Friday, October 6, 2017

01/10/17, 9:04:50 AM: ‪+91 79811 59026‬: *ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్!*
*నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా!!*


*క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి"!*
*క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్!!*


*వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్!*
*నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి!!*


*య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి!*
*యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే!!*

(సుందరకాండ)

మహాత్ములైన ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును. కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు సజ్జనులను సైతము నిందించును.

కోపమునకు లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు

No comments:

Post a Comment