Friday, October 6, 2017

30/09/17, 9:22:16 PM: Seetha Prasanna: అందరికీ సంతోషంగా విజయ దశమి
విజయదశిమి అనగా వజయవంతమైన పదవరోజని అర్ధము. నవరాత్రుల అనంతరం అమ్మ విజయాన్ని సాధించిన సుదినాన్ని విజయదశిమిగా మనము జరుపుకుంటాము.  సాధనామార్గమున ఎదురయ్యెడి అవరోధములనెదుర్కొనెడి శక్తి సామర్ధ్యాలను సాధకునికి అమ్మ  తన అపార క్రుపచే ప్రసాదించును . అమ్మ ఒసగిన సాధనాబలంతో , సాధకుడు ఆధ్యాత్మమార్గాన పురోభివ్రుధ్ధి చెందటమే అమ్మయొక్క విజయము.

కాళిదాసు రచించిన దండకమును పునరావ్రుత్తి చేసుకోవడాన్ని మించిన ప్రార్ధన మరొకటి లేదనడంలో అతిశయములేదు.
" ఓ దేవి ! సకల తీర్ధజలములలో, తంత్రాలలో , మంత్రాలలో , చక్రాలలో(సంకేతాలలో), నాదాలలో , యోగాలలో, వాక్కులో, వేదాలలో , సకల జగత్తులలో - వాటి సారముగా యన్నది నీవు మాత్రమే ! ఓ జనని!  సకల చరాచర స్రుష్టియందున్న ఆదిపరాశక్తియైన నీకు  సభక్తికంగా నేను సమర్పించే సాష్టాంగప్రణామములివే !

No comments:

Post a Comment