే (హరిశ్చంద్ర ఘాట్ ఉంది). తులసీదాసు రామాయణాన్ని (శ్రీరామచరిత మానస్) వ్రాసినది ఇక్కడే.
      జగద్గురువులు ఆదిశంకరరాచార్యులు ఇలా అంటారు "ఆనందమునకు మూలానందమైన ఆనందకాననం (కాశీ)లో నివశిస్తూ, పాపాలను తుంచివేసే, అనాధలకు నాధుడైన కాశీనాధుడు విశ్వనాధుడిని శరణు వేడుకుంటున్నాను" అన్నారు. భజగోవిందంలో జగద్గురువులు గంగానది గురించి "గంగాజల లవ కణికా పీతా" అంటూ గంగమ్మ నీరు ఒక్క చుక్క తాగినా, యముడి వద్దకు వెళ్ళాల్సిన పని ఉండదంటారు.
      కాశీలోని ఘాట్లు మొత్తం 365, అందులో ముఖ్యమైనవి 64 ఘాట్లు. వాటిలోనూ ముఖ్యంగా స్నానం చేయవలసినవి 5 ఘాట్లు అని పెద్దలు చెబుతారు, అవి: 1)అస్సీ ఘాట్, 2)కేదార్ ఘాట్, 3)దశాశ్వమేధఘాట్, 4)మణికర్ణిక ఘాట్, 5)పంచగంగ ఘాట్. వీటన్నింటిలో అతి ముఖ్యమైనది "మణికర్ణిక". ఈ మణికర్ణక ఘాట్లో మధ్యాహ్నం12 గంటలకు దేవతలు అందరూ వచ్చి స్నానం చేస్తారని ప్రసిద్ధి. ఆ సమయంలో మణికర్ణిక స్థవం చదివి స్నానం చేయలంటారు.
    క్షేత్రపాలకుడైన "కాలభైరవుడు"ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈయన మరో పేరు 'క్రోదభైరవ దేవుడు'. ఈయన అనుమతి లేకుండా మనం కాశీ క్షేత్రంలో అడుగుపెట్టలేము. "సాక్షి గణపతి'ని దర్శించుకోవాలి. గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి పొందినది.
శ్రీవిశ్వనాధుని హారతి  ఉ. 3 గంటలకు  సేవకు ₹251, అభిషేకం ₹140 చెల్లించాలి. అన్నపూర్ణమ్మ కుంకుమ పూజకు ₹350 చెల్లించాలి.
"ఎంతో పుణ్యం ఉంటే కానీ కాశీ క్షేత్రంలో అడుగుపెట్టలేము"

"గంగా తరంగ కమనీయ జటాకలాపం,
  గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్,
  నారాయణప్రియ మనంగ మదాపహారం,
  వారణాసీ పుర పతిం భజ విశ్వనాథం


27/10/17, 8:51:47 AM: Ivaturi Umashankar: గోమాత_జననం
గురించి ఒక్కసారి చదవండి

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.

ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.

ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.

.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.

క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.
‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే..

      జై గోమాత జైజై గోమాత
గోమాత పాదాలకు శతకోటి వందనాలు🙏
27/10/17, 10:37:59 AM: ‪+91 79811 59026‬: *మూఢ జహీహి ధనాగమతృష్ణాం*
*కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం*
*యల్లభసే నిజకర్మోపాత్తం*
*విత్తం  తేన వినోదయ చిత్తం*

ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు.  
27/10/17, 11:36:39 AM: ‪+91 94407 54592‬: *కార్తీకపురాణం 7 వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*శివ కేశ వార్చనా విధులు*


వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి    ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును.
శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.

*' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం*
*నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''*


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*
*సప్తమధ్యాము - సప్తమదిన పారాయణము సమాప్తం.*
27/10/17, 1:27:38 PM: Padmaja Mudigonda: *కార్తీకపురాణం 8 వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺



*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*



వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగు ననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానము అన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు

మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక, మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యె౦తటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు- వేదములు పటించి, సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న  దేవాలయం లో జపత పాదు లొనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.


*ఆజా మీళుని కథ*


పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వాని బంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకు చుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు ' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొ డ౦గిరి.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*