Tuesday, 10 October 2017
10/10/17, 9:14:46 AM: +91 79811 59026: ఉ. *వాయువశంబులై యెగసి వారి ధరంబులు మింటఁ గూడుచుం*
*బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై*
*పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదుకాల మన్నియుం*
*జేయుచుఁ నుండుఁ గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్.*
ఆకాశములో మేఘములు వాయువశములై కూడుకుని , విడిపోవుచు వుండే విధంగా, ప్రపంచములోని సమస్తమూ కాల ప్రభావముచే కలియుచు విడిపోవుచు నుండును. ఎల్లప్పుడు నొకేవిధముగా జరుగదు. కాలమే యన్నియు చేయుచుండును. కాలము అతి విచిత్రమైనది. ఎంతటి వారికైననూ కాలము దాట శక్యము కాదు.
No comments:
Post a Comment