16/10/17, 7:25:04 AM: Yes Pk: *శ్రీ మహా విష్ణు పురాణము*
*సూర్యుడూ మొ|| జ్యోతిర్మండలాల స్థితి*
పరాశర మహర్షి ఇలా చెప్తున్నాడు.....
ఈ బ్రహ్మాండం నెలకొని ఉన్నరీతిని సూర్యాది జ్యోతిర్మండలాలు - వాటి ఉనికి, వ్యాప్తి వినెదవుగాక!
సూర్యునిరథం
9 వేల యోజనాలు. దీనికి ఈషాదండం (పోలుగర్ర) కాడినుంచి ఇరుసుకు అనుసంధింపబడి
18 వేల యోజనాల పొడవు. దీంట్లో ఇరుసు (చక్రం యొక్క కన్నుభాగం) ఒక కోటీ 50
లక్షలు. దీంట్లో చక్రం సుప్రతిష్ఠితం. ఈ చక్రానికి 3 నాభీలున్నాయి.
కోడిగుడ్డు ఆకారపు చక్రం. ఈ మూడిట్నీ ప్రాతఃకలం - మధ్యాహ్నకాలం - సాయంకాలం
అని చెప్తుంటారు వ్యాఖ్యాతలు. కొందరు త్రికాలములు అంటారు (వేసవి,
వర్షాకాలం, శీతాకాలాలు). ఈ సూర్యరథచక్రంలో ఆకులు 5. నేములు 6. (బండి చక్రం
చుట్టుగల ఇనుప చట్రం) దీన్ని తాకూతూ ఉండేవి ఆకులు. నేమి, ఆకులు తాకిన
ప్రదేశం ఋతువును వేరుచేస్తుంది.
ఇలాతాకిన
బిందువులు ఋతువుల మార్పుగా కాలచక్రం చుట్టు ఉన్నాయని సంకేతం. సూర్యరథానికి
7 గుర్రాలు. ఇవే 7 ఛందస్సులు. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి,
త్రిష్టుభం, అనుష్టప్, పంక్తి అనే పేర్లుగలవి. అక్షం (ఇరుసు) ఒక కొన
మేరువుమీద; రెండోకొన మానసగిరి మీద ఆనుకొని ఉండి, ధ్రువమండలంతో
అనుసంధానించబడి ఉంటుంది. (అంటే చక్రంతో పాటు ఇరుసు, ధ్రువుడూ కూడా
తిరుగుతూంటారు)
మానసోత్తర
పర్వతానికి తూర్పున ఇంద్రరాజధాని, వస్వౌకసారం, దక్షిణాన యముని పట్టణం
సంయమని, పశ్చిమాన వరుణుని నగరు సుఖపురి, ఉత్తరాన సోముడు(చంద్ర) గల నగరం
విభావరి ఉన్నాయి. దక్షిణదిశన ఉన్న రవి, విసిరిన బాణంలా ఉత్తరదిశకు
జ్యోతిశ్చక్రాన్నంతటినీ (గ్రహ, నక్షత్రమండలాలు యావత్తూ) తనవెంట
తీసుకువెళ్తూ గమనం సాగిస్తాడు. ఆయనము (గమనం) లేర్పడే దీవిధంగానే!
ఆరుమాసాలకాలం పడుతుందీ గమనానికి. ఉత్తరాయన - దక్షిణాయనాలివే! సమస్త
ద్వీపాలకు అహోరాత్రులవ్యవస్థకు కారకుడు సూర్యుడు. ఈ రెండురీతుల సంచారం
చేస్తూంటాడు. ఉత్తరాయణం మార్గాన యోగులు, జ్ఞానులు బ్రహ్మపథంవైపు సాగుతారు.
సూర్యుణ్ణి
ఎవరు, ఎక్కడ చూస్తారో అది పగలు. అతడి వెలుగు సోకని సమయం రాత్రి అని
జగద్వితితం. కనిపించుట, కనిపించకపోవుట అనేవి ఉదయాస్తమయ సంధ్యలు ఉభయములు.
