29/09/17, 2:07:59 PM: +91 98660 49721: దశరా నవరాత్రులలో తొమ్మిదవరోజుసిద్ధిదాత్రీ దేవి అవతారవిశేషాలు.
(9) సిద్ధిధాత్రీ దేవి
సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ||
మార్కండేయ
పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ,
సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి,
కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని
అష్టసిద్ధులు చెప్పబడ్డాయి. ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా
అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని.
కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ
మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు
నెరవేరతాయి.
తొమ్మిదవరోజు నైవేద్యంపాయసం.
No comments:
Post a Comment