11/10/17, 9:28:57 AM: Bharani Kumar: *ధర్మ సూక్ష్మము*
*(చిరుకధ )*
*సుశీలమ్మ,
యాదమ్మ గుడి నుంచి ఇంటికి
షేర్ ఆటోలో బయలు దేరారు...*
మార్గ మధ్యం లో
ఆటోని ఓ లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడి కక్కడే
మరణించారు.
యాదమ్మ ని విష్ణు దూతలు పూల.. విమానం లో తీసుకు పోయారు.
సుశీలమ్మ ని యమధర్మరాజు
గారి వద్ద హాజరు పరిచారు.
సుశీలమ్మ యమధర్మరాజు ముందు మొత్తు కుంది.
నేను ఎన్ని లలితా పారాయణాలు చేసాను,
ఎన్ని విష్ణు సహస్రనామ పారాయణాలు చేసాను.
ఎన్ని నోములు,
వ్రతాలు ఆచరించాను.
ఎన్నో దేవాలయాకు లక్షలకు లక్షలు విరాళంగా ఇచ్చాను.
★ కావాలంటె యమదర్మరాజా భూలోకంలో ఎన్ని దేవాలయాల దగ్గర నా పేర్లు ఉన్నాయో చూడుస్వామి🙏
ఇంతగా చేసిన
నాకీ...
నరకలోక మేమిటి?
గుడి ముందు కొబ్బరికాయ లు
పూలు అమ్మే ఆ యాదమ్మ కి వైకుంఠము ఏమిటి?
*అన్యాయం కదా!*యమదర్మరాజా
*యమ ధర్మరాజు వివరణ:-*
అమ్మా!
నువ్వు అవన్నీ చేసిన మాట వాస్తవం
కానీ అవన్నీ ...
నీ నగలూ,
చీరలూ,
నీ దర్పాన్ని
ప్రదర్శించ డానికే చేసావు.*
★ నీవు దేవాలయాలకు విరాళంగా ఇచ్చింది నీ గొప్పలకోసరము చేసావు !
★ నీవు దేవాలయంలో ముఖ్యమైన దినాలలో అంగులు,ఆర్బాటాల టైంలో మాత్రమే కనబడుతావు
*నువ్వు పూజలు చేసిన
ప్రతిసారీ...
మీ ఆయన,
మీ పిల్లలు,
ఎన్నో సార్లు
తిండి తిప్పలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు.
*నీకు చెప్పలేక
మీ ఆయన సేవలు చేయలేక
మీ అత్తగారిని మావగారిని వృద్దాశ్రమంలో చేర్పించాడు.*
*కానీ యాదమ్మ ఉదయం లేచి భర్త కి పిల్లల కి
కావలసిన ఏర్పాట్లు చేసి గుడికి వచ్చేది.*
★ ప్రతిరోజు స్వామి దర్శనము చేసుకొనేది.
★ దేవాలయాలలో ఏ పూజలు జరిగినా పదిమందికి చెప్పేది
★ పదిమంది బాగుండాలని కోరుకొనేది
*మధ్యాహ్నం భోజనానికి వచ్చి నప్పుడు, సాయం
కాలం ,రాత్రి భర్తకి పిల్లల కూ కావలసిన అన్ని
సదుపాయాలు పూర్తి చేసి వచ్చేది.*
*కర్తవ్య నిర్వాహణే దైవా రాధన...*
*ఎవరినీ అ గౌరవ*
*పరిచేది కాదు...*
*ఈ ధర్మ సూక్ష్మము
పేరు ప్రఖ్యాతుల కోసరము చేసే పూజలు యాగాల వల్ల ప్రయోజనం శూన్యం...*
పదిమంది బాగుకోసరము చేసే పూజాపలమే నీకు పుణ్యపలము ఒస్తుంది
అని ఈ కథా సారాంశం
✍ ఇట్లు- మీ- కె.వి.ఆర్.శంకర్
No comments:
Post a Comment