సూర్యుని
రథవైశాల్యం ('కాంతి ప్రసరించు మార్గం' అని కొందరు...) తొమ్మిదివేల
యోజనాలు. జంబూద్వీపం మధ్యగల మేరువు, దాని మీద 15 లక్షల యోజనాలలో ధ్రువుడు,
మానసపర్వతం మీద ఏభై వేల యోజనాలలో ఆకాశం ఉండి, సూర్యరథచక్రపు అక్షానికి
అనుసంధానింపబడి ఉంటాయి.
సూర్యుడే
ఈ రాత్రీపగళ్లకు కారకుడు. అతడు అంతటా తనకాంతిని ప్రసరింపజేస్తాడు. దేవతల
పర్వతమైన మేరువుమీదా - బ్రహ్మలోకంలోను సూర్యకాంతి ప్రసరించదు.
బ్రహ్మలోకంలోకి ప్రసరిస్తే, ఆ కాంతులు దివిటీ ముందు దీపాల్లా వెలవెలపోతాయని
తాత్పర్యం. బ్రహ్మలోకంలో ఎల్లవేళలా పట్టపగలే! సూర్యాస్తమయం జరిగాక,
అతనికాంతి అగ్నిలో ప్రవేశిస్తుంది. కనుకనే పగటినీరు కొంచెం ఎర్రగా, రాత్రి
నీరు తెల్లగా ఉంటుంది. అయనాలలో పగళ్ల - రాత్రుల ప్రమాణంలో వ్యత్యాసాలుండడం;
విషువత్‌కాలాల్లో పగలు - రాత్రులు సమానంగా ఉండడం సూర్యసంచారంలోని
ప్రభావమే! పగలు ఆరురాసులలోను, రాత్రి ఆరురాసులలోను అతడు సంచరిస్తాడు.
సూర్యోదయ
- సూర్యాస్తమయ నడిమి కాలములకు 'సంధ్య' లని పేరు. అది పరమరౌద్రమైనట్టిది. ఆ
సమయంలో మందేహులనే రాక్షసులు సూర్యుని భక్షించగోరుతారు. అక్షయములైన శరీరం -
దినదినము చావువారికి కలిగేలా బ్రహ్మదేవుని శాపం ఉంది. అందువల్లనే
సూర్యునితో దారుణ యుద్ధం చేస్తూంటారు. బ్రాహ్మణులు సంధ్యాసమయంలో ఇచ్చే
ఆర్ఘ్యాదులు మంత్ర పూరితమైనందున అవి వజ్రాయుధ సమానములై వారి దేహాల్ని
ఖండిస్తాయి. బ్రహ్మవరం వల్ల, తిరిగి మర్నాటికి ఆ రాక్షసులు ఆయువుపోసుకుంటూ
ఉంటారు.
ఆది వాక్పతి,
ఓంకారరూపుడు విష్ణువు. ఋగ్యజుస్సామములనే త్రిధామాత్మకుడు. వేదోచ్ఛారణవల్ల
రాక్షసులు నశిస్తారు. సూర్యుడు విష్ణుని అంశ. అంతర్జ్యోతి - అవికారమైనట్టి
ఓంకారం విష్ణుని ప్రేరేపిస్తుంది. ఓంకారం వల్ల ప్రేరేపించబడిన - ఘనతరమైన
జ్యోతిస్సు కలిగిన ఒకానొక దివ్యశక్తి మందేహరక్కసులను తుదముట్టిస్తుంది.
కనుకనే సంధ్యావందనాన్నెప్పుడు విస్మరించకూడదు. ఇది విప్రుని కర్తవ్యం. అలా
మానివేసిన బ్రాహ్మణుడు సూర్యహని చేసిన వాడౌతూన్నాడు. ఇట్లు బ్రాహ్మణుల
సంధ్యావందనం వల్ల నూతనోత్తేజం పొందిన వాడై, ఆవల వాలఖిల్యాది మహర్షులచేత
స్తుతింపబడి లోకాన్ని రక్షిస్తూవుంటాడు సూర్యుడు.
