19/10/17, 8:10:09 AM: Yes Pk: లక్ష్మీ అనుగ్రహం ఎలా పొందాలో మీకు తెలుసా....!!
సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి.
ఆమె
కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని
తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ
అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే
ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు.
శ్రీ
లక్ష్మీ దేవికి ఉన్న నామాలలో అమ్మవారికి " ఓం శ్రీ మహావిష్ణు వక్షస్థల
స్థితాయై నమ:" అనే నామం అంటే చాలా ఇష్టం. ఆ నామంతో అమ్మవారిని తలచుకుంటే
తప్పకుండా కరునిస్తుంది..
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం,
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం,
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం,
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్.
1.గుమ్మానికి
పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలకు
రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయనివ్వరు.
2.సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రించే వారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
3.శుచి, శుభ్రత, సహనం కలిగి, ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టులు.
4.చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు.
5.బద్దకస్తులు,
అతిగా మాట్లాడేవారు, అమితంగా తినేవారు, గురువులనూ, పెద్దలనూ
అవమానించేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతినిద్రాలోలు ఇంటి
ముంగిటికి కూడా లక్ష్మీదేవి కాలిడదు.
6.లక్ష్మీదేవి
అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రని
వస్త్రాలను, పరిమళభరితమైన పూలను అలంకరించి, ధూపదీప నైవేద్యాలను సమర్పించి,
పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్ఠం.
7.బంగారాన్ని నడుం కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరచినట్లే. అందుకే కాళ్లపట్టాలు, మట్టెలూ వెండివి మాత్రమే ధరించాలి.
8.ఉసిరిపొడిని
నీటిలో కలిపి తలస్నానం చేసి, శుచీశుభ్రతలతో దేవీభాగవతంలోని మహాలక్ష్మి
క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన
సంపదలన్నీ తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి.
9.లక్ష్మీదేవికి నివేదించే పిండివంటలను నూనెతో కాకుండా నేతితో తయారు చేస్తే శ్రేష్ఠం.
10. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి.
11. శ్రీలక్ష్మీ క్షమాగుణం, శాంత గుణం అనే ఆరెండు గుణాల్లో ఉంటుంది. ఈ రెండు గుణాలు ఉన్నవార్ని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది.
లక్ష్మీ కటాక్షం పొందాలంటే.....
- పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో బాటు స్ఫటిక గణపతి విగ్రహాన్ని కూడా ఉంచడం మంచిది.
- లక్ష్మీదేవికి ఐదువత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆర్థికపరమైన కోరికలు ఫలిస్తాయి.
- ధన సంబంధమైన కార్యకలాపాలను సోమవారం లేదా బుధవారం నాడు నిర్వర్తించడం మంచిది.
- గురువారం నాడు ముత్తయిదువలకు పసుపు రాసి, బొట్టు పెట్టి మంగళకరమైన వస్తువులను ఇస్తే మంచిది.
సూర్యోదయానికి
ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది
తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో
పంచముఖ దీపాలను వెలిగించాలి.
ఇంటికొచ్చే
ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు ఇవ్వడం మరిచిపోకూడదు. పసుపు
కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింప
బడతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం
స్నానం చేసి సత్య నారాయణ స్వామిని తులసితో అర్చించి.. పాలతో చేసిన పాయసం,
కలకండ, పండ్లతో నైవేద్యం చేయాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం
తీసుకోవాలి.
వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం
గలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు
బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా
ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు.
అయితే అసత్యాలు
పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి
నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు.
బయటికి వెళ్లి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట
లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు
కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.
No comments:
Post a Comment