16/10/17, 7:27:39 AM: Yes Pk: అనంతాళ్వాన్ గునపం
శ్రీస్వామివారి
ఆలయ మహద్వారంలో పడికావలి వాకిళ్ళ లోపల పైభాగాన ఉత్తరం దిశలో ఒక గునపం
వేలాడుతూ కనిపిస్తుంది.భక్తుడు ఆలయంలో ప్రవేశించే సమయంలోగానీ,బయటకు వచ్చే
సమయంలోగానీ ఈ గడ్డపారను దర్శించవచ్చు.ఈ గునపాన్ని"అనంతాళ్వాన్ గునపము" అని
అంటారు.
పూర్వం
శ్రీభగవద్రామానుజుల కోరిక మేరకు ఆయన శిష్యుడైన ఆనందాళ్వాన్(అనంతాచార్యులు)
తిరుమలలో స్వామివారి సేవ నిమిత్తం తిరుమలలో పూల తోటలను పెంచుతూ
శ్రీవేంకటేశ్వరునికి పుష్పమాలా సమర్పణం చేయుటకు భార్యా సమేతుడై తిరుమలలో
నివాసమేర్పరచుకుంటాడు. పూల తోటలను పెంచుటకు కావలసిన నీటి కోసం శ్రీవారి
ఆలయానికి దక్షిణం దిశగా ఒక చెరువును త్రవ్వ తలబెడతాడు.అనంతాళ్వాన్
త్రవ్వుతూ ఆ మట్టిని గంపకెత్తిస్తూ ఉంటే గర్భవతి అయిన ఆయన భార్య దానిని
దూరంగా పోస్తూ ఉంటుంది.దైవం కోసం చేసే ఈ చెరువు నిర్మాణంలో ఇతరులెవ్వరి
సహాయ సహకారాలను కోరకుండా ఆయన గర్భవతి అయిన భార్యతో దీక్షామగ్నుడయ్యాడు.ఇలా ఈ
కార్యక్రమం కొద్దిరోజులు సాగింది.చాలా వ్యయప్రయాసలతో,సడలని
పట్టుదలతో,దీక్షతో కేవలం భార్యాభర్తలు మాత్రమే చేస్తూవున్న మట్టి పనిని
చూసి సంతోషించిన శ్రీవేంకటేశ్వరుడు తానూ వారికి సహాయం
చేయదలుస్తాడు.శ్రీవారు పండ్రెండేళ్ళ బాలుడుగా వెళ్ళి మట్టి మోయడంలో ఆయన
భార్యకు సహాయపడుతూ ఉంటాడు.ఇతరుల సహాయం వద్దన్నా వినకుండా ఈ బాలుడు
చేస్తున్నపనికి కోప్పడ్డ అనంతాళ్వాన్ తను త్రవ్వుతున్న గునపాన్ని ఆ
బాలునిపైకి విసురుతాడు. ఆ గునపం బాలుని గడ్డానికి తగిలి నెత్తురు
చిమ్మింది. బొటబొట కారుతున్న రక్తంతోనే ఆ బాలుడు పరుగెత్తుకుంటూ
ఆనందనిలయంలోకి వెళ్ళి దాక్కుంటాడు.ఆనాటి సాయంత్రం స్వామివారి దర్శనానికి
వెళ్ళిన అనంతాళ్వాన్‍కు రక్తం కారుతున్న స్వామి వారి చుబుకం మీది గాయానికి
అర్చకులు పచ్చ కర్పూరం అద్దుతూ కనిపిస్తారు.అనంతాళ్వాన్‍కు తన సహాయం కోసం
వచ్చిన బాలుడు సాక్షాత్తూ శ్రీనివాసుడే అని అర్థం అవుతుంది.తన తప్పును
క్షమించమని శ్రీనివాసుని వేడుకుంటాడు అనంతాళ్వాన్.అప్పుడు స్వామివారు ఆయనను
ఓదార్చి నీవు చేస్తూ ఉన్న సేవాకైంకర్యాలను లోకానికి చాటడానికి నేను చేసిన
లీలా విశేషమిది.నీవు నా చుబుకానికి చేసిన గాయానికి గుర్తుగా మాయని మచ్చ
ఏర్పడుతుంది.ఆ మచ్చపై నేటినుండి పచ్చకర్పూరపు చుక్కను
అలంకరించుకుంటూ,తద్వారా భక్తులందరిచేతా నిన్ను స్మరింపజేస్తూ అందరికీ
పరమానందాన్ని కలిగిస్తాను అని చెబుతాడు. ఆనాటినుండి నేటికీ స్వామివారి
చుబుకానికి పచ్చకర్పూరపు చుక్క పెడుతూ ఉన్నారు. స్వామివారికి గాయం చేసిన ఆ
గునపానికి కూడా సముచిత స్థానమిస్తూ మహద్వార పడికావలి లోపలి భాగంలో ఉత్తర
దిశన పైన వ్రేలాడదీసారు.
No comments:
Post a Comment