కాలప్రమాణాన్ని
విభాగించి నపుడు 30 ముహూర్తముల కాలము చేత ఒకరోజు (రాత్రి - పగలు కలిపి)
ఏర్పడుతుంది. ఇందులో 3 ముహూర్తములకాలం ప్రాతఃకాలం. తదుపరి 3ము|| కాలం
సంగవము. అటుపైన 3 ము|| కాలం మధ్యాహ్నం. తర్వాతి 3 ము|| కాలం అపరాహ్ణం. ఆపైన
3 ము|| కాలం సాయాహ్ణం. ఈ ప్రకారం ఐదేసి విభాగాలు (5x3=15) పగలు మరో ఐదేసి
విభాగాలు రాత్రి మొత్తం 30 ము|| కాలం ఒకరోజు అని లెక్కింపబడింది.
దక్షిణాయన
- ఉత్తరాయన కాలాల్లో రాత్రిపగళ్లు హెచ్చుతగ్గులు సంభవిస్తుంటాయి. శరద్వసంత
ఋతువుల్లో 'విషువత్' ఏర్పడుతుంది. రాత్రిపగలు సమానం. కృత్తిక నక్షత్రం
ప్రధమభాగంలో సూర్యుడు ఉన్నప్పుడు - విశాఖనక్షత్రం 4వ పాదంలో చంద్రుడుంటాడు.
అలాగే విశాఖ ప్రధమపాదాన సూర్యుడుంటే - కృత్తిక 4వ పాదంలో చంద్రుడుంటాడు.
అప్పుడేర్పడేవి విషువత్‌దినాలు. బ్రాహ్మణుల్ని - పితృదేవతల్ని అర్చించి
దానాలివ్వడానికి మంచి సమయం.
లోకాలోకమనే
పర్వతముమీద కర్దముని పుత్రులైన సుధన్వుడు, శంఖపాలుడు, హిరణ్యరోముడు,
కేతుమంతుడు అనే నలుగురు నాలుగుదిక్కులకు పాలకులై చరిస్తుంటారు. వీరు
నిరభిమానులు, ద్వంద్వాతీతులు.
అగస్త్యునికి
ఉత్తరంగా అజవీధికి దక్షిణంగా 'ధూమాది మార్గం' అనే పేరిట పితృయానం అనే
మార్గం ఉంది. అది వైశ్వానరమార్గానికి అవతల ఉన్నది. అక్కడ అగ్ని హోత్రాలు
విశిష్టంగా సల్పిన పుణ్యలుంటారు. యుగయుగానా జనించే బ్రహ్మమును - వేదమును
వాళ్లు ఉద్ధరిస్తారు.
స్వర్గ
(నాక) వీధికి ఉత్తరంగా, సప్తర్షి మండలానికి దక్షిణంగా సూర్యుని
ఉత్తరమార్గం అర్చిరాదిమార్గమనే పేరిట దేవయానం ఉంది. అక్కడి వారు
జితేంద్రియులు, పరిశుద్ధులు, బ్రహ్మచారులు. అమృతులు. ఈ ఉత్తరమార్గాన్ని
ఆశ్రయించి 80 వేలమంది మునులు, ఊర్ధ్వరేతస్కులైనవారు ప్రళయం దాకా
సంచరిస్తుంటారు. ఇక్కడ 'అమృతులు' అని చెప్పబడుట 'చిరకాలము' అనే అర్థంలో
వాడబడినదని గుర్తించాలి.
త్రిలోకాల
స్థితి ఎంతకాలం ఉంటుందో అంతదాకా (లేదా) బ్రహ్మదేవుని పగటికాలం గడిచి
ప్రళయవేళ మొదలయ్యేంత దాకా అని అర్థం! సప్తర్షిమండలానికి పైన
ధ్రువుడున్నాడు. భూమినుండి 3వ దివ్యస్థానమిది. ఇదీ విష్ణుపదమే! స్వర్గం
కంటే గొప్పది. పుణ్యపాపాలేవీ లేనివారు, యతీంద్రులు, మోక్షార్హులు ఇక్కడ
ఉంటారు. అనగా ఇక్కడుండేవారు దేహధారులుగా తిరిగి జన్మించరు. క్రమంగా
బ్రహ్మలోకానికేగి, బ్రహ్మతో పాటు మోక్షం పొందగలరు.
ఇక
విష్ణుపదము యొక్క పరమోత్కృష్టత గురించి చెప్తూన్నాను. ఏలోకములో విష్ణువుతో
సమానమైన ఐశ్వర్యాన్ని పొంది, వెలుగొందగలరో అదే విష్ణుపదము. ఆకాశంలో
సర్వప్రకాశమానమై, ప్రాపంచిక జ్ఞానంకంటే భిన్నమైన వివేకజ్ఞానం చేత 'ఇదేఇది'
అని నిర్ణయింపరానిదిగా చూడబడే స్థానమేదో అదే విష్ణువుయొక్క పరమపదము.
ఆ
విష్ణుపదం నుంచి గంగానది, సర్వపాపహారిణిగా - దేవతాస్త్రీల శరీరపరిమళాల
వల్ల ఎర్రనైన రంగుగలదిగా, త్రివిక్రమునిపాదం నుంచి ఉద్భవించినదిగా
ప్రవహిస్తూ ఉంటుంది. అది ప్రభవించేచోట గాని భూలోకానికి పయనించే దారిలోగాని
సామానుల దృష్టికి గోచరం కానిదిగానూ; దేవతలకు అహ్లాదకారిణిగాను ఉంటుంది.
బ్రహ్మయొక్క
కమండల జలం చేత విష్ణుపాదం కడగబడినది. అయితే, ఆ జలం చాలకపోగా ధర్మమే
బ్రహ్మాజ్ఞచేత జలంగా మారినదనీ - అదీ చాలక బ్రహ్మాండ కవాటానికి తూటుపడి,
అందులోని బాహ్యపుపొరలోని నీరు ధారగా వెడలి విష్ణుపాదాన్ని తడుపుతూ భూమికి
చేరిందనీ అదే పరమపావన గంగ అనీ పురాణాల్లో ఉంది.
విష్ణుని
ఎడమపాదం యొక్క బొటనవ్రేలి గోటినుంచి వెడలిన ఆ గంగను ధ్రువుడు భక్తితో
నెత్తిమీద భరిస్తున్నాడు. ఆవల సప్తర్షులు ప్రాణాయామం చేసి, తదుపరి అఘమర్షణ
స్నానం చేస్తూ గంగానదీ జడపాయలలో తేలియాడు తూంటారు. ఆ జలప్రవాహంచేత
చంద్రమండలం తడపబడి రాత్రివేళ చాలా కాంతిగా ఉంటుంది.
చంద్రమండలం
నుంచి మేరుగిరిమీద (శివుని జటాజూటం అని కొందరు) పడి లోకాల్ని పావన మొనర్చి
నలుదిశలా ప్రవహిస్తోంది. గంగ - ఆయాదిక్కులను బట్టి చక్షువు, భద్ర, సీత,
అలకనంద, అనే పేర్లతో ప్రఖ్యాతమైంది.
వీటిలో
అలకనంద అనే పాయను శివుడు వందేళ్లకు పైగా శిరస్సున ధరించగా, అది
సగరకుమారులకు ఉత్తమగతులు కల్పించేందుకు భగీరథుని చేత భూమికి తీసుకొని
రాబడినది. ఈ మహావాహినిలో స్నానం చేసిన తక్షణమే పాపాలన్నీ నశిస్తాయి. ఇక్కడ
పుత్రులు తండ్రుల నిమిత్తం వదలిన ఉదకం, వారికి నూరేళ్లకాలం
తృప్తినిస్తుంది. కేవలం రెండుమార్లు తలచినా గాని మూడుజన్మల పాపాలు పోతాయి.
(దీనికి విష్ణుపురాణంలోని ఈ శ్లోకమే ప్రమాణము)
శ్లో|| గంగా గంగేతి యన్మామ యోజనానాం శతే ష్యపి |
స్థితై రుచ్చారితం హంతి పాపం జన్మత్రయార్జితమ్ ||
No comments:
Post a Comment